Brahmamudi January 28th Episode : కోర్టులోనే తేల్చుకుంటామన్న ధాన్యం .. దిమ్మతిరిగేలా కావ్య ప్లాన్?

దుగ్గిరాల కుటుంబం రోడ్డునపడే వరకు వదిలిపెట్టనని సామంత్‌తో అంటుంది కావ్య. వాళ్ల ఆస్తులన్నీ తాకట్టు పెట్టినా బ్యాంక్ లోన్ కట్టలేరని .. చివరికి స్వరాజ్ కంపెనీ నీ చేతికి వస్తుందని అనామిక చెబుతుంది. ఆస్తిలో వాటా కోసం కోర్టు ద్వారా నోటీసు ఇస్తున్నానని సంతకం పెట్టమని బెదిరించడంతో ప్రకాశం తప్పన పరిస్థితుల్లో సంతకం పెడతాడు.

కావ్య చేతికి అధికారం వచ్చిన తర్వాత డబ్బులు దొరకడం లేదని.. ఆమెను ఇలాగే వదిలేస్తే లాభం లేదని రుద్రాణితో అంటాడు రాహుల్. కావ్యని చంపేస్తానని చెప్పి బట్టలు ఆరబెట్టే తీగకు కరెంట్ సప్లయ్ ఇస్తాడు. అయితే అనుకోకుండా రుద్రాణి బట్టలు ఆరేయడానికి రావడంతో ఆమెకు షాక్ కొడుతుంది. ఇది చూసిన రాహుల్ పవర్ ఆఫ్ చేసి తల్లిని కాపాడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జనవరి 28వ తేదీ .. ఎపిసోడ్ 630లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 630 January 28th 2024 Here is full story

మీ అమ్మని నేనే బతికించానని జీవితాంతం మీరిద్దరూ నాకు రుణపడి ఉండాలని రాహుల్‌తో అంటుంది స్వప్న. నీకేం కాదు మమ్మీ నేను చూసుకుంటానుగా అని రాహుల్ అనగా.. కరెంట్ షాక్ ఐడియా వేసింది నువ్వేనా అని కర్రతో చితకబాదుతుంది రుద్రాణి. అప్పూ సెలవులు పూర్తి కావడంతో ట్రైనింగ్‌కి తిరిగి వెళ్లడానికి కళ్యాణ్ బట్టలు సర్దుతుండగా అతనిని ఆటపట్టిస్తుంది అప్పూ. దీంతో కళ్యాణ్ ఆమెపై కోప్పడి.. నీకు కావావల్సినవి నువ్వే సర్దుకో అంటాడు. ఇంతలో కళ్యాణ్‌కు అపర్ణ ఫోన్ చేసి.. కావ్య నీ దగ్గర ఏ విషయం దాచదు కదా అని అడుగుతుంది. రాజ్ - కావ్యలు కలిసి మన ఔట్ హౌస్ తాకట్టు పెట్టిన విషయం నీకేమైనా చెప్పిందా అని అడగ్గా తనకు తెలియదని అంటాడు. ఆ మాటలకు కళ్యాణ్ షాకవ్వగా.. అప్పూ వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది.

దుగ్గిరాల ఫ్యామిలీకి కావ్య కాఫీ ఇస్తుంది. ఇంతలో పోస్ట్‌మెన్ వచ్చి కొరియర్ ఇస్తాడు. దానిని రిసీవ్ చేసుకుని చదివిన కావ్య షాక్ అవుతుంది. అదేంటని సుభాష్ అడగ్గా.. కోర్టు నోటీసు పంపారని చెబుతుంది. ఎవరు పంపారని ప్రశ్నించగా.. మేమేనని అంటారు ప్రకాశం - ధాన్యలక్ష్మీ. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. మా ఆట ఆస్తి మాకు కావాలని మేం కోర్టుకు వెళ్తున్నామని వారిద్దరూ చెప్పడంతో ఇందిర మండిపడుతుంది. ఇది వాళ్లకు పుట్టిన బుద్ధి కాదని.. దీని వెనుక మా అత్త హస్తం ఖచ్చితంగా ఉంటుందని స్వప్న అంటుంది.

