Brahmamudi December 17th Episode : తాతయ్య మాటని నిలబెట్టిన రాజ్.. నరకంలా మారిన కావ్య జీవితం

తనను, తన కుటుంబాన్ని సమస్యల్లోకి నెట్టిన చిట్‌ఫండ్ కంపెనీ ఓనర్‌ నందగోపాల్‌ను వెతుకుతూ వెళ్తాడు రాజ్. అతని అడ్రస్ కనుక్కొని వెళ్తుండగా తన ఫ్రెండ్ అయిన ఓ పోలీస్ ఆఫీసర్‌కి విషయం చెబుతాడు. అయితే అతను నందగోపాల్ మనిషి కావడంతో రాజ్ వస్తున్న విషయం చెప్పి పారిపోమంటాడు. ఉన్న అవకాశం చేజారిపోవడంతో రాజ్ బాధపడుతుంటాడు.

ఇంట్లో డబ్బు కోసం రుద్రాణి, ధాన్యలక్ష్మీలు కావ్యని పీడుస్తుంటారు. ఇంతలో స్వప్న వచ్చి తనకు లక్షన్నర కావాలని అడుగుతుంది. ఆ మాటలతో షాకైన కావ్య.. నువ్వు కూడా మొదలుపెట్టావా అని చీవాట్లు పెట్టి అడిగినంత ఇస్తుంది. అది చూసిన రుద్రాణి మేం అడిగితే ఎందుకు, ఏమిటీ అని ఆరాలు తీసి మీ అక్కకి మాత్రం అడక్కుండానే ఇస్తున్నావా అంటూ మండిపడుతుంది. ఇకపై ఇంటి బాధ్యతలు మోయటం తన వల్ల కాదని నిర్ణయించుకున్న కావ్య భర్త ఇంటికి రాగానే తాళాలు ఇచ్చేయాలని అనుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక డిసెంబర్ 17వ తేదీ.. ఎపిసోడ్ 595లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 595 December 17th 2024 Here is full story

ఉదయాన్నే హాల్‌లో రుద్రాణి, రాహుల్ కూర్చొని ఉండగా.. ఓ పేద కుటుంబం దుగ్గిరాల వారి ఇంట్లోకి వస్తుంది. అది చూసిన రుద్రాణి ఎవరు మీరు డైరెక్ట్‌గా లోపలికి వచ్చేస్తున్నారు అంటూ మండిపడుతుంది. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? అని అడగ్గా.. సీతారామయ్య గారు మా అబ్బాయిని చిన్నప్పటి నుంచి చదివిస్తున్నారని , ఇప్పుడు ఇంజనీరింగ్‌లో సీటు వచ్చిందని ఆర్ధిక సాయం చేస్తామని రమ్మంటే వచ్చామని ఆ వ్యక్తి చెబుతాడు. ఇప్పుడు ఆ పెద్దాయన ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్నాడని.. ఇక మీకేం ఇస్తాడని అంటుంది రుద్రాణి. సుభాష్ గారితోనైనా ఒక్క మాట చెప్పించమని వారు ప్రాధేయపడగా.. ఎవరు లేరు ముందు బయటికి నడవండి అంటుంది రుద్రాణి. దీంతో వారు ఇంటి బయట బాధపడుతుండగా రాజ్ చూస్తాడు.

లోపలికొచ్చి ఏం జరిగిందని రుద్రాణిని అడగ్గా.. ఆమె జరిగినదంతా చెబుతుంది. వాళ్లని ఎందుకు పోమ్మన్నావ్ .. ఇది తాతయ్యని అవమానించినట్లేనని , ఇంకోసారి నీకు సంబంధం లేదని విషయాల్లో జోక్యం చేసుకోవద్దని రాజ్ వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో రాహుల్‌ని ఎవరు చదివించారని సుభాష్‌ని అడుగుతుంది స్వప్న. మా నాన్నే చదివించాడని అంటాడు. మీలాంటి దారినపోయే వాళ్లని చదివించినప్పుడు ఇంకో కుర్రాడికి విద్యాదానం చేస్తున్నప్పుడు వద్దు అని ఎందుకు అన్నావ్ అంటుంది స్వప్న.

