Brahmamudi January 31st Episode : రాజ్ - కావ్యలకు బంపరాఫర్ .. రుద్రాణిని దెబ్బకొట్టిన స్వప్న
నాకు ఆస్తులేమీ అక్కర్లేదని ఈ కుటుంబంలో ఓ వ్యక్తిలా ఉండాలని అనుకుంటున్నానని కళ్యాణ్ తేల్చి చెబుతాడు. మా వదిన ఏం చేసినా ఈ కుటుంబం మంచి కోసమే చేస్తుందని.. అన్నయ్యకి చెప్పే చేస్తుందని అంటాడు. సమయానికి వచ్చి పెద్ద గండం నుంచి కాపాడావని కళ్యాణ్‌కు థ్యాంక్స్ చెబుతుంది కావ్య. నాకు తలవంపులు తెచ్చావంటూ కళ్యాణ్‌పై మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. మాకు 3 నెలలు సమయం కావాలని , ఈలోపు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అంటుంది కావ్య.
కావ్య వేసిన డిజైన్ బాగుండటంతో ఆమెను మెచ్చుకుని దానికి క్లయింట్‌కి పంపిస్తాడు రాజ్. సమయానికి కళ్యాణ్ వచ్చి ఆపకుంటే ప్రకాశం - ధాన్యలక్ష్మీలు కోర్టుకెక్కేవారని బాధపడుతుంది అపర్ణ. కావ్య ఏం చేస్తుందో? ఎందుకు చేస్తుందో? అర్ధం కావడం లేదని అంటుంది. కావ్య మీద నాకు పూర్తి నమ్మకం ఉందని.. కళ్యాణ్‌ను పిలిపించి సమస్యను పరిష్కరించిందని అంటాడు సుభాష్ .ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జనవరి 31వ తేదీ .. ఎపిసోడ్ 633లో ఏం జరిగిందంటే..

డిజైనర్ గొప్పో, బిజినెస్‌మెన్ గొప్పో కస్టమర్‌లతోనే చెప్పిస్తానని అంటాడు రాజ్. కావ్య వేసిన డిజైన్‌ని వేలం పాటలో పెడతాడు. కావ్య చెబుతున్నా వినకుండా రాజ్ దాని విలువను వేలం పాటలో పెంచేస్తూ వెళతాడు. చివరికి దాని విలువ రూ.1.80 కోట్లకు చేరుకుని శిరీష్ అనే వ్యక్తి సొంతం చేసుకుంటాడు. అదంతా చూసి కావ్య షాక్ అవుతుంది. డిజైనర్, సీఈవో ఎప్పుడూ ఒకటి కాదని ఒప్పుకుంటావా అని రాజ్ అడగ్గా కావ్య దండం పెట్టేస్తుంది. మీ ఈగో వల్ల ఈరోజు కంపెనీకి రూ. 1.80 కోట్లు లాభం వచ్చిందని, ఒక ఈఎంఐ కట్టుకోవచ్చని అంటుంది.
తన ఇంటికి అద్దెను చెల్లించకపోవడంతో స్వప్న మండిపడుతుంది. దానిని దూరం నుంచి చూసిన రుద్రాణి - రాహుల్‌లు రేపు మన క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలని దీని దగ్గర ఏమైనా ట్రై చేద్దామా అని అనుకుంటారు. ఇంతలో రుద్రాణి కిచెన్‌లోకి వెళ్లి జ్యూస్ తీసుకుని స్వప్నకి ఇస్తుంది. ఇంతకీ ఏం కావాలో చెప్పమనడంతో క్రెడిట్ బిల్ కట్టడానికి రూ.45 వేలు ఇవ్వమని అడుగుతుంది రుద్రాణి. నేను డబ్బులిస్తే మీరిద్దరూ ఎలా తిరిగిస్తారని ప్రశ్నిస్తుంది స్వప్న. మా చెల్లెలు అన్ని క్రెడిట్ కార్డుల్ని బ్లాక్ చేయించిందని, అలాంటప్పుడు ఇది ఎక్కడిదని నిలదీస్తుంది. రుద్రాణి ఎంత చెప్పినా వినకుండా .. మీ బిల్లు మీరే కట్టుకోండి అంటూ వెళ్లిపోతుంది స్వప్న.
