Brahmamudi February 3rd Episode : రుద్రాణి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ .. రాజ్- కావ్యలని కాపాడిన అపర్ణ

అమెరికా వెళ్లేందుకు కావ్యకి, తనకు రాజ్ వీసా, పాస్‌పార్ట్ ఏర్పాటు చేయమని ఓ ఏజెంట్‌కు చెబుతాడు రాజ్. ఇదంతా విన్న రుద్రాణి.. కావ్య ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా గమనించి ధాన్యలక్ష్మీకి చెబుతుంది. బయటికి వెళ్తూ స్వప్నకి డాక్యుమెంట్స్ ఉన్న ఫైల్ ఇస్తుంది కావ్య. కళ్యాణ్ రాసిన పాటను మెచ్చుకుంటాడు లక్ష్మీకాంత్. ఇంతలో మ్యూజిక్ డైరెక్టర్‌కు తానే పాటను రాసినట్లు చెప్పి బిల్డప్ ఇస్తాడు. ఆ పాట కళ్యాణ్ రాసినట్లు గుర్తించిన మ్యూజిక్ డైరెక్టర్ అతనికి ఆల్ ది బెస్ట్ చెబుతాడు.

నందగోపాల్‌ను హత్య చేసిన వాడి గురించి రాజ్‌కు క్లూ ఇస్తాడు ఇన్స్‌పెక్టర్. కావ్య - రాజ్‌ల పాస్‌పోర్ట్‌ డాక్యుమెంట్స్ కోసం దుగ్గిరాల వారింటికి వస్తాడు ఏజెంట్. అతను ఎందుకొచ్చాడో అందరికీ చెప్పాలని రుద్రాణి కెలుకుతుంది. కావ్య - రాజ్‌లకు వీసా , పాస్‌పోర్ట్ ఏర్పాట్లు చేయడానికే తాను వచ్చినట్లు అతను చెప్పడంతో కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఫిబ్రవరి 3వ తేదీ .. ఎపిసోడ్ 635లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 635 February 3rd 2025 Here is full story

నీకు 24 గంటలూ ఎక్కడ చిచ్చు పెడదామనే ఆలోచనేనా అంటూ రుద్రాణిపై మండిపడుతుంది అపర్ణ. అన్యాయం జరుగుతున్నప్పుడు నాకు అర్ధమయ్యేలా చెబుతోందని, చిచ్చు పెట్టడం లేదని రుద్రాణికి సపోర్ట్ చేస్తుంది ధాన్యలక్ష్మీ. న్యాయం కోసం పోరాడి మీ అందరికీ చెడ్డదానిలా మారిపోయానని అంటుంది. రాజ్ - కావ్యలు అమెరికా వెళ్లిపోవడానికి ప్లాన్ చేసుకున్నారనే కదా నీ డౌట్ , వాళ్లు వచ్చాక అసలు విషయం కనుక్కుంటానని ఇందిర చెబుతుంది.

వేలం పాటలో కావ్య వేసిన డిజైన్‌ను కొన్న శిరీష్ అనే వ్యక్తి రాజ్ - కావ్యల దగ్గరికి డబ్బు సంచితో వస్తాడు. మేం ఇలా క్యాష్ తీసుకోమని.. ఏదైనా వైట్‌గానా ఉండాలని చెబుతాడు రాజ్. ఈ వ్యవహారం నా భార్యకు తెలియకూడాదని, ఇది పర్సనల్ ఇష్యూ అని అంటాడు శిరీష్. అతను రిక్వెస్ట్ చేయడంతో రాజ్ డబ్బు తీసుకోవడానికి ఒప్పుకుంటాడు. అతను వెళ్లిపోయాక మీ మగాళ్లంతా ఇంతేనని మండిపడుతుంది కావ్య. ఆ రోజు హాలీడే కావడంతో ఆ డబ్బును ఇంటికి తీసుకెళ్తారు రాజ్ - కావ్య.

