Brahmamudi February 7th Episode : కళ్యాణ్ మనసు విరిచేసిన రుద్రాణి .. ప్రకాశంను రెచ్చగొట్టిన ధాన్యం
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన స్వప్నను పాపతో సహా హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్తుంది దుగ్గిరాల ఫ్యామిలీ. వారసుడిని కనిస్తుందని అనుకుంటే ఆడపిల్లని చేతిలో పెట్టిందని రుద్రాణి నానామాటలు అంటుంది. ఆ వెంటనే సీతారామయ్య కోమాలోంచి బయటికొచ్చినట్లు రాజ్‌కు డాక్టర్లు ఫోన్ చేసి చెబుతారు. కళ్లు తెరిచి ఇందిర, రాజ్, కావ్యలను చూసి చూస్తాడు సీతారామయ్య. పాప పుట్టిన వేళా విశేషం.. ఈ ఇంటో అన్ని శుభాలే జరుగుతున్నాయని ఇందిర మురిసిపోతుంది.
ఎస్ఐ ట్రైనింగ్ పూర్తి చేసి యూనిఫాంలో పుట్టింటికొచ్చిన అప్పూ.. గన్‌తో కనకాన్ని భయపెడుతుంది. తర్వాత వచ్చింది తన కూతురని తెలుసుకున్న కృష్ణమూర్తి, కనకం గర్వంతో పొంగిపోతారు. అప్పూ ఎస్ఐ అయిన విషయాన్ని మీ ఇంట్లో కూడా చెప్పమని కళ్యాణ్‌తో అంటుంది కనకం. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఫిబ్రవరి 7వ తేదీ .. ఎపిసోడ్ 639లో ఏం జరిగిందంటే..

అప్పూ పోలీస్ యూనిఫాంలో దుగ్గిరాల వారింటికి వెళ్లడంతో ఈ దసరా వేషం ఏంటని అడుగుతుంది రుద్రాణి. అప్పూ పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఈ ఊరికి ఎస్ఐగా పోస్టింగ్ తీసుకుందని చెబుతుంది కావ్య. ఈ పోలీస్ గారు ఇక్కడెందుకు వచ్చినట్లు దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. నా భార్య పోలీస్ అయ్యిందని ఈ ఇంటి పెద్ద వాళ్లకి చెప్పి వాళ్ల ఆశీర్వాదం తీసుకుందామని వచ్చామని అంటాడు కళ్యాణ్. ఇందిర ఆశీర్వాదం తీసుకోగా.. తల్లి దగ్గరికి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తుండగా శతృువులా నిన్ను దూరం పెట్టనని అంటుంది ధాన్యలక్ష్మీ . ఆ మాటలతో వెళ్లి తల్లిని హత్తుకుంటాడు కళ్యాణ్. ఆ తర్వాత ఇద్దరి ఆశీర్వాదం తీసుకుంటారు అప్పూ- కళ్యాణ్.
ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలంటే మీరిద్దరూ ఇక్కడే ఉండిపోవాలని అంటుంది అపర్ణ. నువ్వు అనుకున్నట్లుగానే నీ భార్యను మంచి స్థాయికి తీసుకొచ్చావని, ఇక మాకు దూరంగా ఉండాల్సిన అవసరం ఏంటని కళ్యాణ్‌ని ప్రశ్నిస్తుంది. ఇవి మాట్లాడటానికి బాగానే ఉన్నాయని.. కానీ కళ్యాణ్ అనుకున్నట్లుగా ఇంకా మంచి పేరు సంపాదించలేదుగా అంటుంది రుద్రాణి. ఈ ఇంట్లో అమ్మతో పాటు కొందరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరని , అందరూ మనస్పూర్తిగా ఒప్పకున్న రోజున ఖచ్చితంగా ఇక్కడే ఉంటామని చెబుతాడు కళ్యాణ్. స్వప్న కూతురి బారసాల ఫంక్షన్‌ను దగ్గరుండి జరిపించాలని ఇందిర చెప్పడంతో సరే అంటాడు కళ్యాణ్.

