Brahmamudi February 1st Episode : నంద హత్యను తవ్వుతోన్న రాజ్ - కావ్య .. కళ్యాణ్‌కు మంచి రోజులు
కావ్య వేసిన లేటెస్ట్ డిజైన్‌ను వేలానికి పెడతాడు రాజ్. కావ్య చూస్తుండగానే దాని విలువను రూ.1.80 కోట్లకు పెంచేస్తాడు . అది చూసిన కావ్య షాక్ అవుతుంది. ఇంతలో రాజ్ ఫ్రెండ్ ఒకరు వచ్చి కావ్య డిజైన్లు బాగున్నాయని, అమెరికాలోని క్లయింట్లకు ప్రెజెంటేషన్ ఇవ్వాలని చెబుతాడు. అమెరికా వెళ్లే ఆఫర్ రావడంతో కావ్య గాల్లో తేలుతూ ఆఫీస్‌లోనే డ్యాన్స్ చేస్తుంది.
క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టేందుకు స్వప్నని రుద్రాణి - రాహుల్ డబ్బు అడుగుతారు. ఆమె ఇవ్వనని ముఖం మీదే చెప్పడంతో స్వప్న అకౌంట్‌లో ఉన్న డబ్బుని హ్యాక్ చేసి కొట్టేస్తాడు రాహుల్. ఈ సంగతి తెలుసుకున్న స్వప్న.. రివర్స్‌లో మరో లింక్ పంపించి రాహుల్ దగ్గర ఉన్న మొత్తం డబ్బు కొట్టేస్తుంది. దీంతో రాహుల్ - రుద్రాణిలు కక్కలేక మింగలేక షాక్‌లో ఉండిపోతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఫిబ్రవరి 1వ తేదీ .. ఎపిసోడ్ 634లో ఏం జరిగిందంటే..

మా వైఫ్ కావ్యకి , నాకు పాస్‌పోర్ట్, వీసా ఏర్పాటు చేయాలని రాజ్ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుండగా రుద్రాణి దొంగచాటుగా వింటుంది. తనకు ఎక్కువ టైం లేదని నెల రోజుల్లోగా ప్రాసెస్ మొత్తం జరిగిపోవాలని ఫోన్‌లో చెబుతాడు రాజ్. భార్యాభర్తలిద్దరూ ఆస్తులన్నీ అమ్మేసి ఫారిన్ చెక్కేస్తున్నారని , ఏదో పెద్ద ప్లానే వేశారని అనుకున్న రుద్రాణి ఈ విషయం ధాన్యలక్ష్మీతో చెప్పాలని వెళ్తుండగా కావ్య 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే బుక్ చదవడాన్ని చూస్తుంది. నువ్వంత అర్జెంట్‌గా ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటున్నావని కావ్యని అడగ్గా.. మీటింగ్స్‌లో ఇంగ్లీష్‌లో దంచాలి కదా అని అంటుంది. నన్ను డిస్ట్రబ్ చేయొద్దని నేను ఇంగ్లీష్‌లో మాట్లాడాలని రుద్రాణిపై చిరాకు పడుతుంది కావ్య.
ధాన్యలక్ష్మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి నీకో విషయం చెప్పాలని హడావుడి చేస్తుంది రుద్రాణి. నేను ఏం చేసినా నీకోసమేనని అంటుంది. ఓవరాక్షన్ చేయొద్దని నీ గురించి నాకు బాగా తెలుసని రుద్రాణిపై కౌంటర్ వేస్తుంది ధాన్యలక్ష్మీ. రాజ్ - కావ్యలు ఆస్తిని అమెరికా డాలర్లుగా మార్చేశారని త్వరలోనే భార్యాభర్తలిద్దరూ ఫారిన్ వెళ్లిపోతున్నారని చెబుతుంది రుద్రాణి. ప్రతీసారి ఏదేదో చేస్తున్నామని.. అందరి ముందు నేను వెర్రీదాన్ని అవుతున్నానని అంటుంది ధాన్యలక్ష్మీ. అన్నిసార్లు జరిగిందని ఇప్పుడు అలా జరగదు కదా నువ్వు అలర్ట్ కావాలని హెచ్చరిస్తుంది రుద్రాణి.
