Brahmamudi January 11th Episode : కావ్య మాస్టర్ స్ట్రోక్ , రుద్రాణికి దెబ్బేసిన ధాన్యం.. స్వప్న ఆశలు ఆవిరి
స్వప్న శ్రీమంతానికి కావ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాహుల్ - రుద్రాణిలు షాక్ అవుతారు. దీంతో కావ్యతో గదిలో పర్సనల్‌గా మాట్లాడతాడు రాజ్. ఇప్పుడున్న పరిస్ధితుల్లో శ్రీమంతం గ్రాండ్‌గా ఎలా చేస్తాం? మన దగ్గర అంత డబ్బు లేదు కదా? అంటాడు. ఇది రుద్రాణి వేసిన స్కెచ్ అని.. దీనికి నేను కౌంటర్ ఇస్తానని చెబుతుంది కావ్య.
శ్రీమంతం ఎందుకు చేయాలని అనుకుంటున్నానో ధాన్యలక్ష్మీకి చెబుతుంది రుద్రాణి. ఆమె ప్లాన్‌కు ధాన్యం కూడా సంతోషిస్తుంది. పాట రాయకుండా , తనకు కనిపించకుండా పోయిన కళ్యాణ్ మీద రైటర్ లక్ష్మీకాంత్ కోప్పడతాడు. రాత్రి పూట ఒంటరిగా తన ఇంటికొచ్చిన కూతురిని చూసి షాక్ అవుతుంది ధాన్యలక్ష్మీ. తల్లికి జరిగినది చెప్పి శ్రీమంతం .. దుగ్గిరాల వారింట్లో కాకుండా మన ఇంట్లో చేయమని కనకాన్ని ఒప్పిస్తుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జనవరి 11వ తేదీ .. ఎపిసోడ్ 617లో ఏం జరిగిందంటే..

శ్రీమంతానికి కావాల్సిన సామన్లు, గెస్టుల లిస్ట్ అంతా కలిపి రూ.20 లక్షల లెక్క చెబుతుంది రుద్రాణి. ఈ హంగామా చూసి కావ్య సహా ఇంట్లో వాళ్లంతా షాకవుతారు. దాంతో తాను కూడా కరెక్ట్‌గా అదే అమౌంట్‌కి ఎప్పుడో చెక్ రాశానని చెప్పి రుద్రాణికి ఇస్తుంది కావ్య. ఇంతలో కనకం వచ్చి స్వప్నని ఎలా ఉన్నావ్? ఆరోగ్యం ఎలా ఉంది? అని అడుగుతుంది. డబ్బుకు మేం పేదవాళ్లం కానీ, ప్రేమాభిమానాలకు కాదని ఈ పుట్టింటి తలుపులు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయని అంటుంది. వయసు పైబడుతున్నా జుట్టుకు రంగు వేయడం మాత్రం మానడం లేదని రుద్రాణిపై సెటైర్లు వేస్తుంది కనకం. నేను రంగు వేయడం ఏంటి నేను నేచురల్ బ్యూటీని అంటుంది రుద్రాణి.
ఇంతలో కరెక్ట్ టైంకి వచ్చావంటూ కనకం గురించి అంటుంది అపర్ణ. ఏమైనా విశేషమా వదిన గారు అని అడుగుతుంది అపర్ణ. మా రుద్రాణి తన చేతుల మీదుగా స్వప్న శ్రీమంతం ఘనంగా చేయించాలని అనుకుంటోందని చెప్పడంతో .. రెండు చెవులు మూసుకుని నో అని గట్టిగా అరుస్తుంది కనకం. అసలు అలా ఎలా జరుగుతుంది? స్వప్న శ్రీమంతం ఇక్కడెందుకు జరుగుతుంది? అని కనకం ప్రశ్నిస్తుంది. జీవితంలో ఏ మంచి పని చేయని రుద్రాణి గారు ఎందుకిలా చేస్తున్నారు అంటూ ఓవరాక్షన్ చేస్తుంది. మా ఇంటి ఫంక్షన్ మేం చేసుకుంటుంటే మధ్యలో నీ పర్మిషన్ ఎవరు అడిగాడు అని ప్రశ్నిస్తుంది రుద్రాణి.
