Brahmamudi January 13th Episode : రాజ్‌ను టెంప్ట్ చేస్తోన్న కళావతి అందం ... కావ్యకి దూరమైన స్వప్న
స్వప్న శ్రీమంతానికి కావాల్సిన ఏర్పాట్లకు రూ. 20 లక్షలు అవుతుందని రుద్రాణి చెప్పడంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవ్వగా.. ఆమెకు చెక్ ఇస్తుంది కావ్య. ఇంతలో కనకం వచ్చి శ్రీమంతం దుగ్గిరాల వారింట్లో కాకుండా మా ఇంటి సాంప్రదాయం ప్రకారం జరపాలని డ్రామా ఆడుతుంది. మధ్యలో ధాన్యలక్ష్మీని లాగి ఆమెను న్యాయం చెప్పమని అడగ్గా.. ధాన్యం కూడా కనకం మాటకే ఎస్ చెబుతుంది.
చివరికి ఇంట్లోని పెద్ద వాళ్లంతా ఒప్పుకుంటారు. ఆ వెంటనే రుద్రాణికి ఇచ్చిన చెక్‌ను కావ్య చించేస్తుంది. రైటర్ చెప్పిన విధంగా అద్భుతంగా పాట రాసి దానిని అప్పూకి వినిపిస్తాడు కళ్యాణ్. భర్త తనపై చూపిస్తోన్న ప్రేమకు అప్పూ ఎమోషనల్ అవుతుంది. మనం వేసిన ప్లాన్‌ని కావ్య తిప్పికొట్టిందని రాహుల్‌తో రుద్రాణి చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జనవరి 13వ తేదీ .. ఎపిసోడ్ 618లో ఏం జరిగిందంటే..

తాతయ్య హాస్పిటల్ బిల్‌ను ఆఫీస్ అకౌంట్ నుంచి కాకుండా క్యాష్ రూపంలో చెల్లించడంతో రుద్రాణి రాహుల్‌కు లేనిపోని అనుమానాలు వస్తాయి. అదేంటో తెలుసుకుంటానని రుద్రాణి అంటుంది. అలాగే స్వప్న శ్రీమంతాన్ని ఇక్కడ కాకుండా వాళ్ల పుట్టింట్లో ఎందుకు జరిపిస్తుందో కూపీ లాగుతానని చెబుతుంది. కిచెన్‌లో వంట చేస్తున్న కావ్య దగ్గరికి వచ్చిన స్వప్న అసలు నా శ్రీమంతం గురించి అమ్మకి ఎలా తెలిసిందని నిలదీస్తుంది. నేనే చెప్పానని.. కావ్య అనగా నువ్వు నా సంతోషానికి అడ్డొస్తున్నావని చెల్లెలిపై మండిపడుతుంది స్వప్న. ఏ ఆడపిల్ల అయినా శ్రీమంతం బాగా జరగాలని కోరుకుంటుందని కానీ నీ వల్ల నేను అవన్నీ కోల్పోయానని బాధపడుతుంది స్వప్న. నువ్వు నా చెల్లెలివి కాదు, తోడి కోడలివేనని నానా మాటలు అంటుంది స్వప్న.
నేనేం చేసినా ఈ కుటుంబం మంచి కోసమే చేస్తానని, నన్ను శత్రువులా చూడొద్దని చెబుతుంది కావ్య. అత్తగారు, అమ్మమ్మల సపోర్ట్ ఉందని రెచ్చిపోతున్నావా .. నీ కంటే మా అత్తే బెటర్ అంటుంది స్వప్న. ఆ మాటలతో మండిపడిన కావ్య.. సొంత అక్కవి నువ్వు కూడా నన్ను అర్ధం చేసుకోవా అని బాధపడుతుంది. సమయం వచ్చినప్పుడు అన్నీ నీకే తెలుస్తాయని చెబుతుంది. నీకు నచ్చినట్లు నువ్వు చేసుకో, నా ఏడుపు ఏదో నేను ఏడుస్తానని అంటుంది. వీరిద్దరి మధ్య జరిగిన గొడవని అపర్ణ వింటుంది. ఇన్ని మాటలు ఎందుకు పడుతున్నావ్ , నువ్వు చెప్పే వరకు నేను నిన్ను ఏం అడగనని చెబుతుంది అపర్ణ.
