Brahmamudi January 2nd Episode : అప్పూ జ్ఞాపకాల్లో కళ్యాణ్ .. కావ్యపై మనసుపడ్డ మరో వ్యక్తి , డ్రైవర్‌లా రాజ్

అద్దె కార్లను కావ్య పంపేయడంతో ఆ సంగతి తేల్చేయాలని రుద్రాణి - ధాన్యలక్ష్మీలు పట్టుబట్టడంతో ఆఫీసు నుంచి వచ్చాక అన్ని విషయాలు కనుక్కుంటానని అంటుంది అపర్ణ. జగదీష్ చంద్ర ప్రసాద్ కాంట్రాక్ట్ పూర్తయ్యే వరకు పెట్టుబడి అవసరాల కోసం మాత్రమే డబ్బును వాడాలని మేనేజర్‌కి కళావతి ఆర్డర్స్ వేస్తుంది. స్వరాజ్ కంపెనీ గురించి చులకనగా మాట్లాడిన స్టాఫ్‌కి వార్నింగ్ ఇస్తుంది కావ్య.

అనామిక- సామంత్‌లను నందగోపాల్ వచ్చి కలుస్తాడు. మరో మూడు నెలలు అండర్ గ్రౌండ్‌లో ఉంటే నీ గురించి జనం మరిచిపోతారని , తర్వాత ఫారిన్‌లో సెటిలైపోవచ్చని అంటుంది అనామిక. అసలు మనం ష్యూరిటి డబ్బు ఎందుకు కట్టాలి.. ముందు ఆ నందగోపాల్‌ని పట్టుకోవాలని రాజ్‌తో అంటుంది కావ్య. ఇంతలో ఎస్ఐ ఫోన్ చేసి నందగోపాల్ లోకేషన్ చెప్పడంతో ఇద్దరూ బయల్దేరతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జనవరి 2వ తేదీ.. ఎపిసోడ్ 609లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 609 January 2nd 2025 Here is full story

కారులో లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తితో నాకు పెళ్లి కాలేదని ఆవిడ మా బాస్ అని అంటాడు రాజ్. ఇంత కాస్ట్‌లీ డ్రెస్ వేశావని అడగ్గా.. మా ఆయన ఈ కోటు దానం చేశాడని చెబుతుంది కావ్య. నీ పేరు ఏంటని రాజ్ అడగ్గా.. సాఫ్ట్‌వేర్ సావిత్రి అని చెబుతాడు ఆ వ్యక్తి. అదేంటి ఆడవాళ్ల పేరు పెట్టుకున్నావని అడగ్గా.. నేను పుట్టగానే అందరూ చనిపోతుండటంతో పంతులు గారు ఆ పేరు పెట్టారని ఆ వ్యక్తి చెబుతాడు. కావ్యతో మాట్లాడుతుండగా.. ఆ వ్యక్తికి ఓ మెసేజ్ వస్తుంది. మీ నవ్వులో ఏదో మహత్యం ఉందని నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్న హోమ్ లోన్ వచ్చిందని అనడంతో కావ్య కంగ్రాట్స్ చెప్పబోతుండగా రాజ్ సడెన్ బ్రేక్ వేస్తాడు. దీంతో సావిత్రి వెనక్కి వెళ్లి కావ్య పక్కన కూర్చొంటాడు.

హాస్పిటల్‌లో తాతయ్యని చూస్తు బాధపడతాడు కళ్యాణ్ ఇంతలో ఓ వ్యక్తి గట్టిగా ఫోన్ మాట్లాడుతూ ఉండటంతో దయచేసి మెల్లగా మాట్లాడండి అని మండిపడతాడు. ఇంతలో హాస్పిటల్‌లోకి ఓ పోలీస్ ఆఫీసర్ రావడంతో ఆమెను అప్పూ అనుకుని భ్రమ పడతాడు కళ్యాణ్. అప్పూతో గడిపిన క్షణాలన్నీ అతనికి గుర్తొస్తాయి. పోలీస్ డ్రెస్ వేసుకొమ్మని మారం చేసిన సంఘటనలు వెంటాడటంతో కళ్యాణ్ మురిసిపోతుంటాడు.

Brahmamudi Serial Today s Episode 609 January 2nd 2025 Here is full story

కారులో వెళ్తుండగా నాకు కొబ్బరి నీళ్లు తాగాలని ఉందని అంటుంది కావ్య. దాంతో సావిత్రి కారు ఆపమని రాజ్‌పై ఆర్డర్స్ వేస్తాడు. సడెన్ బ్రేక్ వేయడంతో సీటుకు కొట్టుకుంటాడు సావిత్రి. కావ్యను కిందకి దిగమని చెప్పి చేయ్యి ఇవ్వడంతో రాజ్ ఉడుక్కుంటూ ఉంటాడు. మూడు బొండాలు తీసుకోమని రాజ్‌కు డబ్బులిస్తాడు సావిత్రి. ఇంతలో అతనికి ఫోన్ రాగా మనం కోర్టులో కేసు గెలిచామని అవతలి వ్యక్తి చెప్పడంతో సావిత్రి చాలా సంతోషిస్తాడు.

