Brahmamudi January 3rd Episode : దుగ్గిరాల వారింట్లో కార్‌ల పంచాయతీ .. నందగోపాల్‌ ఎస్కేప్, రాజ్ - కావ్యలకు షాక

రాజ్ కారులోకి ఎక్కించుకున్న వ్యక్తి తన పేరును సావిత్రి అని చెప్పి, ఆడపిల్ల పేరు పెట్టడానికి రీజన్ చెబుతాడు. ఇంతలోనే అతనికి తన హోమ్ లోన్ రావడంతో పాటు కోర్టులో ఎప్పటి నుంచో నలుగుతున్న కేసు గెలవడంతో కావ్య వల్ల తనకు అదృష్టం పట్టిందని చెబుతాడు సావిత్రి. హాస్పిటల్‌లో తాతయ్య బెడ్ పక్కన ఉండగా అప్పూతో గడిపిన జ్ఞాపకాలు కళ్యాణ్‌కు గుర్తొస్తాయి. ఓ లేడీ పోలీస్ ఆఫీసర్‌ని చూసి అప్పూయేనని భ్రమపడతాడు .

నందగోపాల్ ఫాంహౌస్ దగ్గరికి వచ్చి అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా వాచ్‌మెన్‌కి డబ్బు ఇచ్చి తన ప్రియురాలిని పికప్ చేసుకోవడానికి వెళ్తాడు. మీరు నా లైఫ్‌లోకి వస్తే నా జీవితం మారిపోతుందని, మీకు పెళ్లయ్యిందా అని కావ్యని అడుగుతాడు సావిత్రి. ఆ మాటతో రాజ్ కుళ్లుకుంటూ ఉండగా ఇన్స్‌పెక్టర్ ఫోన్ చేసి నందగోపాల్ ఎక్కడ ఉన్నది చెబుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జనవరి 3వ తేదీ.. ఎపిసోడ్ 610లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 610 January 3rd 2024 Here is full story

సావిత్రిని ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్న రాజ్.. మేం కిడ్నాపర్స్ అని నిన్ను కిడ్నాప్ చేసి కోట్లు సంపాదిస్తామని చెప్పేసరికి సావిత్రి భయపడిపోతాడు. తాతల నాటి ఇల్లయినా రాసిస్తావని కిడ్నాప్ చేశావని రాజ్ చెప్పగా.. ఆ ఇంట్లో నేను ఒక్కరోజు కూడా ఉండలేదని అంటాడు. కారు ఆపకుంటే దూకేస్తానని సావిత్రి చెప్పడంతో రాజ్ పక్కకెళ్లి ఆపుతాడు. అలా కారు ఆపగానే సావిత్రి వెనుకా ముందు చూసుకోకుండా పరిగెత్తుతాడు.

లేకపోతే నా భార్య చేయి పట్టుకుంటాడా అనడంతో కావ్య సిగ్గుపడుతుంది. నువ్వేంటి వాడికి ఫుల్‌గా కో ఆపరేట్ చేస్తున్నావ్ అని ఆమెను ప్రశ్నిస్తాడు రాజ్. లేకపోతే మీరు నాతో గొడవ పెట్టుకుంటారా అంటుంది కావ్య. నందగోపాల్ కోసం అతని గెస్ట్‌హౌస్‌ దగ్గరికి వెళ్తారు రాజ్ - కావ్య. లోపలికి వెళ్లబోతుండగా రాజ్ - కావ్యలను వాచ్‌మెన్ ఆపుతాడు. దీంతో తాము మీ సార్‌కి డబ్బులు ఇవ్వడానికే వచ్చామని అబద్ధం చెప్పి లోపలికి వెళ్తారు వారిద్దరూ.

Brahmamudi Serial Today s Episode 610 January 3rd 2024 Here is full story

మరోవైపు దుగ్గిరాల వారింట్లో ధాన్యం - రుద్రాణిలు ఏదో మాట్లాడుకుంటూ ఉండగా అపర్ణ - ఇందిరలు రావడం చూసి ఆపేయడంతో ప్రకాశం అడుగుతాడు. ఎక్కడికి వెళ్తున్నారని ధాన్యం అడగ్గా.. మేం దాచిపెట్టిన నిధి నిక్షేపాలు ఎలా ఉన్నాయో చూసి వద్దామని వెళ్తున్నామని సెటైర్లు వేస్తుంది అపర్ణ. ఆసుపత్రికి వెళ్తున్నామని ఇందిర చెప్పగా.. ఇంట్లో కార్లు లేవు కదా ఎలా వెళ్తారని ప్రశ్నిస్తుంది రుద్రాణి. సుభాష్‌కి ఫోన్ చేశామని , కారు తీసుకుని వస్తున్నాడని అంటుంది ఇందిర. ఇంతలో సుభాష్ రాగానే కారు కీస్ ఇవ్వమని అడుగుతాడు సుభాష్.. కారుకి బ్రేక్ డౌన్ అవ్వడంతో మెకానిక్‌కి అప్పగించానని చెబుతాడు.

