Brahmamudi January 9th Episode : కావ్యని ఛీ కొట్టిన ప్రకాశం .. అక్కాచెల్లెళ్లని విడగొట్టేలా రుద్రాణి స్కెచ్
కావ్య మేడం తెలివి తేటల ముందు మనం వేస్ట్ అని వాచ్‌మెన్ జరిగినదంతా అనామికకి చెబుతుండగా కావ్య వచ్చి ఫోన్ లాక్కుంటుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మనిషిగా బతకాలని లేదంటే పెద్ద గుణపాఠం నేర్పిస్తానని వార్నింగ్ ఇస్తుంది. వాచ్‌మెన్‌ను ఉద్యోగంలో నుంచి తీసేసి పంపేస్తుంది. వేసిన స్కెచ్ ఫెయిల్ కావడంతో అనామిక మీద మండిపడతాడు సామంత్.
దుగ్గిరాల వారింటికి ధాన్యలక్ష్మీ మేనమామ వచ్చి తక్కువ ధరకు బంగారం అమ్ముతానని చెబుతాడు. ఇంతలో రాజ్ - కావ్యలు రాగా.. ఆయనను పరిచయం చేసి విషయం చెబుతారు ధాన్యం - ప్రకాశం. ఇప్పటికే ఆఫీసులో బోల్డెంత బంగారం ఉందని ఎక్స్‌ట్రా అవసరం లేదని అంటుంది కావ్య.
ఆ మాటలో ధాన్యలక్ష్మీ బంధువు లేచి వెళ్లిపోతాడు. మా బంధువుల ముందు నన్ను, నా భర్తని అవమానిస్తావా అంటూ కావ్యపై ధాన్యలక్ష్మీ మండిపడుతుంది. ఇకపై ఆఫీస్ విషయాల్లో నేనే నిర్ణయం తీసుకుంటానని ఇందులో సంబంధం లేనివాళ్లు కలగజేసుకోవద్దని చెబుతుంది కావ్య. ఆ మాటలతో ప్రకాశం కంటతడి పెట్టి అన్నయ్య సుభాష్ దగ్గరికెళ్లి బాధపడతాడు . ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జనవరి 9వ తేదీ.. ఎపిసోడ్ 615లో ఏం జరిగిందంటే..

నాన్నగారి నిర్ణయాన్ని గౌరవించడంలో తప్పులేదు.. కానీ ఇంట్లో వాళ్ల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం మంచిది కాదని సుభాష్‌తో అంటాడు ప్రకాశం. కావ్య చేసిన పనివాళ్ల ఇకపై నా భార్య నా మాట వింటుందా? నా కొడుక్కి అన్యాయం చేస్తున్నారని నిలదీస్తే నేను ఏం సమాధానం చెప్పగలనని అంటాడు. ఈ సమస్యను నేను పరిష్కరిస్తానని.. నాకు కొంచెం టైమ్ ఇవ్వు అని సుభాష్ అడుగుతాడు. కాలం గడిచేకొద్ది మనుషుల మధ్య మరింత దూరం పెరుగుతుందని ప్రకాశం ఏడుస్తూ వెళతాడు.
లోపలికి వెళ్తున్న ప్రకాశంకు కావ్య ఎదురుపడుతుంది. ఆఫీస్‌లో టెన్షన్‌లో ఏదో అలా అనేశానని .. నన్ను క్షమించండి అని అంటుంది. నిజంగానే ఆఫీస్‌లో చాలా గోల్డ్ స్టాక్ ఉందని.. ఆ టాపిక్‌ని అక్కడితో ఎండ్ చేద్దామనే ఉద్దేశంతోనే అలా అన్నానని చెబుతుంది కావ్య. ఒక వారం తర్వాత మళ్లీ కొనుక్కుందామని చెప్పగా.. అన్ని మనకు నచ్చినట్లుగా జరగవని, శ్రీనివాస్ లాంటి వ్యక్తి దగ్గర ఒక్కసారి నమ్మకం కోల్పోతే రెండోసారి అస్సలు నమ్మరని చెబుతాడు.

