Brahmamudi December 10th Episode : అర్థరాత్రి రాజ్ బెడ్ మీదకి కావ్య .. రుద్రాణి తిరుగులేని అస్త్రం
తన ముందే కుటుంబ సభ్యులంతా ఆస్తి కోసం కొట్టుకుంటూ ఉండటంతో ఇందిర కోప్పడి భోజనం చేయకుండా వెళ్లిపోతుంది. దీంతో ఆమెకు అపర్ణ, కావ్యలు భోజనం తీసుకుని వెళ్లగా గదిలో ఇందిర కనిపించదు. ఆసుపత్రిలో భర్త పక్కన కూర్చొని ఏడుస్తున్న అమ్మమ్మను చూసి కళ్యాణ్ బాధపడతాడు, ఇంతలో భోజనం తీసుకుని కావ్య వస్తుంది.
తాతయ్య కోమాలో నుంచి ఎప్పుడొస్తాడో తెలియదని కావ్యకి కళ్యాణ్ షాకింగ్ న్యూస్ చెబుతాడు. అప్పూ ఎస్ఐ ట్రైనింగ్‌కి సెలెక్ట్ అయ్యిందని తెలుసుకున్న కావ్య చాలా సంతోషిస్తుంది. కళ్యాణ్ పేరిట రాయించిన ఆస్తి పేపర్లు చూసుకుంటూ ఉండగా ధాన్యలక్ష్మీపై మండిపడతాడు ప్రకాష్. వంట గదిలో నేలపై పడుకున్న కావ్యని చూసి అపర్ణ షాకై రాజ్‌ను పిలుస్తుంది. వారిద్దరూ కళావతికి చీవాట్లు పెడతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక డిసెంబర్ 10వ తేదీ.. ఎపిసోడ్ 589లో ఏం జరిగిందంటే..

కావ్య నీ భార్య, ఈ ఇంటి కోడలు.. పనిమనిషో , వంట మనిషో కాదు నీ గదిలో ఉండాలి అని రాజ్‌తో చెబుతుంది అపర్ణ. ఇక్కడ పడుకుంటుందని నాకేం తెలుసు అని అడుగుతాడు రాజ్. నీ గదిలో లేకపోతే, కనిపించకపోతే వచ్చి పిలిచి మరి తీసుకెళ్లాలని అంటుంది అపర్ణ. కావ్య గదిలోకి వెళ్లే సరికి రాజ్ ప్లాస్టర్‌తో బెడ్‌కి మధ్యలో గీతలా పెడతాడు. ఆ సగం నీది, ఈ సగం నాది నువ్వు నా వైపు రావొద్దు, నేను నీ వైపు రాను అని పడుకుంటాడు. మీరు మనస్పూర్తిగా భార్యగా అంగీకరించినప్పుడే బెడ్‌పై పడుకుంటానని తేల్చి చెబుతుంది కావ్య. అనంతరం చాప , దిండు తెచ్చుకుని పడుకుంటుంది కళావతి.
అర్థరాత్రి పూట పడుకోకుండా అటు ఇటు తిరుగుతుంది రుద్రాణి. ఇంతలో రాహుల్ వచ్చి పడుకోకుండా తిరుగుతున్నావని అడుగుతాడు. తాతయ్య కోమాలో నుంచి వచ్చాక మన ఆస్తి మనకు ఇస్తారులే అని అంటాడు. నువ్వు రేపు చెక్ తీసుకుని వెళ్లి నేను ఒక వ్యాపారం చేయాలని అనుకుంటున్నానని రూ.2 కోట్లు ఇవ్వమని అడుగు అని అంటుంది. తల్లి మాటలకు రాహుల్ గట్టిగా నవ్వి నేను చెక్ తీసుకెళితే నన్ను కుక్కను చూసినట్లు చూస్తాడని, నా ట్రాక్ రికార్డ్ మొత్తం వాడికి తెలుసునని అంటాడు.