దీంతో ఎవరు పోయారని అడుగుతాడు రాజ్.. నా నీచ నికృష్టమైన , దరిద్రమైన జాతకం మారిపోయిందని అంటాడు సావిత్రి. మేడం చేయి తాకగానే నాకు ఎన్నో ఏళ్ల నుంచి కోర్టులో పోరాడుతున్న తాతల కాలం నుంచి ఇంటిపై కేసు గెలిచానని చెబుతాడు సావిత్రి. అతనికి కంగ్రాట్స్ చెబుతూ కావ్య చెయ్యి ఇవ్వబోతుండగా సావిత్రి కాలిపై బొండాం పడేస్తాడు రాజ్. అనంతరం కారు ఎక్కబోతుండగా కావ్యకి మళ్లీ చేయి అందిస్తాడు సావిత్రి.. దీంతో రాజ్ ఉడుక్కుంటూ డోర్‌ను ఒక తన్ను తన్నడంతో అతనికి గట్టి దెబ్బ తగులుతుంది.

ఇంతలో నందగోపాల్ తన ఫాంహౌస్ దగ్గరికి వచ్చి నేను మూడు నెలలు ఇక్కడే ఉంటానని, ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయమని వాచ్‌మెన్‌‌తో చెబుతాడు. ఓ మేడం కూడా వస్తారని ఆవిడకి ఏ లోటు రాకుండా చూసుకోవాలని ఆర్డర్స్ వేస్తాడు. తర్వాత లిల్లీకి ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేసి ఫాంహౌస్‌కి రమ్మని చెబుతాడు. నా మీద ప్రేమ లేదని.. నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకోలేదని మండిపడుతుంది. క్యాబ్ డబ్బులు నేను ఇస్తానని నందగోపాల్ చెప్పగా.. నేను కావాలి అనుకుంటే నువ్వే రమ్మని లిల్లీ తేల్చిచెబుతుంది. మూడు నెలలు నీతో చాలా ప్లాన్ చేసుకున్నానని నేనే వస్తానని అంటూ ఆమె దగ్గరికి బయల్దేరతాడు నందగోపాల్.

Brahmamudi Serial Today s Episode 609 January 2nd 2025 Here is full story

పెళ్లి చేసుకో అమ్మాయి జాతకమైన చూసుకున్నావా అని సావిత్రిని అడుగుతాడు రాజ్. వాళ్ల ఫ్యామిలీ జాతకం నాకన్న దరిద్రంగా ఉందని.. ఐరెన్ లెగ్ అన్నయ్య, లెగ్ జారిన చెల్లి, కాటికి లెగ్ చాపుకున్న తల్లి అని అంటాడు. నీ కన్నా చెండాలంగా ఉందని అంటాడు రాజ్. అందుకే మనసు మార్చుకున్నానని చెప్పిన సావిత్రి.. మీకు పెళ్లయ్యిందా అని కావ్యని అడుగుతాడు. నాకు టైం దొరికింది , ఆడుకుంటానని మనసులో అనుకుంటుంది. ఏం సావిత్రి అలా అడిగావ్, నేను నీకు నచ్చానా అని ప్రశ్నిస్తుంది కళావతి. ఎంత పాపిష్టి వాడికైనా, ఎంత ముదనుష్టొడికైనా మీరు నచ్చకుండా ఉంటారా మేడం అని అంటాడు సావిత్రి. మీరు ఒక్క నవ్వు నవ్వితే నాకు హౌసింగ్ లోన్ వచ్చిందని, ఒక్క షేక్ హ్యాండ్ ఇస్తే తాతల నాటి ఇళ్లే వచ్చిందని , మీరు నా లైఫ్‌లోకి వస్తే ఏ రాజ్యానికి రాజుని అయిపోతానో అని అంటాడు సావిత్రి.

మేడం గారి జాతకం గురించి నీకు తెలియదు అంటూ భయపెడతాడు రాజ్. భర్తని ఇంకా ఉడికించాలని అనుకున్న కావ్య..నేను అందంగా ఉన్నానా అని అడుగుతుంది. ఇంతలో నందగోపాల్ ఎక్కడ ఉన్నాడో తెలిసిందని.. మీకు లొకేషన్ పంపించానని రాజ్‌కి ఇన్స్‌పెక్టర్ ఫోన్ చేస్తాడు. నీకు ఏదైనా గుడ్ న్యూస్ తెలిసిందా అని సావిత్రి అడగ్గా.. ఔను అంటాడు రాజ్. మాకు చెబితే మేం కూడా సంతోషిస్తామని అంటాడు సావిత్రి. ఈ రోజు మేం కిడ్నాప్ చేయాల్సిన వ్యక్తి ఎక్కడున్నాడో తెలిసిపోయిందని అంటాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X