Brahmamudi December 14th Episode : సీతారామయ్యని ముంచేసిన మిత్రుడు .. రాజ్ పీకల మీదకి, కుటుంబం రోడ్డు పాలేనా?

ఆస్తి పేపర్లు, ఇంటి తాళాలను కావ్య చేతిలో పెడతారు ఇందిర, సుభాష్, అపర్ణ. దీంతో కళావతి నేరుగా రాజ్ దగ్గరికి వెళ్లి పేపర్లు, ఇంటి తాళాలను భర్త ముందు పెడుతుంది. నేను ఈ బాధ్యతలను మోయలేనని నా వల్ల కాదని మీ ఆస్తి, తాళాలను మీరే తీసేసుకోండని భర్తకు చెబుతుంది. ఇప్పుడున్న పరిస్ధితుల్లో నీ దగ్గరే ఆస్తి , తాళాలు సేఫ్‌గా ఉంటాయని .. తాతయ్య నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టమని కావ్యకి ధైర్యం చెబుతాడు రాజ్.

ఆస్తి మొత్తం కావ్య చేతికి వచ్చేసరికి రాహుల్, రుద్రాణిలు జుట్టు పీక్కుంటూ ఉంటారు. అటు ధాన్యలక్ష్మీ లాయర్‌తో మాట్లాడుతుండగా ప్రకాష్ వస్తాడు. నీకు ఏం హక్కు ఉందని కావ్య మీద కేసు వేస్తావ్ అని అడగ్గా.. కళ్యాణ్ వేస్తాడని చెబుతుంది. అన్నా వదినలను ప్రేమగా చూసుకునే కళ్యాణ్ చచ్చినా ఆ పని చేయడని అంటాడు ప్రకాశం. ఉదయాన్నే ఇందిరను పరామర్శిద్దామని కనకం రాగా.. ఆమెను రుద్రాణి, ధాన్యలక్ష్మీలు నానామాటలు అంటారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక డిసెంబర్ 14వ తేదీ.. ఎపిసోడ్ 593లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 593 December 14th 2024 Here is full story

ఈ ఇంట్లో అయినవాళ్లు ఎవరో? పరాయి వాళ్లు ఎవరో తెలియడం లేదని కనకంతో చెప్పుకుని ఇందిర కన్నీటి పర్యంతమవుతుంది. రాజ్ ఆఫీస్‌లో ఉండగా బ్యాంక్ నుంచి ఇద్దరు వ్యక్తులు అనుమతి లేకుండా సరాసరి లోపలికి రావడంతో రాజ్ మండిపడతాడు. మేం మీ తాతయ్య గారిని కలవాల్సి ఉందని కానీ ఆయన కోమాలో ఉన్నట్లు తెలియడంతో మీ దగ్గరికి వచ్చినట్లు చెబుతారు. మీ తాతయ్య 100 కోట్లకు ష్యూరిటి పెట్టారని చెప్పడంతో రాజ్‌కి ఏమీ అర్ధం కాక కొంచెం క్లారిటీగా చెప్పమంటాడు. మీకు ఎన్‌డీ చిట్‌ఫండ్ కంపెనీ తెలుసు కదా అని బ్యాంక్ వాళ్లు ప్రశ్నించగా.. తెలుసు అది మా తాతయ్య ఫ్రెండ్‌దేనని అయినా ఆయన చనిపోయారు కదా అని అంటాడు.

ఆయన చనిపోయాక ఆయన కొడుకు నడిపించాడని.. ఆ కంపెనీ సడెన్‌గా బోర్డు తిప్పేసిందని సుమారు 1000 మంది అందులో డిపాజిట్లు చేశారని బ్యాంక్ వాళ్లు చెబుతారు. ఆ కంపెనీని స్టార్ట్ చేసే సమయంలో మీ తాతగారు వాళ్ల ఫ్రెండ్‌ని నమ్మి రూ. 100 కోట్లకు బ్యాంక్‌‌లో ష్యూరిటీ సంతకం చేశారని అంటారు. అతను బ్యాంక్‌కి కట్టాల్సిన లోన్లు మొత్తం ఎగ్గొట్టి.. కస్టమర్లని మోసం చేసి పరారీలో ఉన్నాడని కాబట్టి అతని తరపున ష్యూరిటీ ఇచ్చిన మీ తాతయ్య గారే 100 కోట్లు కట్టాలని తేల్చిచెబుతారు. మీ తాతయ్య కోమాలో ఉన్నారు కాబట్టి.. ఆయన వారసుడిగా, ఈ కంపెనీ ఎండీగా ఆ బాధ్యత మీరు తీసుకుని రూ.100 కోట్లు కట్టేస్తారా? లేక వెంటనే మీ ఆస్తిని జప్తు చేయమంటారా? అని ప్రశ్నించడంతో రాజ్ షాక్ అవుతాడు.

