Brahmamudi February 10th Episode : ఆధారాలతో దిగిన అనామిక .. బారసాలను అడ్డుకున్న ప్రకాశం

బారసాల ఫంక్షన్ కావడంతో స్వప్న, అప్పూలకి కావ్య.. కావ్యకి ఇందిర గోరింటాకు పెడతారు. కావ్య, అప్పూలను కూడా త్వరగా పిల్లల్ని కనమని ఇందిర చెప్పడంతో వారు సిగ్గుపడతారు. బెడ్‌రూమ్‌లో రాజ్‌ను టెంప్ట్ చేస్తుంది కావ్య. అయినా ఆమె ఫీలింగ్స్ అర్ధం చేసుకోకుండా పనిలో మునిగిపోవడంతో భర్తపై అలుగుతుంది కళావతి.

అందరి కోసం ఇంటిలో ఉండిపోదామని కళ్యాణ్‌ని అప్పూ అడగ్గా.. మా అమ్మ పూర్తిగా మారినరోజున నేనే ఈ ఇంటికి తిరిగొస్తానని అంటాడు. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండటం తట్టుకోలేక అనామికకు ఫోన్ చేస్తుంది రుద్రాణి. నా ఆస్తి నాకు దక్కించి, ఈ కుటుంబాన్ని రోడ్డునపడేలా చేస్తానని అన్నావ్‌ ఏమైందని అడుగుతుంది. రేపు బారసాలకు నేనొచ్చి బాంబు పేలుస్తానని చెబుతుంది అనామిక . ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఫిబ్రవరి 10వ తేదీ .. ఎపిసోడ్ 641లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 641 February 10th 2025 Here is full story

నేను సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని.. రాజ్‌ని ఎక్కడ లాక్ చేయాలో అక్కడే లాక్ చేసుకుంటూ వచ్చానని అంటుంది అనామిక. వాళ్లిద్దరూ నా గ్రిప్‌లోకి వచ్చేశారని.. అంతా నేను రాసిన స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతోందని చెబుతుంది. రేపు నేను కొట్టబోయే దెబ్బకు కుదేలైపోతుందని రుద్రాణితో అంటుంది అనామిక. ఉదయాన్నే ఊయలను డెకరేట్ చేస్తూ ఇందిరను ఆటపట్టిస్తుంది కావ్య. వీరి హడావుడిని పై నుంచి చూస్తారు రుద్రాణి - ధాన్యలక్ష్మీ.

అక్క కూతురు అనగానే ఖర్చుకు వెనకాడకుండా బారసాల ఫంక్షన్ చేస్తుందని.. అదే మనం అడిగితే అదెందుకు , ఇదెందుకు అంటుందని కావ్యపై మండిపడుతుంది రుద్రాణి. ఏం చేసుకున్నా పర్లేదని.. ప్రతి రూపాయికి నేను లెక్క అడుగుతానని అంటుంది ధాన్యలక్ష్మీ. ఫంక్షన్ నీ మనవరాలిది.. నువ్వు ఏ చలనం లేకుండా ఉన్నావేంటి అని రుద్రాణిని ప్రశ్నిస్తుంది. నాకు అంత ఛాన్స్ ఎక్కడిస్తారు ఈ అక్కచెల్లెళ్లు, ఆ ముసల్ది చేసుకుంటున్నారుగా అంటుంది రుద్రాణి.

ఫంక్షన్‌కు రెడీ అవ్వకుండా ఫోన్ మాట్లాడుతున్న రాహుల్‌ దగ్గరికి రాజ్ - కళ్యాణ్ వస్తారు. పదే పదే నా కూతురు అని నన్ను అంకుల్‌ని చేయొద్దని అంటాడు రాహుల్. నువ్వు అంకుల్‌వి కాక రొమియో అనుకుంటున్నావా అంటూ వాడిపై మండిపడతారు రాజ్ - కళ్యాణ్. ఇంతలో కనకం రాగా.. మనవరాలికి బంగారు వడ్డాణం, నెక్లెస్ తీసుకొస్తావని అనుకుంటే పూలు, పండ్లు తీసుకొచ్చావ్ అంటుంది రుద్రాణి. బంగారం పెట్టే స్తోమత నాకు లేదని మీకు తెలుసునని.. పెట్టే స్తోమత ఉన్నా మీరు పెట్టలేరని మీకు తెలుసునని కౌంటర్ వేస్తుంది కనకం. మనిద్దరి పరిస్ధితి ఒకటేనని కాకపోతే నేను పూరి గుడిసెలో ఉంటున్నానని, మీరు బంగ్లాలలో ఉంటున్నారని అంటుంది.

