Brahmamudi December 21st Episode : రాజ్ కంట కన్నీరు, నిజం తెలుసుకున్న కావ్య .. ఆస్తిని కాపాడిన కళావతి
ట్రైనింగ్‌లో దూరంగా ఉంటే కళ్యాణ్ తనని పట్టించుకోకపోవడంపై అప్పూ బాధపడుతుంది. బ్యాంక్ లోన్, షూరిటీ గురించి కావ్యకి చెప్పాలని రాజ్ తెగ ట్రై చేస్తుంటాడు. ఎప్పుడూ లేనిది వంట గదిలోకి వచ్చి కావ్యతో కబుర్లు చెబుతుండగా అపర్ణ వచ్చి రాజ్‌లో వచ్చిన మార్పును చూసి సంతోషిస్తుంది.
తర్వాత బెడ్ రూమ్‌లో బూజు దులుపుతున్న కావ్య దగ్గరికి వచ్చిన రాజ్.. తాను హెల్ప్ చేస్తానంటూ చెబుతాడు. బూజు దులుపుతుండగా కాలు జారి కావ్యపై పడతాడు. వీరిద్దరిని అంత క్లోజ్‌గా ఉండటం చూసిన రుద్రాణి, ధాన్యలక్ష్మీలు షాక్ అవుతారు. రాజ్ - కావ్య కలిసిపోతే ఈ ఇంట్లో మన ఆటలు సాగవని ధాన్యానికి చెబుతుంది రుద్రాణి. కొడుకు - కోడలు ఎంతో సంతోషంగా ఉంటున్నారని, కావ్యకి దగ్గర కావడానికి రాజ్ ప్రయత్నిస్తున్నాడని సుభాష్‌తో చెబుతుంది అపర్ణ. ఈ మాటలను కావ్య వింటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక డిసెంబర్ 21వ తేదీ.. ఎపిసోడ్ 599లో ఏం జరిగిందంటే..

కావ్య బెడ్ రూమ్‌లో ఉండగా రాజ్ లోపలికి వచ్చి ఘడియ పెడతాడు. తలుపు వేసి మాట్లాడుకుందామని చెప్పి కళావతి చేతులు పట్టుకుంటాడు. ఇప్పుడు నేను ఈ విషయం చెబితే నువ్వు నమ్ముతావో లేదో కూడా నాకు తెలియదని అంటాడు రాజ్. ఈ విషయం మన మధ్యే ఉండాలని ఎవ్వరికీ చెప్పకూడదని ఆమె దగ్గర మాట తీసుకుంటాడు. తానొక పెద్ద సమస్యలో ఇరుక్కున్నానని నువ్వే నాకు సాయం చేయాలని అడుగుతాడు. దీంతో షాకైన కావ్య.. ఏమైంది, ఏం జరిగింది అని ప్రశ్నిస్తుంది.
ఇప్పటి వరకు జరగనిది, ఎవ్వరూ ఊహించనిది దుగ్గిరాల వారి వంశ ప్రతిష్టకు, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మనుగడకు ఓ పెద్ద సమస్యగా మారబోతోందని రాజ్ చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. దాంతో ఆమెకు సీతారామయ్య షూరిటీ, బ్యాంక్ లోన్ గురించి చెబుతాడు రాజ్. తాతయ్య పేరు నిలబెట్టాలి, వంశ పరువు ప్రతిష్టలు దృష్టిలో పెట్టుకోవాలి, ఆస్తులన్నీ అలాగే ఉండాలి, మన కుటుంబం రోడ్డున పడకూడదని చెబుతాడు. రేపు ఉదయం బ్యాంక్ వాళ్లు ఆఫీస్‌కి వస్తారని.. వాళ్లు ఇచ్చిన గడువు పూర్తయిపోయిందని ఏం చేయాలో తెలియడం లేదని అంటాడు.
మీలో ఇంత సంఘర్షణ జరుగుతుందా? ఇన్ని సమస్యల్ని గుండెల్లో దాచుకుని ఎవరికీ చెప్పుకోలేక మీలో మీరే నలిగిపోతున్నారా? ఇన్ని రోజులు ఎలా భరించారు? ముందే నాతో చెప్పి ఉండొచ్చు కదా అని ప్రశ్నిస్తుంది కావ్య. ఈ ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదని, తాతయ్య ఇచ్చిన మాట నిలబెట్టకపోతే ఆయన గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుందని రాజ్ బాధపడతాడు. ఏం చేయాలో అర్ధం కావడం లేదు, నీకు తోచిన సలహా ఏదైనా చెప్పవా అని అడుగుతాడు. ఇప్పటికిప్పుడు 100 కోట్లు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తామని కావ్య ప్రశ్నిస్తుంది.
