Brahmamudi January 14th Episode : స్వప్న శ్రీమంతానికి కక్కుర్తిపడ్డ కనకం.. కావ్య నగలపై రుద్రాణి పంచాయతీ
తాతయ్య హాస్పిటల్ బిల్‌ను ఆఫీస్ అకౌంట్ నుంచి కాకుండా క్యాష్ రూపంలో చెల్లించడంతో రుద్రాణి - రాహుల్‌లకు డౌట్ వస్తుంది. తన శ్రీమంతం జరగకుండా ఎందుకు అడ్డుకున్నావంటూ కావ్యతో గొడవ పడుతుంది స్వప్న. ఇదంతా గమనించిన అపర్ణ.. నువ్వు చెప్పాల్సిన టైంలోనే నిజం చెప్పమంటుంది. స్వప్నను తమవైపుకు తిప్పుకోవడానికి రాహుల్ - రుద్రాణిలు ప్లాన్ చేస్తారు.
స్వప్న శ్రీమంతానికి ఈవెంట్ ప్లానర్‌తో బేరాలు ఆడి రూ.20 వేలకి సెట్ చేస్తుంది కనకం. గదిలో బట్టలు సర్దుతున్న కావ్య నడుమును చూసిన రాజ్.. ఆమెను పట్టుకోవడానికి వెళ్లగా కళావతి వెనక్కి తిరుగుతుంది. కనకం చెప్పినట్లుగానే చాలా తక్కువ బడ్జెట్‌తో శ్రీమంతానికి ఏర్పాట్లు చేస్తాడు ఈవెంట్ ప్లానర్. ఇంతలో దుగ్గిరాల ఫ్యామిలీ అక్కడికొస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జనవరి 14వ తేదీ .. ఎపిసోడ్ 619లో ఏం జరిగిందంటే..

ఒంటిపై నగలు లేకుండా పుట్టింటికి సింపుల్‌గా వచ్చిన కావ్యని చూసి రుద్రాణి - ధాన్యలక్ష్మీలు నానామాటలు అంటారు. ఇంతలో అపర్ణ జోక్యం చేసుకుని నేను నీకు నగలు ఇచ్చాను కదా అవి పెట్టుకుని రావొచ్చు కదా అని కావ్యని అడుగుతుంది. దీంతో ఏం చెప్పాలో తెలియక రాజ్ - కావ్యలు మౌనంగా ఉండిపోతారు.


Click it and Unblock the Notifications











