Brahmamudi January 30th Episode : కావ్య - రాజ్‌లకు 3 నెలలు డెడ్‌లైన్ .. కళ్యాణ్‌పై రగిలిపోతోన్న ధాన్యం
ధాన్యలక్ష్మీ - ప్రకాశంలను కోర్టుకు వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరని కావ్యకి తేల్చిచెబుతుంది అపర్ణ. ఇదే విషయంపై రాజ్‌తో మాట్లాడుతూ తెల్లారితే చిన్నత్తయ్య వాళ్లు కోర్టుకు వెళ్తారని దానిని ఆపాలని అంటుంది కావ్య. ధాన్యం కోర్టుకు వెళ్తుండటంతో ఆస్తి త్వరలోనే మన చేతికి రాబోతోందని రాహుల్ - రుద్రాణిలు డ్యాన్స్ చేస్తుండగా స్వప్న వస్తుంది. కావ్య ఉన్నంత వరకు ఆస్తి ముక్కలు కావడం జరగదని అంటుంది స్వప్న.
ఇంట్లో వాళ్లపై కోర్టుకెళ్తుండటంతో ప్రకాశం బాధపడుతుంటాడు. ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా ప్రకాశంను లాక్కెళ్తుంది ధాన్యలక్ష్మీ. ఇంతలో లాయర్ రాగా.. కావ్య వచ్చి నేను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని అంటుంది. ఇంటి పెద్ద ఆస్తి మనవడికి చెందుతుందా లేదా అని ప్రశ్నించగా.. లాయర్ అవును అంటాడు. అయితే నా కొడుకుతోనే కేసు పెట్టిస్తానని ధాన్యలక్ష్మీ అనగా కళ్యాణ్ వచ్చి తల్లిదండ్రులపై మండిపడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జనవరి 30వ తేదీ .. ఎపిసోడ్ 632లో ఏం జరిగిందంటే..

నాకు వారసత్వం కావాలని, ఈ ఇంటి పేరు కావాలని.. అందరినీ ఎంతో ప్రేమగా చూసుకునే నువ్వు ఎక్కడ తప్పటడుగు వేశావని తల్లిని నిలదీస్తాడు కళ్యాణ్. ఆ మాటలతో ఇందిర ఎంతో సంతోషించి, మనవడిని మెచ్చుకుంటుంది. తాతయ్య ఆస్తి మొత్తం కావ్య చేతిలో పెడితే ఆమె ఆస్తులన్నీ తాకట్టు పెట్టుకుంటూ డబ్బు మొత్తం ఏం చేస్తుందో కూడా తెలియడం లేదని కళ్యాణ్‌తో అంటుంది ధాన్యలక్ష్మీ. మా వదినకు నాకన్నా ఈ ఇంటి గురించి, ఈ బంధాల గురించి తెలుసని , ఆమె ఏం చేసినా ఖచ్చితంగా దాని వెనుక ఓ కారణం ఉంటుందని కావ్యని మెచ్చుకుంటాడు.
వదిన ఏం చేసినా అన్నయ్యకి తెలియకుండా జరగదని మాత్రం నాకు తెలుసని అంటాడు . ఈ ఇంటికి అన్యాయం జరిగే ఏ పనికి ఒప్పుకోడని కూడా అర్ధం చేసుకోమని తల్లికి చెబుతాడు కళ్యాణ్. మమ్మల్ని బాగా అర్ధం చేసుకున్నావని.. అలాగే అందరూ మా ఇద్దరినీ పూర్తిగా అర్ధం చేసుకునే రోజు కూడా వస్తుందని అంటాడు రాజ్. సమయానికి వచ్చి పెద్ద గండం నుంచి కాపాడావని కళ్యాణ్‌కు థ్యాంక్స్ చెబుతుంది కావ్య. మేం ఏ తప్పు చేయడం లేదని, ఎక్కడా డబ్బు దాచుకోవడం లేదని , కళ్యాణ్‌కు అన్యాయం చేయాలనే దురుద్దేశం ఎవరికీ లేదని అంటుంది .
మీరు అడిగే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చెప్పలేనని.. కానీ ఏదో ఒక రోజు అందరికీ సమాధానం దొరుకుతుందని చెబుతుంది కావ్య. ఇందుకు మూడు నెలలు గడువు కావాలని కావ్య అడుగుతుంది. నాకు తలవంపులు తెస్తావని అనుకోలేదని కళ్యాణ్‌పై మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. కొడుకు చేతుల్లో అవమానం జరగడంతో ఇంట్లో వస్తువులన్నీ పగులగొడుతుంది ధాన్యం. కళ్యాణ్‌ని కావ్య పావుగా మార్చుకుని చదరంగం ఆడుతుంటే చూస్తూ కూర్చొంటావా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. వాళ్లు అడిగినట్లుగా మూడు నెలలు టైం ఇస్తే కావ్య మొత్తం తనకు అనుకూలంగా మార్చుకుంటుందని హెచ్చరిస్తుంది. కావ్య- రాజ్‌లు ఏం చేస్తున్నారో ఓ కన్నేసి ఉంచమని కొడుకుతో చెబుతుంది రుద్రాణి.
ఆఫీసులో పరధ్యానంగా ఆలోచిస్తుంటాడు రాజ్.. కళ్యాణ్ వస్తున్నట్లు నాకు ఎందుకు చెప్పలేదని కావ్యని నిలదీస్తాడు . రాజ్ అప్రూవ్ చేసిన డిజైన్లను కావ్య మాన్యుఫాక్చరింగ్‌కి పంపించకపోవడంతో భార్యపై మండిపడతాడు . ప్రింటర్ పనిచేయకపోవడంతో రాజ్ దానిని బద్ధలు కొట్టబోతుండగా.. కావ్య సెట్ చేస్తుంది. సమస్య పరిష్కారమైనా ఎందుకు ఆలోచిస్తున్నావని అపర్ణని అడుగుతాడు సుభాష్. కావ్య మూడు నెలలు గడువు అడిగిందని.. అంత మందితో ఎందుకు మాటలు పడాలని అంటుంది.
ఏదైనా సమస్య రావడం వల్ల కావ్- రాజ్‌లు చెప్పలేకపోతున్నారేమోనని భార్యతో అంటాడు సుభాష్. సమయానికి కళ్యాణ్ వచ్చి ఆపాడు కాబట్టి సరిపోయింది కానీ ధాన్యలక్ష్మీ - ప్రకాశంలు కోర్టు వరకు వెళ్లుంటే అని భయపడుతుంది అపర్ణ. కావ్య ఎప్పటికీ అలా జరగనివ్వదని .. కళ్యాణ్‌ని ఇంటికి పిలిపించి సమస్యను పరిష్కరించిందని అంటాడు సుభాష్. నాకు కావ్య - రాజ్‌ల మీద పూర్తి నమ్మకం ఉందని.. మూడు నెలల్లోనే వారిద్దరూ అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతారని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











