Brahmamudi December 13th Episode : రుద్రాణి కొత్త స్కెచ్, అన్నంత పనిచేసిన ధాన్యం .. కావ్యకి అండగా రాజ్
ఆస్తి ముక్కలు కాకుండా చూడాలని రాజ్‌ను వేడుకుంటుంది కావ్య. తాతయ్య తనకు నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకున్నాడని.. ఇప్పుడు నా చేయి దాటిపోయిందని అంటాడు రాజ్. ఆస్తి పంపకాలకి సుభాష్ నిర్ణయం తీసుకోవడంతో ధాన్యలక్ష్మీ, రుద్రాణిలు పండగ చేసుకుంటుండగా ప్రకాష్ వచ్చి ఇద్దరిపై మండిపడతాడు.
ఉదయాన్నే ఆఫీస్‌కి వెళ్తున్న రాజ్‌ను అపర్ణ, కావ్యలు ఆపుతారు. ఇంతలో లాయర్ రావడంతో ఆస్తిని ముక్కలు చేయాలని నిర్ణయించుకున్నామని సుభాష్ చెబుతాడు. మీకు ఆ అధికారం లేదని మీ నాన్నగారు కొద్దిరోజుల క్రితమే వీలునామా రాశారని చెబుతారు లాయర్. దానిని అందరి ముందు చదివి వినిపించగా.. అందులో ఆస్తి మొత్తం కావ్య పేరిట రాసి ఉండంతో అంతా షాక్ అవుతారు. దీనిని నేను ఒప్పుకునేది లేదని కోర్టులో తేల్చుకుంటానని ధాన్యలక్ష్మీ వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక డిసెంబర్ 13వ తేదీ.. ఎపిసోడ్ 592 ఏం జరిగిందంటే..

ఆస్తి తన పేరు మీద రాయడంతో కావ్య దేవుడి ముందు బాధపడుతుంది. నా భర్తను మార్చి నా మనసు తేలిక చేస్తావు అనుకుంటే నా నెత్తిన ఇంత బరువు పెట్టి నన్ను నడవమంటావా అంటూ అడుగుతుంది. ఇంతలో ఇందిర వచ్చి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసని చెబుతుంది. ఇంతలో సుభాష్ వచ్చి.. ఆస్తి మొత్తం అపాత్రదానం కాకుండా భగవంతుడే అడ్డుపడ్డాడని , ఆస్తి నా పేరిట రాసినా, రాజ్ పేరిట రాసినా ఈ రాబందులు వాటా అడుగుతారని నాన్న ఆస్తి మొత్తం నీ పేరిట రాసి మంచి పనిచేశాడని సంతోషిస్తాడు.
ఇది పరిష్కారం కాదని.. చిన్నత్తయ్య కోర్టుకు వెళ్తానని అంటున్నారని, రుద్రాణి ఎగదోస్తోంది అని బాధపడుతుంది కావ్య. నువ్వేం భయపడొద్దని.. నీ వెనుక మేమంతా ఉన్నామని ధైర్యం చెప్పి వీలునామా, ఇంటి తాళాలను కావ్య చేతుల్లో పెడతాడు సుభాష్. ఇక నుంచి ఆస్తే కాదు, ఈ ఇంటి బాధ్యతలు కూడా నీకే అప్పగిస్తున్నానని.. ఇది దుగ్గిరాల వారింటి గౌరవమని చెబుతుంది అపర్ణ. ఎప్పటికైనా ఈ ఇంటి బాధ్యత నీదేనని.. కాకపోతే ముందొచ్చిందని అంటుంది. ఈ ఇల్లు, కుటుంబం, ఆస్తి ముక్కలు కాకూడదు అన్నదే మీ తాతయ్య ఉద్దేశమని ఇందిర చెబుతుంది.
అనంతరం వీలునామా పేపర్లు, తాళాలను తీసుకుని రాజ్ దగ్గరికి వెళ్తుంది కావ్య. అది చూసిన రాజ్ .. నా దగ్గర వీటిని ఎందుకు పెడుతున్నావ్ అని ప్రశ్నిస్తాడు. ఆస్తి పేపర్లు, తాళాలు నాకిచ్చారని.. ఇవన్నీ నా వల్ల కాదని ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పి వెళ్లిపోతుంది కావ్య. దీంతో రాజ్ కోప్పడి.. ఈ ఇంట్లో అందరికంటే నువ్వే సమర్ధురాలివి, నువ్వే తెలివైనదానివి అని తాతయ్య నిన్ను నమ్మాడని అంటాడు. అయినా ఒకరు ఇస్తే నేను ఏది తీసుకోనని.. ఆస్తి అయినా, అధికారం అయినా నేనే సాధించుకుంటానని తేల్చి చెబుతాడు రాజ్.