Brahmamudi Serial Today s Episode 593 December 14th 2024 Here is full story

నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలని రాజ్ అడగ్గా.. బ్యాంక్ వాళ్లు కుదరదని చెబుతారు. అతని ముందు కొన్ని పేపర్లు పెట్టి వాటిపై సంతకం చేయమంటారు. లేదంటే మీ ఆస్తిని ఇప్పటికిప్పుడే జప్తు చేస్తామని బెదిరించడంతో రాజ్ తప్పనిసరి పరిస్ధితుల్లో సంతకం పెట్టబోతుండగా మేనేజర్ పర్సనల్‌గా మాట్లాడాలని పిలుస్తాడు. మీరు సంతకం పెట్టొద్దు.. ఆయన పేరిట ఇప్పుడు ఏ ఆస్తి లేదని, మీ తాతయ్య కోమాలో ఉన్నారు కాబట్టి ఆయన మాటకు విలువ ఉండదని అనడంతో రాజ్ కోప్పడతాడు. ఆస్తి కోసం మా తాతయ్య ఇచ్చిన మాటను గాలికి వదిలేయనని చెప్పి సంతకం చేస్తాడు.

రుద్రాణి సుభాష్ దగ్గరికి వచ్చి రూ.2 లక్షలు కావాలి అని అడగ్గా నేనే ఈ ఇంటికి పెద్దను మాత్రమేనని ఇంటి బాధ్యతలు మొత్తం కావ్యవేనని చెబుతాడు. నేను ఇప్పుడు ఆవిడగారి ముందు చేతులు కట్టుకుని, కారణం చెప్పి డబ్బులు అడుక్కోవాలా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. ఇంతలో రాహుల్ వచ్చి తల్లికి నచ్చజెప్పి సుభాష్‌ను కూల్ చేస్తాడు. తాళాలు కావ్య దగ్గర ఉండటమే బెటర్ అని.. ఆమెను జుట్టు పట్టుకుని ఆడించవచ్చని అంటాడు.

గార్డెన్‌లో మొక్కలకి నీళ్లు పోస్తున్న కావ్య దగ్గరికి వచ్చి నాకు రెండు లక్షలు కావాలని అడగటంతో కళావతి షాక్ అవుతుంది. ఇవ్వడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కారణం తెలుసుకోవచ్చా అని అడుగుతుంది కావ్య . అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ ధాన్యలక్ష్మీ మధ్యలో అడ్డుపడుతుంది. రేపు ఎవరైనా అడిగితే మాకు ఇచ్చానని చెప్పమని కావ్యపై మండిపడుతుంది. నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉందని ధాన్యలక్ష్మీని ఆకాశానికి ఎత్తేస్తుంది రుద్రాణి. ఇంతలో కావ్య వచ్చి డబ్బు ఇస్తుంది. ఇకపై నేను ఎంత అడిగితే అంత నోరు మూసుకుని ఇవ్వాలని చెప్పి కావ్యకి ఆర్డర్ వేస్తుంది రుద్రాణి.

Brahmamudi Serial Today s Episode 593 December 14th 2024 Here is full story

రాజ్ ఆఫీస్‌లో 100 కోట్ల గురించి ఆలోచిస్తుండగా శృతి ఫైల్ తీసుకొచ్చి సంతకం చేయమని అడుగుతుంది. ఎన్నిసార్లు పెట్టాలని అడగ్గా.. మీరు ఫైల్ కనీసం చూడలేదని చెబుతుంది శృతి. ఇది ఇంపార్టెంట్ ఫైల్ అని.. కొత్త ప్రాజెక్ట్ గురించి క్లయింట్లకు పంపించాలని ఆమె చెప్పగా.. ఇప్పుడు పెట్టకపోతే నాకేమీ 100 కోట్లు లాస్ రాదంటూ శృతిపై రంకెలు వేస్తాడు. మన కంపెనీ బాధ్యతలతో పాటు కంపెనీ పేరు ప్రతిష్టలను నిలబెట్టాల్సింది నువ్వేనని తాతయ్య చెప్పిన మాటలు రాజ్‌కు గుర్తొస్తాయి. తన రూమ్‌లో నుంచి బయటికి వచ్చి స్టాఫ్ మొత్తాన్ని చూస్తాడు. 10 రోజుల్లో రూ.100 కోట్లు కట్టకుంటే నన్ను నమ్ముకుని పనిచేస్తున్న వీళ్లంతా రోడ్డు మీద పడతారని భయపడతాడు రాజ్. అతనిని గమనిస్తున్న శృతి.. ఏదో అయ్యిందని అనుకుంటుంది. ఇంతలో కార్ వదిలేసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X