Brahmamudi January 8th Episode :కావ్య మాటలకు ప్రకాశం కంటతడి, రాజ్ మౌనం.. దుగ్గిరాల ఫ్యామిలీలో కల్లోలం

ఉదయాన్నే రాజ్ నిద్రలేవకపోవడంతో భర్తకి చక్కిలిగింతలు పెడుతుంది కావ్య. అతను కూడా భార్యకి చక్కిలిగింతలు పెడుతుండటతో తన భర్తలో మార్పు మొదలైందని కావ్య సంతోషిస్తుంది. కారులో వెళ్తుండగా ఫైల్ మరిచిపోవడంతో కావ్య మధ్యలోనే దిగిపోతుంది. ఆఫీసుకి రాజ్ ఒక్కడే రావడంతో వాచ్‌మెన్ .. అనామికకి ఫోన్ చేసి చెబుతాడు. దీంతో ఆమె వెంటనే కావ్యకి ఫోన్ చేసి రాజ్‌కు అవమానం జరగబోతోందని చెబుతుంది.

దేవుడి నగలు నకిలీవో, డూప్లికేట్‌వో జగదీష్ చంద్ర ప్రసాద్ చెక్ చేయిస్తుండగా కిరీటం రోల్డ్ గోల్డ్‌దని తేలడంతో రాజ్‌ను నానా మాటలు అంటాడు. ఇంతలో కావ్య వచ్చి కిరీటం నకిలీదని.. అసలది లాకర్‌లో ఉందని చెప్పి భర్తతో కలిసి తీసుకొచ్చి జగదీష్‌కి ఇస్తాడు. దానిని చెక్ చేయగా మేలిమి బంగారమని తేలుతుంది. మిమ్మల్ని అపార్ధం చేసుకున్నానని రాజ్‌- కావ్యలకి క్షమాపణలు చెబుతాడు రాజ్. ఆఫీస్‌లో జరిగిన సంగతిని వాచ్‌మెన్.. అనామికకి ఫోన్ చేసి చెప్పగా ఆమె షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జనవరి 8వ తేదీ.. ఎపిసోడ్ 614లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 614 January 8th 2024 Here is full story

కావ్య మేడం తెలివి తేటల ముందు మనం వేస్ట్ అని వాచ్‌మెన్ చెబుతాడు. మీ దగ్గర ఉన్న కీరిటం బంగారంది కాదు, ఇనపది అని వాచ్‌మెన్ అనడంతో అనామిక - సామంత్‌లు షాక్ అవుతారు. ఇంతలో వాచ్‌మెన్ నుంచి కావ్య ఫోన్ లాక్కుంటుంది కావ్య. నేను మరి నీలాంటి దిక్కుమాలిన ఐడియాలు వేస్తానా? కాస్త తెలివైన ఐడియాలే వేస్తానని అంటుంది . నీలాంటి శత్రువులు మా కంపెనీ పేరు ప్రతిష్టల్ని దెబ్బతీయాలని ఎదురుచూస్తుంటారని ఒకసారి గుణపాఠం నేర్పించావని అప్పటి నుంచి నా జాగ్రత్తలో నేనుంటాను అంటుంది . ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే జీవితంలో కోలుకోలేని గుణపాఠం నేను చెప్పాల్సి వస్తుందని కావ్య హెచ్చరిస్తుంది.

వయసులో పెద్దవాడివి కాబట్టి నిన్ను కొట్టడం లేదని, భార్యాబిడ్డలు ఉన్నారు కాబట్టి పోలీసులకు పట్టించడం లేదని వాచ్‌మెన్‌పై మండిపడుతుంది కావ్య . ఇంకో చోటైనా నిజాయితీగా బతుకు అని చెప్పి అతనిని ఉద్యోగంలో నుంచి తీసేస్తుంది. ఆ కావ్య తేలివితేటల ముందు నువ్వు ఎందుకు పనికిరావని అర్ధం చేసుకో అంటూ అనామికకు చీవాట్లు పెడతాడు సామంత్. దీంతో కోప్పడిన అనామిక వెళ్లి సామంత్ చొక్కా పట్టుకుంటుంది. నేను కూడా నీ గొంతు పట్టుకోగలనని.. చచ్చే వరకు విడిపించుకోలేవని వార్నింగ్ ఇస్తాడు.

