Brahmamudi January 20th Episode : కావ్యకి టెస్ట్ పెట్టిన ఇందిర ... కళ్యాణ్‌కి అప్పూ సర్‌ప్రైజ్

స్వప్న శ్రీమంతం ముగిసి దుగ్గిరాల ఫ్యామిలీకి కృష్ణమూర్తి- కనకం భోజనాలు వడ్డిస్తుండగా రుద్రాణి వచ్చి నగల తాకట్టు విషయం బయటపెడుతుంది. రాజ్ కలగజేసుకుని.. నువ్వు ఎన్ని చేసినా మౌనంగా ఉన్నానని ఇకపై సహించేది లేదని కోప్పడతాడు. గొడవ పెద్దది అవుతుండటంతో అసలు కావ్యని నగలు తాకట్టు పెట్టమని చెప్పిందే నేనంటూ అబద్ధం చెప్పి రాజ్ - కావ్యలను కాపాడుతుంది అపర్ణ. జరిగిన అవమానంతో భోజనం చేయకుండా వెళ్లిపోతున్న రుద్రాణి - రాహుల్‌ను ఆపాలని కృష్ణమూర్తి ప్రయత్నిస్తాడు.

ఇంటికొచ్చిన తర్వాత అసలు నిజమేంటో చెప్పాలని కోడలిని నిలదీస్తుంది అపర్ణ. ఎంత అడిగినా కావ్య నిజం చెప్పకపోవడంతో ఇకపై నీతో మాట్లాడేది లేదని వెళ్లిపోతుంది. అందరికీ ష్యూరిటీ గురించి చెబితేనే ఈ సమస్యలకు ముగింపు లభిస్తుందని కావ్యతో రాజ్ అంటాడు. ఇక జనవరి 20వ తేదీ .. ఎపిసోడ్ 623లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 623 January 20th 2024 Here is full story

పగలు ఆఫీసులో కష్టపడి కాంట్రాక్ట్ పూర్తి చేద్దామని, రాత్రిపూట ఆ నందగోపాల్‌ను వెతికి పట్టుకునే పనిలో ఉందామని రాజ్‌తో చెబుతుంది కావ్య. ఒకవేళ వాడు దొరక్కపోతే ఏం చేస్తావని ప్రశ్నిస్తాడు రాజ్. మరోవైపు ధాన్యలక్ష్మీ , రుద్రాణి, రాహుల్‌లు నగలు తాకట్టు పెట్టిన విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కావ్య - రాజ్ కలిసి డబ్బుల్ని గోల్‌మాల్ చేస్తున్నారేమోనని ధాన్యలక్ష్మీ డౌట్ పడుతుంది. వీరిద్దరి వెనుక సుభాష్ - అపర్ణలు ఉండి కథ నడిపిస్తున్నారని రుద్రాణి చెప్పడంతో ధాన్యలక్ష్మీ షాక్ అవుతుంది. కొడుకుతో కుమ్మక్కై ఆస్తి మొత్తం ముందే రాయించేసుకున్నారని , ప్రకాశం అన్నయ్యని వాళ్ల గ్రిప్‌లో పెట్టుకున్నారని అంటుంది రుద్రాణి. మన కంపెనీలో అకౌంట్స్‌లో నిజంగానే డబ్బులు లేవా? లేకపోతే వాళ్లు కంపెనీలో ఉన్న డబ్బును డైవర్ట్ చేస్తున్నారా? కనుక్కోమని రాహుల్‌కు చెబుతుంది .

అనామిక - సామంత్‌లు కలిసి మందు తాగుతుంటారు. 5 లక్షల కోసం నగలు తాకట్టుపెట్టే రేంజ్‌కి కావ్య - రాజ్‌లు వచ్చేశారని అనామిక చెబుతుంది. 100 కోట్ల ష్యూరిటీ గురించి కూడా లీక్ చేసి దుగ్గిరాల వారింట్లో చిచ్చు పెడతానని అంటుంది. అయితే సామంత్ మాత్రం అలా చేయొద్దని.. అప్పుడు అంతా రాజ్- కావ్యలకి సపోర్ట్‌గా నిలబడతారని అంటాడు. నాకు ఆ కంపెనీ కావాలని ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా వెంటనే రుద్రాణికి ఫోన్ చేస్తుంది.

