Brahmamudi January 10th Episode : కళావతిని ఇరికించేలా రుద్రాణి స్కెచ్.. కావ్య మాస్టర్ ప్లాన్, సీనులోకి కనకం

రుద్రాణి అందరి ముందు నా పరువు పోయేలా మాట్లాడటం బాలేదని సుభాష్‌తో చెప్పుకుని బాధపడతాడు ప్రకాశం. లోపలికి వెళ్తున్న ప్రకాశానికి ఎదురైన కావ్య తాను అన్న మాటలకు క్షమాపణలు చెబుతుంది. నన్ను ఒంటరిగా వదిలేస్తే మంచిదంటూ కావ్యను విదిలించుకుని వెళ్తాడు ప్రకాశం .

కావ్య వల్ల ప్రకాశం మన వైపుకి వస్తాడని త్వరలోనే ఆస్తిని కొట్టేసి హాయిగా ఉంటామని కొడుకుతో చెబుతుంది రుద్రాణి. ఉదయాన్నే శాంత వచ్చి ఏం టిఫిన్ కావాలో చెప్పమని రుద్రాణిని అడగటంతో అంతా షాక్ అవుతారు. ఇంతలో తాను స్వప్నకి శ్రీమంతం చేయాలని అనుకుంటున్నానని చెబుతుంది రుద్రాణి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జనవరి 10వ తేదీ .. ఎపిసోడ్ 616లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 616 January 10th 2024 Here is full story

స్వప్న శ్రీమంతం గురించి రుద్రాణి రకరకాల ప్లాన్లు వేస్తుంది. మన కుటుంబంలో పుట్టే మొదటి బిడ్డ.. వాడు క్షేమంగా భూమి మీదకు రావాలంటే ముత్తయిదువులు నిన్ను ఆశీర్వదించాలని అపర్ణ కూడా శ్రీమంతానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. తలచుకుంటేనే ఎంత ఎగ్జయిటింగ్‌గా ఉందో అంటూ స్వప్న సంబరపడుతుండగా.. మనం అనుకుంటే సరిపోదని, ఈ ఇంట్లో అనుకునేవాళ్లే అనుకోవాలని కావ్యపై సెటైర్లు వేస్తాడు ప్రకాశం. శ్రీమంతం అంత గ్రాండ్‌గా చేయడం అవసరమా అని రాజ్ ప్రశ్నించడంతో అంతా షాక్ అవుతారు.

అలా కుదరదని బంధువులు, కంపెనీలో పనిచేసే స్టాఫ్ అందరిని పిలవాల్సిందేనని అందరికీ విందు భోజనం పెట్టి, బహుమతులు ఇవ్వాల్సిందేనని అంటుంది రుద్రాణి. నిజంగా అంత గ్రాండ్‌గా నా శ్రీమంతం జరగబోతుందా అని స్వప్న సంబరపడిపోతుంది. నీ చెల్లెలు నీ శ్రీమంతం కూడా సింపుల్‌గా జరిపిస్తుందా అని రుద్రాణి ప్రశ్నిస్తుంది. మా అక్క శ్రీమంతం జరుగుతుందంటే నేను ఎందుకు అడ్డు చెబుతాను అలాగే కానివ్వండి అంటుంది కావ్య.

కావ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంచి ముహూర్తం పెట్టమని పంతులు గారిని అడుగుతుంది రుద్రాణి. ఇంతలో కావ్యని లాక్కొని గదిలోకి తీసుకెళ్తాడు రాజ్. ఇప్పుడు శ్రీమంతం ఇంత గ్రాండ్‌గా ఎలా చేస్తావ్ అని అడుగుతాడు . నన్ను అందరి ముందు బ్యాడ్ చేయాలన్నది మీ అత్తయ్య ప్లాన్ అని చెబుతుంది కావ్య. తక్కువలో తక్కువగా 20 లక్షలైనా ఖర్చవుతుందని.. ఇప్పుడు అంత డబ్బు ఇస్తే మా ధాన్యం పిన్ని విరుచుకుపడుతుందని అంటాడు రాజ్. నేను అవన్నీ ఆలోచించే ఓ ప్లాన చేశానని మీరు ధైర్యంగా ఉండండి అని అంటుంది కావ్య.

మా అక్క శ్రీమంతం జరుగుతుందని.. కానీ గ్రాండ్‌గా కాదని, సింపుల్‌గా అని చెబుతుంది కావ్య. దీనికి స్వప్న ఒప్పుకోదు కదా అని రాజ్ అనగా.. మనం చెబితే ఒప్పుకోదని చెప్పేవాళ్లు చెప్పే విధంగా చెబితే వింటుందని అంటుంది. నీ ప్లాన్ మాత్రం రివర్స్ అయి అందరూ నీ మీదకి వస్తే నేనేమీ మాట్లాడలేనని రాజ్ చేతులెత్తేస్తాడు. ఇంతలో ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్లి కావ్యకి ఎలా ఝలక్ ఇచ్చాను అని అడుగుతుంది రుద్రాణి . ఆమెకే కాదు మాక్కూడా ఇచ్చావు కదా అని సెటైర్లు వేస్తుంది ధాన్యం.