ఒక్క మాటైనా మాతో చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని సుభాష్ ప్రశ్నిస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు పట్టించుకోలేదు.. కావ్యకే సపోర్ట్ చేశావ్, అందుకే మా ధాన్యం పోరు పడలేక కోర్టుకి వెళ్లడమే మంచిది అనుకున్నానని చెబుతాడు ప్రకాశం. కన్నతండ్రి ఆసుపత్రిలో సీరియస్‌గా ఉంటే కొడుగ్గా నువ్వు ఇలాంటి పని చేస్తావా అని అపర్ణ నిలదీస్తుంది. మీ అమ్మగారిని ఓదార్చాల్సిన నువ్వే మరింత క్షోభ పెడతావా అని ప్రశ్నిస్తుంది. ఆస్తులన్నీ నీ కొడుకు, కోడలే అనుభవించాలా అని ధాన్యం అనగా.. నీ వారసుడే నిన్ను ఛీ కొట్టి వెళ్లిపోయాడని ఇంకేందుకు నీకు ఆస్తి అని అడుగుతుంది అపర్ణ.

బావగారిని నీ కోడలు అన్నేసి మాటలు అంటుంటే అడగని నువ్వు నన్ను అంటావా అంటూ మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. ఇంట్లో జరుగుతున్న గొడవలు చూడలేకే నా భర్త ఆసుపత్రిలో తల్లడిల్లిపోతున్నాడని , నీకు రక్తసంబంధం కన్నా ఆస్తులే ఎక్కువా అని ప్రకాశంను నిలదీస్తుంది ఇందిర. నీ కొడుకు కోడల్నే నువ్వు నిందిస్తున్నావ్ కానీ.. ఈ పరిస్ధితికి కారణమైన కావ్యని ఒక్క మాటైనా అన్నావా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. పెద్దన్నయ్యని అంత మాట అన్న తర్వాతైనా కావ్యని నిలదీశావా అని అడుగుతుంది. ఇలాగే వదిలితే చివరికి రోడ్డున పడేస్తుందని భయపడి చిన్నన్నయ్య - ధాన్యలక్ష్మీలు ముందే మేల్కోన్నారని అంటుంది రుద్రాణి. ఆ మాటలతో మండిపడిన కావ్య.. మీరు ముందు నోరు మూసుకోండి అంటూ వార్నింగ్ ఇస్తుంది.

కొన్ని పరిస్ధితుల వల్లే మామయ్య గారిని అనాల్సి వచ్చిందని.. ఆయనను అనేంత స్థాయి నాకు లేదని ధాన్యలక్ష్మీతో అంటుంది కావ్య. ఈ ఆస్తి అంతా తాతయ్య వారసులందరికీ చెందుతుందని.. కోర్టు దాకా వెళ్లి ఈ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దని దండం పెడుతుంది కావ్య. కోర్టుకు వెళ్లి తీరాతామని మా వాటా మేం సాధిస్తామని తేల్చి చెబుతుంది ధాన్యలక్ష్మీ. మీరైనా నా మాట వినండి అని ప్రకాశంను కావ్య అడగ్గా.. మీ మావయ్య గుండె గట్టిది కాబట్టి ఆయన ధైర్యంగా నిలబడ్డాడని , రేపు నువ్వు నన్ను గెంటేస్తే బయటి ప్రపంచంలో బతకడం తెలియని వెర్రి బాగులోడిని అంటాడు ప్రకాశం.

కళావతి కానీ, నేను కానీ మీకు అన్యాయం చేసి ఈ ఆస్తిని అనుభవించాలని అనుకోవడం లేదని అంటాడు రాజ్. నీ తండ్రిని నీ భార్య అవమానిస్తుంటే నువ్వు నోరు విప్పలేదని.. ఆయనకే విలువ ఇవ్వని వాళ్లు మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారని అంటుంది ధాన్యలక్ష్మీ. మా నిర్ణయంలో మార్పు లేదని.. ఏదైనా కోర్టులోనే తేల్చుకుందామని తేల్చి చెబుతుంది ధాన్యలక్ష్మీ. సాక్ష్యానికి నన్ను పిలువు నిర్భయంగా వస్తానని అంటుంది రుద్రాణి. గార్డెన్‌లో కూర్చొని ఇంట్లో జరిగిన గొడవ గురించి బాధపడతారు సుభాష్ - అపర్ణ. ఏదో ఒకటి చేసి చిన్న మావయ్యని ఆపమని సుభాష్‌ని బ్రతిమలాడుతుంది కావ్య. చేసినదంతా చేసి ఇప్పుడు మీ మావయ్యని హెల్ప్ చేయమంటావా అంటూ మండిపడుతుంది అపర్ణ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X