Brahmamudi January 7th Episode : కిరీటం గోల్‌మాల్ .. అనామిక ప్లాన్‌ని తిప్పికొట్టిన కావ్య , షాక్‌లో సామంత్
రాజ్ - కావ్యలను భోజనానికి పిలిచినా రాకపోవడంతో అపర్ణ ఇతర కుటుంబ సభ్యులు బాధపడతారు. వాళ్లు బయట తినేసి వచ్చేసి ఉంటారని రుద్రాణి - ధాన్యలక్ష్మీలు వెళ్లిపోతారు. జగదీష్ చంద్ర ప్రసాద్ కాంట్రాక్ట్‌ను పూర్తి చేసి నగలను జాగ్రత్త చేస్తారు రాజ్- కావ్య. రాజ్ కంపెనీలో వాచ్‌మెన్‌గా ఉన్న పాత మేనేజర్‌కు అనామిక ఫోన్ చేసి డబ్బు ఆశ చూపి డూప్లికేట్ కిరీటం పెట్టేలా ప్లాన్ చేస్తుంది.
ప్లాన్ ప్రకారం తనతో పాటు వాచ్‌మెన్‌లుగా ఉన్న వారికి టీలో మత్తు మందు కలిపి ఇస్తాడు పాత మేనేజర్. అందరూ పడుకున్నాక అనామిక మనిషి పంపిన డూప్లికేట్ కీరిటాన్ని ఒరిజినల్ ప్లేస్‌లో పెడతాడు. కాంట్రాక్ట్ పూర్తి కావడంతో హ్యాపీగా నిద్రపోతున్న భర్తను లేపి ఇంకొన్ని పనులు ఉన్నాయని చెబుతుంది కావ్య. అయినప్పటికీ రాజ్ వినిపించుకోకుండా ఆలస్యంగా నిద్రలేస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జనవరి 7వ తేదీ.. ఎపిసోడ్ 613లో ఏం జరిగిందంటే..

రాజ్ నిద్ర లేవకపోవడంతో భర్తకి చక్కిలిగింతలు పెడుతుంది కావ్య. రాజ్ కూడా ఆమెను దగ్గరికి తీసుకుని చక్కిలిగింతలు పెడుతూ రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్లిపోవడంతో భర్తలో మార్పు మొదలైందని కావ్య చాలా సంతోషిస్తుంది. ఆఫీస్‌కి లేట్ కావడంతో రాజ్ స్పీడుగా కారు పోనిస్తాడు. దీంతో స్లోగా వెళ్లమని కావ్య చెబుతుంది. ఇంతలో ఫైలు మరిచిపోయినట్లు కళావతి గుర్తు చేయడంతో రాజ్ షాక్ అవుతాడు. నేను ఆటోలో వెళ్లి ఫైల్ తీసుకొస్తానని.. మీరు ఆఫీస్‌కి వెళ్లిపోమని చెబుతుంది కావ్య. రాజ్ ఆఫీస్‌కి ఒక్కడే రావడంతో వాచ్‌మెన్‌గా ఉన్న పాత మేనేజర్‌కి డౌట్ వచ్చి ఈ విషయాన్ని అనామికకి ఫోన్ చేసి చెబుతాడు. దాంతో ఆమె షాక్ అవుతుంది.
కావ్య లేకపోతే ఏంటి మన పని మనం పూర్తి చేశాం కదా అని సామంత్ అంటాడు. జగదీష్ చంద్ర ప్రసాద్ చేతుల్లో కావ్య - రాజ్‌లు చీవాట్లు తినాలని కావ్యని వదిలేది లేదని అంటుంది. ఆ వెంటనే కావ్యకి అనామిక ఫోన్ చేసి జగదీష్ గారితో అక్షింతలు వేసుకోకుండా నన్ను డిజప్పాయింట్ చేస్తే ఎలా అంటుంది. కాసేపట్లో నేను గెలవబోతున్నానని కావ్య చెప్పగా.. అదంతా నీ భ్రమ అంటుంది అనామిక. మీకు నష్టం జరగబోతోందని , ఎప్పుడూ లేని విధంగా మీ ఆయన స్వరాజ్ తలదించుకోబోతున్నాడని చెబుతుంది అనామిక. మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నానని చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. ఆఫీస్‌లో ఏదో జరగబోతోందని భయపడ్డ కావ్య భర్తకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాజ్ లిఫ్ట్ చేయడు.
