Brahmamudi January 29th Episode : కావ్య దెబ్బకి లాయర్‌కి ముచ్చెమటలు .. ధాన్యలక్ష్మీని కడిగేసిన కళ్యాణ్

అప్పూ ట్రైనింగ్‌కు టైం దగ్గరపడటంతో కళ్యాణ్ ఆమెకు బట్టలు సర్దుతుండగా అపర్ణ ఫోన్ చేసి కావ్య రూ.10 కోట్లకి మన ఔట్ హౌస్ తాకట్టు పెట్టిన విషయం చెబుతుంది. కుటుంబ సభ్యులంతా కాఫీ తాగుతుండగా కావ్యకి కొరియర్ వస్తుంది. ఏంటని సుభాష్ అడగ్గా.. కోర్టు నోటీస్ అని చెప్పడంతో ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతుంది. ఎవరిచ్చారని అడగ్గా.. మేమే పంపామని ధాన్యలక్ష్మీ - ప్రకాశం చెబుతారు. దీని వెనుక మా అత్త హస్తం ఉందని స్వప్న అంటుంది.

ఆస్తులన్నీ నీ కొడుకు, కోడలే అనుభవించాలా అని అపర్ణని ధాన్యలక్ష్మీ ప్రశ్నిస్తుంది. బావగారినే అన్ని మాటలు అన్న కావ్య .. రేపు మమ్మల్ని నడిరోడ్డు మీదకి గెంటేస్తుందని అంటుంది. కొన్ని పరిస్ధితుల వల్లే మామయ్యని అంత మాట అనాల్సి వచ్చిందని చెబుతుంది కావ్య. కుటుంబం ముక్కలయ్యే పరిస్ధితి వచ్చిందని సుభాష్ - అపర్ణలు బాధపడుతుండగా కావ్య అక్కడికొస్తుంది.ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జనవరి 29వ తేదీ .. ఎపిసోడ్ 631లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 631 January 29th 2024 Here is full story

నిన్ను నమ్మి ఆస్తి నీ చేతిలో పెడితే ఎవరికీ అడిగే హక్కు లేదంటూ మా నోళ్లు మూయిస్తున్నావని కావ్యపై మండిపడుతుంది అపర్ణ. వాళ్లు కూడా మనుషులేనని, ఎన్ని అవమానాలు భరిస్తారని ప్రశ్నిస్తుంది. ఎవ్వరూ ఏం చేయలేరని.. వాళ్లు కోర్టుకు వెళ్లే తీరతారని తేల్చిచెప్పడంతో కావ్య మౌనంగా వెళ్లిపోతుంది. ఇన్నాళ్లూ చిన్న అత్తయ్య బెదిరిస్తున్నారని అనుకున్నాను కానీ ఇలాంటి స్టెప్ తీసుకుంటారని అనుకోలేదని రాజ్‌తో అంటుంది కావ్య. మీ పిన్న చస్తాననో, ఇంట్లో నుంచి వెళ్లిపోతాననో బెదిరించడంతో చిన్న మావయ్య కూడా ఆమెకే సపోర్ట్ చేస్తున్నారని చెబుతుంది. తెల్లారితే వాళ్లు కోర్టుకు వెళ్తారని ఏదో ఒకటి చేసి ఆపాలని రాజ్‌తో చెబుతుంది కావ్య.

ధాన్యలక్ష్మీ కోర్టుకు వెళ్తుందన్న ఆనందంతో రుద్రాణి - రాహుల్‌లు మందు తాగి డ్యాన్స్ చేస్తుండగా మధ్యలో స్వప్న కూడా వచ్చి డ్యాన్స్ చేస్తుంది. కోర్టుకు వెళ్లగానే సరిపోదని.. ఇంకా చాలా జరగాలని అంటుంది. ఒకప్పుడు నేను కూడా డబ్బు కోసం పరుగులు తీశానని.. కానీ కావ్య గొప్పతనం తెలిసి మారానని చెబుతుంది. మా నాన్న నీకిచ్చిన ఆస్తి కేవలం నువ్వు అనుభవించగలవని.. అమ్ముకోలేవని, అదే కావ్య అనుకుంటే క్షణాల్లో దానిని అమ్మేయగలదని స్వప్నతో అంటుంది రుద్రాణి. అయినా నా చెల్లెలికే సపోర్ట్ చేస్తానని చెబుతుంది స్వప్న. కావ్య ఉండగా ఆస్తి ముక్కలు కాదని , కోర్టులో గెలవడం కాదు కదా.. కోర్టు మెట్లు కూడా ఎక్కలేరని అంటుంది.

