Brahmamudi December 24th Episode : ఆట మొదలెట్టిన కావ్య .. శాంత రీ ఎంట్రీ, రగిలిపోతోన్న రుద్రాణి - ధాన్యం

బ్యాంక్ వాళ్లని ఒప్పించి పెద్ద గండం నుంచి గట్టెక్కించినందుకు కావ్యకి థ్యాంక్స్ చెబుతాడు రాజ్. ముందు రూ.20 కోట్లు కట్టేసినప్పటికీ.. మిగిలిన 80 కోట్ల గురించి ఆలోచిస్తుండగా కావ్య ధైర్యం చెబుతుంది. వెంటనే మేనేజర్‌ను పిలిచి వర్క్ ఫాస్ట్‌గా చేయాలని రాజ్ ఆర్డర్స్ వేయగా.. బ్యాంక్ బ్యాలెన్స్ గురించి చెబుతాడు మేనేజర్.

రాజ్ - కావ్య కలిసిపోతున్నారని నువ్వు ఏం చేయకుంటే టీ అమ్ముకుని బతకాల్సిందేనని ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతుంది రుద్రాణి. ఇంతలో తనకు రూ.4 లక్షలు ఇవ్వాలని స్వప్నతో గొడవు పెట్టుకుంది . దీంతో భయపడ్డ స్వప్న .. రుద్రాణి అడిగినంత ఇవ్వబోతుండగా కావ్య వచ్చి అడ్డుకుంటుంది. ఇకపై ఎవరైనా డబ్బులు తీసుకుంటే సరైన కారణం చెప్పాలని , పెట్రోల్ పోయించుకున్నా బిల్ చూపించాలని ఆర్డర్స్ వేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక డిసెంబర్ 24వ తేదీ.. ఎపిసోడ్ 601లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 601 December 24th 2024 Here is full story

ఇక నుంచి ఇంట్లో నేను చెప్పిందే జరిగి తీరాలని ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అని ప్రశ్నిస్తుంది కావ్య. మీ మనవరాలు అలా రెచ్చిపోయి మాట్లాడుతుంటే మీరేం మాట్లాడారా అని అత్తగారిపై మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. నీ వల్ల నా భర్త ఆసుపత్రిలో చావు బతుకులతో పోరాడుతున్నాడని.. ఇంటి కోడలిగా నువ్వేం చేశావు? నన్ను ఓదార్చావా? నోటి దగ్గర అన్నం ముద్ద కూడా వదిలేసేలా చేశావ్ అని ప్రశ్నిస్తుంది ఇందిర. మా ఆయన ఆస్తి మొత్తం తన మనవరాలి పేరు మీద రాశారు తప్పించి భార్యనైన నా పేరిట రాయలేదని అంటుంది .

నీ కోడలు అలా రెచ్చిపోయి మాట్లాడుతుంటే నువ్వేం పట్టించుకోవా అని అపర్ణని అడుగుతుంది ధాన్యలక్ష్మీ. నువ్విలా మాట్లాడటం బాలేదని షాపు నుంచి బిల్ తీసుకొస్తేనే ఆమెకైనా డబ్బులు ఇవ్వమని సెటైర్లు వేస్తుంది అపర్ణ. చివరికి నా కొడుకైనా సరే కావ్య మీదే ఆధారపడాలని రాజ్‌ను అడగ్గా.. అవును మమ్మీ నా ఫోన్ బిల్ కూడా కావ్యనే పే చేసింది అంటాడు. ఆఖరికి నువ్వు కూడా ఇలా మారిపోయావేంటి అంటుంది రుద్రాణి. నేనేం చేయలేనని, కళావతి చేతిలో తాళాలు ఉన్నాయని తను ఏం చెబితే అందరం అలా నడుచుకుందామని అంటాడు రాజ్.

ఇంట్లో గొడవ తర్వాత ఎప్పుడూ జాలి, దయ, కరుణ అంటూ అందరితో ప్రేమగా ఉండే నువ్వు రూల్స్ అంటూ చాటా స్ట్రిక్ట్‌గా మారిపోయావని అడుగుతాడు రాజ్. మిమ్మల్ని చూసే ఇలా మాట్లాడటం నేర్చుకున్నానని.. ఇలా ఉంటే అంతా నిన్ను తిట్టుకుంటారని రాజ్ చెబుతాడు. తనకు కావాల్సింది కుటుంబ గౌరవం నిలబెట్టడం, తాతయ్య గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అంటుంది కావ్య. వీళ్ల కోసం తాతయ్య ఎంతో కష్టపడి ఇంత ఆస్తిని సంపాదించారని ఆయన కోసం వీళ్లు ఆ మాత్రం కష్టపడలేరా అని ప్రశ్నిస్తుంది కళావతి.
కంపెనీని కాపాడినందుకు, ఇంట్లో వాళ్ల ముందు సపోర్ట్ చేసినందుకు త్యాంక్స్ చెబుతాడు రాజ్.

