Brahmamudi February 4th Episode : కిరాయి మనుషులను దించిన రుద్రాణి .. ప్రమాదంలో రాజ్- కావ్య
కావ్య వేసిన డిజైన్‌ను వేలం పాటలో కొన్న వ్యక్తి రూ.1.80 కోట్లను క్యాష్ రూపంలో ఇవ్వడంతో రాజ్ వద్దని చెప్పినా అతను బలవంతంగా ఇచ్చేస్తాడు. మీరిద్దరూ ఆస్తిని డాలర్లుగా మార్చేసి అమెరికా పారిపోవాలని అనుకుంటున్నారా అని భోజనాల దగ్గర కావ్య - రాజ్‌లను నిలదీస్తుంది అపర్ణ. కంపెనీ పని మీద అమెరికా వెళ్తున్నామని.. పారిపోవడం లేదని చెప్పి భోజనం చేయకుండా వెళ్లిపోతాడు రాజ్.
మాకు కంపెనీని పైకి తీసుకురావడం, కష్టపడి పనిచేయడం మాత్రమే తెలుసని మోసం చేయడం రాదని అంటుంది కావ్య. వాళ్లిద్దరూ మన ఆస్తిని తాకట్టు పెట్టి ఆ డబ్బంతా ఏం చేస్తున్నారో కనుక్కోమని రాహుల్‌తో అంటుంది రుద్రాణి. అమ్మ కూడా నన్ను అనుమానించిందని కావ్యతో చెబుతూ బాధపడతాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఫిబ్రవరి 4వ తేదీ .. ఎపిసోడ్ 636లో ఏం జరిగిందంటే..

మూడు నెలలు సైలెంట్‌గా ఉందామంటే వినకుండా నన్ను రెచ్చగొట్టావంటూ రుద్రాణిపై మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. రాజ్ - కావ్యలు కుటుంబం కోసం కష్టపడుతున్న మంచివాళ్లయితే.. వాళ్లను తప్పుబట్టినందుకు నేను తప్పుడు మనిషిని అయ్యానని ఫైర్ అవుతుంది . ఇంతలో స్వప్న వచ్చి ఇన్ని రోజులకు మా అత్తయ్య గురించి కరెక్ట్‌గా తెలుసుకున్నారని సెటైర్లు వేస్తుంది. ఒకప్పుడు మీ మాటకు ఇంట్లో వాళ్లు ఎలా రెస్పెక్ట్ ఇచ్చేవారు.. మీరు ఎప్పుడైతే మా అత్తయ్యతో చేతులు కలిపారో అప్పుడే మీ స్థాయిని కోల్పోయారని ధాన్యలక్ష్మీకి స్వప్న గుర్తుచేస్తుంది.
కావ్య - రాజ్‌లు క్లయింట్ ఇచ్చిన డబ్బులు లెక్కపెడుతుండగా రాహుల్ చూసి ఈ విషయాన్ని వెంటనే రుద్రాణికి చెబుతాడు. వాళ్లిద్దరూ మన ఆస్తిని డాలర్స్‌గా మార్చేస్తున్నారని ఈ గుట్టు బయటపెట్టి అందరి ముందు రాజ్ - కావ్యల అంతు చూడాలని రాహుల్‌కు ఓ ప్లాన్ చెబుతుంది రుద్రాణి. పథకం ప్రకారం ఉదయాన్నే రాజ్ - కావ్యలు బయల్దేరుతుండగా కిరాయి మనుషులను ఏర్పాటు చేసి లోపలికి పిలుస్తుంది. వాళ్లొచ్చి రుద్రాణిని పిలవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు.
ఎవరు వాళ్లు? ఎందుకొచ్చారని ఇంట్లో అంతా రుద్రాణిని నిలదీస్తారు. షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి మా దగ్గర రెండు కోట్లు అప్పు చేసి తీసుకుందని వచ్చిన వాళ్లు చెప్పడంతో ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. నాకు మీరు డబ్బులు ఇవ్వడం లేదని , నేనే సంపాదించుకోవాలని మార్కెట్‌లో పెడితే నేను కొన్న షేర్స్ పడిపోయాయని అంటుంది రుద్రాణి. వాళ్లొచ్చి మీరూ మీరూ తర్వాత తేల్చుకోండి మాకు డబ్బు ఇవ్వండి అని వచ్చిన వాళ్లు గొడవ చేస్తారు.
నువ్వే నాకు దిక్కని.. వాళ్లకి రెండు కోట్లు ఇచ్చి కాపాడమని రాజ్‌ని అడుగుతుంది రుద్రాణి. అంత సింపుల్‌గా ఇచ్చేయమని ఎలా చెబుతున్నారు? ఇన్ని కోట్లకు అధిపతులం మన దగ్గర రెండు కోట్లు కూడా లేవా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. డబ్బు సంపాదించి ఈ ఇంటికి పూర్వ వైభవం తీసుకురావాలని అనుకున్నానని చెప్పగా.. ఇంటికి అప్పుల వాళ్లను తీసుకొచ్చి పెట్టావని అంటుంది ఇందిర. నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదని అడ్జెస్ట్ చేసే పరిస్ధితులు కూడా లేవని తేల్చి చెబుతాడు రాజ్.
నా భర్త డబ్బు ఉంచుకుని లేదు అని చెప్పే రకం కాదని అంటుంది కావ్య. ఉన్నా కానీ నువ్వు ఇవ్వనివ్వవు కదా అని మండిపడుతుంది రుద్రాణి. మీ ఇద్దరూ ఆఫీస్‌కి వెళ్లండి, ఇంట్లో సంగతి మేం చూసుకుంటామని అంటుంది స్వప్న. మీకు ఒక్కరోజు సమయం ఇస్తామని లేదంటే డైరెక్ట్‌గా మీతో డీల్ చేస్తామని కిరాయి మనుషులు రుద్రాణికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతారు. మమ్మల్ని ఏం చేద్దామని అనుకుంటున్నావ్ అంటూ రుద్రాణిపై మండిపడుతుంది ఇందిర. నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నానని.. నన్ను కాపాడారా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. ఇక నాకు వేరే దిక్కు లేదని ఏ నుయ్యో, గొయ్యే చూసుకుంటామని ఓవర్ యాక్టింగ్ చేస్తుంది .
రాజ్ అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాడని, సాయంత్రం వాడొచ్చాక నేనే ఏదో లాగా మాట్లాడతానని సుభాష్ చెబుతాడు. ఆ మాటలతో సంతోషపడిన రుద్రాణి.. రాహుల్‌ను పంపి రాజ్ - కావ్యల దగ్గరున్న 2 కోట్లను కోట్టేయమని చెబుతుంది. మన దగ్గర రెండు కోట్లు ఉన్నప్పుడే రుద్రాణి అప్పు గురించి బయటికి తెలియడం వెనుక ఏదో స్కెచ్ ఉందని అనుమానిస్తుంది కావ్య. మా అత్త గ్యాంబ్లింగ్ ఆడి డబ్బులు సంపాదించాలని అనుకుందని చెబుతాడు రాజ్. రాహుల్ ఒక దొంగని పిలిపించి .. రాజ్ - కావ్యల దగ్గరున్న డబ్బుని ఎలా కొట్టేయాలో చెబుతాడు . ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










