Brahmamudi December 20th Episode : కావ్యతో రాజ్ రొమాన్స్ .. భార్యాభర్తల్ని విడగొట్టేందుకు రుద్రాణి స్కెచ్

సీతారామయ్య గారు పెట్టిన ష్యూరిటీని అనుసరించి ఆస్తిని జప్తు చేస్తున్నామని మీరంతా తక్షణం బయటికి వెళ్లాలని బ్యాంక్ వాళ్లు చెప్పడంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీలు ఒప్పుకోరు. మాకు రావాల్సిన వాటాను దక్కించుకోవడానికి కోర్టుకెక్కుతామని బెదిరిస్తారు. వారి మాటలతో ఇందిర మండిపడుతుంది.. నా భర్త ముందు నోరెత్తడానికే భయపడే మీరు ఇవాళ ఆయనను మతిస్థిమితం లేని వ్యక్తి అంటారా అంటూ కోప్పడుతుంది. ఈ విషయం ఆయనకి తెలిస్తే తట్టుకోలేక ప్రాణం వదిలేస్తాడని, ఆయనే లేనప్పుడు ఏ చిట్టి కూడా బతకదని గుండెపోటుతో కుప్పకూలిపోతుంది ఇందిర. దీంతో నిద్రలోంచి రాజ్ ఉలిక్కిపడి లేస్తాడు.

ఇలా జరగకూడదంటే బ్యాంక్ లోన్ తీసుకుని రూ.100 కోట్లు కట్టేయాలని అనుకుని మేనేజర్‌కి ఫోన్ చేయగా.. ఆస్తి కావ్య పేరిట ఉండటంతో ఆమెను తీసుకుని రమ్మంటాడు. భోజనాల దగ్గర కావ్యని నానా మాటలు అంటుంటారు ధాన్యలక్ష్మీ, రుద్రాణి. దాంతో వారికి ఇంట్లో వాళ్లు కౌంటరిస్తారు. ఇంతలో రాజ్ వచ్చి కావ్య వంటను మెచ్చుకుంటూ ఉండగా ధాన్యం, రుద్రాణి మాటలతో భోజనం మధ్యలోనే లేచి వెళ్లిపోతాడు. ఇక డిసెంబర్ 20వ తేదీ.. ఎపిసోడ్ 598లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 598 December 20th 2024 Here is full story

నా వల్ల నువ్వు ఎన్నో మాటలు పడ్డావని.. వాళ్లందరికీ సమాధానం చెప్పేలా నేను ఖచ్చితంగా ఎస్ఐగానే తిరిగొస్తానని అంటుంది అప్పూ. ట్రైనింగ్‌ దగ్గరికి నువ్వు కూడా రావొచ్చు కదా .. నేను లేను కదా అని ఇంకెవరికైనా ట్రై చేస్తున్నావా అంటూ అడుగుతుంది. తనతో పాటు బ్యాంక్‌కి కావ్యని తీసుకెళ్లేందుకు గాను ఆమెను ఇంప్రెస్ చేసేందుకు రాజ్ ప్రయత్నిస్తుంటాడు. ఎప్పుడూ లేనిది వంటగదిలో భార్యకు సాయం చేయడానికి వచ్చాడు. కిచెన్‌లోకి రావడానికే ఇష్టపడని మీరు లోపలికి ఎందుకొచ్చారో ముందు చెప్పమని అడుగుతుంది కావ్య. మీ ఇంట్లో మీకు మొహమాటం ఎందుకు అని అడగ్గా.. ఇది మన ఇల్లు అంటాడు రాజ్. టీ కావాలని .. నువ్వు పనిలో ఉన్నావ్ కాబట్టి నేనే పెట్టుకుంటానని అంటాడు.

ఇంతలో అపర్ణ అక్కడికి వస్తుంది. టీ పెట్టుకునేటప్పుడు దానిలో వేయాల్సింది టీ పోడి కానీ, కాఫీ పోడి కాదని సెటైర్లు వేస్తుంది. టీ కావాలంటే కావ్యని కానీ, నన్ను కానీ అడగొచ్చు కదా అని అంటుంది అపర్ణ. దీంతో రాజ్ కిచెన్‌లో నుంచి వచ్చేస్తాడు. నువ్వేమైనా వాడిపై మంత్రించిన నీళ్లు చల్లావా ఇంత మార్పు మొదలైంది అని కావ్యని అడుగుతుంది అపర్ణ. ఈ మధ్యకాలంలో నీకు బాగా దగ్గర కావాలని చూస్తున్నాడని.. నువ్వు వంట చేస్తే బాగుందని చెబుతున్నాడని గుర్తుచేస్తుంది అపర్ణ. మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని.. నాకు కూడా అదే కావాలని అంటూ నువ్వుకుంటూ వెళ్లిపోతుంది.

ఉదయాన్నే బెడ్ రూమ్‌లో బూజు దులుపుతున్న కావ్య మంచం పై నుంచి కిందపడబోతుండగా రాజ్ వచ్చి పట్టుకుంటాడు. సడెన్‌గా వచ్చి పిలిస్తే జడుసుకున్నానని కావ్య అనగా.. నువ్వు భయపడే రకం కాదని ఆడపులివి, ఆడ సింహానివి అంటూ మెచ్చుకుంటాడు. నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఏం కావాలని అని కావ్య ప్రశ్నిస్తుంది. నీకేమైనా సాయం కావాలా అని రాజ్ అడగ్గా.. ఇవాళ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని ప్రశ్నిస్తుంది కావ్య. సీలింగ్ మొత్తం క్లీన్ చేయాలని అనుకుంటున్నానని.. మీరు హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది.