మూడు నెలల్లో అన్ని సమస్యలకి ఆన్సర్ ఇస్తామని అన్నారు కదా అప్పుడు దాకా వెయిట్ చేద్దామని రుద్రాణితో అంటుంది ధాన్యలక్ష్మీ. దీనిని నమ్ముకుని లాభం లేదని.. నేనే ఏదో ఒకటి చూసి ఈ విషయం బయటపెట్టాలని అనుకుంటుంది రుద్రాణి. ఉదయాన్నే పాస్‌పోర్ట్ ఆఫీస్ నుంచి డాక్యుమెంట్స్ కోసం రాజ్‌కు ఫోన్ వస్తుంది. ఇంటికొచ్చి అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకోమని రాజ్ చెప్పగా.. కావ్య అలా ఎందుకు చెప్పారని నిలదీస్తుంది. మనం బ్యాంక్‌కు వెళ్లి ఈఎంఐ కట్టాలని అందుకే కొంచెం త్వరగా వెళ్లాలని చెబుతాడు రాజ్.
స్వప్నకి ఫైల్ ఇచ్చి ఓ అబ్బాయి వస్తాడని అతనికి ఆ డాక్యుమెంట్స్ ఇవ్వమని చెబుతుంది కావ్య. ఇంతలో ఆ ఫైల్‌ని రుద్రాణి లాక్కొని చూడాలని అనుకోగా స్వప్న అడ్డుకుంటుంది. లక్ష్మీకాంత్‌కి తాను రాసిన పాటను చూపించడంతో ఆయన కళ్యాణ్‌ను మెచ్చుకుంటాడు. ఇంతలో మ్యూజిక్ డైరెక్టర్ రాగా పాట రాసేశానని అంటాడు లక్ష్మీకాంత్. ఆ పాటను చూసిన మ్యూజిక్ డైరెక్టర్ .. ఇది మీరు రాసినట్లుగా లేదని, చాలా ట్రెండీగా ఉందని అంటాడు. అయితే నాకు చిన్న డౌట్ ఉందని క్లారిఫై చేయమని అడగటంతో లక్ష్మీకాంత్ షాకై ఏదేదో చెబుతాడు. మ్యూజిక్ డైరెక్టర్ తిరిగి వెళ్లిపోతుండగా వేరే పదం చెబుతాడు కళ్యాణ్. ఈ పాట రాసిందని నువ్వేనని నాకు తెలుసని, నువ్వు త్వరలోనే గొప్ప రచయితవి అవుతావని కళ్యాణ్‌ని మెచ్చుకుంటాడు ఆ వ్యక్తి.
కారులోనూ ఇంగ్లీష్‌పై కుస్తి పడుతుంది కావ్య. నేను తెలుగు సామెతల్ని ఇంగ్లీష్‌లో అడుగుతానని.. మీరు దానికి అర్ధం చెప్పాలని రాజ్‌తో అంటుంది . ఇంతలో ఎస్ఐ ఫోన్ చేసిన నందగోపాల్ హత్య గురించి ఓ ఇంపార్టెంట్ న్యూస్ చెబుతాడు. టెన్షన్ పడొద్దని మన కష్టం వూరికే పోదని, నందుని హత్య చేసిన వాడు ఖచ్చితంగా దొరుకుతాడని రాజ్‌తో అంటుంది కావ్య. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇంట్లో కూర్చొని ఉండగా సతీష్ అనే వ్యక్తి వచ్చి స్వప్నని డాక్యుమెంట్స్ ఇవ్వమని అడుగుతాడు.
ఆ వ్యక్తిని మన గ్రిప్‌లో పెట్టుకుంటే మరిన్ని విషయాలు తెలుస్తాయని అనుకుంటుంది రుద్రాణి. ఇంతలో స్వప్న ఫైల్ తీసుకొచ్చి అతనికి ఇవ్వగా.. అదేంటి అని అడుగుతుంది రుద్రాణి. అమెరికా వెళ్లడానికి వీసా, పాస్‌పోర్ట్ రెడీ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అని చెబుతాడు ఆ వ్యక్తి. ఎవరెవరికి వీసా, పాస్‌పోర్ట్ ఏర్పాటు చేస్తున్నారని రుద్రాణి అడగ్గా.. రాజ్ - కావ్యలకి అని చెబుతాడు. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. ఇప్పటికైనా నీకు అర్ధమైందా అని ధాన్యాన్ని అడుగుతుంది రుద్రాణి. ఆస్తులు తాకట్టు పెట్టి, అప్పులు చేసి రాజ్ - కావ్యలు అమెరికా వెళ్లబోతున్నారని అనడంతో అపర్ణ, సుభాష్‌లు ఆమెకు గడ్డిపెడతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











