Brahmamudi January 24th Episode : సుభాష్‌ని బాధపెట్టిన కావ్య .. కళావతిని గుండెల్లో పెట్టుకున్న రాజ్

నందగోపాల్‌ను చితక్కొట్టిన రాజ్.. వాడిని పోలీసులకు అప్పగించి బయటికి తీసుకొస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి అతనిని కాల్చి చంపుతాడు. ఉన్న ఒక్కగానొక్క ఆధారం పోవడంతో రాజ్ - కావ్యలు షాక్ అవుతారు. ఇంటి దగ్గర రుద్రాణి, ధాన్యలక్ష్మీలకు ఏ సమాధానం చెప్పాలో తెలియక తలపట్టుకుంటారు.

రాజ్ - కావ్యల కోసం దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఎదురుచూస్తుంటుంది. ఇంతలో వాళ్లిద్దరూ రాగానే రుద్రాణి, ధాన్యలక్ష్మీలు రౌండప్ చేసి ఆస్తుల్ని ఎందుకు తాకట్టు పెట్టారు అని అడుగుతారు. కనకం మీ అక్కచెల్లెళ్లను నాటకాలాడి మాకు అంటగట్టారని ధాన్యం మండిపడుతుంది. కావ్యను నానా మాటలు అనడంతో మేం చెప్పే నిజం విని తట్టుకోగలరా అంటాడు రాజ్. అయితే కావ్య అతనిని కూల్ చేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జనవరి 24వ తేదీ .. ఎపిసోడ్ 627లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 627 January 24th 2024 Here is full story

మీకు ఏం సంబంధం ఉందని ఇందులో జోక్యం చేసుకుంటున్నారని రాజ్‌ను అడుగుతుంది కావ్య. గెస్ట్‌హౌస్‌ను తాకట్టు పెట్టింది నేను.. 10 కోట్ల అప్పు తీసుకుంది నేను, మీరేందుకు మధ్యలో మాట్లాడుతున్నారని మండిపడుతుంది. సమాధానం చెప్పకుంటే వీళ్లు తల తీసి మొలేస్తారా అంటూ ఫైర్ అవుతుంది. ఆస్తి మొత్తం నా పేరు మీదే ఉందని, చెప్పాలనిపిస్తేనే చెబుతానని .. ఇందులో మీరు మాట్లాడొద్దని రాజ్‌ని గదుముతుంది.

అంతా అయిపోయిందని.. రాజ్‌ని కావ్య డమ్మీగా మార్చేసిందని అపర్ణతో అంటుంది రుద్రాణి. నువ్వు మనుషుల్ని రెచ్చగొట్టద్దని , నేను కనుక్కుంటానని అంటాడు సుభాష్. ఆస్తి మొత్తం నీ పేరు మీదనే ఉందని.. మన కంపెనీ కస్టమర్ల కోసం కట్టించామని , దానిని తాకట్టు పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చిందని కావ్యని ప్రశ్నిస్తాడు సుభాష్. ఇందులో మీరు జోక్యం చేసుకోవద్దని.. అవసరమైతే ఆస్తిని అమ్మేసే హక్కు కూడా నాకుందని తేల్చి చెబుతుంది కావ్య. అడిగే హక్కు ఎవరికీ లేదని సుభాష్‌తో అంటుంది. ఈ మాటలు విన్న అపర్ణ.. నా భర్తనే ఎదిరించి మాట్లాడతావా అంటూ కావ్యని కొట్టబోతుండగా సుభాష్ ఆపుతాడు.

