Brahmamudi February 6th Episode : కోమాలోంచి బయటికొచ్చిన సీతారామయ్య .. ఎస్ఐలా తిరిగొచ్చిన అప్పూ
రాహుల్ ఏర్పాటు చేసిన మనిషి కావ్య - రాజ్‌ల కారులోంచి డబ్బులున్న బ్యాగ్‌ను కొట్టేస్తాడు. ఆ దొంగను కావ్య - రాజ్‌లు పట్టుకుని చితకబాదగా రాహుల్ చెప్పడంతోనే దొంగతనం చేసినట్లు చెబుతాడు. ఇంటికొచ్చి రాహుల్‌ను కొడతాడు రాజ్.. ఇంతలో రుద్రాణికి డబ్బు ఇచ్చామని చెప్పిన వారితో కావ్య ప్రత్యక్షమవుతుంది. కావ్య - రాజ్‌లు డబ్బు దోచుకుంటున్న తీరు గురించి బయటపెట్టాలనే నేను, రాహుల్ ఇలా చేశామని చెబుతుంది రుద్రాణి.
ఈ డబ్బును స్వరాజ్ గ్రూప్‌ను కాపాడటం కోసమే ఖర్చు పెడుతున్నామని చెబుతాడు రాజ్. మూడు నెలల్లో మేం ఏం చేస్తున్నామో చెబుతామని తేల్చేస్తాడు. గడువు ముగిసే వరకు గొడవలొద్దని వెయిట్ చేద్దామని రుద్రాణితో రాహుల్, ధాన్యలక్ష్మీ అంటారు. మూడు నెలలు గడిచి ఓ రోజున స్వప్నకు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులంతా ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తారు. కావ్యకు అపర్ణ ఫోన్ చేసి నువ్వు పిన్నివి అయ్యావని చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఫిబ్రవరి 6వ తేదీ .. ఎపిసోడ్ 638లో ఏం జరిగిందంటే..

స్వప్న అక్కకి ఆడపిల్ల పుట్టిందని రాజ్‌తో చెప్పడంతో భార్యకు కంగ్రాట్ చెబుతాడు . పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్వప్నకు గుమ్మం దగ్గర హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్తుంది కావ్య. ఇన్నాళ్టీకి లక్ష్మీ దేవి మన ఇంటికి వచ్చిందని ఇందిర చెప్పగా.. కనీసం ఈమె రాకతోనైనా ఎవరి ఆస్తి వాళ్లకి వచ్చేస్తే సంతోషమని అంటుంది. కాసేపైనా నా ముని మనవరాలితో ఆడుకోనివ్వమని అంటుంది ఇందిర. నీ పెళ్లి కూడా ఇక్కడే జరగాలని అనుకుంటూ ఉండగా.. అప్పటిదాకా ఎవరుంటారో? ఎవరు పోతారోనని సెటైర్లు వేస్తుంది రుద్రాణి.
మేం పనిగట్టుకుని ఈ కుటుంబాన్ని ముక్కలు చేసేదానిలా కనిపిస్తున్నానా అని మండిపడుతుంది. అది వేరే చెప్పాల్సిన అవసరం లేదని ఆస్తి కోసం గొడవ ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తుంది. నీకు మనవరాలు పుట్టిందన్న ఆనందం కూడా లేదా అని సుభాష్ ప్రశ్నిస్తాడు. స్వప్న మగపిల్లాడని కని ఈ ఇంటికి వారసుడిని ఇస్తుందనుకుంటే ఆడపిల్లని తీసుకొచ్చి చేతిలో పెట్టిందని మండిపడుతుంది రుద్రాణి. ఆ మాటలతో అంతా బాధపడతారు.