బాగున్న కారుని కొడుకు - కోడలు తీసుకెళ్లారని.. మరో కారు పాడైపోయిందని మరి ఎలా వెళ్తారని ధాన్యలక్ష్మీ ప్రశ్నిస్తుంది. ఇంట్లో ఉన్న మిగిలిన కార్లను రిటర్న్ పంపించారట కదా ఎందుకని సుభాష్ అడుగుతాడు. ఈ విషయం మీకు కూడా చెప్పలేదంటూ ధాన్యలక్ష్మీ ప్రశ్నిస్తుంది. మీ కోడలు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో ఇప్పటికైనా అర్ధమైందా అంటూ సెటైర్లు వేస్తుంది. ఈ సంసారం ఇలా అయిపోయింది, నాన్నని చూడటానికి ఆటోలో వెళ్లాల్సిన పరిస్ధితి వచ్చిందని అంటుంది రుద్రాణి. ఎలాగైనా సరే నా బావని చూడటానికి వెళ్తానని అంటుంది ఇందిర. ఇందిర - అపర్ణలు వెళ్లగానే సుభాష్‌ని రెచ్చగొడుతుంది రుద్రాణి. టిఫిన్లు, రిచ్ ఫుడ్, క్రెడిట్ కార్డులు, నాలుగు కార్లు పోయాయని అంటుంది .

Brahmamudi Serial Today s Episode 610 January 3rd 2024 Here is full story

కావ్య - రాజ్‌లు నందగోపాల్ గెస్ట్‌హౌస్‌ లోపలికి వెళ్లి అంతా చూస్తారు. మీరు మళ్లీ బూత్ బంగ్లా ప్లాన్ ఏమైనా చేశారా అంటూ కావ్య డౌట్ పడుతుంది. నన్ను ఇలాగే మోసం చేసి , వంచించి బూత్ బంగ్లాకి తీసుకెళ్లి నా జీవితంలో నిప్పులు పోశారని అంటుంది. మళ్లీ నా జీవితం నాశనం చేయడానికి ఎక్కడ బెడ్ వేయించారు, ఎక్కడ డెకరేషన్ చేయించారని ప్రశ్నిస్తుంది కావ్య. నాకు అలాంటి ఆలోచనలు, ఓపిక లేవని ముందు ఆ నందగోపాల్‌ దొరికితే నాలుగు బాది 100 కోట్ల సంగతి తేల్చుకుంటానని అంటాడు రాజ్. అయినా కావ్య నమ్మకుండా రెండో శోభనం కోసమే ఇక్కడికి తీసుకొచ్చారని అంటుంది.

వాళ్లు ఒక రూమ్‌లోకి వచ్చేసరికి అంతా క్యాండిల్స్‌లో డెకరేట్ చేసి ఉంటుంది. నాకు ఇదంతా బూత్ బంగ్లాకు జిరాక్స్ కాపీలా ఉందని కావ్య మళ్లీ మొదలుపెడుతుంది. రాజ్‌తో గొడవపడుతూ కాలు జారి భర్తపై పడటంతో ఇద్దరూ బెడ్‌పై పడతారు. ఇంతలో కారు సౌండ్ వినిపించడంతో నందగోపాల్ వచ్చినట్లు ఉన్నాడని ఇద్దరూ వెళ్లి దాక్కుంటారు. నందగోపాల్ తన ప్రియురాలిని తీసుకుని లోపలికి వస్తుండగా లోపల మీ కోసం ఓ సర్‌ప్రైజ్ ఎదురుచూస్తుందని వాచ్‌మెన్ అంటాడు. వాళ్లిద్దరూ లోపలికి వచ్చేసరికి రాజ్ - కావ్యలు కనిపించడంతో నందగోపాల్ షాక్ అవుతాడు.

Brahmamudi Serial Today s Episode 610 January 3rd 2024 Here is full story

మీ నాన్న మీదున్న గౌరవంతో మా తాతయ్య నమ్మి 100 కోట్లకు ష్యూరిటీ పెడితే మమ్మల్ని మోసం చేసి తప్పించుకుని తిరుగుతావా అంటూ మండిపడతాడు రాజ్. మా 100 కోట్లను కక్కించడమే కాదు, నీ ఆస్తులన్నీ బయటపెట్టించి నువ్వు మోసం చేసిన అందరికీ సమానంగా పంచి పెడతానని అంటాడు . నేను ఎవరినీ మోసం చేయలేదని, కంపెనీ లాస్ అయ్యిందని అందుకే మూసేశానని చెబుతాడు. మోసం చేసే ఉద్దేశం లేకపోతే ఫారిన్ వెళ్తున్నానని ఇండియాలోనే ఎందుకు ఉంటావని అంటాడు రాజ్.

ఆ వెంటనే నందగోపాల్‌ను చితకబాదుతాడు రాజ్. దీంతో రాజ్‌ను తప్పించుకుని నందగోపాల్ పారిపోతాడు. రాజ్ - కావ్యలు కారులో ఛేజ్ చేయాలని వెళ్తుండగా కారు ఆగిపోతుంది. దొరికినట్లే దొరికి నందగోపాల్ తప్పించుకోవడంతో ఏం చేయాలో తెలియక వారిద్దరూ బాధపడతుండగా నందగోపాల్ ప్రియురాలు పారిపోతుండగా ఆమెను పట్టుకుంటారు. ఇంతలో వాచ్‌మెన్‌ను లాగి పీకుతాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X