Brahmamudi January 6th Episode : అనామిక ట్రాప్‌లో రాజ్ వాచ్‌మెన్ .. కిరీటం మాయం, కావ్యతో రాజ్ రొమాన్స్

రాజ్ - కావ్యలు ఇంటికి రాగానే అద్దె కార్లు ఎందుకు పంపించేశావని కళావతిని నిలదీస్తారు రుద్రాణి - ధాన్యలక్ష్మీ. తాతయ్య సర్వహక్కులు నాకే ఇచ్చారని.. ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కావ్య తేల్చిచెబుతుంది. మీకు నచ్చినా నచ్చకున్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా మాట వినాల్సిందేనని అంటుంది . ఆ మాటలతో ప్రకాశం నొచ్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రాను రాను ఇంట్లో నువ్వు అందరికీ శత్రువుగా మారిపోతున్నావని రాజ్ కావ్యతో అంటాడు.

కావ్య మాటలతో ప్రకాశంలోనూ మార్పు మొదలైందని .. ఇది ఇలాగే కొనసాగితే వాడు రుద్రాణి వైపు వెళ్లే ప్రమాదం ఉందని ఇందిర భయపడుతుంది. కావ్య- రాజ్‌లతో మాట్లాడాలని సుభాష్ - అపర్ణలు ఎంత ప్రయత్నించినా కొడుకు - కోడలు అస్సలు టైం ఇవ్వరు . రాజ్ నుంచి తప్పించుకున్న నందగోపాల్‌ను లాగి పీకుతుంది అనామిక. రాజ్‌ను దెబ్బ కొట్టాలంటే కావ్య వేసిన డిజైన్లను నాకు కావాలని సామంత్‌ను అడుగుతుంది . ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జనవరి 6వ తేదీ.. ఎపిసోడ్ 612లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 612 January 6th 2024 Here is full story

ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన కావ్య- రాజ్‌లను అపర్ణ భోజనానికి పిలుస్తుంది. మేమిద్దరం బయటే తినేశామని.. కొంచెం పని ఉందని మీరు తినండి అని చెబుతాడు రాజ్. వాళ్లిద్దరూ బయట ఇష్టమైన ఫుడ్ తింటారు.. మనం మాత్రం గేదేల్లాగ ఆకుకూరలు తినాలా అని రుద్రాణి ప్రశ్నిస్తుంది. ఇలాంటి చెత్త తినాల్సిన కర్మ మనకి పట్టలేదని రాహుల్, రుద్రాణి, ధాన్యలక్ష్మీలు డైనింగ్ టేబుల్ నుంచి లేచి వెళ్లిపోతారు. పది రకాల వంటలు చేసినా, ఒక రకం చేసినా ఆకలి తీరడానికే కదా అని అంటాడు ప్రకాశం. అందరూ మీలా అర్ధం చేసుకోరని అంటుంది స్వప్న.

మా బావ హాస్పిటల్ పాలైనప్పటి నుంచి ఈ ఇల్లు ఇలా అయిపోయిందని ఇందిర ఆవేదన వ్యక్తం చేస్తుంది. జగదీష్ ప్రసాద్ కాంట్రాక్ట్‌ను పూర్తి చేసిన రాజ్ - కావ్యలు డెలివరీ ఇవ్వడానికి దేవుడి నగలు సిద్ధం చేస్తారు. వాటిని చూడగానే రాజ్ ఆశ్చర్యపోతూ భార్యను మెచ్చుకుంటాడు.. స్టాఫ్ కూడా కావ్యపై ప్రశంసల వర్షం కురిపిస్తారు. సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌ను పిలిచి రెండ్రోజులు మనకి చాలా ఇంపార్టెంట్ అని సెక్యూరిటీ టైట్‌గా ఉండాలని చెప్పి, నగలు జాగ్రత్తగా లాకర్‌లో పెట్టమని చెబుతాడు రాజ్.

