Brahmamudi January 16th Episode : కావ్య - స్వప్నలనీ కలిపిన రాజ్ .. రుద్రాణి నడుం విరగ్గొట్టిన కనకం

స్వప్న శ్రీమంతానికి బోసిగా వచ్చిన కావ్యను నగల గురించి నిలదీస్తారు అపర్ణ, ధాన్యలక్ష్మీ, రుద్రాణి. హడావుడిలో మరిచిపోయానని ఆమె చెప్పినప్పటికీ రుద్రాణికి మాత్రం డౌట్ వస్తుంది. ఇంతలో దుగ్గిరాల కుటుంబానికి కనకం, కృష్ణమూర్తిలు స్వాగతం పలుకుతారు. పుట్టింట్లో శ్రీమంతం ఏర్పాట్లు నచ్చకపోవడంతో బాధపడుతున్న స్వప్న కళ్లు తెరిపిస్తుంది కావ్య. బాగా ఆకలి వేయడంతో శ్రీమంతానికి తెచ్చిన యాపిల్ తినబోతుండగా ఈవెంట్ ప్లానర్ వచ్చి రుద్రాణిని అడ్డుకుంటాడు. దీంతో అతని చెంప పగలగొడుతుంది రుద్రాణి.

ఇంతలో అవి ప్లాస్టిక్ పండ్లు అని తెలియడంతో కనకాన్ని నానామాటలు అంటుంది. రాజ్ అత్తారింట్లో పూలతో డెకరేట్ చేసిన గదిని చూస్తూ తన ఫస్ట్ నైట్ రోజును గుర్తుచేసుకుంటాడు. ఇంతలో కావ్య లోపలికి వచ్చి తలుపు వేస్తుంది . ఆ వెంటనే రాజ్ ఆమెను దగ్గరికి లాక్కుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జనవరి 16వ తేదీ .. ఎపిసోడ్ 620లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 620 January 16th 2024 Here is full story

ఆమెకు రాజ్ ఓ గిఫ్ట్ బాక్స్ ఇస్తాడు. కావ్య దానిని తెరిచి చూడగా.. అవి స్వప్న కొన్న నగలు . దానిని తీసుకెళ్లి స్వప్నకి ఇస్తే ఆమె చాలా సంతోషిస్తుందని చెబుతాడు రాజ్. ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్లందరినీ మీరు బాగానే అర్ధం చేసుకుంటారు కానీ నాతో మాత్రం అంటీ ముట్టనట్లుగా ఉంటారని రాజ్‌పై కావ్య సెటైర్లు వేస్తుంది. రూమ్‌లో నుంచి వెళ్లబోతూ అంతేనా ఇంకేం లేదా అంటూ రాజ్‌ను కవ్విస్తుంది కావ్య. చాలా ఎక్స్‌పెక్ట్ చేశావే అంటూ మనసులో అనుకుంటాడు రాజ్.

శ్రీమంతం ఏర్పాట్లు చూసి ధాన్యలక్ష్మీ, రుద్రాణి తిట్టుకుంటూ ఉంటారు. ఇంతలో విరిగిన కుర్చీలో కూర్చోబోతున్న రుద్రాణిని ఈవెంట్ మేనేజర్ ఆపుతాడు. ఇంతలో కనకం వచ్చి ఆమె కూడా ఇందులో కూర్చోవద్దు అంటుంది. మీరిద్దరూ ఎంత చెప్పినా నేను వినను.. కూర్చోంటానని చెప్పి ఈవెంట్ మేనేజర్‌ను లాగి పీకుతుంది. నువ్వు పక్కకి జరుగు నేను కూర్చొంటానని ధాన్యం కూడా ఈవెంట్ మేనేజర్‌ను లాగి పీకుతుంది. పంతానికైనా సరే నేను కూర్చొంటానని చెప్పి కుర్చీలో కూర్చొన్న రుద్రాణి కిందపడుతుంది. నన్ను పిలిచి అవమానిస్తావా అంటూ కనకంపై ఫైర్ అవుతుంది రుద్రాణి. మేం కూర్చోవద్దు అని చెప్పినా వినిపించకుండా మీరే కూర్చొన్నారని పంచ్ వేస్తుంది కనకం. నడుం విరిగి కుంటుతూ నడుస్తున్న రుద్రాణిని చూసి నవ్వుతుంది కనకం.