మీ వాళ్లు అనేసరికి గ్రాండ్ అంటూ కోట్లు కుమ్మరిస్తున్నావ్.. అదే మాకైతే ముష్టివాళ్లకు వేసినట్లు చిల్లర వేస్తారంటూ రుద్రాణి మండిపడుతుంది. దీంతో రాజ్ కలగజేసుకుని దుగ్గిరాల వారి ఇంటి కోడళ్లు ఒకరు పోలీస్ అయ్యారని, మరొకరు ఈ ఇంటికి మనవరాలిని తీసుకొచ్చారని చెబుతాడు . ఇలాంటి ఆనంద క్షణాల్ని గ్రాండ్‌గా సెలబ్రెట్ చేస్తేనే మన ఇంటి పరువు నిలబడుతుందని అంటాడు. పరువు, ప్రతిష్టల గురించి రుద్రాణికేం తెలుసు.. మీరు అనుకున్నట్లుగానే ఫంక్షన్ చేయించండి అంటాడు సుభాష్. ఈ రాత్రికి ఇక్కడే ఉండి పొద్దున్నే బారసాల చూసుకుని వెళ్లొచ్చు అని కళ్యాణ్‌తో అంటుంది కావ్య. నా కూతురికి వీరంతా బారసాల జరిపించడం ఏంటని రుద్రాణితో అంటాడు రాహుల్.
రాత్రికి ముగ్గురు అక్కచెల్లెళ్లు కలిసి బారసాల ఏర్పాట్లు చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఎంత అరచుకున్నా, కొట్టుకున్నా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అలాగే ఉంటుందని కావ్య అంటుంది. ఇంతలో మీ ఆయన గుర్తొచ్చాడా అని కావ్యని స్వప్న అడుగుతుంది. అలాగే చిన్నప్పుడు చేసిన అల్లరిని వీరు గుర్తుచేసుకుంటూ ఉంటారు. అనుకున్నది సాధించడంలో మీరిద్దరూ అదృష్టవంతులని కావ్య, అప్పూలని మెచ్చుకుంటుంది స్వప్న. నేను మాత్రం ఇంటికే పరిమితమైపోయానని అనగా.. అందుకే నీకోసం బిడ్డ వచ్చిందని అంటుంది కావ్య.
ఒక తల్లికి పుట్టిన మనం, ఒకే ఇంటికి కోడళ్లం అవుతామని అనుకోలేదని చెబుతుంది కావ్య. అందుకు మీ ఇద్దరు నాకు థ్యాంక్స్ చెప్పాలని అమ్మ నన్ను ఈ ఇంటికి కోడల్ని చేయాలని అనుకున్నప్పుడే కదా నీకు రాజ్, నీకు కళ్యాణ్ పరిచయమయ్యారని అంటుంది స్వప్న. పెళ్లిళ్లు అయ్యాక ఈ ఇంట్లో గొడవలు కూడా జరిగాయని అందుకు నిన్ను తిట్టుకోవాలా అని అప్పూ సెటైర్లు వేస్తుంది. ఇంతలో పాప ఏడుపు వినిపించడంతో ముగ్గురూ బెడ్‌రూంలోకి పరిగెడతారు.

బిడ్డ ఎంతకీ ఏడుపు ఆపకపోవడంతో పాపను నాకివ్వమని అంటుంది కావ్య. తల్లిని నా వల్లే కాలేదు , నీ వల్ల అవుతుందా అని కావ్యపై మండిపడుతుంది స్వప్న. పాపతో ఏడుపు మానిపించాలంటే తల్లే కానక్కర్లేదని, తల్లితనం తెలిసిన ఏ ఆడదైనా చాలని అంటుంది కావ్య. పాపని తీసుకుని పాట పాడటంతో కావ్య ఒళ్లోనే బిడ్డ పడుకుంటుంది. ముగ్గురిని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అపర్ణతో అంటుంది ఇందిర. నేను కాపురానికి వచ్చిన కొత్తలో రాజ్‌ని ఒడిలో పెట్టుకుంటే ఓ వైపు మీరు, మరోవైపు ధాన్యలక్ష్మీలు వాడిని నెత్తిన పెట్టుకుని చూసుకునేవాళ్లని అంటుంది. అప్పుడు మన దగ్గర ఇంత ఆస్తి లేదని అయినా అందరం సంతోషంగా ఉండేవాళ్లమని గుర్తుచేసుకుంటుంది ఇందిర. కానీ ఇప్పుడు ఆ డబ్బే మన మధ్య దూరం పెంచుతుందని బాధపడుతుంది.
బెడ్‌రూంలో పుస్తకం చదువుకుంటున్న ప్రకాశం దగ్గరికి ధాన్యలక్ష్మీ వచ్చి కొడుక్కి జరుగుతున్న అన్యాయం గురించి మరోసారి చెబుతుంది. ఆస్తి విషయంలో జరుగుతున్న అన్యాయం గురించి కళ్యాణ్‌కు చెప్పమని అంటుంది. వాడి మంచితనాన్ని చేతకాని తనంలా మార్చేసి కళ్యాణ్‌ని కావ్య ఆడుకుంటోందని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. వాడు ఒప్పుకుంటే మన వాటా ఆస్తి తీసుకుని కొడుకుతో కలిసి సంతోషంగా ఉందామని చెబుతుంది. ఇది కరెక్ట్ కాదని కాస్త ఓపిక పట్టమని ప్రకాశం ఎంత చెబుతున్నా ధాన్యలక్ష్మీ వినిపించుకోదు. రాజ్ - కావ్యలు మనపై పెత్తనం చెలాయిస్తున్నారని , కళ్యాణ్ కూడా ఇక్కడికి వచ్చేస్తే వాడు కూడా అన్న కింద బతకాల్సిందేనని అంటుంది. పాప బారసాల లోపు అన్ని తేలిపోవాలని తేల్చి చెబుతుంది ధాన్యలక్ష్మీ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











