Brahmamudi December 18th Episode : రాజ్‌కి షాకిచ్చిన బ్యాంక్ .. దుగ్గిరాల వారి ఆస్తులు జప్తు, కావ్యపైనే భారం

సీతారామయ్య చదివిస్తున్న ఓ కుర్రాడి కుటుంబం ఆర్ధిక సాయం కోసం దుగ్గిరాల వారింటికి రాగా రుద్రాణి వారిని తిట్టి పంపేస్తుంది. వాళ్లు బాధపడుతూ వెళ్తుండగా రాజ్ చూసి లోపలికి వచ్చి అంతా తెలుసుకుంటాడు. అనంతరం కావ్యని పిలిచి నానమ్మ చేతుల మీదుగా వారికి రూ.5 లక్షలు ఇప్పిస్తాడు. తాతయ్యకి తగిన వారసుడివి నువ్వేనని రాజ్‌ను మెచ్చుకుంటుంది ఇందిర. భర్త తనను పట్టించుకోకపోవడంతో కళ్యాణ్‌కి ఫోన్ చేస్తుంది అప్పూ.

సుభాష్, ప్రకాశం, రాహుల్‌లు ఇష్టమొచ్చినట్లుగా డబ్బులు అడుగుతూ ఉండటంతో ఇక నా వల్ల కాదని భయపడ్డ కావ్య .. రాజ్‌కి తాళాలు ఇచ్చేయాలని అనుకుంటుంది. అయితే 100 కోట్లు ఎలా కట్టాలో తెలియక ఆలోచిస్తున్న సమయంలో విసిగించడంతో కావ్యపై కోప్పడతాడు రాజ్. దీంతో అత్తగారి దగ్గరికి వెళ్లి తాళాలు ఇచ్చేసి నా వల్ల కావడం లేదని చెబుతుంది కళావతి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక డిసెంబర్ 18వ తేదీ.. ఎపిసోడ్ 596లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 596 December 18th 2024 Here is full story

అడిగినంత ఇవ్వకుండా అవసరం తెలుసుకుని ఇవ్వాలని కావ్యకి అపర్ణ సూచిస్తుంది. నువ్వేమీ దేవతవి కాదని అందరికీ నచ్చడానికి, నువ్వు ఓడిపోవడం నాకు అస్సలు ఇష్టం ఉందని చెప్పి ధైర్యం నూరిపోస్తుంది. ఎవ్వరూ నన్ను అర్ధం చేసుకోవడం లేదంటూ అయిష్టంగానే తాళాలు తీసుకుని వెళ్లిపోతుంది కావ్య. తాతయ్య పేరు చెబితే ఎవరొచ్చి అడిగినా ఎంతైనా ఇచ్చేస్తారా అంటూ ఇంట్లో డబ్బులు కొట్టేయడానికి రాహుల్ స్కెచ్ గీస్తాడు. వెంటనే వాళ్ల ఫ్రెండ్‌కి ఫోన్ చేసి మా ఇంటికొచ్చి 50 లక్షలు తీసుకోవాలని చెబుతుండగా స్వప్న వస్తుంది.

ఇంత చీప్‌గా ఆలోచించడానికి సిగ్గు లేదా అంటూ తిడుతుండగా రుద్రాణి వచ్చి స్వప్నపై మండిపడుతుంది. ఇంతకీ ఏం చేశావని తల్లి అడగ్గా.. ఎవరో వచ్చి తాతయ్య పేరు చెబితే 5 లక్షలు ఇచ్చారు కదా అలాగే మా ఫ్రెండ్‌కి ఫోన్ చేసి రూ.50 లక్షలు తీసుకోమన్నానని చెబుతాడు రాహుల్. వచ్చినవాడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? నిజంగా తాతయ్యకి తెలుసా లేదా అన్నది ఎంక్వైరీ చేశాకే ఇస్తారని రాహుల్‌కు గడ్డిపెడుతుంది. నువ్వు ఈ ప్లాన్ అమలు చేసుంటే మన ఇద్దరిని ముద్దాయిల్లా నిలబెట్టి కడిగి పారేసేవాళ్లని మండిపడుతుంది రుద్రాణి.

