Brahmamudi December 9th Episode : ఇందిర మనసు ముక్కలు .. కావ్యకి షాకింగ్ న్యూస్ చెప్పిన కళ్యాణ్

తాతయ్య ఆరోగ్యం గురించి టెన్షన్ పడుతూ ఆసుపత్రికి పరిగెత్తుకుంటూ వస్తాడు కళ్యాణ్. నాయనమ్మని ఓదారుస్తుండగా ఇంతలో డాక్టర్ వచ్చి పెద్దాయన కోమాలోకి వెళ్లిపోయినట్లు చెప్పడంతో అంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తారు. సీతారామయ్యకి గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేసిన విషయం తెలుసుకున్న కృష్ణమూర్తి , కనకం చాలా బాధపడతారు. ఒంటరిగా కూర్చొని భర్త ఫోటోను చూస్తూ బాధపడుతున్న ఇందిరను కావ్య ఓదార్చి భోజనానికి తీసుకెళ్తుంది.

అంతా ముద్ద నోట్లో పెట్టుకోకముందే ఆస్తి కోసం రుద్రాణి, ధాన్యలక్ష్మీలు మరోసారి గొడవ చేస్తారు. దీంతో అపర్ణ, కావ్య, ప్రకాష్, సుభాష్‌లు వారికి చీవాట్లు పెడతారు. తన భర్త ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా గొడవ పడుతున్న వారసుల్ని చూసి ఇందిర కోప్పడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక డిసెంబర్ 9వ తేదీ.. ఎపిసోడ్ 588లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 588 December 9th 2024 Here is full story

ఎలాంటి కుటుంబంలో ఎలాంటి వాళ్లు తయారయ్యారు.. ఇంటి పెద్దకి ఆపద వస్తే ఆయనను ఎలా బతికించుకోవాలా అని ఆరాటపడతారు ? ఆయనకు ఏమైన అయితే ఆస్తిని ఎలా దక్కించుకోవాలా అని ఆలోచిస్తున్నారా? అని ఇందిర మండిపడుతుంది. నాకు ఇంత కష్టం వస్తే కడుపు నిండా అన్నం కూడా తిననీయకుండా చేస్తున్నారంటూ భోజనం చేయకుండానే వెళ్లిపోతుంది. కాసేపు అయ్యాక ఆమెకు భోజనం తీసుకుని కావ్య, అపర్ణలు ఇందిర గదిలోకి వెళ్లగా.. ఆమె లోపల కనిపించదు. అమ్మమ్మ తాతయ్య దగ్గరికే వెళ్లి ఉంటారని అంటుంది కావ్య.

ఆసుపత్రిలో తాతయ్య పక్కన నాయనమ్మని చూసి కళ్యాణ్ షాక్ అవుతాడు. తాతయ్య క్షేమంగా తిరిగొస్తారని.. అందరినీ నవ్వుతూ పలకరిస్తాడని కళ్యాణ్ అంటాడు. ఆ రోజులు పోయాయని.. మనవాళ్లు అనుకున్న వాళ్లంతా కానివాళ్లు అయిపోయారని ఇందిర వాపోతుంది. చివరి రోజుల్లో ఆయనకు ప్రశాంతత లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇంతలో కావ్య వచ్చి .. తాతయ్యని చూడాలని అనుకుంటే నేను కూడా వచ్చేదాన్నని చెబుతుంది. మీరు తినకుంటే నేను తినలేదని , నాకు కళ్లు తిరుగుతున్నాయని తాతయ్య పక్కనే ఇంకో బెడ్ వేయమని అంటుంది కావ్య. ఆమె మాటలకు ఇందిర మెత్తబడుతుంది. ఎట్టకేలకు ఆమెను ఓదార్చి అన్నం తినిపిస్తుంది కావ్య. ఇది చూసి కళ్యాణ్ చాలా సంతోషిస్తాడు.

తాతయ్య ఆరోగ్యం గురించి కావ్యకి కళ్యాణ్ షాకింగ్ న్యూస్ చెబుతాడు. అప్పూ ఎక్కడ.. దాన్ని తీసుకురాలేదా అని అడుగుతుంది కావ్య. తను ఎస్ఐ సెలక్షన్స్‌లో రాతపరీక్షలో పాసైందని.. ట్రైనింగ్‌‌కి రమ్మని లెటర్ వస్తే పంపించానని చెబుతాడు. తాతయ్యకి ఇలా జరిగిందని తెలిస్తే అప్పూ ట్రైనింగ్‌కి వెళ్లదని అందుకే నిజం చెప్పలేదని కళ్యాణ్ చెప్పడంతో మంచి పని చేశారని ప్రశంసిస్తుంది కావ్య. తనకి తెలిసిన తర్వాత పెద్ద గొడవ చేస్తుందని కళ్యాణ్ చెప్పగా.. అప్పూని ఎలా ఓదార్చాలో నాకు బాగా తెలుసు అంటుంది . ఇంట్లో పరిస్ధితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయని.. రోజుకొక గొడవ జరుగుతుందని కావ్య చెబుతుంది. మీరు వచ్చారు కాబట్టి మళ్లీ ఆ ఇల్లు తిరిగి మామూలుగా మారిపోతుందని అంటాడు కళ్యాణ్. భూదేవి అంతటి ఓర్పు మీకు ఉంది కాబట్టే.. తాతయ్య ఇంటి బాధ్యతల్ని మీకు అప్పగించాడని చెబుతాడు.

ఆస్తిలో వాటాను ఎలా పంచాలోనని ఆలోచిస్తూ డాక్యుమెంట్స్ చదువుతుంది ధాన్యలక్ష్మీ.. వాటిని చూసిన ప్రకాశ్ చించివేస్తాడు. ఆస్తిలో వాటా అడగటం అంటే ఇంటిని ముక్కలు చేయడమేనని మండిపడతాడు ప్రకాష్. కిచెన్‌లో నేలపై పడుకున్న కావ్యని చూసి షాక్ అవుతుంది అపర్ణ. వాడు రావొద్దు అన్నాడా? తలులు వేసేశాడా అని కోడలిని అడుగుతుంది . అమ్మమ్మ- తాతయ్య అంత కష్టపడి నిన్ను ఇక్కడికి తీసుకొస్తే నువ్వు నేల మీద పడుకుంటావా అంటూ మండిపడుతుంది. వెంటనే రాజ్‌ని పిలిచి నీ భార్య ఎక్కడ పడుకుందో చూడు అంటూ చూపిస్తుంది. నేల మీద పడుకున్నావా, ఈ ఇంట్లో మానవత్వం లేని మనుషులు ఉన్నారు అనుకున్నావా అంటూ మండిపడతాడు. మరి ఎక్కడ పడుకోవాలి అని అపర్ణ అడగ్గా.. రాజ్ నీళ్లు నములుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X