Brahmamudi January 25th Episode : కళావతికి అండగా సుభాష్ .. నందగోపాల్ హత్యను తవ్వుతోన్న కావ్య - రాజ్
ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో ఎవ్వరూ కలగజేసుకోవడానికి వీలు లేదని సుభాష్‌కి తేల్చి చెబుతుంది కావ్య. ఆ మాటలో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతుంది. ఇంతలో అపర్ణ వచ్చి కావ్యని కొట్టబోతుండగా సుభాష్ వచ్చి ఆపుతాడు. గదిలోకి వెళ్లి మామయ్య గారిని నానా మాటలు అన్నానని రాజ్‌కి చెప్పి బాధపడుతుంది కావ్య. నీ విలువ నాకు తెలియలేదని .. ఇకపై నిన్ను ఏ కష్టం లేకుండా చూసుకుంటానని రాజ్ చెప్పడంతో కళావతి భర్తను హత్తుకుని ఏడుస్తుంది.
పాట రాస్తుండగా కళ్యాణ్‌కు అనామిక మాటలే గుర్తొస్తాయి.. దీంతో అప్పూ వచ్చి భర్తను ఓదార్చి అతని మనసు మారుస్తుంది. అర్ధరాత్రి ఒంటరిగా బాధపడుతున్న సుభాష్ దగ్గరికి ప్రకాశం వచ్చి .. కావ్య వల్ల నీకు అవమానం జరిగిందని అంటాడు. ఆస్తిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో కావ్య ఏం చేస్తోంది.. అసలు ఆ డబ్బును ఎక్కడికి చేరవేస్తుందని ప్రశ్నిస్తాడు ప్రకాశం . ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జనవరి 25వ తేదీ .. ఎపిసోడ్ 628లో ఏం జరిగిందంటే..

ఇన్ని రోజులు ధాన్యలక్ష్మీని తిట్టో, భయపెట్టో భరిస్తూ వచ్చానని.. ఇక నా వల్ల కాదని సుభాష్‌తో అంటాడు ప్రకాశం. ఈ మౌనం, మంచితనం కావ్య దృష్టిలో చేతకానితనం కాకూడదని చెబుతాడు. ఈ ఇంట్లో ఎవరు నన్ను అర్ధం చేసుకున్నా, చేసుకోకపోయినా నువ్వు అర్ధం చేసుకుంటావని అనుకున్నానని ప్రకాశంతో అంటాడు సుభాష్. నలుగురి ముందు నా పరువు పోయిందని అంటున్నావ్.. ఆ నలుగురు మన కుటుంబ సభ్యులే కదా .. కావ్య నన్ను అంత మాట అన్నందుకు బాధ లేదని, అసలు అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే ఆలోచిస్తున్నానని అంటాడు సుభాష్. ఎప్పుడూ నోరు జారని కావ్య.. ఈరోజు అంత మాట అందంటే తనకు ఇంకెంత కష్టం వచ్చిందోనని ప్రకాశంతో చెబుతాడు సుభాష్.
కావ్య డబ్బుకన్నా మనుషులకి, బంధాలకి విలువ ఇస్తుందని.. అలాంటి మనిషిని శత్రువులా చూడకూడదని అంటాడు. నీ మీద గౌరవంతో నేను మౌనంగా ఉంటున్నా.. ధాన్యలక్ష్మీ నన్ను అలా ఉండనివ్వడం లేదని అన్నయ్యతో చెబుతాడు ప్రకాశం. వాళ్ల మాటల్ని లోపలి నుంచి కావ్య విని కంటతడి పెడుతుంది. కావ్య భోజనం వడ్డిస్తుండగా నీ చేత్తో పెడితే మేం తినమని ధాన్యలక్ష్మీ , ప్రకాశం, రుద్రాణి వద్దు అంటారు. దీంతో మా అత్తది భస్మాసుర హస్తమని ఎవరి నెత్తిన చేయి పెడితే వాళ్ల బతుకు బూడిదేనని అంటూ సెటైర్లు వేస్తుంది స్వప్న.
భోజనం దగ్గరికి అపర్ణ - సుభాష్ రాకపోవడంతో అంతా వారి కోసం ఎదురుచూస్తారు. నువ్వు చేసిన అవమానం తట్టుకోలేక మా అన్నయ్య- వదినలు భోజనం చేయడానికి రాలేదని అంటుంది రుద్రాణి. ఇంతలో సుభాష్ భోజనానికి వస్తాడు. రుద్రాణిని స్వప్న నానా మాటలు అంటుంటే పెళ్లాన్ని నోరు మూయించడం నేర్చుకో అంటూ రాహుల్‌పై మండిపడుతుంది రుద్రాణి. మరి కావ్యని రాజ్ ఎందుకు నోరు మూయించడం లేదని ప్రశ్నిస్తాడు రాహుల్. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. అత్తయ్యగారిని భోజనానికి పిలవమని ఇందిరకు చెబుతుంది కావ్య.