ఏం చేయాలో తెలియక కావ్య వెళ్లిపోతుండగా.. తాను ఆవేశంతో చెప్పడం లేదని, ఆలోచించి చెబుతున్నానని అంటాడు రాజ్. ఒక రకంగా ఈ బాధ్యతలన్నీ చూసుకోవడానికి నువ్వే కరెక్ట్ , ఆ తాళాలు నీ చేతుల్లో ఉంటేనే సేఫ్‌గా ఉంటాయని .. తాతయ్య పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు నిలబెడతావ్ అనుకుంటున్నానని చెప్పి వెళ్లిపోతాడు. భర్త నుంచి అలాంటి మాటలు ఊహించని కళావతి షాక్ అవుతుంది. ఆస్తి మొత్తం కావ్య పేరు మీదకి వచ్చే సరికి రుద్రాణి, రాహుల్‌లు బాధపడుతుంటారు. ఇంతలో అనుకున్నది ఒక్కటి అనే పాట పెట్టుకుని స్వప్న వస్తుంది. రాహుల్‌కి ఆస్తి వస్తే నీకు వచ్చినట్లే కాదా అని స్వప్నపై రుద్రాణి మండిపడుతుంది.
మీరిద్దరూ కలిసి నన్ను ఇంట్లో నుంచి గెంటేయాలని, నా కడుపు పొగొట్టాలని చూశారని గతం గుర్తుచేస్తుంది స్వప్న. ఆస్తిని లాక్కోవాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఆ కావ్యే మా కాళ్లు పట్టుకునేలా చేస్తానని రాహుల్‌తో రుద్రాణి అంటుంది. ఆస్తిలో వాటా దక్కకపోయేసరికి కోర్టుకెక్కాలని ధాన్యలక్ష్మీ భావించి లాయర్‌తో మాట్లాడుతుండగా ప్రకాశం వింటాడు. నువ్వు ఏ అధికారం ఉందని కావ్య మీద కేసు వేస్తావని ప్రకాశం ప్రశ్నిస్తాడు. నాకు అధికారం లేకపోవచ్చు.. కానీ కళ్యాణ్‌కి ఉందని ధాన్యం చెప్పగా, అన్నవదినలను వాడు సీతారాముల్లా చూసుకుంటున్నాడని వాడెందుకు కేసు వేస్తాడని ప్రశ్నిస్తాడు ప్రకాశం.
ఉదయాన్నే కావ్య వచ్చి కాఫీ ఇస్తుండగా తాతయ్య ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతుంది ఇందిర. ఇంతలో కనకం వచ్చి గుమ్మం దగ్గర నిలబడుతుంది. రుద్రాణి, ధాన్యలక్ష్మీలు ఆమెను నానామాటలు అంటుండగా ప్రకాష్ , స్వప్నలు కౌంటర్ ఇస్తారు. తర్వాత పెద్దావిడని కలిసి ఓదారుస్తుంది కనకం. నువ్వు పలకరించడానికి వచ్చావో, లేక పగ్గాలు కూతురి చేతుల్లోకి వచ్చాయని ఆస్తి రాయించుకోవడానికి వచ్చావో ఎవరికి తెలుసని అంటుంది రుద్రాణి. అలాంటి బుద్ధులు మా అమ్మకు లేవని కావ్య, స్వప్నలు కౌంటర్ ఇస్తారు.
చేసినదంతా చేసి ఏం తెలియనట్లు నటించొద్దు అంటుంది రుద్రాణి.. మా నాన్నని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయించి, ఆస్తి మొత్తం నీ కూతురి మీద రాయించుకున్నావని ఆరోపిస్తుంది . అలాంటి ఆశ, ఆలోచన నాకు .. నా పిల్లలకు లేదని కనకం బదులిస్తుంది. ఇంట్లో ఇంత మంది ఉన్నా.. నా కూతురే సరైన మనిషి అని నమ్మి ఆ పెద్దాయన ఆస్తి రాశాడని చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











