Brahmamudi December 19th Episode : కుప్పకూలిన ఇందిర .. ఆస్తి కోసం కావ్యను ట్రాప్ చేస్తోన్న రాజ్
ఇంటి బాధ్యతలు మోయడం తన వల్ల కావడం లేదంటూ భయపడుతున్న కావ్యకి అపర్ణ ధైర్యం చెప్పి తిరిగి తాళాలు ఇస్తుంది. తాతయ్య పేరు చెప్పుకుని ఇంట్లో నుంచి లక్షలు కొట్టేయాలని రాహుల్ ప్లాన్ వేయడంతో అది తెలుసుకున్న రుద్రాణి, స్వప్నలు బాగా గడ్డిపెడతారు.
ఉదయాన్నే తనకు కాఫీ కూడా ఇవ్వకపోవడంతో కావ్యపై కేకలు వేస్తాడు రాజ్. ఇంతలో పోలీస్ ఆఫీసర్ రావడంతో ఎవరికీ తెలియకుండా బయటికెళ్లి మాట్లాడతాడు. ఆ సమయంలో కాఫీ తీసుకొచ్చిన కావ్యని తిట్టడంతో అపర్ణ కోప్పడి కోడలికి క్షమాపణలు చెప్పిస్తుంది. రాజ్ ఏదో ఇబ్బందిలో ఉన్నాడని తెలుసుకున్న కావ్య అదేంటో కనుక్కోవాలని అనుకుంటుంది. ఉదయాన్నే బ్యాంక్ వాళ్లు వచ్చి సీతారామయ్య పెట్టిన ష్యూరిటీ సంతకం గురించి చెప్పడంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఇక డిసెంబర్ 19వ తేదీ.. ఎపిసోడ్ 597లో ఏం జరిగిందంటే..

మీ గొడవలు ఏమైనా ఉంటే బయట తేల్చుకోవాలని.. మీరంతా బయటికి వెళ్తే ఇంటికి సీల్ వేస్తామని బ్యాంక్ వాళ్లు అనడంతో అంతా షాక్ అవుతారు. చచ్చినా ఖాళీ చేయమని రుద్రాణి అనగా.. పోలీసులను తీసుకొచ్చి బలవంతంగా బయటికి గెంటాల్సి వస్తుందని బ్యాంక్ వాళ్లు చెబుతారు. మేం కోర్టుకెళ్లి స్టే ఆర్డర్ తీసుకొస్తామని రుద్రాణి, ధాన్యలక్ష్మీలు వార్నింగ్ ఇస్తారు. పెద్దాయన పెట్టిన సంతకానికి, ఇచ్చిన మాటకి తలవంచేదే లేదని ధాన్యలక్ష్మీ అంటుంది.
ఈ గొడవలు చూసిన ఇందిర కోప్పడుతుంది. ఇన్నాళ్లు ఆయన ముందు నోరెత్తడానికే మీరంతా భయపడేవాళ్లు.. కానీ ఇవాళ ఆస్తి లేదు అనేసరికి మతిస్థిమితం లేని వాడని అంటారా అంటూ బాధపడుతుంది. నా భర్త కష్టపడి సంపాదించిన ఆస్తి ఆయన ఇష్టమని.. ఆయన ఇచ్చిన మాట, పెట్టిన సంతకం కోసం ఆస్తి మొత్తం పోయినా పర్లేదని అంటుంది. కుదరదని.. మా వాటా మేం రాబట్టుకుంటామని, ఆస్తుల కోసం కోర్టుకు వెళ్తారా అంటూ బాధపడుతుంది. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న నా భర్తకు తన మాట పోయిందని తెలిస్తే ప్రాణం వదిలేస్తాడని , ఆయనే లేనప్పుడు ఈ చిట్టి బతకదని ఇందిర గుండెపోటుతో కుప్పకూలిపోతుంది. ఆ దెబ్బతో రాజ్ ఒక్కసారిగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తాడు.
ఇదంతా కల అని కూల్ అయినా.. బ్యాంక్ వాళ్లు చెప్పిన గడువు లోగా రూ.100 కోట్లు కట్టకుంటే ఇదే జరుగుతుందని భయపడతాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా బ్యాంక్ లోన్‌కి వెళ్లడమే బెటర్ అని అనుకుని మేనేజర్‌కి ఫోన్ చేస్తాడు. లోన్ ఇస్తాం కానీ.. ఆస్తి మీ వైఫ్ పేరిట ఉంది కాబట్టి ఆమెను తీసుకుని రమ్మంటాడు మేనేజర్. కళావతిని ఎలా సాయం అడగాలా అని ఆలోచిస్తుండగా ఆత్మారామ్ వచ్చి .. నువ్వు ఆమెను ఆడగటానికి ఒప్పుకోను అంటాడు. ఆసుపత్రిలో తాతయ్యకి ట్రీట్‌మెంట్ చేస్తుండగా ఆయన ఎప్పుడు కోమాలో నుంచి బయటికి వస్తాడా అని కళ్యాణ్ డాక్టర్లను అడుగుతాడు.