గదిలో కోపంతో రగిలిపోతున్న ధాన్యలక్ష్మీ దగ్గరికి రుద్రాణి వస్తుంది. రంగులు వేసుకునే దానిని తీసుకొచ్చి ఇంటికి కోడలిని చేయడమే కాకుండా ఇప్పుడు ఏకంగా ఆస్తి, అధికారం కూడా ఆమె చేతిలో పెట్టారని మండిపడుతుంది రుద్రాణి. కావ్యని ఇలాగే వదిలేస్తే ఇంకా రెచ్చిపోతుందని ఏదో ఒకటి చేయాలని అంటుంది ధాన్యలక్ష్మీ. ఇప్పటి వరకు నేను మాత్రమే నీకు సపోర్ట్ చేస్తున్నానని.. కానీ ఇకపై నీకు ప్రకాశం అన్నయ్య కూడా అండగా నిలుస్తాడని అంటుంది రుద్రాణి. అన్నయ్య ఆలోచన మారకముందే నీవైపుకు తిప్పుకో అని సలహా ఇస్తుంది.
కిచెన్‌లో సుభాష్‌కి థ్యాంక్స్ చెబుతుంది కావ్య. నన్ను బాగా అర్ధం చేసుకుందని మా అమ్మ, నాన్నే అనుకున్నానని.. కానీ మీరు కూడా నా కన్నవాళ్లలాగే అర్ధం చేసుకున్నారని అంటుంది. ఈ ఇంట్లో జరిగేదానిలో ఏది నా చేతుల్లో లేదని.. కానీ జరిపించేది నేనే అని చెబుతుంది. అందరూ నన్ను అపార్ధం చేసుకుంటున్నారని.. మీరు మాత్రమే నా ప్రవర్తన వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని నమ్మారని చెబుతుంది కావ్య. మీరు చిన మావయ్యతో మాట్లాడింది నేను విన్నానని అంటుంది . మాయ విషయంలో ఇంటిల్లిపాది నన్ను దూరం పెట్టినప్పుడు నువ్వు ఒక్కదానివే నా వైపు నిలబడ్డావని గుర్తుచేస్తాడు సుభాష్. నా కోడలు తప్పు చేయదని.. అది ఏదో ఒకరోజు ఇంట్లో వాళ్లంతా తెలుసుకుని పశ్చాత్తాపంతో తలదించుకుంటారని చెబుతాడు .
గదిలో ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న అపర్ణ దగ్గరికి ఇందిర భోజనం తీసుకొస్తుంది. కావ్యని ఎందుకు కొట్టాలని అనుకున్నావ్ అని ఇందిర ప్రశ్నించగా.. కట్టుకున్న భర్తని అందరి ముందు అవమానిస్తుంటే ఏ భార్యకైనా కోపం రాదా అని అడుగుతుంది. సొంత అత్తతో కూడా చెప్పుకోలేక పోతోందంటే అది ఎంత క్షోభ అనుభవిస్తుందోనని ఇందిర అంటుంది. ఏదో ఒకరోజు కావ్య అంటే ఏంటో తెలుసుకుంటావని అపర్ణకి భోజనం తినిపిస్తుంది ఇందిర .
ఉదయాన్నే గార్డెన్‌లో కూర్చొని బాధపడుతున్న కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. గతంలో నన్ను ప్రేమించకపోయినా.. నన్నెప్పుడూ మాట పడనివ్వలేదని.. నాకు , నా పుట్టింటికి ఎంతో సపోర్ట్ చేశారని చెబుతుంది కళావతి. నేను నిన్ను అర్ధం చేసుకోవడం కన్నా .. నువ్వే నన్ను ఎక్కువ అర్ధం చేసుకున్నావని అంటాడు రాజ్. ఇంతకీ నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావని అడగ్గా.. నందగోపాల్ గురించేనని చెబుతుంది కావ్య. నందగోపాల్‌ని చంపితే మనకి నష్టం, కానీ వాడిని చంపడం వల్ల ఎవరికి లాభం అని ప్రశ్నిస్తుంది కళావతి. దీని వెనుక ఎవరున్నారు అనే దాని గురించి ఆలోచించాలని ఇద్దరూ అనుకుంటూ ఉంటారు. సామంత్ - అనామికలు చెస్ ఆడుతూ నందగోపాల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నందని చంపేసి రాజ్ - కావ్యలకి భలే చెక్ పెట్టావని అనామికను మెచ్చుకుంటాడు సామంత్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











