Brahmamudi January 23rd Episode : నందగోపాల్‌ హత్య .. రాజ్ - కావ్యలకు కొత్త కష్టాలు

నందగోపాల్ ఎక్కడ ఉన్నాడో ఎస్ఐ చెప్పడంతో రాజ్ - కావ్యలు వాడి కోసం బయల్దేరుతుండగా ధాన్యలక్ష్మీ వాళ్లిద్దరినీ ఆపుతుంది. సుభాష్ చేతికి డాక్యుమెంట్స్ ఇచ్చి మీ కోడలు రూ.10 కోట్లకు దుగ్గిరాల వారి గెస్ట్ హౌస్‌ని తాకట్టు పెట్టిందని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇప్పుడు సమయం లేదని అర్జెంట్ పని మీద వెళ్తున్నామని.. సాయంత్రం వచ్చి అన్ని విషయాలు చెబుతామని రాజ్ చెబుతాడు. అసలు ఇంతకీ డాక్యుమెంట్స్ మీ చేతికి ఎలా వచ్చాయని రుద్రాణి - రాహుల్‌లను నిలదీస్తుంది స్వప్న.

కారులో వెళ్తుండగా సాయంత్రం ఇంట్లో వాళ్లకి ఏం సమాధానం చెబుతారని అడుగుతుంది కావ్య. నందగోపాల్ గాడిని పట్టుకుని మన రూ.100 కోట్లు కక్కించి జరిగినదంతా ఇంట్లో వాళ్లకి చెబుతానని అంటాడు రాజ్. వాడు మీ చేతికి చిక్కకపోతే అని కావ్య అంటుంది. తన అనుచరులతో కలిసి నందగోపాల్ ఓ ఇంట్లో మందు కొడుతూ ఉండగా.. అక్కడికి రాజ్ - కావ్యలు వస్తారు . ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జనవరి 23వ తేదీ .. ఎపిసోడ్ 626లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 626 January 23rd 2024 Here is full story

మీ భార్యాబిడ్డలను వదులుకుని ఇలాంటి వెదవ కోసం ఫైట్ చేయడం అవసరమా? కాసేపట్లో నందగోపాల్‌ని పట్టుకోవడానికి పోలీసులు వస్తున్నారని, మీరు ఇక్కడే ఉంటే ఇతనితో పాటు మిమ్మల్ని కూడా పట్టుకెళ్తారని రౌడీలను కావ్య బెదిరిస్తుంది. మీరు జైల్లోకి వెళితే మీ భార్యాబిడ్డలు రోడ్డున పడతారని ఆ పరిస్ధితి మీకు ఇష్టమేనా అని కావ్య అడగ్గా రౌడీలంతా అక్కడి నుంచి పారిపోతారు. వాళ్లని భయపెట్టినట్లు నన్ను భయపెట్టాలని అనుకుంటున్నావా అంటూ బీర్ బాటిల్ తీసి కావ్యని నందగోపాల్ కొట్టబోతుండగా రాజ్ అడ్డుకుంటాడు. జనం నుంచి కాజేసిన డబ్బు ఎక్కడ పెట్టావో చెప్పు అంటూ నందగోపాల్‌ని చితక్కొడతాడు. కాసేపట్లో పోలీసులు వస్తారని వాళ్లకి అప్పగిస్తే నిజాలు వాళ్లే రాబడతారని అంటుంది కావ్య.

రాజ్ - కావ్యల నుంచి తప్పించుకుని పారిపోతుండగా నందగోపాల్‌ను పోలీసులు రౌండప్ చేస్తారు. వాడిని పోలీసులు అరెస్ట్ చేసి బయటికి తీసుకొస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి నందగోపాల్‌ను కాల్చి చంపుతాడు. ఉన్న ఒక్కగానొక్క ఆధారం పోవడంతో రాజ్ - కావ్యలు షాక్ అవుతారు. ఈ స్పాట్‌లో మీరు ఉండొద్దని.. విషయం మీడియాకు తెలిస్తే ఈ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందని ఎస్ఐ చెప్పడంతో రాజ్‌ను తీసుకుని కావ్య వెళ్లిపోతుంది.