Brahmamudi Serial Today s Episode 620 January 16th 2024 Here is full story

శ్రీమంతానికి స్వప్నను రెడీ చేస్తుంటారు అపర్ణ - కనకం. ఇంతలో కావ్య వచ్చి ఆమె నగల్ని గిఫ్ట్‌గా ఇస్తుంది. అది చూసిన స్వప్న.. ఈ నెక్లెస్ నువ్వు అమ్మలేదా అని అడుగుతుంది. ఈ తతంగం చూసిన రుద్రాణి.. వెంటనే ధాన్యలక్ష్మీని పిలిచి జరిగింది చెబుతుంది. ఖర్చులు పెరిగిపోతున్నాయని.. మా అందరి తిండిపై ఆంక్షలు పెట్టి అక్కకి మాత్రం చెక్ ఇచ్చి నగలు కొనుక్కోమని చెప్పిందని కావ్యపై నిందలు వేస్తుంది రుద్రాణి. తన బండారం బయటపడుతుందని అక్కపై సీరియస్ అయినట్లు నటించి.. ఇప్పుడు టైం చూసుకుని దుగ్గిరాల వారి కానుక అని చెప్పి ఆ నెక్లెస్ ఇచ్చిందని ఆరోపిస్తుంది రుద్రాణి.

తోడబుట్టిన అక్కని ఒకలాగా, మన ఇంట్లో వాళ్లని మాత్రం అడుక్కు తినేలా చేస్తోందని కావ్యపై మండిపడుతుంది ధాన్యం. అవన్నీ ఇక్కడ అవసరమా? సంతోషంగా శ్రీమంతం జరిపించి వెళ్లిపోదామని సుభాష్ నచ్చచెబుతాడు. పది లక్షలు గోల్డ్ నెక్లెస్‌ని అక్కకి ఇస్తారు కానీ, మేం కడుపు నిండా భోజనం కూడా చేయకూడదా అని ప్రశ్నిస్తుంది ధాన్యం. మేం ఇద్దరం కలిసిపోతే మీ ఇద్దరిని ఇంట్లో నుంచి తరిమేసేవాళ్లమని అంటుంది స్వప్న. ఆ రోజు కావ్య నాకు చెక్ ఇచ్చి ఇంట్లో ఖర్చుల కోసం వాడమని చెప్పిందని, కానీ నేనే నెక్లెస్ కొనుక్కున్నానని.. నమ్మితే నమ్మండి లేదంటే లేదని తేల్చి చెబుతుంది స్వప్న.

Brahmamudi Serial Today s Episode 620 January 16th 2024 Here is full story

ఇంతలో రాజ్ వచ్చి.. మా అత్తగారింటిలో గొడవ పెట్టి ఎవరికీ మన:శాంతి లేకుండా చేయాలని అనుకుంటున్నారా అని మండిపడతాడు. ఎప్పుడు కనకం ఇంటికి వచ్చినా ఏదో ఒక గొడవ చేయడం వీళ్లకి అలవాటైందని ఇందిర కూడా గడ్డిపెడుతుంది. అయితే నాక్కూడా ఓ డైమండ్ నెక్లెస్ చేయించమని అడుగుతుంది రుద్రాణి. నువ్వెప్పుడు కడుపుతో ఉన్నావ్? ఈ వయసులో శ్రీమంతం చేసి పైగా డైమండ్ నెక్లెస్ గిఫ్ట్‌గా ఇవ్వాలా? అని ప్రశ్నిస్తుంది స్వప్న. శ్రీమంతం గురించి మేం మాట్లాడటం లేదని.. మీ చెల్లి చూపించే పక్షపాతం గురించేనని చెబుతుంది కనకం.

ఆ డైమండ్ నెక్లెస్ కళావతి ఇక్కడికి తీసుకురాలేదని..నేను తీసుకొచ్చానని చెబుతాడు రాజ్. స్వప్నతో అంత కఠినంగా ఉండొద్దని నేనే ఆమెను మందలించానని.. ఎప్పటికైనా స్వప్నకే ఇవ్వాలని దానిని దాచి ఉంచానని చెబుతాడు రాజ్. ఇవాళ శ్రీమంతం కాబట్టి ఇస్తే బాగుంటుందని కళావతి చేతుల మీదుగా స్వప్నకి ఇప్పించానని అంటాడు. కళావతి అందరినీ సమానంగానే చూస్తుందని.. తన కుటుంబం కంటే దుగ్గిరాల వంశం కోసమే పాడుపడుతోందని అంటాడు రాజ్. ఎప్పటికైనా మేం ఇద్దరం ఒక్కటేనని అంటుంది స్వప్న.

ఇంతలో రాహుల్‌ వచ్చి రుద్రాణిని బయటికి తీసుకొస్తాడు. కావ్య తన నగల్ని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో తాతయ్య ఆసుపత్రి బిల్లు కట్టిందని తల్లితో చెబుతాడు రాహుల్. ఆ మాటలు విన్న రుద్రాణి ఇంట్లో ఏదో జరుగుతోందని డౌట్ పడుతుంది. ఆ పాయింట్ పట్టుకుని ఇక్కడ మంట పెడతానని అంటుంది రుద్రాణి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X