అనామిక కూల్‌గా మందు తాగుతుండగా సామంత్ వచ్చి దానిని లాక్కొని తాను తాగుతాడు. ఇంకో పెగ్గు ఇచ్చే దాన్ని కదా నా దగ్గర ఎందుకు లాక్కున్నావని ప్రశ్నిస్తుంది అనామిక. నేనే చెప్పేది వింటే నీక్కూడా నాలాగే పిచ్చెక్కుతుందని అంటాడు సామంత్. రాజ్ - కావ్యలు కాంట్రాక్ట్ పూర్తి చేసి రేపు అనుకున్న టైంకి డెలివరి కూడా ఇవ్వబోతున్నారని చెబుతాడు. కావ్య వేసిన డిజైన్లు తీసుకొచ్చి ఇచ్చాను వాటిని ఏం చేశావని నిలదీస్తాడు సామంత్.

నువ్వు కూల్‌గా ఉండు నేను ఆడబోయే గేమ్ చూడు అంటూ వెంటనే గతంలో రాజ్ దగ్గర మేనేజర్‌గా పనిచేసి ఇప్పుడు వాచ్‌మెన్‌గా ఉన్న వ్యక్తికి అనామిక ఫోన్ చేసి డబ్బు ఆశ చూపించి ఒరిజినల్ కిరీటం ప్లేస్‌లో డుప్లికేట్‌ది పెట్టమంటుంది. నువ్వు చేస్తున్న సెక్యూరిటీ జాబ్ జీవితాంతం చేస్తే ఎంతిస్తారు అని ప్రశ్నించగా.. ఇక 25 లక్షలు సంపాదిస్తానని చెబుతాడు సెక్యూరిటీ గార్డ్. నేను రూ.50 లక్షలు ఇస్తానని అనామిక అంటుంది. దీంతో ఏం చేయాలని ఆ సెక్యూరిటీ గార్డ్ ఆశగా అడుగుతాడు.

నేను నా పర్సన్‌తో డుప్లికేట్ కిరీటం పంపిస్తానని, కావ్య - రాజ్‌లు తయారు చేయించిన ఒరిజినల్ కిరీటం ప్లేస్‌లో డూప్లికేట్‌ది పెట్టి ఒరిజినల్‌ది నాకు పంపించాలని చెబుతుతుంది అనామిక . ఆ మాటలతో సెక్యూరిటీ గార్డ్ షాక్ అవుతాడు. ఏం జరిగినా నేను చూసుకుంటానని అనామిక చెప్పడంతో మీరు చెప్పినట్లే చేస్తానని అంటాడు సెక్యూరిటీ గార్డ్. ఆ స్కెచ్‌ని చూసిన సామంత్ .. నువ్వు మామూలు దానివి కాదంటూ అనామికపై ప్రశంసల వర్షం కురిపిస్తాడు.

కాంట్రాక్ట్ పూర్తి చేయడంతో హ్యాపీగా పడుకోబోతోన్న రాజ్‌ను ఆపి.. రేపు మీటింగ్‌కు కావాల్సిన ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయమని చెబుతుంది. కావ్య ఎంత చెబుతున్నా వినకుండా రాజ్ పడుకుంటాడు. ఆఫీస్ వద్ద సెక్యూరిటీ ఎలా ఉందో తెలుసుకుని మిగిలిన పనులు చూసుకుంటుంది కావ్య. మరోవైపు ఆఫీస్‌లో తనతో పాటు పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్‌లకు మత్తు మందు కలిపిన టీ ఇస్తాడు అనామిక మనిషి. ఇంతలో ఓ వ్యక్తి డుప్లికేట్ తాళం తెచ్చి సెక్యూరిటీ గార్డ్‌కు ఇస్తాడు. ఆ వెంటనే అతను లోపలికి వెళ్లి ఒరిజినల్ కిరీటం ప్లేస్‌లో డూప్లికేట్‌ది పెట్టేసి ఆ విషయాన్ని అనామికకి చెబుతాడు . ఉదయాన్నే రాజ్‌ నిద్ర లేవకపోవడంతో కావ్య అతనికి కితకితలు పెడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X