నా ప్లాన్ వల్ల నీకు కూడా న్యాయం జరుగుతుందని అంటుంది రుద్రాణి. కావ్య అందరికీ ఓ న్యాయం , తన అక్కకి మాత్రం మరో న్యాయం అంటుందని ఇంట్లో వాళ్లకి చూపించాలన్నదే నా ప్లాన్ అని చెబుతుంది. స్వప్న శ్రీమంతానికి కనీసం రూ.20 లక్షలైనా కావాలని.. అంత అమౌంట్ ఎలా ఖర్చు పెడుతుందని నేను గొడవ చేస్తానని రుద్రాణి అంటుంది. ఒకవేళ సింపుల్‌గా చేస్తే అని ధాన్యలక్ష్మీ ప్రశ్నించగా.. కావ్యపై సెల్ఫీష్ అన్న ముద్ర వేసి ఫుట్ బాల్ ఆడుకుంటానని చెబుతుంది రుద్రాణి. ఈ ఆటలో మా అన్నయ్య ప్రకాశం కూడా కలిస్తే ఈ డ్రామా మరింత రసవత్తరంగా ఉంటుందని అంటుంది .

పాట రాయకుండా ఆలస్యం చేస్తుండటంతో కళ్యాణ్‌పై మండిపడతాడు రైటర్ లక్ష్మీకాంత్. మా తాతయ్య కోమాలో ఉన్నారని.. నాకు కొంచెం టైమ్ ఇస్తే పాట రాసిస్తానని చెబుతాడు కళ్యాణ్. అప్పూని ఊహించుకుంటూ పాటను పూర్తి చేయాలని అనుకుంటాడు. మరోవైపు.. కనకం దగ్గరికి వస్తుంది కావ్య. నువ్వు ఈ టైంలో వచ్చావంటే ఏ చేదు వార్త మోసుకోచ్చావోనన్న భయమేస్తుందని చెబుతుంది కనకం. నాది గుండె అనుకున్నావా బండరాయి అనుకున్నావా? చెప్పాపెట్టకుండా వచ్చి షాకులిస్తున్నావ్ అని ప్రశ్నిస్తుంది. ఇంత రాత్రిపూట బ్యాగ్ లేకుండా వచ్చావ్.. నిన్ను కట్టుబట్టలతో తరిమేశారా అని అడుగుతుంది కనకం.

నేను శుభవార్త చెప్పడానికే వచ్చానని కావ్య చెప్పగా.. కనకం సంబరపడిపోతోంది. ఎక్కువ ఊహించుకోవద్దని.. స్వప్న అక్కకి శ్రీమంతం చేయాలని మా ఇంట్లో వాళ్లు అనుకుంటున్నారని చెబుతుంది కావ్య. ఆ మాటతో ఆనందపడ్డ కనకం.. మన చుట్టాలు అందరికీ చెబుతానని, మన ఇంటి నుంచి ఏమేం వెళ్లాలో లెక్క రాసుకుంటానని అంటుంది. అంత ఓవరాక్షన్ చేయొద్దని.. శ్రీమంతం మా ఇంట్లో చేయొద్దని, మన ఇంట్లో చేయమని అంటుంది కావ్య.

కూతురి మాటలతో షాకైన కనకం.. అలా ఎందుకు చేయమంటున్నావ్ అని అడుగుతుంది. వాళ్లు సంతోషాలకు, అడంబరాలకు కనీసం రూ. 25 లక్షలు ఖర్చు అవుతుందని .. అలా జరగడం నాకిష్టం లేదని అంటుంది కావ్య. 100 మందికి భోజనం కూడా పెట్టలేమని, మీ అక్కకి 10 గ్రాముల బంగారం కూడా కొనలేమని మన పరిస్ధితి తెలిసి కూడా ఇక్కడ చేయమని ఎందుకు అడుగుతున్నావ్ అని నిలదీస్తుంది కనకం. నువ్వు ఇలా మాట్లాడుతుంటే ఏదో భయంగా ఉందని కనకం అంటుంది. కానీ నీ కోసం నేను ఏమైనా చేస్తానని చెబుతుంది కనకం.

నీకు నిజం చెప్పే టైం వస్తే నేనే చెబుతానని అంటుంది కావ్య. అక్కడ ఉన్నది రుద్రాణి అని ఆమెను ఒప్పించడం అంత తేలిక కాదని హెచ్చరిస్తుంది. నన్ను తక్కువ అంచనా వేయొద్దని .. మీ అక్కని తీసుకొచ్చి శ్రీమంతం చేసే బాధ్యత నాది అని అంటుంది కనకం. శ్రీమంతానికి ఎవరిని పిలవాలి? ఎలాంటి విందు ఏర్పాట్లు చేయాలి? ఎలాంటి ఫుడ్ పెట్టాలి? అంటూ లెక్కలు వేస్తుంటారు రాహుల్ - రుద్రాణి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X