Brahmamudi January 15th Episode : స్వప్న కళ్లు తెరిపించిన కావ్య .. రుద్రాణికి దొరికిపోయిన కనకం
తాతయ్య హాస్పిటల్ బిల్‌ను ఆఫీస్ అకౌంట్ నుంచి కాకుండా క్యాష్ రూపంలో చెల్లించడంతో రుద్రాణి - రాహుల్‌లకు డౌట్ వస్తుంది. తన శ్రీమంతం జరగకుండా ఎందుకు అడ్డుకున్నావంటూ కావ్యతో గొడవ పడుతుంది స్వప్న. ఇదంతా గమనించిన అపర్ణ.. నువ్వు చెప్పాల్సిన టైంలోనే నిజం చెప్పమంటుంది. స్వప్నను తమవైపుకు తిప్పుకోవడానికి రాహుల్ - రుద్రాణిలు ప్లాన్ చేస్తారు.
స్వప్న శ్రీమంతానికి ఈవెంట్ ప్లానర్‌తో బేరాలు ఆడి రూ.20 వేలకి సెట్ చేస్తుంది కనకం. గదిలో బట్టలు సర్దుతున్న కావ్య నడుమును చూసిన రాజ్.. ఆమెను పట్టుకోవడానికి వెళ్లగా కళావతి వెనక్కి తిరుగుతుంది. కనకం చెప్పినట్లుగానే చాలా తక్కువ బడ్జెట్‌తో శ్రీమంతానికి ఏర్పాట్లు చేస్తాడు ఈవెంట్ ప్లానర్. ఇంతలో దుగ్గిరాల ఫ్యామిలీ అక్కడికొస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జనవరి 15వ తేదీ .. ఎపిసోడ్ 619లో ఏం జరిగిందంటే..

కనకం శ్రీమంతానికి చేసిన ఏర్పాట్లపై రుద్రాణి నానా మాటలు అనడంతో స్వప్న, కావ్యలు కౌంటరిస్తారు. లోపలికి వెళ్తుండగా.. నా గోల్డ్ నెక్లెస్ మరిచిపోయానని బాధపడుతుంది స్వప్న. ఏం పర్లేదు నువ్వు చూడటానికి మహాలక్ష్మీలా ఉన్నావని కావ్య అంటుంది. నా కోడలు అందంగానే ఉందని, కానీ నువ్వు పేదరికానికి కేరాఫ్ అడ్రస్‌లా ఉన్నావని అంటుందని రుద్రాణి. దివాళా తీసినట్లు, అప్పుల పాలైనట్లు బోసి మెడతో వచ్చావేంటీ అని ధాన్యలక్ష్మీ కూడా ఆమెకు జత కలుస్తుంది. దాంతో నేను నీకిచ్చిన నగలు ఏమయ్యాయని అపర్ణ ప్రశ్నిస్తుంది. ఇంతకీ ఆ నగలు ఉన్నాయా? పోయాయా? అని రుద్రాణి ఆరా తీస్తుంది. నువ్వేళ్లి నగలు తీసుకుని రా అని కొడుక్కి ఆర్డర్స్ వేస్తుంది అపర్ణ. కావ్య మాటలు తేడాగా ఉండటంతో నగల సంగతి ఆరా తీయాలని రాహుల్ - రుద్రాణిలు అనుకుంటారు.
ఇంతలో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తానికి కనకం - కృష్ణమూర్తిలు వారికి స్వాగతం పలుకుతారు. ఏర్పాట్లు బాలేదని కనకాన్ని ధాన్యలక్ష్మీ, రుద్రాణిలు నానా మాటలు అంటారు. తన స్థాయికి తగినట్లుగా ఏర్పాట్లు చేస్తానని కనకం ముందే చెప్పిందని అపర్ణ వారికి కౌంటర్ ఇస్తుంది. ఆకాశమంత పందిరి ముఖ్యం కాదని, మా అక్కని దీవించే విశాల హృదయాలు ముఖ్యమని.. అలాంటి వాళ్లు ఇక్కడ చాలా మంది ఉన్నారని అంటుంది కావ్య. ఖర్చులు తగ్గించాలని కొంతమంది ఇదంతా ప్లాన్ చేశారేమో అని ఇన్‌డైరెక్ట్‌గా కావ్యపై కామెంట్స్ చేస్తాడు రాహుల్. అన్ని అలా అర్ధం చేసుకుంటే మనం ఏం చేయలేమని రాజ్ అంటాడు.
