Brahmamudi February 8th Episode : బెడ్‌రూంలో రాజ్‌ని రెచ్చగొడుతోన్న కావ్య .. రగిలిపోతోన్న రుద్రాణి

తన భార్య ఎస్ఐ అయ్యిందని చెప్పడానికి అప్పూతో కలిసి దుగ్గిరాల వారింటికి వస్తాడు కళ్యాణ్. పెద్దలు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న అనంతరం ఇక్కడే ఉండిపోమ్మని అపర్ణ అంటుంది. మమ్మల్ని ఇంట్లో వాళ్లంతా మనస్పూర్తిగా రమ్మన్నప్పుడే వస్తామని కళ్యాణ్ తేల్చి చెబుతాడు. స్వప్న కూతురు బారసాల జరిగే వరకైనా ఇక్కడే ఉండమని కావ్య అడగటంతో రాత్రి ఇక్కడే ఉండటానికి ఓకే చెబుతాడు కళ్యాణ్.

స్వప్న, కావ్య, అప్పూ ఒక్కచోట చేరి చిన్నప్పటి నుంచి నేటి వరకు జరిగిన సంఘటనలపై మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో పాప ఏడవటంతో స్వప్న పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఎంతకీ పాప ఏడుపు ఆపకపోవడంతో కావ్య లాలించి నిద్ర పుచ్చుతుంది. వీళ్ల ముగ్గురిని చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయని ఇందిరతో అంటుంది అపర్ణ. ఆస్తిలో వాటా దక్కించుకునేలా కళ్యాణ్‌ని ఒప్పించమని ప్రకాశంను రెచ్చగొడుతుంది ధాన్యలక్ష్మీ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఫిబ్రవరి 8వ తేదీ .. ఎపిసోడ్ 640లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 640 February 8th 2025 Here is full story

స్వప్నకి గోరింటాకు పెడుతున్న కావ్య.. ఎవరికైనా కావాలంటే పెడతానని అంటుంది . నీకు గోరింటాకు అంటే ఇష్టం కదా వెళ్లి పెట్టించుకోమని ధాన్యలక్ష్మీకి అపర్ణ చెప్పగా.. నేను అడిగింది ఇస్తే చాలని, గోరింటాకులు ఎవడికి కావాలని అంటుంది ధాన్యలక్ష్మీ. నువ్వు పెట్టుకోవా అని అప్పూని ఇందిర అడగ్గా.. నాకు అలవాటు లేదని వద్దని చెబుతుంది. నువ్వు ఎంత పోలీస్ అయినా , ఆడపిల్లవేనని గోరింటాకు పెట్టుకుంటే చేతులు చాలా బాగుంటాయని అంటుంది ఇందిర. కళ్యాణ్ కూడా చెప్పడంతో గోరింటాకు పెట్టుకోవడానికి అప్పూ ఒప్పుకుంటుంది. నువ్వు అప్పూని బాగానే కంట్రోల్‌లో పెట్టావని కళ్యాణ్‌తో ఇందిర అనగా.. అంటే మేం భర్తల మాట వినడం లేదా అని ప్రశ్నిస్తుంది కావ్య.

నేను మీ మాట ఎప్పుడు వినలేదు అని రాజ్‌ను కావ్య అడగ్గా.. ఈ ఇంటి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అందరూ నీ మాటలే వింటున్నారని, ఇక నా మాట నువ్వేం వింటావని కౌంటర్ వేస్తాడు రాజ్. కావ్య చిన్నపిల్లే అయినా ఇంటి వ్యవహారాలు, వ్యాపారంలో ఎంతో కష్టపడుతోందని ఆమెకు మనం తోడుగా ఉండాలని చెబుతుంది ఇందిర. తర్వాత కావ్యకి గోరింటాకు పెడుతుంది ఇందిర. మీ అక్క స్వప్న పిల్లని కని మా చేతిలో పెట్టిందని , మీరిద్దరు ఎప్పుడిస్తారని కావ్యని అడుగుతుంది ఇందిర. మీరు ముగ్గురు అక్కాచెల్లెళ్లు కావడం , ఒకే ఇంటి నుంచి రావడంతో ఈ ఇల్లు ఆనందంగా ఉందని చెబుతుంది .

ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటున్న రాజ్ .. కావ్యని వాటర్ బాటిల్ అడుగుతాడు. చేతికి గోరింటాకు ఉండటంతో వాటర్ బాటిల్ ఇవ్వడానికి కావ్య ఇబ్బంది పడుతుంది. అది గమనించి ముందే చెప్పొచ్చుగా అంటాడు. మీకు బెడ్‌రూంలోనూ వర్కే కావాలా భార్య గురించి పట్టించుకోరా అని ప్రశ్నిస్తుంది కావ్య. వీపు దురద పెట్టడంతో గోడకేసి రుద్దుకుంటుంది . ఆమె ఇబ్బందిని గమనించిన రాజ్ వీపు గోకుతుండగా కావ్య పులకించి పోతుంది. అమ్మమ్మ అడిగినట్లుగా చేస్తారా కావ్య ప్రశ్నించగా.. రాజ్ అవును అని ఆన్సర్ ఇవ్వడంతో ఆమె సంతోషిస్తుంది. నేను చెప్పేది ఇంటిని హ్యాపీగా ఉంచుతానని అని రాజ్ అనగా.. కావ్య మండిపోతూ గోరింటాకు కడిగేసుకుంటుంది.

మొరటోడు కూడా సంవత్సరం తిరిగేసరికి పెళ్లాం చేతిలో పిల్లల్ని పెడుతుంటే మీరు పెద్ద కంపెనీకి సీఈవో అయ్యుండి కూడా ఏం చేయడం లేదని కావ్యపై మండిపడుతుంది రాజ్. నువ్వు ఇంట్లో గడిపిన క్షణాలు గుర్తురావడం లేదా అని కళ్యాణ్‌ని ప్రశ్నిస్తుంది అప్పూ. నాకు ప్రతిక్షణం గుర్తొస్తాయని.. ఇంట్లో వాళ్లు మన పెళ్లిని ఒప్పుకుని ఉంటే మనం ఈ రూమ్‌లోనే ఉండేవాళ్లమని చెబుతాడు కళ్యాణ్. నా వల్ల నువ్వు వీటికి దూరం కావడం నాకు మంచిగా అనిపించడం లేదని , ఒకసారి ఇంట్లో వాళ్లు చెప్పింది ఆలోచించమని అంటుంది అప్పూ. వాళ్లు అడిగినట్లుగా ఇక్కడే ఉండిపోదామని అప్పూ ప్రశ్నించగా.. అమ్మ ఈ మధ్య చాలా మారిపోయిందని అంటాడు కళ్యాణ్ .

ఇంట్లో వాళ్లు నాకు అన్యాయం చేస్తున్నారని, ఆస్తి నాకు దక్కకుండా చేస్తున్నారని, ఆస్తి కోసమే రోజూ ఇంట్లో గొడవ చేస్తోందని చెబుతాడు కళ్యాణ్. మనం ఇక్కడే ఉంటే ఆ గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయని.. ఆస్తి గురించి అడగమని చాలాసార్లు నన్ను అమ్మ బలవంతం చేసిందని చెబుతాడు కళ్యాణ్. అందరూ ఎప్పుడూ కలిసి ఉండాలనేది తాతయ్య, నానమ్మల ఆశ అని వాళ్లని బాధపెట్టలేనని.. అమ్మని ఎవరు రెచ్చగొడుతున్నారో కూడా తెలుసని అంటాడు. అమ్మ మనసు మార్చుకుని, పూర్తిగా మారిపోయాక ఈ ఇంటికి తిరిగొస్తానని చెబుతాడు కళ్యాణ్. ఆ రోజులు ఎంతో దూరంలో లేవని , నన్ను నమ్ము అని అప్పూతో అంటాడు. నానమ్మ అడిగినట్లుగా మనవడిని, మనవరాలిని ఇద్దామని కళ్యాణ్ చెప్పగా.. ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాక చూద్దాం అంటుంది అప్పూ.

దుగ్గిరాల వారింట్లో అందరూ సంతోషంగా ఉండటం చూసి తట్టుకోలేకపోతుంది రుద్రాణి. ఇంతలో అనామికకు ఫోన్ చేసి ఇంట్లో ఉన్న విషయాలన్నీ నీకు చెప్పానని అంటుంది. దుగ్గిరాల ఫ్యామిలీని ఏదో చేస్తానని, రోడ్డు మీదకి ఈడుస్తానని చెప్పావ్ ఏం చేశావని మండిపడుతుంది . నేను కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని అనామిక చెబుతుంది. వారి ఆనందాన్ని ఆవిరి చేయడానికి నేను రేపు అక్కడికి రాబోతున్నానని అంటుంది. వాళ్ల గుండెలు బద్ధలయ్యే ట్విస్ట్ ఇవ్వబోతున్నానని చెబుతుంది అనామిక. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X