భోజనాల దగ్గర వంటలు బాలేదంటూ కావ్యపై మండిపడతారు రుద్రాణి, ధాన్యలక్ష్మీ. దాంతో అపర్ణ, స్వప్నలు వాళ్లకి కౌంటర్ ఇస్తారు. ఒక్కపూటకి ఉప్పు తగ్గితే సర్దుకోలేవా అంటూ అపర్ణ మండిపడుతుంది. ఇంతలో రాజ్ అక్కడికి వస్తాడు. నేరుగా సాయం చేయమంటే బాగోదు కాబట్టి నాలుగు మంచి మాటలు మాట్లాడి కావ్యని ఇంప్రెస్ చేయాలని అనుకుంటాడు. కళావతి వంటలు అద్భుతంగా చేస్తుందని.. ఏది ఎంత వేయాలో అంత వేస్తుందని భార్యను పొగుడుతాడు. పొగడ్తలు ఆపి తిని చూసి చెప్పమంటుంది ధాన్యలక్ష్మీ. ముద్ద నోట్లో పెట్టుకోగానే ఉప్పు తక్కువగా ఉందని గమనించి కావ్య బాధపడుతుందని అలాగే తినేస్తాడు. కూరలన్నీ చప్పగా ఉంటే నువ్వు పొగుడుతున్నావేంటీ అంటూ ధాన్యలక్ష్మీ మండిపడుతుంది.
ఇన్నాళ్లు భార్యను వదిలేసిన రాజ్.. ఇంత దారుణంగా ఉన్న వంటను కూడా ఈ రేంజ్‌లో పొగుడుతున్నాడంటే ఆస్తి , ఇంటి తాళాలు కావ్య చేతుల్లో ఉన్నాయనే అంటుంది రుద్రాణి. ఆస్తుల కోసం భజన చేసి బతకాల్సిన అవసరం నాకు లేదంటూ రాజ్ మధ్యలోనే చేయి కడిగేసి వెళ్లిపోతాడు. దాంతో మీ కడుపు మంట చల్లారిందా అంటూ రుద్రాణి, అపర్ణలపై కావ్య మండిపడుతుంది. ఇంట్లో మనశ్శాంతి లేకపోవడంతో ప్రకాశం కూడా భోజనం చేయకుండా వెళ్లిపోతాడు.

ట్రైనింగ్ మధ్యలో కళ్యాణ్‌కు ఫోన్ చేస్తుంది అప్పూ. ట్రైనింగ్ ఎలా జరుగుతుందని కళ్యాణ్ అడగ్గా.. నిన్ను చాలా మంది చాలా మాటలు అన్నారని, వాళ్ల ముందు సగర్వంగా తలెత్తుకునేలా చేయడానికి ఎంత కష్టాన్ని అయినా భరిస్తానని చెబుతుంది అప్పూ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










