Brahmamudi January 21st Episode : రాజ్ చెంప పగలగొట్టిన అపర్ణ .. రుద్రాణి చేతికి బ్రహ్మాస్త్రం

ఎలాగైనా నందగోపాల్‌ను పట్టుకోవాలని.. అప్పటి వరకు మనకు ఈ కష్టాలు తప్పవని రాజ్‌తో అంటుంది కావ్య. నగల తాకట్టు గురించి రుద్రాణి , రాహుల్, ధాన్యలక్ష్మీలు మాట్లాడుకుంటూ ఉంటారు. సీతారామయ్య ష్యూరిటీ సంగతికి సంబంధించిన సమాచారాన్ని డాక్యుమెంట్ల రూపంలో రుద్రాణికి పంపిస్తుంది అనామిక. ఇంట్లో చిచ్చుపెట్టడానికి అత్త ఏదో స్కెచ్ వేసిందని పసిగడుతుంది స్వప్న.

కిచెన్‌లో ఉన్న కావ్య దగ్గరికి ఇందిర వచ్చి నగలు ఇస్తుంది. కానీ వాటిని కళావతి వద్దని చెప్పడంతో నా టెస్ట్‌లో నువ్వు పాసయ్యావని ఇందిర అనడంతో కావ్య షాక్ అవుతుంది. హాస్పిటల్‌కు వచ్చిన అప్పూని చూసి భ్రమ పడుతున్నానని అనుకుంటాడు కళ్యాణ్. చేతులపై గిల్లేసరికి కళ్యాణ్‌ దెబ్బకి దిమ్మ తిరుగుతుంది. ఉదయాన్నే కావ్య కాఫీ తీసుకొచ్చి ఇచ్చినా అపర్ణ తీసుకోదు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జనవరి 21వ తేదీ .. ఎపిసోడ్ 624లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 624 January 21st 2024 Here is full story

అత్తగారు అలిగి వెళ్లిపోయిందని కోడలు గారు చిన్న బుచ్చుకున్నారా? అని ప్రశ్నిస్తాడు రాజ్. అత్తయ్య కాఫీ తీసుకోవడం లేదని .. మీకే గనుక దమ్ము, ధైర్యం ఉంటే మీ అమ్మకి ఈ కాఫీ ఇచ్చి నాతో మాట్లాడించండి అని చెబుతుంది కావ్య. అసలు నేనంటే ఏమనుకున్నావ్.. కొడుకు వేరు, కోడలు వేరు అంటూ పౌరుషంగా చెబుతాడు రాజ్. మీ అమ్మ అసలే కోపంగా ఉందని ఇప్పుడు రోషం వద్దని అంటుంది ఇందిర. వాళ్లిద్దరూ ఎంత చెప్పినా వినకుండా అపర్ణ దగ్గరికి వెళ్తాడు రాజ్. గదిలోంచి కాఫీ కిందపడినట్లు, చెంప దెబ్బ కొట్టినట్లుగా శబ్ధాలు రావడంతో ఇందిర, కావ్యలు షాక్ అవుతారు. తర్వాత ఎగిరొచ్చి బయటపడతాడు రాజ్.

కాఫీ చల్లారిపోయింది తర్వాత తాగుతానని చెప్పిందని రాజ్ కవర్ చేసేందుకు ట్రై చేయగా ఇందిర, కావ్యలు సెటైర్లు వేస్తారు. ఈసారి మళ్లీ ట్రై చేస్తానని కాఫీ రెడీ చేయమని కావ్యతో చెబుతాడు రాజ్. నా మనవడు రెండో ప్రయోగం చేస్తానని అంటున్నాడు.. ఏం చేస్తాడో చూద్దామని అంటుంది ఇందిర. కిచెన్‌లో కాఫీ కలుపుతున్న కావ్య దగ్గరికి వచ్చి.. మా అమ్మ చేతిలో కాఫీ కప్పు పెట్టి ఆమె కాళ్ల మీద పడిపోతే మా అమ్మ కోపం కరిగిపోతుందని అంటాడు. నేనొక్కదాన్నే ఎందుకు ఇద్దరం కలిసి పడదామని అంటుంది కళావతి. రాజ్‌కు చెంపదెబ్బ గుర్తొచ్చి నేను రాను, మీ అత్తా కోడళ్ల అనుబంధాన్ని దూరంగా ఉండి చూస్తానని చెబుతాడు రాజ్.

Brahmamudi Serial Today s Episode 624 January 21st 2024 Here is full story

అయినా కావ్య వినిపించుకోకుండా పట్టుబట్టడంతో రాజ్ ఆమె వెంట తల్లి దగ్గరికి రావడానికి ఒప్పుకుంటాడు. ఇళ్లంతా వెతికినా అపర్ణ ఎక్కడా కనిపించదు.. చివరికి గార్డెన్‌లో కూర్చొని ఒంటరిగా బాధపడుతుంటుంది. కాఫీ ఎవరు ఇవ్వాలా అని రాజ్ - కావ్యలు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్లని చూసిన అపర్ణ లేచి వెళ్లిపోబోతుండగా ఇద్దరూ ఆమె కాళ్ల మీద పడి ఏదేదో చెబుతూ లేచి చూసే సరికి అక్కడ ఇందిర కాఫీ తాగుతూ కనిపిస్తుంది. మీ అమ్మ గురించి నేను ముందే చెప్పాను మీరు వినిపించుకోలేదని అంటుంది ఇందిర.