నేను మాటిస్తే రాజ్ - కావ్య కాదనరు, మీ గోల్డ్ కొంటామని చాలా గట్టిగా చెప్పానని.. కానీ నువ్వు ఒక్క క్షణంలో నా మాటను తీసి పారేశావని మండిపడతాడు ప్రకాశం. తన మాటలతో బాధపడుతున్న ప్రకాశంను మరోసారి క్షమాపణలు కోరుతుంది కావ్య. కానీ ప్రకాశం నాకేమి చెప్పొద్దు అని ఆమెను చీకొట్టి వెళ్లిపోతాడు. అక్కడ చేసినదంతా చేసి చాటుగా క్షమాపణలు చెబుతావా అని ధాన్యలక్ష్మీ మండిపడుతుంది. ఈ ఇంటికొచ్చినప్పుడు నాకు ఎంతో సపోర్ట్‌గా మాట్లాడిన మీరు ఇప్పుడు నన్ను శత్రువులా చూస్తున్నారని అడుగుతుంది కావ్య. నేనేం మారలేదని .. నువ్వే ఆస్తులు రాగానే మారిపోయావని చెబుతుంది ధాన్యలక్ష్మీ.
జరిగినదంతా పై నుంచి చూస్తుంటాడు రాజ్.. అనంతరం గదిలోకి వచ్చి బాధపడుతుంది కావ్య. నా నిర్ణయాలు అందరినీ ఇబ్బంది పెడుతున్నాయని రేపు మావయ్య, అత్తయ్య, అమ్మమ్మ గారు నాకు దూరమైపోతారని భయమేస్తుందని అంటుంది కావ్య. నువ్వు ఏడుస్తుంటే నవ్వొస్తోందని.. ఎప్పుడూ మొండిగా కనిపించే నువ్వు చిన్నపిల్లలా కనిపిస్తున్నావని అంటాడు రాజ్. ఇంట్లో అందరికీ తాతయ్య ష్యూరిటీ గురించి చెప్పేద్దామని అంటాడు రాజ్. దాంతో భయపడ్డ కావ్య.. అలా చెబితే రుద్రాణి, ధాన్యలక్ష్మీలు ఆస్తి కోసం కోర్టుకెక్కుతారని చెబుతుంది. కష్టమో నష్టమో లక్ష్యాన్ని అందుకోవాలని అంటుంది కావ్య.

ఇంట్లో జరిగిన గొడవతో ప్రకాశం ఇకపై మనతో చేతులు కలుపుతాడని రాహుల్ - రుద్రాణిలు సంబరపడిపోతుంటారు. ఆస్తి నా చేతిలోకి, బిజినెస్ నీ చేతిలోకి రావాలన్నదే నా ప్లాన్ అంటుంది రుద్రాణి. నెక్ట్స్ ఏం చేయబోతున్నావని రాహుల్ అడగ్గా.. నీ పెళ్లానికి శ్రీమంతం చేయబోతున్నానని చెబుతుంది. ఉదయాన్నే శాంత వచ్చి ఏం టిఫిన్ చేయమంటారని రుద్రాణిని అడగటంతో అంతా షాక్ అవుతారు. కంటికి ఆపరేషన్ చేయించుకున్నావా? నన్ను అడుగుతావేంటి అని మండిపడుతుంది రుద్రాణి. ఇవాళ్టీ నుంచి ఎవరెవరికి ఏమేం టిఫిన్లు కావాలో అన్ని చేయమని కావ్య మేడమే చెప్పారని అంటుంది శాంత. ఆ వెంటనే కావ్య వచ్చి మా ఆయన నాకు గడ్డి పెట్టారని.. అందుకే నా నిర్ణయాలు మార్చుకుంటున్నానని చెబుతుంది.
ఇంతలో ఓ పంతులు గారు ఇంట్లోకి వస్తాడు. ఇప్పుడు పంతులు గారిని ఎవరు పిలిచారని అడగ్గా.. నేనే పిలిచానని చెబుతుంది రుద్రాణి. నా కోడలు స్వప్నకు ఆరు నెలలు నిండాయని ఆమెకు శ్రీమంతం జరిపించాలని అనుకుంటున్నానని చెబుతుంది . ఆ మాటలు విన్న స్వప్న, ప్రకాశంలు షాకై.. మేం విన్నది నిజమేనా? అని ప్రశ్నిస్తుంది. నా కోడలంటే నాకు ఇష్టం లేదని.. కానీ ఆమె కడుపులో పెరిగే బిడ్డ నా వారసుడి కాబట్టి ఆమెకు శ్రీమంతం చేయాలని అనుకుంటున్నట్లు చెబుతుంది రుద్రాణి. శ్రీమంతం ఎలా చేయాలో? గెస్ట్‌లకు ఎలాంటి గిఫ్ట్‌లు ఇవ్వాలో ఆమె చెబుతుండగా రాజ్ - కావ్యలు టెన్షన్‌లో ఉంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











