Brahmamudi December 7th Episode : కోమాలోకి సీతారామయ్య .. తెగించిన ధాన్యలక్ష్మీ , ఆస్తి కోసం భారీ కుట్ర
చావు బతుకుల మధ్య ఉన్న సీతారామయ్య.. కావ్యతో మాట్లాడాలని అనుకుంటున్నాడని డాక్టర్ చెప్పడంతో ఆమె లోపలికి వెళ్తుంది. ఏం జరిగినా సరే, ఎవరెన్ని మాటలు అన్నా సరే దుగ్గిరాల కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడతానని కావ్య దగ్గరి నుంచి సీతారామయ్య మాట తీసుకుంటాడు. పెద్దాయన కండీషన్ క్రిటికల్‌గా ఉందని ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చని రాజ్‌తో డాక్టర్ చెబుతాడు.
ఎస్ఐ ట్రైనింగ్‌కి సెలెక్ట్ అయినట్లుగా అప్పూకి లెటర్ వస్తుంది .. అది చూసి కళ్యాణ్ చాలా సంతోషిస్తాడు. భార్యను ట్రైనింగ్‌కు పంపుతుండగా అతనికి కావ్య ఫోన్ చేసి తాతయ్యని ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లు చెప్పడంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. అప్పూని ఒంటరిగా స్టేషన్‌కి పంపి తాను దుగ్గిరాల ఇంటికి బయల్దేరతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక డిసెంబర్ 7వ తేదీ.. ఎపిసోడ్ 587లో ఏం జరిగిందంటే..

హాస్పిటల్ దగ్గరికి కళ్యాణ్ పరిగెత్తుకుంటూ వస్తాడు. నాయనమ్మకి ధైర్యం చెప్పి అసలెందుకు ఇలా జరిగింది అని ప్రశ్నిస్తాడు. ఇంతలో డాక్టర్ బయటికొచ్చి.. పెద్దాయన కోమాలోకి వెళ్లిపోయారని చెబుతాడు. తాతయ్య దగ్గర నేను ఉంటాను.. మీరంతా ఇంటికి వెళ్లిపోమని అంటాడు కళ్యాణ్. నాయనమ్మకి సర్దిచెప్పి ఆమెను అంతా కలిసి ఇంటికి తీసుకెళ్తారు . పెద్దాయనికి గుండెపోటు వచ్చిన విషయాన్ని కృష్ణమూర్తికి చెబుతుంది కనకం. తాను నమ్మలేకపోతున్నానని.. మహావృక్షం లాంటి మనిషి కుంగిపోవడం ఏంటని ప్రశ్నిస్తాడు కృష్ణమూర్తి. ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి కావ్య మెడకి చుట్టుకుంటుందేమోనని కనకం భయపడుతుంది. కావ్య జీవితంలో అడుగడుగునా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయని అంటుంది.
ఒంటరిగా కూర్చొని సీతారామయ్య ఫోటో చూసుకుంటూ బాధపడుతుంది ఇందిర. ఇంతలో కావ్య వచ్చి పెద్దావిడను ఓదారుస్తుంది. తాతయ్య లేకుండా ఎప్పుడు లేనని దీనికంటే చనిపోవడమే మంచిదని అంటుంది ఇందిర. ఉదయం నుంచి మీరు ఏం తినలేదని.. అందరం కలిసి భోజనం చేద్దాం రమ్మని పిలుస్తుంది కావ్య. భోజనాల దగ్గర కూడా ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతుంది రుద్రాణి. కొడుక్కి ఆస్తి రావాలని ఆమె ఆత్మహత్యాయత్నానికి కూడా సిద్ధపడిందని మరేం నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నిస్తుంది.
అన్నం తినను అంటే అమ్మమ్మని తీసుకుని బతిమలాడి తీసుకొస్తే మీరు ఇలాంటి మాటలు మాట్లాడి ఆమెను తినకుండా చేస్తారని మండిపడుతుంది కావ్య. ఆస్తిని ముక్కలు చేయడానికి ధాన్యలక్ష్మీ దగ్గర ఎంత కమీషన్ తీసుకున్నారని రుద్రాణిని నిలదీస్తుంది కావ్య. అసలు నీకేం సంబంధం ఉందని మాట్లాడుతున్నావని ధాన్యలక్ష్మీ ప్రశ్నిస్తుంది. ఆ మాటలకు కోప్పడిన అపర్ణ.. నేను ఈ ఇంటికి ఎలా పెద్ద కోడలినో , తాను కూడా నా తర్వాత ఈ ఇంటికి పెద్ద కోడలు అని చెబుతుంది . మీరంతా అంటే సరిపోదు.. రాజ్ తన భార్యగా ఒప్పుకోవాలి కదా అని అంటుంది ధాన్యలక్ష్మీ.
ధాన్యం తన కొడుక్కి న్యాయం చేయమని అడిగింది దానికే ఇంత రాద్ధాంతం చేస్తారా అంటూ రుద్రాణి ప్రశ్నిస్తుంది. ఆ మాటలకు అపర్ణ ఊగిపోతుంది. పెంపుడు జంతువులకు కూడా విశ్వాసం ఉంటుందని, కానీ కొందరికీ వాటికున్న బుద్ధి కూడా ఉండదని అంటుంది. నీ ఎదురుగా ప్లేట్‌లో ఉన్న అన్నం ఎవరి కష్టార్జితం? ఎవరి భిక్ష? అంటూ సీతారామయ్యని గుర్తుచేస్తుంది. అలాంటి మనిషి ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉంటే కొంచెం కూడా జాలి లేకుండా మాట్లాడుతున్నావ్ అంటూ అపర్ణ ఫైర్ అవుతుంది.
కావ్య పుట్టింటిలో గతి లేక మావయ్య గారు ఆమెను ఇంటికి తీసుకొచ్చారని అలాంటి ఆమె కూడా మాట్లాడుతుందా అంటూ ధాన్యలక్ష్మీ మండిపడుతుంది. దీనికి స్వప్న కలగజేసుకుని.. మాకు పుట్టిల్లు అయినా ఉంది, మీకు ఏముంది అని ప్రశ్నిస్తుంది. నేను ఓపిక పడుతున్నానని రెచ్చిపోతున్నావా అంటూ ధాన్యంపై మండిపడతాడు ప్రకాష్. పెద్దా, చిన్నా అన్న గౌరవం లేకుండా ఆ మాటలేంటీ అంటూ ఫైర్ అవుతాడు. మీకు పుట్టిల్లు అనేది ఉందా? ఏనాడైనా నా తమ్ముడిని పిలిచి అల్లుడిలా గౌరవించారా అని సుభాష్ కూడా స్వప్న మాదిరిగా ప్రశ్నిస్తాడు. . ఈ గొడవని చూసిన ఇందిర కోప్పడి ఆపమని గద్దిస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