ఈ ఇంట్లో హక్కులన్నీ కావ్య కాళ్ల కింద నలిగిపోతున్నాయని అంటుంది రుద్రాణి. పెద్దరికం కళ్లకు గంతలు కట్టుకుని కూర్చోవాల్సి వచ్చిందని, పెడితే తినాలి, తిడితే పడాలి అనే పరిస్ధితులు వచ్చాయని చెబుతుంది. దుగ్గిరాల వారి వంశ ప్రతిష్ట.. కనకం గారి కూతురి చేతుల్లో చెరిగిపోయే సమయం ఆసన్నమైందని అంటుంది. అనంతరం గదిలోకి వచ్చి ఏడుస్తుంది కావ్య. దేవుడు లాంటి మామయ్య గారిని నానా మాటలు అన్నానని మరి మీకు కోపం రాలేదా అని అడుగుతుంది. నా నిస్సహాయత మీద , మనల్ని మోసం చేసినవాడి మీద, నిన్ను దోషిగా నిలబెడుతున్న నా అసమర్ధత మీద కోపం వచ్చిందని అంటుంది. నువ్వు మనిషివేనని గుర్తించడానికి నాకు చాలా కాలం పట్టిందని .. నువ్వెంత నలిగిపోతున్నావో నాకు తెలియదా అని చెబుతాడు.

అన్ని దారులు మూసుకుపోయి శూన్యం మిగిలిందని.. అప్పటికీ నేనే నిజం చెబుదామని అనుకున్నా నువ్వే చెప్పనివ్వలేదని అంటాడు రాజ్. అప్పుడలా మాట్లాడకుంటే నిన్ను, నన్ను నిలదీసేవాళ్ల నోళ్లు మూతపడేవే కావని చెబుతాడు. మా నాన్న మాత్రం నిన్ను అపార్ధం చేసుకోడని అనుకుంటున్నా అంటాడు రాజ్. భార్య అంటే భర్త కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని అంటారు. కానీ నువ్వు అత్తింటి కష్టాన్ని, నీ కష్టంగా మార్చుకున్నావని కళావతిని ప్రశంసిస్తాడు. భర్తగా నేను ఎప్పుడూ నీకు ఏం చేయలేదు.. కానీ ఇక నుంచి నీ మనసు కష్టపడకుండా చూసుకుంటానని రాజ్ చెబుతాడు. దీంతో భర్తను పట్టుకుని కంటతడి పెడుతుంది కళావతి.

పాట రాస్తుండగా.. కళ్యాణ్‌కు అనామిక మాటలే గుర్తొస్తాయి. ఇంతలో అప్పూ వచ్చి కోపం, చిరాకు ఎందుకు చూపిస్తున్నావని అంటుంది. ఉదయానికల్లా పాట పూర్తి చేయాలని కానీ నాకు అనామిక మాటలే గుర్తొస్తున్నాయని చెబుతాడు కళ్యాణ్. నాకు ఆకలి లేదని భోజనం వద్దని చెప్పడంతో నాకు కూడా వద్దని అంటుంది అప్పూ. దీంతో కళ్యాణ్ తనే భోజనం తీసుకొచ్చి తినిపిస్తాడు. గార్డెన్‌లో ఒంటరిగా బాధపడుతున్న సుభాష్ దగ్గరికి ప్రకాశం వస్తాడు. నిన్ను ఇలాంటి పరిస్దితుల్లో చూస్తానని అనుకోలేదని.. ఈ ఇంట్లో అందరికీ నీ మాటంటే ఒక గౌరవం ఉందని, అలాంటి నీకే కావ్య ఎదురు చెప్పిందని అంటాడు ప్రకాశం.

ఆస్తిని తీసుకెళ్లి తన చేతిలో పెట్టారని.. ఆమె తాకట్టు పెట్టి ఆ డబ్బంతా ఏం చేస్తుందో అదో రహస్యంగా మారిపోయిందని చెబుతాడు ప్రకాశం. ఇదేంటని అడిగితే నోళ్లు మూయిస్తుందని , ఒకప్పుడు నాకు అవమానం జరిగితే నాకు అండగా నువ్వు ఉన్నావని అనుకున్నానని అంటాడు. కానీ ఈరోజు అదే పరిస్ధితుల్లో నువ్వు ఉన్నావని ఈ సమస్యని ఎవరు పరిష్కరించాలని అడుగుతాడు ప్రకాశం. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X