Brahmamudi December 16th Episode : కావ్యని ఏటీఎంలా వాడేస్తోన్న ధాన్యలక్ష్మీ .. రాజ్‌కి ఎస్ఐ వెన్నుపోటు
రాజ్ ఆఫీస్‌లో ఉండగా కొందరు బ్యాంక్ అధికారులు నేరుగా ఎండీ రూమ్‌లోకి దూసుకొస్తారు. మీ తాతయ్య గారు వాళ్ల ఫ్రెండ్‌ని నమ్మి అతని ఓ చిట్ ఫండ్ కంపెనీకి రూ.100 కోట్లు ష్యూరిటీ సంతకం పెట్టారని చెబుతారు. ఆ కంపెనీ ఇప్పుడు దివాళా తీయడంతో వాళ్లు మాకు కట్టాల్సిన డబ్బును మీ తాతయ్య కట్టాలని.. ఆయన కోమాలో ఉన్నారు కాబట్టి సీతారామయ్య వారసుడిగా మీరే కట్టాలని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు.
10 రోజులు టైం ఇస్తున్నామని.. ఈలోగా 100 కోట్లు కట్టకుంటే మీ ఆస్తుల్ని జప్తు చేస్తామని బెదిరించడంతో రాజ్ షాక్ అవుతాడు. డబ్బు కోసం కావ్యను పీడుస్తూ ఉంటారు రుద్రాణి, ధాన్యలక్ష్మీ. గడువులోగా 100 కోట్లను ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక రాజ్ రోడ్డుపై నడుచుకుంటూ పిచ్చోడిలా తిరుగుతుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక డిసెంబర్ 16వ తేదీ.. ఎపిసోడ్ 594లో ఏం జరిగిందంటే..

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న రాజ్‌ని డ్రైవర్ ఆపి కారు ఎక్కించుకుంటాడు. అనంతరం పోలీస్ ఆఫీసర్ అయిన తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి ఎన్‌డీ చిట్‌ఫండ్ కేసు గురించి ఆరా తీస్తాడు. ఇంతలో వంట గదిలో ఉన్న కావ్య దగ్గరికి రుద్రాణి, ధాన్యలక్ష్మీ వచ్చి మాకు పండ్లు, పాలు కావాలని తెప్పించాలని అడుగుతారు. ఆస్తి నీ పేరిట రాశారని నీ కళ్లు నెత్తికెక్కాయంటూ నానా మాటలు అంటారు. నా రూమ్‌లో ఏసీ పనిచేయడం లేదని, సబ్బులు అరిగిపోయాయని ఏదేదో ఫిర్యాదులు చేస్తుంటారు.
మరోవైపు.. పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన అడ్రస్‌తో చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ నందగోపాల్ ఇంటికి వెళ్తాడు రాజ్. సార్ లేరని ఎక్కడికి వెళ్లారో కూడా తెలియదని వాచ్‌మెన్ చెబుతాడు. ఇలా పని జరగదని భావించిన రాజ్ కొత్త ప్లాన్ వేస్తాడు. మీ సార్‌కి రూ. 50 లక్షలు ఇవ్వాలని ఆయన లేరు కాబట్టి వెళ్లిపోతానని అంటాడు. ఆ మాటలతో షాకైన వాచ్‌మెన్ .. మా సార్ ఫాంహౌస్‌లో ఉన్నారని నిజం చెబుతాడు. ఆడ్రస్ తెలుసుకున్న రాజ్ అక్కడికి కోపంగా వెళ్తాడు.'

