Brahmamudi January 22nd Episode : ఆస్తి తాకట్టుపై ధాన్యం పంచాయతీ .. రాజ్‌కి చిక్కిన నందగోపాల్

మా అమ్మకి నేను కాఫీ ఇస్తానని అపర్ణ గదిలోకి వెళ్లి తన్నులు తింటాడు రాజ్. ఇందిర ఎంత చెబుతున్నా వినకుండా మరోసారి కాఫీ తీసుకుని రాజ్ - కావ్యలు అపర్ణ దగ్గరికి వెళ్లి ఆమె కాళ్ల మీద పడతారు. కానీ అక్కడ ఇందిర కాఫీ తాగుతూ కనిపిస్తుంది. అప్పూ - కళ్యాణ్‌లు రోడ్డు మీద మాట్లాడుకుంటూ వెళ్తుండగా అనామిక - సామంత్‌లు కనిపిస్తారు. అప్పూ ఎస్ఐ కాబోతోందని .. త్వరలోనే నీ ఆట కట్టించబోతుందని చెబుతాడు కళ్యాణ్.

అనామిక పంపించిన డాక్యుమెంట్స్‌ తీసుకుని ధాన్యలక్ష్మీకి ఇస్తుంది రుద్రాణి. దుగ్గిరాల వారి గెస్ట్‌హౌస్‌ను రూ.10 కోట్లకు తాకట్టు పెట్టినట్లుగా అందులో ఉండటంతో ధాన్యలక్ష్మీ షాక్ అవుతుంది. ఇంత ఆస్తిని ఎందుకు తాకట్టు పెట్టాల్సి వచ్చిందో కూపీ లాగితే.. అసలు మేటర్ బయటకు వస్తుందని ధాన్యంతో అంటుంది రుద్రాణి. ఇక జనవరి 22వ తేదీ .. ఎపిసోడ్ 625లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 625 January 22nd 2024 Here is full story

ఇంటి కోసం నువ్వు చేస్తున్న పనులు చూసి నిన్ను మేడం సార్ .. మేడం అనాలనిపిస్తుంది అంటాడు రాజ్. మీరూ తిట్టినా పర్లేదు కానీ పొగిడితే నాకు భయమని అంటుంది. ఇంతలో నందగోపాల్ ఎక్కడున్నాడో తెలిసిందని రాజ్‌కు ఎస్ఐ ఫోన్ చేయడంతో ఇద్దరూ బయల్దేరుతుండగా ధాన్యలక్ష్మీ ఆగమని గట్టిగా కేకలు వేస్తుంది. ఏమైనా ఉంటే వచ్చాక మాట్లాడుకుందామని చెబుతారు రాజ్ - కావ్య. అయినప్పటికీ నాకు సమాధానం చెప్పేవెళ్లాలని గద్ధిస్తుంది ధాన్యం.

ఏమైంది నీకు అని ఇందిర ప్రశ్నించగా.. ఒక దారుణమైన నిజం తెలిసిందని అంటుందని ధాన్యం. ఏంటా దారుణమైన నిజమని సుభాష్ ప్రశ్నించగా.. మీరే చూడండి అంటూ డాక్యుమెంట్స్ చూపిస్తుంది . మీ కోడలు సమర్ధురాలని మావయ్య గారు ఆస్తిని తీసుకెళ్లి ఆమె చేతిలో పెడితే ఏం చేసింది ? రూ.10 కోట్ల కోసం దుగ్గిరాల వారి గెస్ట్‌హౌస్‌ని తాకట్టు పెట్టిందని చెబుతుంది ధాన్యలక్ష్మీ. ఆ మాటలతో కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు.

ఈ రహస్యం మాకు ఎలా తెలిసిందని అనుకుంటున్నారా అని రుద్రాణి అడగ్గా.. మీ తల్లి, కొడుకుల పనే అయి ఉంటుందని సెటైర్లు వేస్తుంది స్వప్న. ఇప్పుడు ఏం అవసరం వచ్చిందని 10 కోట్లకు గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మీ. ఈ విషయం నీకు తెలుసా అంటూ ఇందిర వెళ్లి రాజ్‌ను అడగ్గా.. తెలుసు అని తల ఊపుతాడు. నాకు తెలియకుండా కళావతి ఏ నిర్ణయం తీసుకోదని అంటాడు. ఏదో అవసరం వచ్చి తాకట్టు పెట్టి ఉంటారు.. ఇందులో తప్పేం ఉందని అంటుంది ఇందిర. కానీ నాకు , నా భర్తకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అంటుంది ధాన్యలక్ష్మీ.