ఇక ఈ ఇంట్లో మన పని అయిపోయినట్లేనా అని రుద్రాణి- ధాన్యలక్ష్మీలు మాట్లాడుకుంటూ ఉండగా అపర్ణ వింటుంది. ఇంతలో పనిమనిషి శాంతని చూసి రుద్రాణి ఆగమంటుంది. కానీ ఆమె మాత్రం పట్టించుకోకుండా లోపలికి వచ్చేస్తుంది. మా ఇంట్లో పనిచేయనని వెళ్లిపోయావు.. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావ్ అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. మేడం ఫోన్ చేసి పిలిస్తేనే వచ్చానని అంటుంది శాంత. ఎవరా మేడం అని రుద్రాణి అడగ్గా.. నేనే పిలిచానని చెబుతుంది కావ్య. కొన్ని ఆఫీస్ పనుల్లో సాయం చేయడానికి నేను మా ఆయనతో కలిసి వెళ్తున్నానని అలాంటప్పుడు పనిమనిషి కావాలనే శాంతను పిలిపించినట్లు చెబుతుంది కళావతి.

కావ్య చెబుతున్నా వినకుండా శాంతను బయటికి వెళ్లిపోమంటుంది రుద్రాణి. నౌకర్లను ఉంచాలన్నా , తీయాలన్నా మీకు ఎలాంటి అధికారం లేదని తేల్చిచెబుతుంది కావ్య. నీ కోడలు అంత పొగరుగా మాట్లాడుతుంటే నువ్వు పట్టించుకోవా అని అపర్ణని అడగ్గా.. నా మాటను నువ్వు కానీ, ధాన్యలక్ష్మీ కాని ఎప్పుడైనా విన్నారా అని ప్రశ్నిస్తుంది అపర్ణ. నా కోడలు ఏం తప్పు చేయలేదని.. తనకు వీలు కాదు కాబట్టి పనిమనిషిని పెట్టిందని కళావతిని వెనకేసుకొస్తుంది. ఈ ఇంట్లో కావ్య పరిపాలన మొదలైపోయిందని నువ్వు జాగ్రత్త పడాలని ధాన్యలక్ష్మీని హెచ్చరిస్తుంది రుద్రాణి.

Brahmamudi Serial Today s Episode 601 December 24th 2024 Here is full story

మా ఆయన ఎప్పుడు కోలుకుంటారని డాక్టర్‌ని నిలదీస్తుంది ఇందిర. ఆయనేం సమాధానం చెప్పకపోయే సరికి బాధపడుతుంది. ఇంతలో కళ్యాణ్ నాయనమ్మని ఓదారుస్తాడు. ఉదయాన్నే డైనింగ్ టేబుల్‌పై ఇడ్లీలు తప్పించి మరో ఐటెం కనిపించకపోవడంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీలు షాక్ అవుతారు. ఇవాళ్టీ నుంచి రోజుకొక టిఫిన్ మాత్రమే చేయమని కావ్య మేడం చెప్పారని పనిమనిషి శాంత చెబుతుంది. అవన్నీ కుదరదని నాకు పెసరట్టు , నా కొడుక్కి గారెలు కావాలి చేసుకునిరా అని ఆర్డర్స్ వేస్తుంది రుద్రాణి.

ఇంతలో కావ్య అక్కడికి రాగా.. ఇంతకుముందులా రోజుకు నాలుగైదు రకాల టిఫిన్లు ఉండవని, రోజుకొక టిఫిన్ మాత్రమే ఉంటుందని తేల్చిచెబుతుంది. ఏది ఇష్టమైతే అదే తింటున్నారని, మిగిలిపోయినవి చెత్త బుట్ట పాలవుతున్నాయని అందుకే ఈ రూల్ తెచ్చానని కావ్య ఆన్సర్ ఇస్తుంది. డబ్బును, ఆహార పదార్ధాల్ని వేస్ట్ చేయడం నాకు నచ్చదని తేల్చిచెబుతుంది. నువ్వు చెప్పినట్లు మేం తినమని.. ఆన్‌లైన్‌లో మాకు నచ్చినవి తెప్పించుకుని తింటామని చెప్పి రుద్రాణి, ధాన్యలక్ష్మీలు వెళ్లిపోతారు. అయితే రోజు రోజుకు ఇలా చేయడంతో ఇంట్లో ఏదో జరుగుతుందని అపర్ణలో అనుమానాలు మొదలవుతాయి.

ప్రకాశం ఏదో పనిచేసుకుంటూ ఉండగా ధాన్యలక్ష్మీ వచ్చి చీవాట్లు పెడుతుంది. ఒకప్పుడు కోట్ల రూపాయల బిజినెస్ చేశానని.. ఇప్పుడు రాజ్ బాధ్యతలు తీసుకున్నాడు కాబట్టి రిటైర్మెంట్ ఎంజాయ్ చేస్తున్నాని చెబుతాడు ప్రకాశం. ఆ కావ్య రోజురోజుకు రెచ్చిపోతోందని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X