Brahmamudi January 18th Episode : నేరం తనపై వేసుకున్న అపర్ణ .. కావ్యకు దూరమైన అత్తగారు

కావ్య బంగారం తాకట్టు పెట్టింది అనడానికి ఆధారంగా రసీదు సంపాదించానని తల్లితో చెబుతాడు రాహుల్. ఆ వెంటనే అపర్ణ దగ్గరికి వెళ్లి కావ్య నగల గురించి పంచాయతీ పెట్టగా అంతా కలిసి రుద్రాణి నోరు మూయిస్తారు. తన నెక్లెస్ తీసి కావ్య మెడలో వేస్తుంది అపర్ణ.. అత్తగారు తనపై చూపెడుతున్న ప్రేమతో కంటతడి పెడుతుంది కళావతి.

స్వప్నకు ముత్తయిదువులు అంతా కలిసి శ్రీమంతం ఘనంగా చేస్తారు. ఇంట్లో పండగ వాతావరణం ఉండటంతో రుద్రాణి తట్టుకోలేకపోతుంది. ఇంతలో రాహుల్ వచ్చి నగల తాకట్టుకు సంబంధించిన రసీదును తల్లికి చూపిస్తాడు. ఇదే అదనుగా లోపలికి వెళ్లి కావ్య - రాజ్‌లు నగలు తాకట్టు పెట్టిన విషయాన్ని బయటపెడుతుంది రుద్రాణి. ఇక జనవరి 18వ తేదీ .. ఎపిసోడ్ 622లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 622 January 18th 2024 Here is full story

నువ్వు దుగ్గిరాల వారి వంశ గౌరవాన్ని కోరుకునే దానివే అయితే కళావతి నగలు తాకట్టు పెట్టిందన్న విషయం ఇంత మందిలో చెప్పేదానివే కాదు అంటూ రుద్రాణిపై రాజ్ మండిపడతాడు. నలుగురు కలిసి నవ్వుకోవడం , ఇంటిల్లిపాది సంతోషంగా ఉండటం నీకు ఎప్పటికీ నచ్చదు అంటూ ఫైర్ అవుతాడు. ఇన్ని రోజులు నువ్వు ఎన్ని గొడవలు చేసినా నేను చూసీ చూడనట్లు వదిలేశానని.. కానీ ఈరోజు మీ తల్లీకొడుకులిద్దరూ ఏదో పరిశోధించి వచ్చి నిలదీస్తుంటే అసలు నిన్ను ఏం అనాలో కూడా అర్ధం కావడం లేదంటూ మండిపడతాడు. రుద్రాణి గొడవలు పెడుతుంది సరే.. మరి ఆమె బయటపెట్టిన నిజం సంగతేంటి అని ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మీ. హాస్పిటల్ బిల్ కట్టడానికి నగలు తాకట్టు పెట్టేంత దుస్థితిలో ఉన్నామా అని నిలదీస్తుంది.

రుద్రాణికి , నీకు తేడా లేదని నువ్వు కూడా ఈ మధ్య రుజువు చేసుకుంటున్నావ్ అని ధాన్యంపై అపర్ణ మండిపడుతుంది. నేను చెబితేనే కావ్య నగలు తాకట్టు పెట్టిందని అనడంతో అంతా షాక్ అవుతారు. కంపెనీ అకౌంట్స్ అన్ని హోల్డ్‌లో పెట్టడంతో హాస్పిటల్ బిల్ కట్టకపోతే పరువు పోతుందనే ఉద్దేశంతో నేనే కావ్య నగల్ని తాకట్టు పెట్టమని చెప్పానని అంటుంది. నువ్వు నీ తెలివిగా నీ కొడుకు - కోడల్ని కాపాడావని అర్ధమవుతుందని రుద్రాణి అనగా.. ఔను ఐతే నేను చెప్పింది అబద్ధమని రుజువు చేయమని సవాల్ విసురుతుంది అపర్ణ.

నన్ను, నా కొడుకు, కోడల్ని, ఈ కనకం కుటుంబాన్ని అసలు నువ్వు ఏ హక్కుతో నిలదీస్తున్నావ్ అని ప్రశ్నిస్తుంది. నువ్వెంత నీ బ్రతుకెంత, ఈడ్చికొడితే నడిరోడ్డు మీద పడే బతుకు అంటూ అపర్ణ కోపంతో ఊగిపోతుంది. రుద్రాణి అన్నిసార్లు నగలు గురించి అడిగితే ఎందుకు చెప్పలేదని ధాన్యలక్ష్మీ ప్రశ్నిస్తుంది. అప్పుడే బయటపెట్టుంటే మీ ఇద్దరూ స్వప్న శ్రీమంతం జరగనిచ్చేవారా అని అంటుంది అపర్ణ. భోజనం చేయకుండా వెళ్లిపోతున్న రుద్రాణి - రాహుల్‌లను ఆపుతాడు కృష్ణమూర్తి. మీరు భోజనం చేయకుండా వెళితే మాకు బాధగా ఉంటుందని చెప్పినా వినిపించుకోకుండా వారిద్దరూ కోపంగా వెళ్లిపోతారు.

ఇంటికొచ్చిన వెంటనే అసలు నిజం చెప్పమని కావ్యని నిలదీస్తుంది అపర్ణ. మీ నమ్మకాన్ని పొగొట్టుకునే పని నేను చేయనని కావ్య చెప్పగా.. అది ఈ రోజుతో పోయిందని అంటుంది అపర్ణ. ఎందుకంత సీరియస్ అవుతున్నావ్? కావ్య ఏం చేసినా ఈ ఇంటి మంచి కోసమే చేస్తుందని చెబుతుంది ఇందిర. నేను మీ అబ్బాయి ఈ ఇంటి మంచి కోసమే కష్టపడుతున్నామని అంటుంది కావ్య. చెప్పలేనని అంటుంది కదా ఎందుకు అంతలా నిలదీస్తున్నావని అపర్ణకు ఇందిర నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తుంది.

ఈ బాధ్యతలు మోయలేనని నేను చెప్పినప్పుడు నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన మీరు ఈరోజు నిలదీయడం భావ్యంగా లేదని కావ్య బాధపడుతుంది. ఇంట్లో ఈ సంక్షోభం ఎందుకొచ్చిందో చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉందని, అడగాల్సిన బాధ్యత నా మీద ఉందని అయినా నువ్వు తప్పించుకుని వెళ్లిపోతున్నావని ఫైర్ అవుతుంది అపర్ణ. నా మాటకు విలువ ఇవ్వనప్పుడు నువ్వెప్పుడూ నాతో మాట్లాడొద్దు అని తేల్చిచెప్పి వెళ్లిపోతుంది. అపర్ణ ఇంతలా అడిగినా కావ్య చెప్పలేదంటే పెద్ద సమస్యే ఎదురైందని , అదేంటో తెలుసుకుంటానని ఇందిర మనసులో అనుకుంటుంది.

జరిగింది? జరగబోయేది గురించి ఊహిస్తూ రాజ్ - కావ్యలు బాధపడుతుంటారు. మీ రుద్రాణి అత్త ఏదో ఒక గొడవ తీసుకొచ్చి మన నెత్తి మీద వేస్తుంటుందని మండిపడుతుంది కావ్య. నిజం చెప్పడం ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమని రాజ్ అనగా కావ్య షాక్ అవుతుంది. దీంతో జరగబోయేది ఏంటో కావ్య ఓ పిక్చర్ వేసి చూపిస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X