Brahmamudi December 23rd Episode: దుగ్గిరాల వారి ఖజానా ఖాళీ.. కావ్య దెబ్బకు బిత్తరపోయిన రుద్రాణి, ధాన్యం

కావ్య లోపల ఉండగా రాజ్ తలుపు గడియ వేసి ఆమెతో మాట్లాడతాడు. దుగ్గిరాల వంశ ప్రతిష్టకి, స్వరాజ్ గ్రూప్ మనుగడకే ఓ పెద్ద సమస్య వచ్చిందని ష్యూరిటీ గురించి చెప్పి తనకు సాయం చేయమని కావ్యని అడుగుతాడు రాజ్. భర్తను అలాంటి స్థితిలో చూడని కావ్య షాక్ అవుతుంది. అయినా నేనున్నానంటూ ధైర్యం చెప్పడంతో కావ్యని హగ్ చేసుకుంటాడు రాజ్. ఉదయాన్నే ఆఫీస్‌కి కలిసి వెళ్తున్న రాజ్- కావ్యలను చూసి సుభాష్ - అపర్ణలు సంతోషిస్తారు.

వెళ్తూ వెళ్తూ ఇంటి తాళాలను స్వప్నకి ఇచ్చి జాగ్రత్తగా చూసుకోమని చెబుతుంది కావ్య. భార్యాభర్తలిద్దరూ కలిసి ఆఫీసుకి వెళ్లడంతో రుద్రాణి కుళ్లుకుంటుంది. రాజ్- కావ్యలు కలిసిపోయినట్లుగా కనకానికి చెబుతుంది అపర్ణ. మరోవైపు.. మీకు కట్టాల్సిన 100 కోట్లను ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో చెల్లిస్తామని కావ్య బ్రతిమలాడటంతో బ్యాంక్ వాళ్లు అంగీకరిస్తారు ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక డిసెంబర్ 23వ తేదీ.. ఎపిసోడ్ 600లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 600 December 23rd 2024 Here is full story

ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో డబ్బు కట్టేందుకు బ్యాంక్ వాళ్లు అంగీకరిస్తారు. అయితే ఆ అమౌంట్‌ను ఎలా కడతారో చెప్పాలని అడగ్గా.. దానిని 5 వాయిదాల్లో కడతామని మొదటి వాయిదా కిందా రూ.20 కోట్లను ఇప్పుడే కట్టేస్తామని దానికి కావాల్సిన పేపర్స్‌ను రెడీ చేయించాలని కావ్య చెబుతుంది. దీనికి బ్యాంక్ వాళ్లు ఓకే చెప్పి వెళ్లిపోతారు. ఆ వెంటనే రాజ్ కావ్య వైపు చూసి చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడావని, చాలా కన్విన్సింగ్‌ మాట్లాడావని భార్య భుజం తడతాడు. ఆ కాసేపటికి శృతి వచ్చి రానున్న 24 గంటల్లో భారీ వర్షం కురుస్తుందని అంటుంది. మొత్తం రాజావారిలోనే మార్పు కనిపిస్తోందని మీరు ఏదో మ్యాజిక్ చేశారని అనడంతో కావ్య సిగ్గుపడుతుంది.

కిచెన్‌లో కాఫీ కలుపుకుంటున్న ధాన్యలక్ష్మీ దగ్గరికి రుద్రాణి వచ్చి రిలాక్స్‌గా ఉన్నావా అని అంటుంది. రాజ్‌ని అడిగి ఓ ప్లాస్క్ కొనుక్కుని బస్టాండ్లు, పార్క్‌లలో టీ , కాఫీలు అమ్ముకో అనడంతో ధాన్యలక్ష్మీ మండిపడుతుంది. అటు పక్క రాజ్ - కావ్యలు కలిసి ఆఫీస్‌కి వెళ్లిపోయారని.. నువ్వు ఇలాగే నిర్లక్ష్యం చేస్తే నిన్ను ఈ ఇంట్లో ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నిస్తుంది. అలాంటి రోజే వస్తే ఈ ధాన్యలక్ష్మీ విశ్వరూపం ఎలా ఉంటుందో ఇంట్లో అంతా చూస్తారని చెబుతుంది.

చాలా రోజుల తర్వాత లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉన్నానని.. నేను ఏ అప్పు చేయకపోయినా ఓ థర్డ్ పర్సన్ నా ఛాంబర్‌లోకి వచ్చి డబ్బులు ఎప్పుడు కడతారని అడగటంతో నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయిందని కావ్యతో రాజ్ అంటాడు. నాకేం సంబంధం లేదని చెబుదామంటే తాతయ్య మాట పోతుందని.. కడదామంటే అంత డబ్బు లేదని, ఏం చేయాలో తెలియక నరకం అనుభవించానని రాజ్ బాధపడతాడు. ఎవరితో షేర్ చేసుకోవాలో నీకు చెప్పుకున్నానని.. నేను అనుకున్నట్లే నువ్వు చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేశావని అంటాడు రాజ్. పెద్ద గండం నుంచి తనను , తన కుటుంబాన్ని కాపాడినందుకు కావ్యకు థ్యాంక్స్ చెబుతాడు రాజ్.

