Brahmamudi February 5th Episode : రుద్రాణి ప్లాన్ తిప్పికొట్టిన కావ్య .. దుగ్గిరాల వారింటికి కొత్త మెంబర్
కావ్య - రాజ్‌ల వద్ద ఉన్న రూ.2 కోట్ల గుట్టు విప్పేందుకు కిరాయి మనుషులను రంగంలోకి దించుతుంది రుద్రాణి. సరిగ్గా రాజ్ - కావ్యలు ఆఫీస్‌కు వెళ్లబోతుండగా వాళ్లు వచ్చి మేం ఇచ్చిన రూ. 2 కోట్లు ఇవ్వమని గొడవ చేస్తారు. నేను షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి డబ్బుల్లేక రూ.2 కోట్లు అప్పుగా తీసుకున్నానని.. కానీ మార్కెట్ డౌన్ కావడంతో పోయాయని అంటుంది.
రూ.2 కోట్లు ఇచ్చి నన్ను కాపాడమని రాజ్‌ను అడుగుతుంది రుద్రాణి. నేను ఎలాంటి హెల్ప్ చేయలేనని చెప్పి రాజ్ - కావ్యలు ఆఫీస్‌కి బయల్దేరతారు. నా పని నేను చేశానని.. నువ్వు వాళ్లిద్దరి దగ్గర ఉన్న రూ.2 కోట్లు కొట్టేయమని రాహుల్‌ను పంపిస్తుంది రుద్రాణి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఫిబ్రవరి 5వ తేదీ .. ఎపిసోడ్ 637లో ఏం జరిగిందంటే..

రాజ్ - కావ్యల దగ్గరి నుంచి డబ్బులు కొట్టేసేందుకు ఓ మనిషిని ఏర్పాటు చేసి ప్లాన్ చెబుతాడు రాహుల్. కారులో వెళ్తుండగా రాజ్‌కు ఎక్కిళ్లు రావడంతో వాటర్ బాటిల్ కనిపించదు.. దీంతో ఏం చేయాలో తెలియక భర్తకు ముద్దు పెడుతుంది కావ్య. అయినప్పటికీ రాజ్‌కు ఎక్కిల్లు ఆగకపోవడంతో కారు దిగి వాటర్ బాటిల్ కోసం వెళ్తాడు. ఇంతలో రాహుల్ ఏర్పాటు చేసిన మనిషి కావ్య - రాజ్‌ల కళ్లు గప్పి కారులో నుంచి డబ్బులున్న బ్యాగ్ కొట్టేస్తాడు. అది చూసిన కావ్య గట్టిగా అరవడంతో ఆ దొంగ బ్యాగ్‌ని రాహుల్ దగ్గర విసిరి పారిపోతాడు.
ఎట్టకేలకు భార్యాభర్తలిద్దరూ వాడిని వెంబడించి పట్టుకుంటారు. మేం డబ్బు తీసుకొస్తున్న సంగతి వీడికెలా తెలుసు? నీతో ఎవరు ఈ పని చేయించారని రాజ్ దొంగని చితక్కొట్టగా రాహుల్ పేరు చెబుతాడు. 20 లక్షలు ఇస్తానంటే ఈ పని చేశానని చెప్పడంతో రాజ్ - కావ్య షాక్ అవుతారు. మీరు ఇంటికి వెళ్లి రాహుల్‌ను నిలదీయండి.. నాకు చిన్న పని ఉంది చేసుకుని వచ్చేస్తానని అంటుంది కావ్య. ఇంటికొచ్చి రాహుల్‌ని పట్టుకుని నేను నిన్ను తమ్ముడిలా చూశానని, నువ్వు నన్ను శత్రువులా చూశావంటూ రాహుల్‌ని చితక్కొడతాడు రాజ్.
ఇంతకీ రాజ్ ఏం చేశాడంటూ ఇంట్లో వాళ్లు ప్రశ్నించగా.. నా దగ్గర 2 కోట్లు కొట్టేశాడని రాజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. అసలు రాజ్ దగ్గర చిల్లిగవ్వ కూడా లేదని చెప్పాడుగా.. మరి రెండు కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నిస్తుంది రుద్రాణి. నీ దగ్గర అంత డబ్బుందా? రుద్రాణి చెప్పింది నిజమా? అని రాజ్‌ను నిలదీయగా.. ఉందని అంటాడు రాజ్. ఆ మాటలతో ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. అంత డబ్బు ఉన్నప్పుడు నేను అప్పు తీసుకున్నవాళ్లు వచ్చి బెదిరించినప్పుడు ఎందుకలా మౌనంగా ఉన్నావని నిలదీస్తుంది రుద్రాణి. వాళ్లు నన్ను చంపేసి ఉంటే మీ ఇద్దరూ వేడుక చూసేవాళ్లా అని ప్రశ్నిస్తుంది.