ఇప్పటికే ఆస్తుల కోసం పిన్ని, అత్త గొడవ చేస్తున్నారని.. ఈ పరిస్ధితుల్లో తాతయ్య 100 కోట్లకు షురిటి పెట్టినట్లు తెలిస్తే ఇంకా పెద్ద గొడవ చేస్తారని రాజ్ అంటాడు. ఏం జరిగినా పర్లేదని.. ఈ సమస్యకి తెల్లారేలోగా పరిష్కారం దొరుకుతుందని, రేపు నేను కూడా మీతో పాటు ఆఫీస్‌కి వస్తానని చెబుతుంది కావ్య. ఇద్దరం కలిసి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని.. మీరు ఇదంతా మరిచిపోయి ప్రశాంతంగా ఉండండి అంటుంది కావ్య. ఆ మాటతో భార్యను కౌగిలించుకుని కంటతడి పెడతాడు.. ఆమెకు థ్యాంక్స్ చెబుతాడు.
ఉదయాన్నే రాజ్- కావ్య ఆఫీస్‌కి బయల్దేరతారు. ఇంతలో ఆస్తి పత్రాలు తీసుకుని కావ్య బ్యాగ్‌లో పెడుతుంది. ఎన్ని సమస్యలు వచ్చినా ఆస్తుల్ని అమ్మనని , తాతయ్య నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయనని అంటుంది. అంతా హాల్‌లో కాఫీ తాగుతూ ఉండగా.. రాజ్ , కావ్యలు కలిసి మెట్లు దిగుతారు. ఇది కలా నిజమా, వీళ్లిద్దరూ కలిసి రావడం ఏంటని సుభాష్- అపర్ణలు షాక్ అవుతారు. ఆఫీస్‌కి వెళ్తున్నామని చెప్పడంతో జాగ్రత్తగా వెళ్లమని సుభాష్ - అపర్ణ అంటారు. ఆఫీస్‌కి భార్యను తీసుకెళ్లడం ఏంటో అని ధాన్యలక్ష్మీ ఆశ్చర్యపోతుంది.
కొన్ని కొత్త డిజైన్లు వేయాల్సి ఉందని అందుకే కావ్యను తీసుకెళ్తున్నానని చెబుతాడు రాజ్. కొన్ని రోజులు కావ్య నాతో పాటే ఆఫీస్‌కి రావాల్సి ఉంటుందని చెప్పడంతో అంతా నేను చూసుకుంటానని అపర్ణ అంటుంది. నిన్న మీకు చెబితే నమ్మలేదు కదా.. వాడిలో మార్పు రాకపోతే కావ్యని తీసుకుని ఆఫీస్‌కి వెళ్తాడా అని సుభాష్‌ను అడుగుతుంది అపర్ణ. త్వరలోనే ఆమెను భార్యగా అంగీకరిస్తాడన్న అపర్ణ .. ఈ విషయాన్ని వెంటనే కనకానికి చెప్పాలని ఆమెకు ఫోన్ చేస్తుంది.
స్వప్నకి తాళాలు ఇచ్చి తానొచ్చే వరకు చూసుకోమని చెబుతుంది కావ్య. భార్యాభర్తలిద్దరూ కలిసి ఆఫీస్‌కి వెళ్లడం చూసిన రుద్రాణి షాక్ అవుతుంది. ఇవాళ్టీ నుంచి ఇంటి పెత్తనం మొత్తం కావ్య నాకే అప్పగించిందని రుద్రాణితో చెబుతుంది స్వప్న. ఇంతలో కనకానికి ఫోన్ చేసి కావ్య - రాజ్‌లు కలిసిపోయినట్లు చెబుతుంది అపర్ణ. నాకు నమ్మకం లేదని కనకం అనగా.. వెళ్లి మా ఆఫీసులో చూడు ఇద్దరూ కలిసే వెళ్లారని చెప్పడంతో కనకం ఆనంద పడుతుంది. ఇది కలో నిజమో అర్ధం కాక భర్తను పిలిచి గిల్లమంటుంది.
ఒకరినొకరు అర్ధం చేసుకుని ఒక్కటయ్యారా? లేక అవసరం కోసం ఒక్కటయ్యారా అని కృష్ణమూర్తి ప్రశ్నిస్తాడు. అర్ధం చేసుకుని ఒక్కటైతే ఆ బంధం శాశ్వతమని, అవసరం కోసం ఒక్కటైతే మాత్రం పని పూర్తయ్యాక విడిపోతారని కృష్ణమూర్తి చెప్పడంతో కనకం షాక్ అవుతుంది. ఇంతలో బ్యాంక్ వాళ్లు ఆఫీస్‌కి వచ్చి రాజ్‌తో మాట్లాడుతుండగా.. కావ్య తన భార్యని వాళ్లకి పరిచయం చేస్తాడు. మేం డబ్బులు కట్టేస్తామని కానీ.. ఒకేసారి కాకుండా వాయిదాల పద్దతిలో చెల్లిస్తామని అంటుంది కావ్య. దానికి బ్యాంక్ వాళ్లు ఒప్పుకోరు.. అంత డబ్బు మేం ఒకేసారి కట్టలేమని చెబుతుంది కళావతి. మీకు డబ్బులు కావాలా? మా ఆస్తుల్ని జప్తు చేయడమే కావాలా? అనేది మీరే ఆలోచించుకోండి అంటుంది కావ్య. ఆమె చెప్పిన పద్ధతికి మెత్తబడిన బ్యాంక్ వాళ్లు ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో డబ్బులు కట్టడానికి ఒప్పుకుంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