ఇంట్లో వాళ్లపై కోర్టు నోటీసు ఇవ్వడంపై బాధపడుతుంటాడు ప్రకాశం. ఇంతలో ధాన్యలక్ష్మీ అక్కడికి రాగా.. కోర్టుకు వెళ్లడం కరెక్ట్ కాదని చెబుతాడు. ఇదంతా ఒకరిపై పగతో చేయడం లేదని, వాడి భవిష్యత్తు గురించి ఆలోచించి చేస్తున్నానని ధాన్యలక్ష్మీ చెబుతుంది. ఇంతలో లాయర్ రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. కోర్టుకు వెళ్లడం గురించి ఒక్కసారి ఆలోచించాలని ప్రకాశంకు చెబుతారు . న్యాయం కోసం కోర్టుకు వెళ్లడం తప్పడం లేదని ధాన్యలక్ష్మీ అంటుండగా.. మంచి పని చేశారని అంటుంది కావ్య. అయితే నేను లాయర్ గారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తానని చెబుతుంది. దానికి నేను ఒప్పుకోనని అంటుంది రుద్రాణి.. లాయర్ కలగజేసుకుని మీ ప్రశ్నలేంటో కావ్యని చెప్పమంటాడు .

మీరు కేసు పూర్వాపరాలు పరిశీలించడం మరిచిపోయారని చెబుతుంది కావ్య. ఒక ఇంటి యజమాని ఆస్తి కొడుకులకు చెందుతుందా? మనవళ్లకి చెందుతుందా? అని ప్రశ్నిస్తుంది. మనవళ్లు గనుక ఉంటే మనవళ్లకే చెందుతుందని లాయర్ చెబుతాడు. మరి మీరు ఈ ఇంటి యజమాని కొడుకు , కోడలు గురించి కేసు వేయడానికి ఎందుకొచ్చారని నిలదీస్తుంది కావ్య. మీరు ఈ ఇంటి యజమానికి మనవడు కాదా అని ప్రకాశంను అడుగుతాడు లాయర్. దీంతో తాను ఆయన కొడుకునని, మా అబ్బాయి మనవడని అంటాడు. అయితే మీ అబ్బాయి కోర్టులో కేసు వేయాలని , మీరు వేయకూడదని లాయర్ తేల్చి చెబుతాడు.

నువ్వేదో గొప్ప పాయింట్ లాగానని గెలిచానని సంబరపడిపోతున్నావా అని కావ్యపై మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. మా ఆయనకు కేసు వేసే అధికారం లేకపోతే.. నా కొడుకు చేత కేసు వేయిస్తానని చెబుతుంది ధాన్యం. ఇంతలో కళ్యాణ్ అక్కడికి కావడంతో కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. నా అనుమతి లేకుండా? నా ఇష్టం లేకుండా? నా సంతకం లేకుండా కేసు ఎలా వేస్తారని నిలదీస్తాడు కళ్యాణ్. మీరు కేసు వేయరా అని లాయర్ అడగ్గా.. వేయనని తేల్చిచెబుతాడు కళ్యాణ్. నాకు ఆస్తి అక్కర్లేదని, బయటికెళ్లి బతుకుతున్నానని అంటాడు.

ఇది నీ భవిష్యత్ కోసమేనని, ఇంత మందితో గొడవలు పడి కోర్టుకు వెళ్తున్నానని.. చివరికి మీ నాన్న కూడా ఒప్పుకున్నాక ఇలా అంటావేంటి అని అడుగుతుంది ధాన్యలక్ష్మీ. దీంతో ప్రకాశం దగ్గరికి ఇది తప్పు కదా నాన్న అని అడుగుతాడు కళ్యాణ్. తప్పలేదు నాన్నా అని ప్రకాశం చెప్పడంతో .. డాడీని బెదిరించో, భయపెట్టో కేసు వేయడానికి ఒప్పించావని అంటాడు కళ్యాణ్. ఆస్తిని నేనేమైనా మూట కట్టుకుని పోతానా? కళ్యాణ్ కోసమేనని అంటుంది ధాన్యం. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని , ఇవాళ ఉండి రేపు పోయే ఆస్తులు ఎవడికి కావాలని అంటాడు కళ్యాణ్. మరేం కావాలని రుద్రాణి అడగ్గా.. ఆత్మీయత, అనుబంధం కావాలని చెబుతాడు . తత్వం, కవిత్వాలు కడుపు నింపవని రుద్రాణి చెప్పగా.. నాది నీ తత్వం కాదని అంటాడు.

ఆస్తి ఎవరు అడిగారు? నేను రాసివ్వమన్నానా ? నా తరపున పోరాడి , నా వ్యక్తిత్వాన్ని దిగజారుస్తావా అంటూ ధాన్యలక్ష్మీపై మండిపడతాడు కళ్యాణ్. ఇంత గొప్ప కుటుంబాన్ని నాకు మానసికంగా దూరం చేసే హక్కు నా తండ్రికి ఎక్కడిది అని ప్రశ్నిస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X