కళ్యాణ్ - అప్పూ రోడ్డు మీద మాట్లాడుకుంటూ వెళ్తారు. నీ పోలీస్ ట్రైనింగ్‌కు వచ్చినవాళ్లలో నువ్వే పోట్టా, లేక ఎవరైనా ఉన్నారా అంటూ భార్యను ఆటపట్టిస్తాడు కళ్యాణ్. నేను పొట్టిదాన్ని అయినా గట్టి దాన్ని అని అప్పూ కౌంటర్ ఇస్తుంది. ఇంతలో ఎవరో దొంగ ఓ వ్యక్తి పర్సు కొట్టేస్తూ అప్పూకి కనిపించడంతో వాడిని పట్టుకుని పర్సును తీసుకుంటుంది. పర్సును తీసుకుని దాని యజమానికి ఇవ్వబోతుండగా అతను సామంత్. ఇంతలో చప్పట్లు కొడుతూ అనామిక బయటికొస్తుంది. రోడ్డు మీద పిక్ పాకెటర్స్, చైన్ స్నాచర్స్ నుంచి కాపాడినందుకు ఎంత తీసుకుంటావ్ అని అప్పూని అడుగుతుంది అనామిక.

కారు కొన్నావా? విల్లా కొన్నావా? ఏది చూపించు అంటూ వాళ్లని ఎగతాళి చేస్తుంది అనామిక. అవన్నీ నెరవేరే రోజు తొందరలోనే ఉందని కళ్యాణ్ కౌంటరిస్తాడు. నువ్వు తప్పు చేశావని మేం మెడ పట్టుకుని గెంటేస్తే.. నువ్వు అతని కాళ్లు పట్టుకుని సామంత్ పక్కన చేరావని అంటాడు. నా భార్య దేశానికే సేవ చేయబోతోందని, త్వరలో పోలీస్ అయి నీలాంటి అడ్డదారులు తొక్కేవాళ్లని దారిలో పెడుతుందని చెబుతాడు. ఆ మాటలతో అనామిక నవ్వేసి .. జోక్ బాగుందని, నిన్ను సెలెక్ట్ చేసిన ఆ తిక్కోడు ఎవరు అని సెటైర్లు వేస్తుంది అనామిక.

Brahmamudi Serial Today s Episode 624 January 21st 2024 Here is full story

సొంత ప్రతిభతో పరీక్ష రాసి ఎస్ఐ ట్రైనింగ్‌కు సెలెక్ట్ అయ్యిందని.. త్వరలోనే యూనిఫాంలో వస్తుందని చెబుతాడు కళ్యాణ్. ఆ మాటలతో షాకైనా అనామిక.. తాను రాజ్ - కావ్యలపై ఫోకస్ చేసి వీరిద్దరిని వదిలేశానని సామంత్‌తో అంటుంది. వీళ్ల సంగతి తర్వాత ముందు డాక్యుమెంట్స్‌ని రుద్రాణికి పంపించావ్ కదా.. అక్కడ అంటుకునే మంట గురించి ఆలోచించు అని చెబుతాడు సామంత్.

ధాన్యలక్ష్మీ దగ్గరికి పత్రాలు తీసుకొచ్చి చదవని చెబుతుంది రుద్రాణి. 10 కోట్లకి మన గెస్ట్‌హౌస్‌ను తాకట్టు పెట్టారా అని తెలుసుకుని ధాన్యలక్ష్మీ షాక్ అవుతుంది. నిన్ను, నన్ను పిచ్చోళ్లని చేసి వాళ్లు మాత్రం డబ్బుల్ని దాచుకుంటున్నారని రుద్రాణి అంటుంది. ఆస్తిలో వాటా ఇవ్వకపోగా.. ఇప్పుడు అప్పులో వాటా ఇవ్వమని అడుగుతారు ఏం చేస్తావ్ అని ప్రశ్నిస్తుంది. అసలు ఆస్తిని ఎందుకు తాకట్టు పెట్టాల్సి వచ్చిందో కూపీ లాగితే అన్ని బయటికి వస్తాయని అంటుంది రుద్రాణి. ఇప్పటి వరకు సాక్ష్యాలేం లేవు కాబట్టి.. వాళ్లు చెప్పినదానికి ఒప్పుకున్నానని.. ఇంత పెద్ద సాక్ష్యం దొరికాక ఎందుకు వదులుతానని అంటుంది ధాన్యలక్ష్మీ. ఆఫీసుకి వెళ్లేందుకు రాజ్ రెడీ అవ్వకపోవడంతో కావ్య వచ్చి భర్తను రెడీ చేస్తుంది. నువ్వు ఈ ఇంటి కోసం చేస్తున్న అన్ని పనులకి మేడం సార్ .. మేడం అంతే అనాలని అనిపిస్తుంది అంటాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X