Brahmamudi Serial Today s Episode 598 December 20th 2024 Here is full story

దీంతో నేను చేసేస్తానంటూ క్లీన్ చేస్తుంటాడు. నీకొక విషయం చెప్పాలంటూ గొణుక్కుంటూ ఉంటాడు.. ఇంతలో మంచంపై నుంచి జారి కావ్య మీద పడగా దీనిని రుద్రాణి, ధాన్యలక్ష్మీ చూస్తారు. అనగనగా ఒక రాజు , ఆ రాజుకు ఒక్కతే భార్య, ఆమెకు ఒక్కడే కొడుకు అంటుండగా రాజ్ మళ్లీ వస్తానంటూ పారిపోతాడు. ఈ ఇంట్లో ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అర్ధం కావడం లేదంటూ ధాన్యలక్ష్మీతో అంటుంది రుద్రాణి. వేళ పాళా లేకుండా ఈ రొమాన్స్ ఏంటి.. ఇంట్లో ఇంత మంది జనం ఉన్నారు ఎవరైనా చూస్తారన్న బుద్ధి లేదంటూ ధాన్యలక్ష్మీ కూడా మండిపడుతుంది.

వాళ్లిద్దరూ అలా కలిసిపోతే.. మనిద్దరం ఈ ఇంట్లో ఏం చేయలేమని ధాన్యలక్ష్మీతో అంటుంది రుద్రాణి. ముసలాయన పుణ్యమా అని వెళ్లిపోయిన కావ్య మళ్లి వచ్చి సెటిలైందని, ఈ రాజా గారికి ఆ రాణి గారు కనెక్ట్ అయిపోయారని అంటుంది. ఇంట్లో అధికారం కావ్య చేతుల్లో, కంపెనీ రాజ్ చేతుల్లో ఉందని.. ఇది ఇలాగే కొనసాగితే ఈ దుగ్గిరాల వారి రాజ్యాన్ని వారిద్దరే ఏలుతారని హెచ్చరిస్తుంది రుద్రాణి. నీ కొడుకు ఆస్థాన కవిలా, నా కొడుకు సైన్యాధికారిలా బతికేస్తారని అంటుంది. ఇదంతా చూస్తూనే ఉంటావా అంటూ ధాన్యాన్ని రెచ్చగొడుతుంది రుద్రాణి.

మన రాజ్ చాలా మారిపోయాడని సుభాష్‌తో అంటుంది అపర్ణ. అదే కదా నా బాధ , వాడు రోజుకొకలా మారిపోతూ తలనొప్పులు తీసుకొస్తున్నాడని అంటాడు సుభాష్. కొడుకు మొండిగా మారితే అది గుడ్ న్యూస్ ఎలా అవుతుందని ప్రశ్నిస్తాడు. మన ముందు కావ్య అంటే ఇష్టం లేనట్లు ప్రవర్తిస్తూనే, చాటుగా దానిపై ప్రేమను చూపించడం మొదలుపెట్టాడని అంటుంది. వాడు కావ్యని కవ్వించాలని, నవ్వించాలని రకరకాలుగా ప్రయత్నిస్తున్నాడని భర్తతో చెబుతుంది అపర్ణ.

Brahmamudi Serial Today s Episode 598 December 20th 2024 Here is full story

ఇందాక కావ్య వంటను పొగిడాడని, వంట గదిలో కావ్యను ఇబ్బంది పెట్టకూడదని వాడే కాఫీ పెట్టుకున్నాడని అంటుంది. వీరిద్దరూ ఇలాగే ఉంటే ఇక ఇంటిని ఎవ్వరూ ముక్కలు చేయలేరని అపర్ణ అనగా.. నువ్వు చెప్పేది నిజమైతే అంతకంటే గుడ్ న్యూస్ మరొకటి ఉండదని అంటాడు సుభాష్. వాడే కనుక మారి కావ్యని అర్ధం చేసుకుని కలిసిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయని చెబుతాడు. ఈ మాటలను కావ్య దూరం నుంచి విని గాల్లో తేలిపోతుంది.

100 కోట్లు ఎలా కట్టాలో తెలియక రాజ్ గార్డెన్‌లో ఆలోచిస్తుండగా.. ఇంతలో మేనేజర్ ఫోన్ చేస్తాడు. రేపు బ్యాంక్ ఆఫీసర్లు ఆఫీస్‌కి వస్తున్నారని.. డబ్బు సెటిల్ చేయడానికి వాళ్లకి ఒక డేట్ చెప్పాలని అంటాడు. దానిని నేను చూసుకుంటానని.. ఇదంతా బయటికి రాకుండా గోప్యంగా ఉంచాలని రాజ్ అతనితో చెబుతాడు. ఇక లాభం లేదని కళావతి హెల్ప్ తీసుకుని ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలనేది డిస్కష్ చేయాల్సిందేనని రాజ్ అనుకుంటాడు. బెడ్ రూంలోకి వచ్చి తలుపు వేసి మాట్లాడుకుందామా అని అడుగుతాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X