Brahmamudi Serial Today s Episode 596 December 18th 2024 Here is full story

ఉదయాన్నే టెన్షన్‌తో అటు ఇటు తిరుగుతున్న రాజ్‌ని చూసినా పట్టించుకోకుండా వెళ్లిపోతుంది కావ్య. చెట్టంత మనిషి ఇక్కడ ఉంటే వాడికి కనీసం కాఫీ ఇవ్వాలన్న బుద్ధి లేదా అంటూ మడిపడతాడు రాజ్. రాత్రి కాఫీ తీసుకొస్తే నన్ను నానా మాటలు అన్నారు కదా.. ఇప్పుడు మళ్లీ ఏమంటారోనని ఇవ్వలేదని చెబుతుంది కావ్య. ఇంతలో పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి రాజ్‌ను ఇంటి బయటికి రమ్మంటాడు. నందగోపాల్ బ్యాంకాక్‌లో దిగాడని పోలీస్ ఆఫీసర్ చెప్పడంతో అక్కడ తనకు తెలిసినవాళ్లు ఉన్నారని రాజ్ చెబుతాడు. కానీ నందగోపాల్ ఫేక్ అడ్రస్ ఇచ్చాడని అంటాడు ఆఫీసర్.

వీళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కావ్య కాఫీ తీసుకుని రాగా.. రాజ్ ఆమెపై మండిపడతాడు. అది చూసి అపర్ణ కొడుకుపై కోప్పడుతుంది. ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటే కాఫీ ఇవ్వడం తప్పా .. అంత ఇంపార్టెంట్ అయితే లోపల కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు కదా అంటుంది. పరాయి మగాడి ముందు నీ భార్యను తిడతావా అంటూ కొడుకుపై కేకలు వేస్తుంది. దీంతో కావ్యకి రాజ్‌ క్షమాపణలు చెబుతాడు. రాజ్ ప్రవర్తన విచిత్రంగా ఉండటంతో కావ్య, అపర్ణలు షాక్ అవుతారు. అసలేం జరిగిందో తెలుసుకోవాలని కళావతి అనుకుంటుంది.

Brahmamudi Serial Today s Episode 596 December 18th 2024 Here is full story

గదిలో అటు ఇటు తిరుగుతున్న రాజ్‌ని చూసి కావ్య లోపలికి వస్తుంది. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని .. అదేంటో చెబితే ఏదైనా సలహా ఇస్తానని అంటుంది కావ్య. దాంతో రాజ్ ఏదేదో పిచ్చిగా చెప్పడంతో కళావతికి ఏం అర్ధం కాదు. ఉదయాన్నే ఏకంగా ఇంట్లోకి వస్తారు బ్యాంక్ వాళ్లు. అది చూసిన సుభాష్ వాళ్లపై కోప్పడి విషయం చెప్పమంటాడు. దీంతో సీతారామయ్య ఇచ్చిన ష్యూరిటీ సంగతి చెప్పడంతో వాళ్లు షాక్ అవుతారు. 100 కోట్లు కట్టకుంటే మీ ఆస్తిని జప్తు చేస్తామని చెప్పడంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు.

కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఉన్నపళంగా జప్తు చేస్తామంటే ఎలా అని సుభాష్ ప్రశ్నిస్తాడు. ఈ విషయం రాజ్‌కు తెలుసునని, మీ ఆఫీస్‌కి నోటీసు కూడా అతికించామని బ్యాంక్ వాళ్లు చెబుతారు. మేం ఇచ్చిన టైం అయిపోయిందని రూల్స్ ప్రకారం, అగ్రిమెంట్ ప్రకారం ఆస్తుల్ని జప్తు చేస్తామని ఇల్లు ఖాళీ చేసి బయటికి నడవమని తేల్చిచెబుతారు. ఆ మాటలతో ముసలోడు నిలువునా ముంచేశాడని, నడిరోడ్డుపై నిలబెట్టేశాడని రుద్రాణి నానా మాటలు అంటుంది. పెద్దాయన దానకర్ణుడు కదా మా అందరి నోట్లో మట్టి కొట్టాడని ధాన్యలక్ష్మీ కూడా వంత పాడటంతో ప్రకాశం మండిపడతాడు. కష్టమైనా, సుఖమైనా కుటుంబం అంతా కలిసి పంచుకుంటుందని అపర్ణ అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X