మనవరాలిని చూసుకుని మురిసిపోతుంది కనకం. రేపు మన బిడ్డ బారసాల ఫంక్షన్‌కు కూడా ఇలాగే డెకరేట్ చేయమని అప్పూతో అంటాడు కళ్యాణ్. ఇప్పటి వరకు ఎస్ఐ కావాలి కాబట్టి దాని కోసం కష్టపడ్డామని, ఇకపై పిల్లలపై దృష్టి పెడదామని అంటాడు. అప్పూకి పోలీస్ డ్యూటీ తప్పించి ఏమీ గుర్తుండదని చెబుతుంది అపర్ణ. మీ చేతుల మీదుగానే బిడ్డని ఊయలలో వేయమని అపర్ణ, కనకం, స్వప్నలు ఇందిరను అడుగుతారు. పాపను ఊయలలో వేస్తుండగా ప్రకాశం ఆగండి అని చెప్పి కౌంట్‌డౌన్ స్టార్ట్ చేస్తాడు. మంచి ఘడియలు రాగానే పాపని ఊయలలో వేసి ఊపుతుంటారు.

ఇంతలో అనామిక రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాకవుతుంది. నిన్ను ఎవరు పిలిచారు? ఎందుకొచ్చావ్? అని అనామికపై మండిపడతారు. అమాయకులను మేల్కోలిపేందుకు నేనే వచ్చానని అంటుంది అనామిక. ఇక్కడున్న అంతా అమాయకులేనని ఓ ఇద్దరు తప్ప అంటూ సెటైర్లు వేస్తుంది. ఆ ఇద్దరు ఎవరని రుద్రాణి అడగ్గా.. రాజ్ - కావ్య అని అంటుంది అనామిక. అసలు మీ కుటుంబంలో, మీ కంపెనీలో, దుగ్గిరాల వారి వంశానికి ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసా అని ప్రశ్నిస్తుంది.

ఆ మాటలతో ఇందిర మండిపడుతుంది. అందరూ సంతోషంగా ఉన్నప్పుడు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావని అనామికపై రగిలిపోతుంది. దుగ్గిరాల వారికి ఏమాత్రం సంబంధం లేని నువ్వు ఇలా రావడం మాకు ఇబ్బందిగా ఉందని ఇందిర, కావ్య, రాజ్ మండిపడతారు. అసలు ఏం చెప్పాలని వచ్చిందో తెలుసుకుని పంపించేద్దామని అందరికి నచ్చజెబుతుంది రుద్రాణి. ఈ ఇంట్లో రాజ్ - కావ్య కలిసి ఎంత పెద్ద రహస్యం దాచారో? అందరి కళ్లకు ఎలా గంతలు కట్టారో తెలుసా అని అంటుంది అనామిక.

నువ్వు వెళ్తావా? మెడపట్టి గెంటించమంటావా అంటూ కావ్య మండిపడుతుంది. నువ్వు నీ భర్తతో కలిసి ఇంతమందిని మోసం చేశావని తెలిస్తే నిన్ను ఛీ కొడతారని భయంగా ఉందా అని ప్రశ్నిస్తుంది అనామిక. నా కూతురిని ఛీకొట్టేంత తప్పు ఏం చేసిందని అనామికని కనకం నిలదీస్తుంది. ఇంతదూరం పనిగట్టుకుని వచ్చింది కాబట్టి.. అది మంచిదో , చెడ్డదో తేలిపోతుందని అంటుంది ధాన్యలక్ష్మీ. ఈ ఇంట్లో తిండిపైనా, డబ్బుపైనా, చివరికి కారులో బయటికి వెళ్లాలన్నా కావ్య ఆంక్షలు పెట్టింది కదా అని చెబుతుంది అనామిక. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X