రాజ్ - కావ్యల కోసం రుద్రాణి - ధాన్యలక్ష్మీలు వెయిట్ చేస్తుంటారు. వాళ్లు ఎంతకూ రాకపోవడంతో వారిపై మండిపడతారు. ఇంతలో స్వప్న వచ్చి వారిద్దరి మీద సెటైర్లు వేస్తుంది. కోడల్ని కంట్రోల్‌లో పెట్టడం చేతకాదు.. అదే నేనైతే, నోరు మూయించే దాన్నని అంటుంది ధాన్యలక్ష్మీ. కళ్యాణ్ అప్పూకి ఫోన్ చేసి లక్ష్మీకాంత్ ఇంట్లో ఏం జరిగింది, మ్యూజిక్ డైరెక్టర్ తనను ఎలా మెచ్చుకుంది చెబుతాడు. ఇంకా నీకు ఎంత కాలం దూరంగా ఉండాలని అప్పూతో అంటాడు కళ్యాణ్.

అంతా భోజనం చేస్తుండగా నువ్వు , కావ్య కలిసి మన ఆస్తిని అమ్మేసి డాలర్లుగా మార్చేసి అమెరికాకు పారిపోతున్నారా అని రాజ్‌ని నిలదీస్తుంది అపర్ణ. పక్కవాళ్ల ఆస్తిని అమ్మే హక్కు నీకెవరు ఇచ్చారు? నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా? పాస్‌పోర్ట్, వీసాలు రెడీ చేసుకుంటున్నావ్‌గా అని మండిపడుతుంది. అపర్ణ మాటలకు కావ్య - రాజ్‌లు బిత్తరపోతారు. మీ ప్రశ్నకు సమాధానం నేను చెబుతానని కావ్య జోక్యం చేసుకుంటుంది. సీక్రెట్‌గా పాస్‌పోర్ట్ , వీసాకు ఏర్పాట్లు చేసుకోవడం.. ఎవరికీ తెలియకుండా డాక్యుమెంట్స్ ఇవ్వడం ఇవన్నీ మీ మీద అనుమానాలు తెచ్చిపెడతాయని అంటుంది రుద్రాణి.

Brahmamudi Serial Today s Episode 635 February 3rd 2025 Here is full story

నిజంగా మేం ఫారిన్‌కు పారిపోవాలని అనుకుంటే బ్రోకర్‌ని ఇంటికెందుకు రమ్మంటామని ప్రశ్నిస్తాడు రాజ్. రోజంతా ఆఫీస్‌లో కష్టపడొచ్చిన మనిషిని అన్నం కూడా తిననివ్వడం లేదని కావ్య మండిపడుతుంది. ఇందులో సీక్రెట్ ఏం లేదని, కంపెనీ పని మీదే అమెరికా వెళ్తున్నామని, మన డిజైన్స్ ఫారిన్ క్లయింట్స్‌కు నచ్చడంతో వాళ్లు డేమొ ఇవ్వమనడంతో వెళ్లాల్సి వస్తోందని చెబుతాడు రాజ్. ఆ కాంట్రాక్ట్ ఓకే అయితే రూ.40 కోట్ల డీల్ వస్తుందని.. ప్రాసెస్ అంతా పూర్తయ్యాకే చెబుదామనుకున్నామని, ఆలోపే మీరు ఈ ఇన్వెస్టిగేషన్ చేశారని మండిపడతాడు.

మీరు చెప్పేది నిజమేనా? అని రుద్రాణి ప్రశ్నించగా.. మాకు కష్టపడి పనిచేసి, పైసా పైసా కూడబెట్టడం, కంపెనీని మరింత పై స్థాయికి తీసుకురావడం మాత్రమే తెలుసని కావ్య కౌంటర్ ఇస్తుంది. తమను నానా మాటలు అనేసరికి రాజ్- కావ్యలు భోజనం చేయకుండా వెళ్లిపోతారు. వాళ్లిద్దరూ మన ఆస్తిని తాకట్టు పెట్టి ఆ డబ్బంతా ఏం చేస్తున్నారో కనుక్కోమని రాహుల్‌తో అంటుంది రుద్రాణి. డబ్బు చాలా చెడ్డదని.. చివరికి మా అమ్మ కూడా నన్ను అనుమానించిందని కావ్యతో చెబుతాడు రాజ్. ఆ నలుగురికి కలిగిన అనుమానాన్ని ఆమె అడిగి మీ నోటితోనే నిజం చెప్పించాలనే అత్తయ్య అలా మాట్లాడారని అంటుంది కావ్య. తన కొడుకును నిలదీసే అవకాశం రుద్రాణి, చిన్నత్తయ్యకి ఇవ్వకుండా అత్తయ్య ఇలా చేశారని చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X