డిజైనర్‌ని పిలిపించి ఖరీదైన చీరలని సెలెక్ట్ చేసిన ధాన్యలక్ష్మీ నాకు మూడు లక్షలు కావాలని వెంటనే వెళ్లి తీసుకురా అంటూ కావ్యకి ఆర్డర్స్ వేస్తుంది. ఆమె డబ్బు తీసుకొచ్చి ఇవ్వగానే ఇంటికొచ్చిన మూడో వ్యక్తి ముందు నా పరువు తీయాలని అనుకుంటున్నావా అంటూ మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. నేను మూడు లక్షలు ఖర్చు పెట్ట కూడదా అంటూ నిలదీస్తుంది. ఇంట్లో ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకుని తీర్చడమే నీ పని అని అంతే తప్పించి సింహాసనమెక్కి కూర్చుంటానని అంటే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. వీళ్లు కావాలని డబ్బులు నీళ్లలా ఖర్చు పెడుతున్నారని.. నన్ను ఇరికించడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని కావ్య తనలో తాను ఆలోచిస్తుంది.
నందగోపాల్ అడ్రస్ తెలుసుకున్నట్లు పోలీస్ ఆఫీసర్‌కి చెబుతాడు రాజ్. వాడిని అస్సలు వదలొద్దని, వాడో పెద్ద ఫ్రాడ్ అని ఎంతోమంది అమాయకుల జీవితాలతో ఆడుకున్నాడని చెబుతాడు పోలీస్ ఆఫీసర్ . అయితే ఆ పోలీస్ ఆఫీసర్ కూడా నందగోపాల్ మనిషే కావడంతో రాజ్ అక్కడికి వస్తున్న విషయం అతనికి చెప్పి వెంటనే పారిపోమంటాడు. ఇంతలో రాజ్ అక్కడికి రాగా.. సార్ ఇక్కడ లేరని కొద్దిసేపటి క్రితమే బయటికి వెళ్లిపోయారని చెబుతాడు వాచ్‌మెన్. దీంతో ఏం చేయాలో తెలియక రాజ్ ఆలోచిస్తుండగా పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి దొరికాడా అని అడుగుతాడు.

ఇంతలో స్వప్న బయటికి వచ్చి తాను ఆన్‌లైన్‌లో శారీ ఆర్డర్ చేశానని.. నాకు లక్షన్నర కావాలని అడగటంతో కావ్య షాక్ అవుతుంది. మనం మధ్య తరగతి వాళ్లమని వెయ్యో, రెండు వేలల్లోనో ఖర్చు చేయాలని అంటుంది. నేను కనకం కూతురిని కాదని, దుగ్గిరాల వారింటి కోడలిని అని చెబుతుంది స్వప్న. పరిస్ధితులకు తగినట్లుగా మనల్ని మార్చుకోవాలని అనేసరికి కావ్యకి ఏం చేయాలో తెలియక స్వప్న అడిగినంత మొత్తం తెచ్చిస్తుంది. దానిని చూసిన రుద్రాణి మేం అడిగితే ఎందుకు ఏంటి అని వంద ఆరాలు తీస్తున్నావ్.. అదే మీ అక్క అడిగితే ఏం మాట్లాడకుండా ఇచ్చేస్తున్నావని కావ్యని నిలదీస్తుంది.
మీరు ఎప్పుడెప్పుడు ఎంత ఖర్చు చేస్తున్నారో నా దగ్గర రుజువులు ఉన్నాయని నా జోలికి వస్తే చిట్టా బయటపెడతానని వార్నింగ్ ఇస్తుంది స్వప్న. మా ఖర్చులు నేను, నా చెల్లి చూసుకుంటామని మీ పని మీరు చూసుకోండి అంటూ మండిపడుతుంది . ఇక ఈ బాధ్యతలు మోయటం నా వల్ల కావడం లేదని రాజ్ ఆఫీస్ నుంచి రాగానే ఆయనకి ఇచ్చేయాలని అనుకుంటుంది కావ్య. ఇంతలో రాజ్‌కు ఆ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి నందగోపాల్ ఎక్కడా కనిపించటం లేదని త్వరలోనే వాడి ఆచూకీ కనుక్కుంటానని అంటాడు. నా కంపెనీ పెద్ద ఇబ్బందుల్లో పడిందని ష్యూరిటీ గురించి చెబుతాడు రాజ్. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