Brahmamudi Serial Today s Episode 600 December 23rd 2024 Here is full story

మీరు భార్యగా భావిస్తే నాకు థ్యాంక్స్ అక్కర్లేదని, ఒక ఉద్యోగిగా భావిస్తే నాకు జీతం అక్కర్లేదు, బయటి వ్యక్తిగా భావిస్తే అసలేం అక్కర్లేదని మీరు సంతోషంగా ఉంటే నాకది చాలని అంటుంది కావ్య. బ్యాంక్ ఇన్‌స్టాల్‌మెంట్ 20 శాతం కట్టేశామని.. మిగిలిన 80 శాతం పరిస్థితి ఏంటో అని రాజ్ ఆలోచించగా.. ఏదో ఒక పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుందని కావ్య చెబుతుంది. ఇంతలో రాజ్ మేనేజర్‌కు ఫోన్ చేసి లోపలికి రమ్మంటాడు. వారంలోగా ఇప్పుడున్న వర్క్స్ పూర్తి చేయాలని.. అవసరమైతే ఔట్ సోర్సింగ్ నుంచి డైలీ లేబర్‌ను తీసుకోమని చెబుతాడు రాజ్. అలా చేయాలంటే ఔట్ సోర్సింగ్ స్టాఫ్‌కు రోజువారి వేతనాలు ఇవ్వాలని.. కంపెనీ ఖాతాలో రూ. 25 లక్షలకు మించి లేవని, స్టాఫ్‌కు జీతాలు కూడా ఇవ్వలేమని మేనేజర్ చెబుతాడు.

25 లక్షల్లో 5 లక్షలను తాతయ్య గారి హాస్పిటల్ బిల్ కట్టడానికి పక్కనపెట్టాలని అడుగుతుంది కావ్య. ఉన్న డబ్బంతా వాడేశామని.. ఇంటి అవసరాలు ఎలా మేనేజ్ చేయాలి, వాళ్లకు డబ్బులు ఇవ్వకుంటే లేనిపోని డౌట్స్ వస్తాయని రాజ్ భయపడతాడు. బ్యాంక్‌కి ప్రతినెలా 20 కోట్లు కట్టాలని.. తాకట్టు పెట్టిన ఆస్తుల్ని విడిపించాలని మదనపడుతుంటాడు. అంతా నేను చూసుకుంటానని మీరేమి టెన్షన్ పడొద్దని అంటుంది కావ్య.

తనకు రూ.4 లక్షలు కావాలంటూ స్వప్నతో గొడవ పెట్టుకుంటుంది రుద్రాణి. కారణం చెప్పకుండా అంత డబ్బు ఇచ్చేది లేదని స్వప్న తేల్చి చెబుతుంది. ఎవరి దగ్గరికి వెళితే పని జరుగుతుందో వాళ్ల దగ్గరికి వెళితే ఆ డబ్బు తన్నుకుంటూ వస్తుందని ధాన్యలక్ష్మీ పేరు చెబుతుంది రుద్రాణి. దాంతో ఏం చేయాలో తెలియక వాళ్లు అడిగినంత డబ్బు తీసుకొచ్చి ఇవ్వబోతుండగా కావ్య వచ్చి అడ్డుపడుతుంది. ఇంత డబ్బు ఎందుకు ఇస్తున్నావని అడగ్గా.. ధాన్యలక్ష్మీ ఆంటీకి చెప్పి గొడవ పెడుతుందని భయపడి ఇస్తున్నానని అంటుంది స్వప్న. అక్క దగ్గరి నుంచి డబ్బు, తాళాలు తీసుకుని అందరినీ పిలవమని చెబుతుంది కావ్య.

Brahmamudi Serial Today s Episode 600 December 23rd 2024 Here is full story

ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నారని ఇక నుంచి ఇంట్లో ఏం కావాలో నేను చూసుకుంటానని అంటుంది కావ్య. ఇకపై ఎవరు ఎంత తీసుకున్నా ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందేనని , చివరికి పెట్రోల్ కొట్టించినా నాకు బిల్ తెచ్చి ఇవ్వాలని చెబుతుంది. దాంతో షాకైన రుద్రాణి .. ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతుంది. ఇంటి తాళాలు చేతికొచ్చేసరికి కొమ్ములు వచ్చాయా అని ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మీ. ఎవరు ఏమనుకున్నా సరే ఈ రూల్స్‌ని స్ట్రిక్ట్‌గా పాటించాల్సిందే.. ఇట్స్ మై ఆర్డర్ అంటుంది కళావతి. రూల్స్ పెట్టడానికి ఇదేమైనా జైలా.. మా అమ్మనాన్నలే ఇలాంటి కండీషన్స్ పెట్టలేదని చెబుతుంది రుద్రాణి. మేం నీకు అమ్మానాన్నలు ఎప్పుడు అయ్యామని ప్రశ్నిస్తుంది ఇందిర. ఇక నుంచి నేను చెప్పిందే జరుగుతుందని.. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా అని అడుగుతుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X