రాజ్ సంతకం పెట్టడన్న సంగతి నాకు తెలుసని.. నేరుగా ఆ చెక్ తీసుకుని ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్తానని అంటుంది రుద్రాణి. ఆమెను రెచ్చగొట్టి రాజ్‌తో సంతకం పెట్టిద్దామని చెబుతుంది. అత్త అడిగినప్పుడు అంత ఈజీగా సంతకం పెట్టేస్తాడా అని రాహుల్ ప్రశ్నించగా.. పెట్టకపోవడమే నాక్కూడా కావాలని అప్పుడే మన ప్లాన్ వర్కవుట్ అవుతుందని రుద్రాణి అంటుంది. ఉదయాన్నే రాజ్, ప్రకాష్‌లు ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉండగా రాహుల్, రుద్రాణిలు చెక్ తీసుకుని వస్తారు. రాజ్ దగ్గరికి వెళ్లి నీతో మాట్లాడాలి అని అంటాడు.
ఒక చెక్ మీద సంతకం చేయాలని అడగ్గా.. ఎంత రూ.50 వేలా, రూ. లక్ష అని ప్రశ్నిస్తాడు రాజ్. రెండు కోట్లని రాహుల్ అనడంతో ప్రకాష్ ఎగిరిపడతాడు. నేను నా కాళ్ల మీద నిలబడాలని అనుకుంటున్నానని.. డైమండ్స్ బిజినెస్ పెడతానని రాజ్‌కు చెబుతాడు రాహుల్. నీకు అందులో అనుభవం లేదు కదా అని రాజ్ ప్రశ్నించగా.. ఎక్స్‌పర్ట్స్‌ని పెట్టుకుని వ్యాపారం చేస్తానని అంటాడు . నీకు రెండు కోట్లు ఇస్తే ఏం చేస్తావో ఈ ఇంట్లో అందరికీ తెలుసని చెబుతాడు ప్రకాష్. కష్టపడాలనే ఆలోచన నీకు ఉంటే నీ భార్యని, తల్లిని పోషించడం మొదలుపెట్టు అని అంటాడు .
డైమండ్ బిజినెస్ చేయాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చిందని ప్రకాష్ అడగ్గా.. రుద్రాణి కలగజేసుకుంటుంది. నేను ఏం మరిచిపోయినా దాని వల్ల ఎవరికీ ఏ నష్టం జరగలేదంటూ రుద్రాణికి కౌంటర్ ఇస్తాడు ప్రకాష్. రాహుల్‌ను కొన్నాళ్లు కంపెనీకి పంపిస్తే కోట్లాది రూపాయలు లాస్ తీసుకొచ్చాడని అంటాడు. రాజ్ ఇస్తానన్నా నేను ఇవ్వనివ్వనని తేల్చిచెబుతాడు ప్రకాష్. ఈ విషయాన్ని నేను ఇంతటితో వదిలిపెట్టనని అంటుంది రుద్రాణి. నువ్వు ఈ పాముని నమ్మొద్దని.. నా పెళ్లాన్ని ఊసిగొలిపి మా నాన్నని ఆసుపత్రి పాలు చేసిందని రాజ్‌కి చెబుతాడు ప్రకాష్.
తమ ప్లాన్ వర్కవుట్ అయినందుకు రుద్రాణి - రాహుల్ ఆనందపడతారు. వెంటనే ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్లి మరో నాటకం మొదలుపెట్టి.. జరిగినదంతా చెబుతారు. బిజినెస్ చేస్తే నా కొడుకు బాగుపడతాడని, మాకు డబ్బులిస్తే వాళ్ల ఆస్తులు కరిగిపోతాయని రుద్రాణి అంటుంది. నువ్వే నాకు హెల్ప్ చేయాలని.. నా బిజినెస్ సెట్ అయితే ఫ్యూచర్‌లో కళ్యాణ్‌ని నా పార్ట్‌నర్‌గా చేసుకుని సెటిలైపోతామని ధాన్యలక్ష్మీతో రాహుల్ అంటాడు. అయినా ఎందుకు ఆలోచిస్తున్నావని రాహుల్ అడగ్గా .. మనలాగే ధాన్యలక్ష్మీని ఎక్కడ చీ కొడతాడోనని భయపడుతుందని రుద్రాణి రెచ్చగొడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