5 లక్షల మేటర్ లీక్ అయ్యిందంటగా.. స్వప్న శ్రీమంతం తూతూ మంత్రంగా జరిగిందంటగా అని రుద్రాణిని అడుగుతుంది. మీకు తెలియని విషయాలు ఎన్నో నా దగ్గర ఉన్నాయని.. ఆ ఇంటికి సంబంధించిన బిగ్‌న్యూస్ చెబుతానని దానిని ఉపయోగించి ఇంట్లో అల్లర్లు సృష్టిస్తారో , ఆస్తిని దక్కించుకుంటారో మీ ఇష్టమని అంటుంది అనామిక. రేపు ఉదయం డాక్యుమెంట్స్ పంపిస్తానని అది చదివాక ఆ కావ్యని ఇంట్లో నుంచి గెంటేసినా ఎవ్వరూ ప్రశ్నించరని చెబుతుంది . ఆ మాటలతో రుద్రాణి సంబరపడిపోతుంది.

రుద్రాణి ఫోన్ పెట్టేయగానే ఎదురుగా స్వప్న ఉంటుంది. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటని అడగ్గా.. నాకు వారసుడు పుట్టబోతున్నాడని ఆనందంగా ఉందని చెబుతుంది. నిన్న మా శ్రీమంతం అని కూడా చూడకుండా 5 లక్షల మేటర్ చెప్పి మొత్తం పెంట పెంట చేశావని రుద్రాణిపై కోప్పడుతుంది. నీకు , రాహుల్‌కు అన్యాయం జరగకుండా నేను నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని ఏదో ఒక రోజు నా గురించి తెలుసుకుని పశ్చాత్తాపపడతావని అంటుంది రుద్రాణి.

కిచెన్‌లో ఉన్న కావ్య దగ్గరికి ఇందిర వచ్చి నగలు ఇస్తుంది. ఇంట్లో ఇన్ని బాధలున్నా.. గుండెల్లో దాచుకుని ఎంతో కష్టపడుతున్నావని నా దగ్గర దాయాలని చూడొద్దని అంటుంది ఇందిర. ఈ నగలు అవసరానికి ఉపయోగపడతాయని తీసుకోమ్మని చెబుతుంది. నాకు మీ ఆశీస్సులు చాలని, నగలు వద్దని తేల్చిచెబుతుంది కావ్య. అకౌంట్స్ అన్ని హోల్డ్‌లో ఉన్నాయని.. అందుకే తాతయ్య హాస్పిటల్ బిల్ కట్టడానికి నగలు తాకట్టు పెట్టామని చెబుతుంది. నీ దగ్గర నుంచి నిజం తెలుసుకోవడానికే టెస్ట్ చేశానని చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది.

తాతయ్య ఎప్పుడు కోమాలో నుంచి కోలుకుంటాడోనని డాక్టర్‌ను అడుగుతాడు కళ్యాణ్. ఇంతలో అప్పు ట్రైనింగ్ నుంచి వచ్చి కళ్యాణ్ కోసం వస్తుండగా.. ఇదంతా భ్రమ అనుకుంటాడు కళ్యాణ్. హాయ్ కుచ్చి అని వచ్చి పలకరించగా.. కళ్యాణ్ ఏమాత్రం పట్టించుకోకుండా అంతా భ్రమ అని అప్పూతోనే అంటాడు. దీంతో భర్తని గట్టిగా గిల్లుతుంది అప్పు. మూడు రోజులు సెలవులు ఇవ్వడంతో నిన్ను చూద్దామని వచ్చేశానని అంటుంది అప్పూ. తాతయ్యకి ఎలా ఉందని అప్పూ అడగ్గా.. అలాగే ఉందని చెబుతాడు కళ్యాణ్. ఉదయాన్నే కాఫీ తీసుకొచ్చి ఇచ్చినా అపర్ణ తీసుకోదు. కారణాలు చెప్పనివారు కాఫీ ఇస్తే తీసుకోనని అంటుంది. ఇదంతా రాజ్ చూసి బాధపడతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X