స్వప్నకి బాగా పొగరుబట్టిందని.. దాన్ని అణిచి వేయాలని రాహుల్‌తో అంటుంది రుద్రాణి. దాని దగ్గర ఉన్న డబ్బులు కొట్టేయడానికి స్వప్న ఫోన్‌ని హ్యాక్ చేస్తానని చెప్పి.. 10 కోట్ల లాటరీ గెలిచినట్లుగా ఓ లింక్‌ని పంపిస్తాడు రాహుల్. 10 కోట్లు వచ్చిందన్న ఆనందంతో స్వప్న ఆ లింక్ క్లిక్ చేయగానే స్వప్న అకౌంట్‌లోని డబ్బంతా రాహుల్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ఈ విషయాన్ని తల్లితో చెప్పడంతో రుద్రాణి సంబరపడిపోతుంది. ఇంతలో స్వప్న వచ్చి.. నా అకౌంట్‌లో డబ్బంతా పోయిందని చెప్పడంతో , అడ్డమైన లింక్స్ క్లిక్ చేస్తే ఇలాగే జరుగుతుందని అంటాడు రాహుల్. నేను లింక్ క్లిక్ చేసినట్లు రాహుల్‌తో చెప్పలేదని .. అంటే నా డబ్బులు వాళ్లిద్దరే కొట్టేశారని స్వప్నకి అర్ధమైపోతుంది.
రాజ్ - కావ్యలు ఆఫీస్‌లో వర్క్ చేస్తుండగా.. రాజ్ ఫ్రెండ్ ఒకరు వచ్చి మీ డిజైన్స్ అమెరికా క్లయింట్స్‌కి బాగా నచ్చాయని , వాళ్లతో మీటింగ్ అరెంజ్ చేశానని చెప్పడంతో రాజ్ - కావ్య ఎంతో సంతోషిస్తారు. రాజ్‌కి కంగ్రాట్స్ చెప్పి.. ఎప్పుడు వెళ్తున్నారో చెప్పండి, మీ లగేజ్ మొత్తం సర్దేస్తానని అంటుంది కావ్య. దాంతో వాడు మాత్రమే కాదని, నువ్వు కూడా వెళ్లాలని అంటాడు రాజ్ ఫ్రెండ్. ఆ మాటలతో కావ్య షాకై గాల్లో తేలుతుంటుంది. అతను వెళ్లిపోగానే కావ్య డ్యాన్స్ చేస్తుంది. అమెరికా వెళ్లాలంటే ఇంగ్లీష్ రావడంతో పాటు పాస్‌పోర్ట్, వీసా కూడా కావాలని అంటాడు రాజ్. నువ్వు ఇంగ్లీష్‌లో మాట్లాడి నా పరువు తీయొద్దని, నేను చూసుకుంటానని చెప్పడంతో నేను ఇంగ్లీష్‌లో మాట్లాడి చూపిస్తానని అనుకుంటుంది కావ్య.
బయటి నేను అప్పు చేశానని దానిని వడ్డీతో సహా కట్టాలని రుద్రాణితో రాహుల్ చెబుతుండగా స్వప్న వింటుంది. బాధపడుతున్నట్లుగా వాళ్ల దగ్గరికి వచ్చి రూ.50 వేలు కావాలని , క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలని అంటుంది. దీంతో నీకు క్రెడిట్ కార్డ్ ఎక్కడిదని అడుగుతుంది రుద్రాణి. సీక్రెట్‌గా క్రెడిట్ కార్డ్ మెయింటైన్ చేస్తున్నానని, ఒక రూ.25 వేలు ఇవ్వమని అడుగుతుంది స్వప్న. పది వేలు కూడా ఇవ్వడం కుదరదని చెప్పి వెళ్లిపోతారు రాహుల్ - రుద్రాణి. మీ దగ్గర డబ్బులు ఎలా కొట్టేయాలో నాకు తెలుసని చెప్పి రాహుల్‌కు ఓ మెసేజ్ పెడుతుంది స్వప్న. దానిని రాహుల్ క్లిక్ చేయగానే డబ్బంతా స్వప్న అకౌంట్‌కి వెళ్లిపోతాయి.
ఇంతలో రుద్రాణి వచ్చి క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టమనడంతో డబ్బంతా పోయిందని చెబుతాడు రాహుల్. ఇంతలో స్వప్న రావడంతో.. డబ్బు ఇవ్వనని చెప్పాను కదా , అయినా ఎందుకొచ్చావని మండిపడుతుంది రుద్రాణి. నాకు ఇవ్వడానికి మీ దగ్గర ఉండాలి కదా అనడంతో తల్లీకొడుకులు షాక్ అవుతారు. ఇప్పుడేం చేద్దాం అని రాహుల్ అడగ్గా.. రేపటిలోగా 2 లక్షలు తీసుకురాకుంటే నిన్ను చంపేస్తానని రుద్రాణి వార్నింగ్ ఇస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