నేను , నా కొడుకు ఎంతో కష్టపడి ఆధారాలు నీ చేతిలో పెడుతుంటే నువ్వు రాజ్ - కావ్యలను సింపుల్‌గా వదిలేస్తున్నావని ధాన్యలక్ష్మీపై మండిపడుతుంది రుద్రాణి. సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు ఏ సమాధానాలు చెప్పాలో ప్రిపేర్ అయి వస్తారని అంటుంది. ఇంతలో రాహుల్ వచ్చి రాజ్ - కావ్యలు అసలు ఈరోజు ఆఫీస్‌కే వెళ్లలేదని చెప్పడంతో రుద్రాణి - ధాన్యలక్ష్మీలు షాక్ అవుతారు. సాయంత్రం వాళ్లని ఎలా నిలదీస్తానో, అన్ని లెక్కలు ఎలా అడుగుతానో చూడు అంటుంది ధాన్యం.

ఇన్నాళ్లు తప్పించుకుని తిరుగుతున్నవాడు ఈసారి ఏకంగా పైకి పోయాడని ఇప్పుడేం చేయాలో అర్ధం కావడం లేదని రాజ్‌తో అంటుంది కావ్య. తాతయ్య ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఏ పాపం తెలియని నిన్ను అనవసరంగా సమస్యల్లోకి నెట్టానని కావ్యకి సారీ చెబుతాడు రాజ్. ఔట్ హౌస్ తాకట్టు, 100 కోట్ల ష్యూరిటీ వ్యవహారం తెలిస్తే రుద్రాణి అత్త సైలెంట్‌గా ఉండదని, ఊరంతా చాటింపు వేస్తుందని అంటాడు రాజ్. అసలు మనం చెప్పింది నమ్ముతారా? ఇంటికి వెళ్లాలంటేనే భయం వేస్తుందని అంటాడు రాజ్.

రాజ్ - కావ్యల కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుంటారు. రాహుల్ సీఈవోగా ఉన్నప్పుడు ఎన్ని కోట్ల ఫ్రాడ్ చేశాడో, దానిని తీర్చడానికి మేం ఎన్ని తిప్పలు పడుతున్నామో వాళ్లిద్దరూ చెబుతారని అంటుంది స్వప్న. తల్లీకొడుకులు తట్టా బుట్టా రెడీ చేసుకుని ఏ చెట్టు నీడకో వెళ్లండి అంటూ సెటైర్లు వేస్తుంది. ఇంతలో రాజ్ - కావ్యలు ఇంటికి వచ్చి లోపలికి వెళ్లి ఏం చెప్పాలో తెలియక భయపడతారు. ఇప్పటికే అందరి దృష్టిలో నేను విలన్‌ని అయ్యానని, ఏమన్నా నన్నే అంటారు, మీరు సైలెంట్ అవ్వండి అంటుంది కావ్య.

మీ కోసమే ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నామని రుద్రాణి , ధాన్యలక్ష్మీలు రాజ్ - కావ్యలపై సెటైర్లు వేస్తారు. అసలు గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో నిజం చెప్పమని వారు నిలదీస్తారు. గెస్ట్ హౌసే తాకట్టు పెట్టారో లేక కోట్లే చక్కబెట్టారోనంటూ వాళ్లని నానా మాటలు అంటారు. ఇన్ని మాటలు అంటున్నా నోరెత్తకపోవడంతో ఏం జరిగిందని కావ్యను సుభాష్ అడుగుతాడు. ఆ నిజం ఏదైనా, ఎంత కఠినంగా ఉన్నా మాకు చెప్పాల్సిందే అంటాడు. నన్ను క్షమించాలని ఇప్పుడు నేనేం చెప్పలేనని అంటుంది కావ్య.

మీ అమ్మ నాటకాలాడి మీ ముగ్గురు అక్కచెల్లెళ్లని మా ఇంటికి కట్టబెట్టింది అంటూ కావ్యపై మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. పొద్దున్న ఆఫీసుకి వెళ్తున్నామని చెప్పారు.. కానీ మీరు ఆఫీస్‌కే వెళ్లలేదట అని నిలదీస్తుంది రుద్రాణి. దీంతో రాజ్ - కావ్యలు షాక్ అవుతారు. ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఏం చేస్తున్నారు? ఆస్తుల్ని తాకట్టు పెట్టిన డబ్బుతో ఏం చేశారు? ఇవాళ మీరు నిజం చెప్పే తీరాలని ధాన్యలక్ష్మీ నిలదీస్తుంది. దాంతో రాజ్ ఒక్కసారిగా రగిలిపోతాడు. మేం నిజం చెబితే తట్టుకునే శక్తి మీలో ఒక్కరికైనా ఉందా అని అంటాడు. అసలు మేం ఔట్ హౌస్ ఎందుకు తాకట్టు పెట్టామో అంటూ రాజ్ చెప్పబోతుండగా కావ్య ఆపుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X