Brahmamudi Serial Today s Episode 595 December 17th 2024 Here is full story

బాబుని చదివించడానికి తాతయ్య ఎంత సాయం చేస్తానని తాతయ్య చెప్పారని రాజ్ అడగ్గా.. 5 లక్షలు అని చెబుతాడు ఆ వ్యక్తి. దీంతో కావ్యకి చెప్పి ఆ డబ్బును తీసుకురమ్మంటాడు రాజ్. దానిని తీసుకొచ్చి ఇందిర చేతుల మీదుగా ఇప్పిస్తుంది కావ్య. తాతయ్య ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఆయనకు సరైన వారసుడు అనిపించుకున్నారని ఆ పేద కుటుంబం రాజ్‌ని ప్రశంసిస్తుంది. వాళ్లు వెళ్లిపోగానే ఇలా లక్షలకు లక్షలు దానం చేస్తే అందరం రోడ్డున పడతామని రుద్రాణి అంటుంది.

పడితే పడతామని.. కానీ నా భర్త మాటకు, ఆయన గౌరవ మర్యాదలకు ఎలాంటి భంగం కలగకూడదని అంటుంది ఇందిర. నిజంగానే ఆస్తులు పోయే పరిస్ధితులు వస్తే నా కొడుకులు, మనవళ్లు తిరిగి సంపాదిస్తారని చెబుతుంది. ఇదే విషయాన్ని రాజ్‌ని అడగ్గా.. తాతయ్య ఇచ్చిన మాటను నిలబెట్టడం నా బాధ్యత అని చెబుతాడు. నువ్వు రావడం ఒక్క క్షణం లేట్ అయ్యుంటే మీ తాతయ్య ఇచ్చిన మాట తప్పినట్లు అయ్యేదని నువ్వు ఈ కుటుంబ పరువుని కాపాడావని మనవడిని మెచ్చుకుంటుంది.

ఆసుపత్రిలో ఉండగా కళ్యాణ్‌కి అప్పూ ఫోన్ చేస్తుంది. ఒక్క ఫోన్ కూడా చేయకుండా, నేను ఉన్నానో లేదో కూడా పట్టించుకోవా అని అడుగుతుంది. కావ్యని సుభాష్ 2 లక్షలు, ప్రకాశం లక్ష అడుగుతారు. ఆ వెంటనే రాహుల్ వచ్చి 50 వేలు కావాలని అడుగుతాడు. కావ్య కారణం అడగ్గా.. మా ధాన్యలక్ష్మీ ఆంటి వస్తే సరిగ్గా చెబుతుంది అంటూ బెదిరించడంతో కావ్య డబ్బులు ఇస్తుంది. ఇలా అడిగిన వాళ్లకి అడిగినంత ఇచ్చుకుంటూ పోతే ఖజానా ఖాళీ అయిపోతుందని భయపడ్డ కావ్య ఇంటి ఖర్చుల బాధ్యతలు రాజ్‌కి అప్పగించాలని డిసైడ్ అవుతుంది.

Brahmamudi Serial Today s Episode 595 December 17th 2024 Here is full story

తాతయ్య ఇచ్చిన రూ.5 లక్షల మాట నిలబెట్టకపోతేనే నానమ్మ అంత ఎమోషనల్‌గా ఫీల్ అయ్యిందని అలాంటిది రూ.100 కోట్ల మాట గురించి తెలిస్తే ఏమనుకుంటోందోనని రాజ్ బాధపడతాడు. కావ్య తీసుకొని రాజ్‌ దగ్గరికి వెళ్లగా.. అతను వద్దు అంటాడు. కాఫీ తాగకపోతే నువ్వు కూడా ఫైన్ వేస్తావా ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు కట్టాలి అంటూ రాజ్ మండిపడతాడు. దాంతో అపర్ణతోనే తేల్చుకోవాలని ఆమె దగ్గరికి వచ్చి తాళాలు ఇచ్చేస్తుంది కావ్య. ఈ బరువు నేను మోయలేకపోతున్నానని.. ఒక్కొక్కరు లక్షల్లో అడుగుతున్నారని, ఎందుకు అని నేను అడిగితే నువ్వెంత , నీ బతుకెంత అని అంటున్నారని బాధపడుతుంది కళావతి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X