ఇంతలో జగదీష్ ప్రసాద్ ఆఫీస్‌కు రావడంతో ఆయనకు నగలు చూపిస్తాడు రాజ్. ఆభరణాలు చాలా బాగున్నాయని జగదీష్ మెచ్చుకుంటాడు. ఈ క్రెడిట్ అంత కావ్యదేనని, మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఎంతో కష్టపడిందని రాజ్ చెబుతాడు. కావ్య ఎక్కడని జగదీష్ అడగ్గా.. ఇంటి నుంచి బయల్దేరిందని కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తుందని అంటాడు రాజ్. ఈ లోపు బంగారాన్ని చెక్ చేస్తానని జగదీష్ చెప్పడంతో రాజ్ ఓకే చెబుతాడు. అన్ని నగలు పర్ఫెక్ట్‌గా ఉన్నాయని అప్రైజర్ చెబుతూ... ఇంతలో కిరీటాన్ని చెక్ చేస్తూ షాక్ అవుతాడు. ఈ కిరీటం గోల్డ్‌ది కాదని.. నకిలీదని చెప్పడంతో రాజ్, జగదీష్ ప్రసాద్ ఉలిక్కిపడతారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న స్వరాజ్ కంపెనీలో ఫ్రాడ్ జరిగే అవకాశమే లేదని జగదీష్ అంటాడు. నేను అంతా చెక్ చేశానని ఇది బంగారం కాదని అప్రైజర్ అంటాడు.
దుగ్గిరాల సీతారామయ్య గారు స్థాపించిన కంపెనీలో ఫ్రాడ్ చేస్తావా అంటూ జగదీష్ మండిపడతాడు. మీ తాతయ్య నా ఫ్రెండ్ కాబట్టి ఆయన్ను నమ్మి ఇంత పెద్ద కాంట్రాక్ట్ మీకిస్తే చివరికి ఇంతగా దిగజారతారా అని ఫైర్ అవుతాడు. అంత పెద్ద కీరిటాన్ని మాయం చేసి దాని ప్లేస్‌లో డమ్మీది పెడతారా అని మండిపడతాడు. మాకు అలాంటి అలవాటు లేదని, పైగా దేవుడికి సమర్పించే నగల్లో ఫ్రాడ్ చేయాలని నేనే కాదు, ఎవ్వరూ అనుకోరని నచ్చచెప్పాలని చూస్తాడు రాజ్. మరి ఒరిజినల్ కీరిటం ఏమైంది చూపించు అంటూ నిలదీస్తాడు జగదీష్.
మిమ్మల్ని నమ్మి కోట్లు విలువ చేసే ప్రాజెక్ట్ ఇస్తే మీ తాతయ్య పేరు చెడగొడతారా అంటూ మండిపడతాడు. ఇంతలో కావ్య అక్కడికి వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. నకిలీ కిరీటం పెట్టి నన్ను మోసం చేస్తారా అని జగదీష్ ప్రశ్నించడంతో కావ్య షాక్ అవుతుంది. ఆ వెంటనే మీ బాబాయి గారిలాగే మీకు కూడా మతిమరుపు వచ్చిందని అంటుంది కావ్య. అది ఒరిజినల్ కీరిటం కాదని, నకిలీదని ఒరిజినల్ కీరిటం లాకర్‌లో సేఫ్‌గా ఉందని అనడంతో అంతా షాక్ అవుతారు. సెక్యూరిటీ కింద నకిలీ కిరీటాన్ని పెడతాం కదా.. మీ చేతులతో మీరే ఒరిజినల్ కిరీటాన్ని పెట్టండి అని భర్తని లోపలికి తీసుకెళ్తుంది. ఇదంతా బయటి నుంచి చూస్తున్న వాచ్‌మెన్ ఉలిక్కిపడతాడు.
ఇంతలో కిరీటాన్ని తీసుకుని రాజ్ - కావ్యలు వచ్చి దానిని చెక్ చేసుకోమ్మని ఇస్తారు. దానిని చెక్ చేసిన అప్రైజర్ .. ఇది అసలైన మేలిమి బంగారం అని అంటాడు. ఏం జరిగిందో తెలుసుకోకుండా దుగ్గిరాల సీతారామయ్య గారి మనవడినే అనుమానించారా? అని జగదీష్‌ని కావ్య ప్రశ్నిస్తుంది. ఆయన సారీ చెప్పబోతుండగా.. నాకు కాదు మా ఆయనికి చెప్పండి అని అంటుంది. మీ కంపెనీ గురించి, మీ తాతయ్య గురించి తెలిసి నేను నిన్ను అనుమానించానని రాజ్‌కి జగదీష్ క్షమాపణలు చెబుతాడు.
నీతికి , నిజాయితీకి మారుపేరైన ఈ కంపెనీలో ఎప్పటికీ ఎలాంటి తప్పు జరగదని చెబుతుంది కావ్య. ఇదంతా చూసిన వాచ్‌మెన్ వెంటనే అనామికకి ఫోన్ చేస్తాడు. నేను చేసిన దొంగతనానికి నన్ను కుమ్మేసి, మిమ్మల్ని లోపల వేయించడానికి రెడీ అవుతున్నారని చెప్పడంతో అనామిక - సామంత్ షాక్ అవుతారు. కావ్య మేడం తెలివి తేటల ముందు మనం పనికిరామని అంటాడు. మీ ఎదురుగా ఉన్న కిరీటం బంగారంది కాదు నకిలీదని చెప్పడంతో సామంత్ - అనామికలు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