స్వప్న మీద నాకు సర్వహక్కులు ఉన్నాయని.. కాదనే అధికారం మీకు లేదని అంటుంది కనకం. అసలు నీ సోది, నీ ఓవరాక్షన్ ఏంటీ? ముందు నీ బాధ ఏంటో చెప్పమని అడుగుతుంది రుద్రాణి. మా వంశ ఆచారం ప్రకారం.. మా ఇంటి ఆడబిడ్డ కడుపున పుట్టిన బిడ్డ ఏ అనారోగ్యం లేకుండా పుట్టాలంటే మా ఇంట్లోనే శ్రీమంతం చేయాలనేది మా పూర్వీకుల తీర్మానమని చెబుతుంది కనకం. ఆ మాటలతో రుద్రాణి షాక్ అవుతుంది. మా కోడలు శ్రీమంతం ఘనంగా చేయాలని లెక్కలు వేసుకుంటుంటే నువ్వొచ్చి ఆ పూరింట్లో సింపుల్‌గా శ్రీమంతం చేస్తానంటావా అని ప్రశ్నిస్తుంది. అసలు మీకు ఇంత హఠాత్తుగా నా కూతురి మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని అడుగుతుంది కనకం.
నా కొడుక్కి వారసుడు పుట్టబోతున్నాడు కాబట్టే నా కోడలి శ్రీమంతం నా ఇంట్లోనే అందరి సమక్షంలో జరిపిస్తానని రుద్రాణి తేల్చి చెబుతుంది. దీంతో కనకం ఏడుపు డ్రామా ఆడుతుంది. మా ఇంటి సాంప్రదాయాన్ని మట్టిలో కలిపేస్తారా? ఈ విషయంలో ధాన్యలక్ష్మీ గారే న్యాయం చెబుతారని ఆమెను ఆకాశానికి ఎత్తేస్తుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో జరిపించడమే మంచిదని అంటుంది ధాన్యలక్ష్మీ. ఆవిడ న్యాయం చెప్పారని, నాకు ఉన్న దాంట్లో పది మందిని పిలిచి స్వప్న శ్రీమంతం ఘనంగా జరిపిస్తానని చెబుతుంది కనకం. ఆ మాటలతో మేం ఒప్పుకోం అంటూ రుద్రాణి, రాహుల్, స్వప్నలు అంటారు.
నీ పుట్టింట్లో నీకు శ్రీమంతం చేయించడం నీకు చిన్నతనంగా ఉందా? అని స్వప్నను కనకం ప్రశ్నిస్తుంది. ఇక్కడ ఏదో జరుగుతుందని కానీ అదేంటో నాకు అర్ధం కావడం లేదని స్వప్న ఏడుస్తుంది. అంతా ఒప్పుకున్నాకా నేనేం చేస్తాను.. కనీసం బారసాల అయినా ఇక్కడ జరిపించండి అని అడుగుతుంది. ఇంతలో కావ్య వచ్చి రుద్రాణికి ఇచ్చిన చెక్‌ను తీసుకుని చించేస్తుంది. మా కూతురి శ్రీమంతం మా ఇంట్లో ఘనంగా జరిపిస్తానని .. మీరంతా ఖచ్చితంగా రావాలని చెబుతుంది కనకం.
పాట అద్భుతంగా వచ్చిందని చెప్పి అప్పూకి వినిపిస్తాడు కళ్యాణ్. అది వినగానే అప్పూ ఎమోషలన్ అయి కళ్యాణ్‌కు ఐ లవ్ యూ చెబుతుంది. వేసిన ప్లాన్ ఫెయిల్ కావడంతో రుద్రాణి , రాహుల్‌లు రగిలిపోతుంటారు. నా ప్లాన్ సక్సెస్‌ఫుల్‌గా అమలవుతుంది అనుకుంటున్న టైంలో మధ్యలో వచ్చి మొత్తం చెడగొట్టిందని కనకంపై మండిపడతారు. దీని వెనుక కావ్య ఉందని తల్లికొడుకులిద్దరూ డౌట్ పడతారు. అయితే తాతయ్య హాస్పిటల్ బిల్ కంపెనీ అకౌంట్ నుంచి కాకుండా క్యాష్ రూపంలో కట్టారని చెబుతాడు రాహుల్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