ఇంతలా రుద్రాణి ఏర్పాటు చేసిన మనుషులును తీసుకుని ఇంటికొస్తుంది కావ్య. దాంతో షాకైన రుద్రాణి మీ రెండు కోట్లు రేపు తెచ్చిస్తానని ఇప్పుడు వెళ్లిపోమని అంటుంది. అవసరం లేదని వాళ్లకి ఇవ్వాల్సిన ఐదొందలు నేను ఇచ్చేశానని చెబుతుంది కావ్య. వీళ్ల పేమెంట్ రోజుకు 500 మాత్రమేనని, వీళ్లు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌లని అంటుంది కావ్య. మేం జూనియర్ ఆర్టిస్టులమని.. డబ్బులు ఇస్తానంటే వచ్చామని చెబుతారు కిరాయి మనుషులు. దాంతో కుటుంబ సభ్యులంతా షాకై రుద్రాణిని నానా మాటలు అంటారు.
నేను ఇలా ఎందుకు చేశానో ఒకసారి ఆలోచించండి అని అంటుంది రుద్రాణి. అడ్డంగా దొరికిపోయాక కూడా ఇంకా మభ్యపెట్టాలని చూడొద్దని కావ్య మండిపడుతుంది. అడ్డంగా దొరికిపోయింది నేను కాదు.. నువ్వు , నీ మొగుడు అంటుంది రుద్రాణి. ఇదంతా నేనే చేశానని.. వీరిద్దరి నిజ స్వరూపం అందరికీ తెలియాలనే ఇలా చేశానని అంటుంది. ఇన్ని రోజులు వాళ్లిద్దరూ స్వార్ధం కోసమే ఇదంతా చేశారని చెబుతుంది. భోజనాలు, టిఫిన్స్‌పై రిస్ట్రిక్షన్స్ పెట్టి.. ఇన్నాళ్లు వీళ్లు దోచుకుని, దాచుకున్న డబ్బు ఇదేనని డబ్బు బ్యాగ్ చూపిస్తుంది రుద్రాణి. వీళ్ల దగ్గర డబ్బుందని నేను చెబితే ఎవరూ నమ్మలేదని.. మరి ఇప్పుడేం అంటారని ప్రశ్నిస్తుంది.
మా చుట్టూ నువ్వు వైఫైలా తిరుగుతుంటావని, మమ్మల్ని నిలదీయడమే పనిగా పెట్టుకున్నావని తెలుసని అంటాడు రాజ్. డబ్బులు లేవంటే మేం దాచుకుంటున్నామని కాదని, ఓ ముఖ్యమైన పని కోసం ఖర్చు పెడుతున్నామని చెబుతాడు రాజ్. ఆ ముఖ్యమైన పని ఏంటో అది కూడా నువ్వే చెప్పు అని నిలదీస్తుంది రుద్రాణి. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంటే నాకు ముఖ్యమైనది ఏది లేదని దానిని కాపాడుకోవడం కోసమే ఇలా చేస్తున్నానని అంటాడు రాజ్. మూడు నెలల సమయం ముగిసేవరకు ఆగితే మీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానని చెబుతాడు.
ఇలాంటి చిల్లర గొడవలు ఇంకోసారి ఇంటి మీదకి తీసుకొస్తే నీ పళ్లు రాలగొడతానని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది ఇందిర. కావ్య - రాజ్‌లు ఈజీగా తప్పించుకున్నారని రాహుల్ - రుద్రాణి అనుకుంటారు. మూడు నెలలు సమయం కావాలని అన్నారు కదా అప్పటి వరకు వెయిట్ చేద్దామని ఇంట్లో ప్రతి ఒక్కరూ అనుకుంటారు. చూస్తుండగానే 3 నెలల గడువు ముగుస్తుంది. ఈలోగా ఓ రోజున స్వప్న మెట్లపై నడిచి వస్తుండగా ఆమెకు నొప్పులు వస్తాయి. కావ్య - రాజ్‌లు ఆఫీస్‌లో వర్క్ చేస్తుండగా కావ్యకి అపర్ణ ఫోన్ చేసి.. నువ్వు పిన్నివి అయ్యావని చెప్పడంతో కళావతి సంతోషపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