అసలు అంత అవసరం ఏమొచ్చిందని కొడుకుని నిలదీస్తాడు సుభాష్. మీ కొడుకు సమాధానం చెప్పాలనుకున్నా .. మీ కోడలు చెప్పనివ్వదని అంటుంది అపర్ణ. కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పి వెళ్లమని ప్రకాశం అడగటంతో.. అర్జంట్‌ పని మీద వెళ్తున్నామని , సాయంత్రం రాగానే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతామని అంటాడు రాజ్. తప్పు బయటపడేసరికి తప్పించుకుని వెళ్లిపోతున్నారని అంటుంది రుద్రాణి. ఇంతలో స్వప్న కలగజేసుకుని .. అసలు ఈ డాక్యుమెంట్స్ వీళ్ల చేతికి ఎలా వచ్చాయో అడగండి అంటుంది. ఈ ఇంట్లోనే ఉంటూ , ఈ ఇంటి సొమ్ము తింటూ రాజ్ - కావ్యల వెనుక గోతులు తవ్వుతున్న ఆ గుంట నక్కలు ఎవరో కనుక్కోవాలి కదా అని చెబుతుంది.

కారులో వెళ్తుండగా కావ్య డల్‌గా కనిపించడంతో ఎందుకలా ఉన్నావ్ అని అడుగుతాడు రాజ్. పెళ్లి చేసుకుని భర్తకు, కుటుంబానికి సేవలు చేస్తూ గడిపేద్దామని అనుకున్నానని.. కానీ ఇక్కడికొచ్చి లేనిపోనివి నెత్తిన వేసుకుంటున్నానని చెబుతుంది. ఆ నందగోపాల్ మన చేతికి చిక్కాక మన డబ్బు మనం వసూలు చేసుకుని జరిగినదంతా ఇంట్లో వాళ్లకి చెబుతానని అంటాడు రాజ్. కానీ ఇదంతా ఆ నందగోపాల్ మన చేతికి చిక్కినప్పుడు అని కావ్య అనడంతో రాజ్ మళ్లీ టెన్షన్ పడతారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నందగోపాల్‌ను పట్టుకుని తీరతానని చెబుతాడు రాజ్.

అనుచరులు ఎంత చెప్పినా పట్టించుకోకుండా.. రాజ్ వచ్చేసరికి నందగోపాల్ పీకలదాకా తాగుతూ ఉంటాడు. ఇంకో మూడు నెలలు ఇలాగే టైం పాస్ చేస్తే ఫారిన్‌లో సెటిలైపోవచ్చని అంటాడు. ఇంతలోనే రాజ్ - కావ్యలు లోపలికి వచ్చేస్తారు. వారిని చూడగానే నందగోపాల్ షాక్ అవుతాడు. నువ్వేంట్రా నన్ను జిడ్డులా తగులుకున్నావ్.. నీకు వేరే పనేం లేదా అని ప్రశ్నిస్తాడు . వందల మంది దగ్గర డబ్బులు దోచేసి.. మా తాతయ్యని నిలువునా ముంచేసి తప్పతాగి ఎంజాయ్ చేస్తుంటే వెంటాడకుండా ఉంటానా అని రాజ్ మండిపడతాడు. ఆ డబ్బు నా దగ్గర లేదని నందగోపాల్ అనగా.. ఎక్కడున్నా నేను వచ్చేలా చేస్తానని అంటాడు రాజ్.

అప్పటి వరకు నువ్వు బతికి ఉండాలి కదా అని రాజ్‌కు వార్నింగ్ ఇస్తాడు నందగోపాల్. రాజ్‌ను చంపేయమని చెప్పగానే రౌడీలు రాజ్ మీదకు వస్తారు. ఇంతలో కావ్య కలగజేసుకుని మీరంతా బతుకు దెరువు కోసం భార్యాబిడ్డలను వదిలేసి ఇక్కడికి వచ్చుంటారు. మీరు ఇంతలా రక్తాలు చిందించేది వాళ్ల కోసమే కదా అని కావ్య అనగా.. రౌడీలు కూడా ఔను అని ఒప్పుకుంటారు. అలాంటప్పుడు మీరు ఇతని కోసం ఫైట్ చేయడం అవసరమా అని నిలదీస్తుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X