Brahmamudi December 30th Episode : కార్లు కూడా పాయే.. దారుణంగా దుగ్గిరాల వారి పరిస్ధితి, కష్టాల్లో కావ్య
సుభాష్ దగ్గరికి వచ్చి కావ్య పెట్టిన రూల్స్ గురించి కంప్లయంట్ చేస్తాడు ప్రకాశం. ఇంతలో సీతారామయ్య గారి ట్రీట్‌మెంట్‌కి సంబంధించి హాస్పిటల్ బిల్ క్లియర్ కాలేదని ఫోన్ రావడంతో కావ్యని పిలిచి అడుగుతాడు సుభాష్. ఛాన్స్ దొరకడంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీలు ఆమెను నానా మాటలు అంటారు. ఇదంతా చూస్తోన్న రాజ్ అన్నింటికి నేను ఆన్సర్ చేస్తానని చెబుతాడు. రాహుల్ కొన్నాళ్లు ఎండీగా ఉన్నప్పుడు జరిగిన లెక్కలకు సంబంధించి ఆఫీస్‌లో ఆడిటింగ్ జరుగుతోందని అందుకే అకౌంట్స్, ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేశామని చెబుతాడు.
గార్డెన్‌లో ఒంటరిగా బాధపడుతున్న ఇందిరను ఓదారుస్తుంది కావ్య. రాజ్ దగ్గరికి వచ్చిన సుభాష్ నువ్వు ఏదో సమస్యల్లో ఉన్నట్లుగా అనిపిస్తోందని , మా అందరి దగ్గర దాస్తున్నావని అదేంటో చెప్పాలని అడుగుతాడు. రాజ్ మాటలు తేడాగా ఉండటంతో రుద్రాణి - ధాన్యలక్ష్మీలు ఆ రహస్యం ఏంటో కనుక్కోవాలని అనుకుంటారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక డిసెంబర్ 30వ తేదీ.. ఎపిసోడ్ 606లో ఏం జరిగిందంటే..

పనిగట్టుకుని అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏంటని ధాన్యలక్ష్మీతో అంటుంది రుద్రాణి. కావ్య వేసిన డిజైన్లను దొంగతనం చేసి తాను వేసినట్లుగా బిల్డప్ ఇచ్చాడని గుర్తుచేస్తుంది. అప్పుడు కావ్య మీద కోపంతో .. ఇప్పుడు కావ్య మీద ప్రేమతో ఇలా చేస్తున్నాడని అంటుంది. కొద్దిరోజులుగా జరుగుతున్నది గమనిస్తే ముందుగా కావ్య- రాజ్ కలిసి ఏదో గేమ్ ఆడుతున్నట్లుగా ఉందని రుద్రాణి డౌట్ పడుతుంది. మనం ఆస్తి పంచాలని అంటున్నాం కాబట్టి డబ్బంతా వాళ్ల పర్సనల్ అకౌంట్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేసి ఉండాలని.. లేదంటే అసలు అకౌంట్స్ ఖాళీ అయిపోయి ఉండాలని ఊహిస్తుంది రుద్రాణి.
ఇంత పెద్ద కంపెనీలో డబ్బులు అయిపోతాయా అని ధాన్యలక్ష్మీ ప్రశ్నిస్తుంది. తనకు షేర్ మార్కెట్ గురించి బాగా తెలుసని, ఇలాంటి కంపెనీలు ఎన్నో కుదేలు కావడం చూశానని రుద్రాణి అంటుంది. నువ్వు నాకు సపోర్ట్ ఇస్తే చాలు.. మిగిలిన నిజాలన్నీ నేను బయటికి తీసుకొస్తానని ధాన్యాన్ని అడుగుతుంది. తాతయ్య హాస్పిటల్ బిల్ కోసం రూ. 5 లక్షలు ఎలా కట్టాలో తెలియక వాళ్ల ఫ్రెండ్స్‌కి ఫోన్ చేస్తాడు రాజ్. కానీ ఎవ్వరూ హెల్ప్ చేయరు. ఇలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడూ ఎదుర్కోలేదని .. ఇప్పుడు ఏం చేయాలో అర్ధం కావడం లేదని కావ్యతో అంటాడు.