ఏడు వారాల నగల్లో ఒక వారం నగల్ని అద్భుతంగా చేసిచ్చారని.. మిగిలిన ఆరు వారాల నగల్ని కూడా పూర్తి చేశాక బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చేస్తానని అంటాడు జగదీష్ ప్రసాద్. కొంతైనా అడ్వాన్స్ వస్తుంది అనుకుంటే ఇలా చేశాడేంటీ అనుకుంటాడు రాజ్. ఇంతలో భార్య దగ్గరికి వెళ్లి ఆమెను ఎత్తుకోబోతాడు. డమ్మీ కిరీటాన్ని ఎందుకు పెట్టాలని అనిపించింది అని రాజ్ ప్రశ్నిస్తాడు. అంతా మీలా నిజాయితీగా ఉండరు కదా అందుకే ఒరిజినల్‌ది లాకర్‌లో పెట్టానని చెప్పడంతో భార్యను మెచ్చుకుంటాడు. కానీ ఇప్పుడు ఇంకో చిక్కు సమస్య వచ్చిందని అంటాడు రాజ్. కాంట్రాక్ట్ పూర్తయ్యాకే మిగిలిన బ్యాలెన్స్ ఇస్తానని జగదీష్ గారు చెప్పారని అంటాడు. ఏం పర్లేదని.. అయిన ఇచ్చిన అడ్వాన్స్‌ డబ్బుతో కావాల్సిన బంగారాన్ని కొనేశామని చెబుతుంది కావ్య.

ధాన్యలక్ష్మీ పుట్టింటి నుంచి ఆమె మేనమామ ఒకరు దుగ్గిరాల వారింటికి వస్తాడు. ప్రకాశం నాకు ఫోన్ చేసి ఏదో పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందని గోల్డ్ బిస్కెట్స్ కావాలని చెప్పాడని ఆ వ్యక్తి అంటాడు. బయట ఎవరికో లాభానికి అమ్ముకోకుండా రెండేళ్ల క్రితం నాటి ధరకే మనకి అమ్మడానికి వచ్చారని చెబుతాడు ప్రకాశం. ఇప్పుడున్న రేటులో గోల్డ్ కొనాలంటే చాలా ఖర్చు అవుతుందని.. అదే పాత రేట్ ప్రకారం అయితే మన కంపెనీకి చాలా హెల్ప్ అవుతుందని సుభాష్ చాలా సంతోషిస్తాడు. అది మా పుట్టింటి వాళ్లంటే అంటూ ధాన్యలక్ష్మీ సంబరపడిపోతుంది.

ఇంతలో రాజ్ - కావ్యలు ఇంటికి వస్తారు. ఈయన శీను బాబాయ్ అని చెప్పి వారిద్దరికి పరిచయం చేస్తాడు ప్రకాశం. మా పుట్టింటి వాళ్లది కూడా గోల్డ్ బిజినెస్సే అంటూ ధాన్యలక్ష్మీ చెబుతుంది. మన కోసం మంచి ఆఫర్‌తో వచ్చారని.. కాకపోతే ఆయన లిక్విడ్ క్యాష్ కావాలని అడుగుతున్నారని ప్రకాశం చెప్పడంతో రాజ్ - కావ్యలు టెన్షన్ పడతారు. ఇప్పుడున్న రేట్ కాకుండా మీ బాబాయ్ అడిగారని మనకి పాత రేటుకే ఇస్తున్నారని చెబుతుంది ధాన్యలక్ష్మీ. భార్యాభర్తలిద్దరూ ఏం మాట్లాడకపోవడంతో ప్రకాశం - ధాన్యలక్ష్మీ ఏం జరిగిందని ప్రశ్నిస్తారు.