మీ అమ్మ చేసిన శ్రీమంతం ఏర్పాట్లు నీకు నచ్చాయా అని స్వప్నను అడుగుతుంది రుద్రాణి. ఇక్కడ శ్రీమంతం అన్నప్పుడే నా ఆశలు సగం చచ్చిపోయాయని, ఇక్కడికి వచ్చాక పూర్తిగా చచ్చిపోయాయని బాధపడుతుంది స్వప్న. నాకు అస్సలు నచ్చలేదని ఏడుస్తూ లోపలికి వెళ్లిపోతుంది. అత్తారింట్లో కోట్ల ఆస్తులు పెట్టుకుని ఇలా దిక్కుమొక్కు లేకుండా పుట్టింట్లో శ్రీమంతం చేసుకోవాల్సిన ఖర్మ పట్టిందని కావ్యతో అంటుంది స్వప్న. ఆ ఇంటికి వచ్చే వాళ్లంతా మన దగ్గర ఉన్న డబ్బును చూసి వస్తారని , మనం ఫంక్షన్ ఎంత గ్రాండ్‌గా చేశామో చెక్ చేయడానికి వస్తారని అంటుంది కావ్య. మనం హ్యాపీగా ఉంటే కుళ్లుకుంటారని, ఫార్మాలిటీకి దీవిస్తారని, భోజనాల్లో ఒక్క ఐటెం బాగోకపోయినా ఫంక్షనే సరిగా చేయలేదని మన మొహం మీదే చెబుతారని నచ్చచెబుతుంది కావ్య.
అదే మన పుట్లింట్లో నాన్న తాటాకులతో పందిరి వేసినా, నాన్న మామిడి ఆకులతో తోరణాలు కట్టినా అది మన సంస్కృతి , సాంప్రదాయాలను తెలియజేస్తుందని అంటుంది కావ్య. మన పద్ధతులు, మన మంచితనాన్ని చూసి ఇక్కడికి వస్తారని చెబుతుంది. ఇక్కడి ప్రతి ఇల్లు మనకు తెలుసని, వాళ్లంతా ఆప్యాయంగా వచ్చి నిన్ను దీవిస్తూ ఉంటే నీకు సంతోషంగా ఉండదా అని ప్రశ్నిస్తుంది కావ్య. ఇన్ని జ్ఞాపకాలు ఇచ్చిన ఈ ఇంట్లో శ్రీమంతం జరుపుకునే అవకాశం రావడం నిజంగా అదృష్టం అంటుంది . కావ్య మాటలతో స్వప్న చల్లబడి నవ్వుతుంది. ఇవన్నీ తెలియక అమ్మను బాధపెట్టానని అంటుంది స్వప్న.
ఈ ఫంక్షన్‌లో అయినా నలుగైదు టిఫిన్‌లు పెడతారు అనుకుంటే ఈ కనకం ఉప్మా చేయించిందని ధాన్యలక్ష్మీతో అంటుంది రుద్రాణి. ఆ ఉప్మా తినలేక ఆకలికి తట్టుకోలేకపోతున్నానని చెబుతుండగా ఆమెకు యాపిల్స్ కనిపిస్తాయి. అయితే అవి ప్లాస్టిక్ ఫ్రూట్స్ కావడంతో ఆమెని ఆపాలని ఈవెంట్ మేనేజర్ అడ్డుకోగా రుద్రాణి లాగిపీకుతుంది. ఏమైనా సరే నేను యాపిల్ తింటానని చెప్పి నోట్లో పెట్టుకోగా.. అది ప్లాస్టిక్ ఫ్రూట్ అని తెలుస్తుంది. ఇదంతా పెద్ద సినిమా సెట్‌లో నుంచి తీసుకొచ్చామని చెప్పి రుద్రాణి బొడ్డుపై యాపిల్‌తో కొడుతుంది కనకం. ఎవరో ఒకరితో కొట్టించుకుని కనీసం 1000 రూపాయలైనా సంపాదించాలని అంటుంది.
రాజ్ ఒంటరిగా ఉండగా కావ్య గదిలోకి వచ్చి తలుపులు వేస్తుంది. ఈ గది చూస్తుంటే మన ఫస్ట్ నైట్ రోజులు గుర్తొస్తున్నాయని అంటాడు రాజ్. ఆ పీడ కలను గుర్తు చేయొద్దని అంటుంది. కాస్త దగ్గరికి రమ్మంటూ ఆమెను పక్కకి లాక్కొగా కావ్య సిగ్గు పడుతుంది. అనంతరం కావ్యకి ఏదో గిఫ్ట్ ఇస్తాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