శ్రీమంతానికి కావాల్సిన ఏర్పాట్లు ,లిస్ట్ గురించి ఈవెంట్ ప్లానర్‌కు చెబుతుంది కనకం . మొత్తం బిల్ రూ.40 వేల పైన అవ్వడంతో దానిని తగ్గించాలని బేరాలు ఆడి దానిని 20 వేలకి తీసుకొస్తుంది. బెడ్ రూంలో బట్టలు సర్దుతున్న కావ్య నడుముని చూస్తాడు రాజ్. ఇంతలో ఆత్మారామ్ వచ్చి ఆమెను వెనుక నుంచి వెళ్లి ముట్టుకోమని చెబుతాడు. తనంతట తాను రావాలి కానీ.. మనం వెళ్లి పట్టుకుంటే చీప్ అయిపోతామని రాజ్ భయపడతాడు. అయినా ఆత్మారామ్ తోయ్యడంతో కావ్యను పట్టుకోబోతుండగా ఆమె వెంటనే వెనక్కి తిరగడంతో ఆమెను పట్టుకుంటాడు రాజ్. ఎందుకొచ్చారని కావ్య అడగ్గా.. మీ ఇంట్లో శ్రీమంతం ఎలా చేస్తుందో అని అడుగుతాడు.
శ్రీమంతం తన ఇంట్లో జరగకపోతుండటంతో నగలు మందు పెట్టుకుని స్వప్న బాధపడుతుంది. ఇంతలో రాహుల్, రుద్రాణిలు వచ్చి ఆమెను రెచ్చగొడతారు. నీకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక నిన్ను ఓదార్చడానికి వచ్చామని చెప్పగా.. నాకేంటీ నన్ను రెచ్చగొట్టడానికి వచ్చినట్లు అనిపిస్తోందని స్వప్న కౌంటర్ ఇస్తుంది. దుగ్గిరాల వారి స్థాయికి తగ్గకుండా నీ శ్రీమంతం చేయాలని అనుకున్నామని కానీ కావ్య అన్ని చెడగొట్టిందని చెబుతుంది రుద్రాణి. ఆస్తి మన చేతికి వస్తే నీ శ్రీమంతం, డెలివరీ, బారసాల అన్ని గొప్పగా ప్లాన్ చేశామని అంటుంది రుద్రాణి. శ్రీమంతం ఖర్చు తగ్గించాలని నీ పుట్టింటికి తీసుకెళ్లిన కావ్య.. రేపు డెలివరీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేస్తే అని ప్రశ్నిస్తుంది. ఆ మాటలతో స్వప్న ఆలోచనలో పడుతుంది.
ఉదయాన్నే శ్రీమంతం ఏర్పాట్లు చేయడానికి ఈవెంట్ ప్లానర్ వస్తాడు. ఇంతలో విరిగిని కుర్చీని చూసిన కనకం దాంట్లో రుద్రాణిని కూర్చోబెట్టాలని అనుకుని ఇంతలో ప్లాస్టిక్ పళ్ల గురించి కృష్ణమూర్తి ప్రశ్నిస్తాడు. నీ కక్కుర్తి వల్ల మాట వస్తే ఊరుకునేది లేదని కనకాన్ని హెచ్చరిస్తాడు. ఇంతలో విరిగిన కుర్చీలో కృష్ణమూర్తి కూర్చోబోతుండగా.. కనకం ఆపుతుంది. ఇంతలో దుగ్గిరాల ఫ్యామిలీ అక్కడికి వస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