మీకు ఇలాంటివి కొత్త కావొచ్చు కానీ.. నాకు మా పుట్టింట్లో ఇది కొత్త కాదని అంటుంది కావ్య. ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్లి తన నగలు తీసుకొస్తుంది. వీటిని బ్యాంక్‌లో తాకట్టు పెట్టి ఐదు లక్షలు కట్టేద్దామని అంటుంది. దీంతో కావ్యని ప్రేమగా చూస్తాడు రాజ్. ఇన్నాళ్లు ఇంత మంచి భార్యను అపార్ధం చేసుకున్నానే.. బూత్ బంగ్లాకి తీసుకెళ్లానని బాధపడుతున్నారా అంటుంది కళావతి. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. అవసరం కోసం ఆలిని ఆలింగనం చేసుకునే టైప్ కాదు.. నువ్వు సినిమాలు ఎక్కువగా చూస్తావేమో ఏదేదో ఊహించుకోవద్దని అంటాడు .
ఆసుపత్రిలో ఉన్న కళ్యాణ్‌కి అప్పూ ఫోన్ చేసి.. నన్ను పూర్తిగా మరిచిపోయావని, నేను గుర్తుచేస్తేనే నన్ను గుర్తుచేసుకుంటున్నావని మండిపడుతుంది. హైదరాబాద్‌లో చిన్న ఇల్లు ఏమైనా మెయింటైన్ చేస్తున్నావా అని అప్పూ అడగ్గా ఆ మాటలకు కళ్యాణ్ షాక్ అవుతాడు. ఇంతలో డాక్టర్ వచ్చి మీరు ఇంకా బిల్ కట్టలేదని.. ఇలా ఆలస్యం చేస్తే హాస్పిటల్ రూల్స్ ప్రకారం ట్రీట్‌మెంట్ ఆపేస్తామని అంటాడు . ఆ మాటలను అప్పూ వింటుంది. చిన్న చిన్న విషయాల్లోనే మా అన్నయ్య చాలా క్లియర్‌గా ఉంటాడని, అలాంటిది తాతయ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండడని మీ దగ్గరే ఏదో పొరపాటు జరిగిందని అంటాడు కళ్యాణ్. ఇంతలో నర్స్ వచ్చి దుగ్గిరాల కంపెనీ నుంచి మేనేజర్ వచ్చి బిల్ కట్టేశారని అంటుంది.
అప్పూ ఆపకుండా ఫోన్ చేస్తూనే ఉంటుంది. హాస్పిటల్‌లో ఎవరు ఉన్నారు? బిల్ ఎవరు పే చేయలేదు? నా దగ్గర ఏ నిజం దాస్తున్నావు? నిజం చెప్పకుంటే నా మీద ఒట్టు అంటుంది. దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో అప్పూకి జరిగినదంతా చెబుతాడు కళ్యాణ్. ఆ మాటలతో షాకైన అప్పూ.. నాకు వెంటనే టికెట్ బుక్ చేయ్ వచ్చేస్తానని అంటుంది. నువ్వు ఇలాగే భయపడతావనే నేను నీకు చెప్పలేదని అంటాడు కళ్యాణ్. నీ లక్ష్యాన్ని మధ్యలో వదిలేసి రావొద్దని.. నీ గురించి ఆల్రెడీ కావ్య వదినకు చెప్పానని , తాతయ్య కోమాలో నుంచి బయటికొచ్చేసరికి నువ్వు ఆయన ముందు పోలీస్‌లా నిలబడాలని చెబుతాడు.
ఉదయాన్నే రాజ్ ఏదో లెటర్ చదివి షాక్‌తో తల పట్టుకుంటాడు. ఇంతలో కావ్య వచ్చి భర్తకి కాఫీ ఇస్తుంది. మూలిగే నక్క మీద తాటి పండు పడటం ఎప్పుడైనా చూశావా అంటూ ఆ లెటర్ ఆమెకు కూడా చూపిస్తాడు. అద్దెకు తీసుకున్న కార్ల బిల్లు 3 లక్షలకు పైగా రావడంతో కావ్య షాక్ అవుతుంది. ఈ పరీక్షలు తట్టుకోలేకపోతున్నామని ఇద్దరూ బాధపడతారు. ఇంతలో కావ్యకి సూపర్ ఐడియా వస్తుంది. మన కార్లే మన దగ్గర ఉంచుకుని, అద్దె కార్లను పంపించేద్దామని అనడంతో .. అలా చేస్తే ఇంట్లో వాళ్లకి కొత్త డౌట్స్ వస్తాయని రాజ్ చెబుతాడు. ఏం జరిగినా నేను చూసుకుంటానని కావ్య భరోసా ఇస్తుంది. ఇంట్లో వాళ్లంతా కనిపించకపోవడంతో రుద్రాణి హాల్‌లో ఒక్కటే కూర్చొంటుంది. పనిమనిషి శాంతను పిలిచి కాఫీ ఇవ్వమని అడుగుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