Brahmamudi Serial Today s Episode 614 January 8th 2024 Here is full story

ఇప్పుడున్న ఆర్డర్స్ కోసం ముందే గోల్డ్ కొనేశామని కొత్తగా బంగారం అక్కర్లేదని కావ్య చెప్పడంతో అంతా షాక్ అవుతారు. అంత గోల్డ్ లాస్‌లో ఇస్తున్నారంటే డౌట్‌గా ఉందని అనడంతో మా మావయ్యనే అవమానిస్తావా అని ధాన్యం మండిపడతాడు. గోల్డ్ మన దగ్గర ఎంతుంటే అంత మంచిదని సుభాష్, ప్రకాశంలు కావ్యకి నచ్చచెబుతారు. దాంతో శీను అన్న వ్యక్తి లేచి మీ ఇద్దరి మాటకు ఇంట్లో ఉన్న విలువ ఇదేనా అంటూ ధాన్యం, ప్రకాశంలను అవమానిస్తాడు. ఆ పార్టీని కాదని లాస్ వచ్చినా సరే అయినవాళ్లు కదా అని మీకు అమ్ముదాం అని వచ్చానని అంటాడు . ఇంకోసారి మీ ఇంటికి పిలిస్తే చచ్చినా రానని చెప్పి వెళ్లిపోతాడు.

రాకరాక నా పుట్టింటి నించి ఒక్క వ్యక్తి వస్తే నన్ను , నా భర్తను పూచీక పుల్లలా తీసి పారేశారని ధాన్యలక్ష్మీ కంటతడి పెడుతుంది. నీ పిన్ని పుట్టింటి వాళ్లు మన మీద అభిమానంతో బంగారం తక్కువ ధరకు ఇవ్వడానికి వస్తే ఇలా అవమానిస్తారా అంటూ ప్రకాశం మండిపడతాడు. కంపెనీకి సంబంధించిన నిర్ణయాలు నువ్వు తీసుకోవాలి కానీ.. మట్టి పిసుక్కునే నీ భార్య మీద వదిలేశావని నిలదీస్తుంది ధాన్యలక్ష్మీ. ఆస్తి అడిగానని ఇంతలా అవమానిస్తారా అని మండిపడుతుంది. ఇంతలో ఈ గొడవను రుద్రాణి ఇంకా రెచ్చగొడుతుంది. ఆస్తి కావాలని నేనేందుకు గొడవ చేశానో ఇప్పటికైనా తెలిసిందా అని ప్రకాశంను అడుగుతుంది ధాన్యలక్ష్మీ.

ఆ మాటలతో కావ్య మండిపడుతుంది. ఇల్లే కాదు ఇక నుంచి కంపెనీకి సంబంధించిన నిర్ణయాలను కూడా నేనే తీసుకుంటానని , సంబంధం లేనివాళ్లు ఇందులో కలగజేసుకోకూడదని తేల్చిచెబుతుంది. ఆ మాటలతో ప్రకాశం కంటతడి పెడతాడు. ఇంట్లో జరుగుతున్న సంఘటనలతో బాధపడ్డ సుభాష్ గార్డెన్‌లో అటు ఇటూ తిరుగుతుంటాడు. ఇంతలో అక్కడికి ప్రకాశం వస్తాడు. మొదటిసారి అవమానం ఎలా ఉంటుందో రుచి చూశాను కాబట్టి నిద్ర పట్టడం లేదని అంటాడు. ఇన్నాళ్లు కావ్య - రాజ్‌ల గురించి ధాన్యం చెబుతున్నా దానినే తిట్టానని చెబుతాడు. కానీ ఇంట్లో నా వాళ్ల ముందు, నా భార్య ముందు నాకు అవమానం జరిగిందని బాధపడతాడు ప్రకాశం. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X