ఇంతలో రాజ్‌కు హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. మీ తాతయ్య గారు కోమాలోంచి బయటికొచ్చారని చెప్పడంతో అంతా సంతోషిస్తారు. పాప ఇంటికొచ్చిన వేళా విశేషం తాతయ్య కళ్లు తెరిచారని అంటుంది కావ్య. ఆడపిల్ల పుడితే తప్పేంటి, అసలు ఈ సృష్టికి మూలం ఆడదని చెబుతుంది ఇందిర. పాప ఇంట్లోకి రాగానే శుభవార్తని తీసుకొచ్చిందని.. ఇంతటి అదృష్ట జాతకురాలు పుట్టడం నీ అదృష్టమని అంటుంది అపర్ణ. ఆ వెంటనే అందరూ హాస్పిటల్‌కు పరుగులు తీస్తారు.
సీతారామయ్య కళ్లు తెరవడంతో అంతా ఆనందంగా ఉంటారు. కంపెనీ పరిస్థితి ఎలా ఉందని అడగ్గా మీ మనవడు మరో సీతారామయ్యలా పరిపాలిస్తున్నాడని చెబుతుంది కావ్య. ఇంతలో డాక్టర్ వచ్చి తాతయ్యని బాగా చూసుకోవాలని చెబుతాడు. తాతయ్య ఇంటికొచ్చేలోపే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని అనుకుంటాడు రాజ్. కనకం ఇంట్లో వంట చేస్తుండగా అప్పూ పోలీస్ యూనిఫాంలో వచ్చి హ్యాండ్సప్ అంటుంది. నన్ను వదిలేయండి మేడం.. నేను ఏ తప్పు చేయలేదని, అంతా పక్కింటి పంకజం చేసిందని చెబుతుంది కనకం.
నీ గురించి నాకు అంతా తెలుసు.. నీకు ముగ్గురు కూతుళ్లు, వాళ్లకి పెళ్లిళ్లయి ఈ మధ్యే స్వప్నకి పాప పుట్టిందని ఈ విషయం నీ చిన్నకూతురికి చెప్పావా అని అడుగుతుంది. హడావుడిలో అంతా మరిచిపోయానని చెబుతుంది కనకం. అదే నువ్వు చేసిన తప్పని అందుకే నిన్ను అరెస్ట్ చేస్తున్నానని అంటుంది అప్పూ. ఇప్పుడే ఫోన్ చేసి క్షమాపణలు అడుగుతానని కనకం అనగా ఫోన్ సౌండ్ ఇంట్లోనే వినిపిస్తుంది. కన్నకూతురినే గుర్తు పట్టలేకపోయావా అని కృష్ణమూర్తి, అప్పూ వచ్చి కనకాన్ని ఆటపట్టిస్తారు. అప్పూని పోలీస్ డ్రెస్‌లో చూసి షాకైన కనకం.. నన్నే భయపెడతావా అని చీపురు కట్టతో కూతురి వెంట పడుతుంది. నా మీద చేయి పడితే డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేయి వేసినందుకు అరెస్ట్ చేస్తానని అంటుంది అప్పూ.

కూతురిని చూసి కృష్ణమూర్తి, కనకం ఎంతో సంతోషిస్తారు. మా అప్పూకి నువ్వు భర్తగా దొరకడం అది చేసుకున్న పుణ్యమని కళ్యాణ్‌ని మెచ్చుకుంటుంది కనకం. తనను లక్ష్యం వైపు నడిపించి కల నెరవేర్చావని అంటుంది. ఇంతకీ ఈ విషయం మీ ఇంట్లో వారికి చెప్పారా అని కనకం, కృష్ణమూర్తిలు కళ్యాణ్‌ను అడుగుతారు. మనవరాలితో ఆడుకుంటూ ఉంటుంది ఇందిర. ఇది ఆడగాలే గానీ నా ప్రాణాలైనా ఇచ్చేస్తానని అంటుంది. ప్రాణాలెందుకు మా ఆస్తి మాకు ఇచ్చేయమని అంటుంది రుద్రాణి. ఆ మాటలకు ఇందిర సరేనని అంటుంది ఇందిర.
రాజ్ అడిగినట్లు మూడు నెలల సమయం ముగియబోతోందని ఆస్తి గురించి త్వరలోనే క్లారిటీ వస్తుందని అంటుంది ధాన్యలక్ష్మీ. తొందరొద్దని త్వరలోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని అంటుంది కావ్య. పాపకి బారసాలా చేయాలని అనుకుంటున్నామని, అందరినీ పిలిచి గ్రాండ్‌గా చేద్దామని చెబుతుంది ఇందిర. నేను పంతులు గారిని కనుక్కున్నానని రేపే మంచి ముహూర్తం ఉందని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










