Brahmamudi February 12th Episode : రాజ్- కావ్యలని కాపాడిన సుభాష్ .. నడిరోడ్డు మీదకి దుగ్గిరాల ఫ్యామిలీ
కావ్య - రాజ్‌లు 100 కోట్లు అప్పు చేశారని అనామిక చెప్పడంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. మీరంతా రోడ్డు మీదకు వచ్చినప్పుడే నాకు మనశ్శాంతి అని మళ్లీ ఆరోజు వస్తానంటూ అనామిక వెళ్లిపోతుంది. 100 కోట్లు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందని ఇంట్లో వాళ్లు కావ్య - రాజ్‌లను నిలదీస్తారు. జరిగిన దానికి పూర్తి బాధ్యత నాదేనని కళావతికి ఏం సంబంధం లేదని అంటాడు రాజ్. మన ఆస్తులు ఎక్కడికి పోలేదని.. కానీ అప్పు మాత్రం నిజమేనని ఒప్పుకుంటాడు. త్వరలోనే అప్పుకట్టేసి, మీ ప్రశ్నలకు సమాధానం చెబుతానని వెళ్లిపోతాడు.
రాజ్ - కావ్యలు ఏదో పెద్ద ఆపదలో ఉన్నారని .. అదేంటో కనుక్కోవాలని అపర్ణతో అంటాడు రాజ్. అన్నయ్య - వదినలకు సాయం చేయాలని ప్రకాశంతో కళ్యాణ్ అంటుండగా ధాన్యలక్ష్మీ వచ్చి మండిపడుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ చుట్టూ అష్ట దిగ్బంధనం చేసేశానని.. ఏటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియక కొట్టుకుంటారని సామంత్‌తో అంటుంది కావ్య. రేపు బ్యాంకు వాళ్లు దుగ్గిరాల వారింటికి వెళ్లి ఆస్తిని జప్తు చేస్తారని చెబుతుంది. ఇక ఫిబ్రవరి 12వ తేదీ .. ఎపిసోడ్ 643లో ఏం జరిగిందంటే..

ఇప్పటికైనా కళ్లు తెరిచి మన వాటా మనం తీసుకుని ఇక్కడి నుంచి బయటపడటం మంచిదని , లేదంటే ఆ 100 కోట్ల అప్పు మన మెడకి చుట్టుకుని రోడ్డున పడాల్సి వస్తుందని అంటుంది ధాన్యలక్ష్మీ. అమ్మ అలా మాట్లాడుతుంటే నువ్వు ఏం మాట్లాడవేంటీ అని ప్రకాశంను ప్రశ్నిస్తాడు కళ్యాణ్. ఇన్నిరోజులు మా అన్నయ్య దారిలో నడిచి తప్పు చేశానేమో అనిపిస్తోందని.. ఇప్పుడు నువ్వు కూడా అదే తప్పు చేస్తున్నావని అంటాడు ప్రకాశం. నిన్ను తప్పుపట్టలేనని.. అలాగని మీ అమ్మని బాధపెట్టలేనని, మీ అమ్మ చెప్పింది కూడా ఒకసారి ఆలోచించమని కళ్యాణ్‌కి చెబుతాడు ప్రకాశం.
100 కోట్ల అప్పంటే మన ఆస్తులు అమ్మినా సరిపోవని స్వప్నతో అంటుంది రుద్రాణి. చివరికి మా నాన్న నీకిచ్చిన ఆస్తిని కూడా అమ్మేయాల్సి వస్తుందని చెబుతుంది . రుద్రాణి మాటలతో స్వప్న కూడా ఆలోచనలో పడుతుంది. ఆసుపత్రిలో తనను చూడటానికి వచ్చిన ఇందిరను చూసి ఎందుకలా ఉన్నావని అడుగుతాడు సీతారామయ్య. నేను చావునే గెలిచానని, నా గుండె గట్టిదని ఏం జరిగిందో చెప్పని అడుగుతాడు. నువ్వు కోమాలోకి వెళ్లిన తర్వాత మన ఇల్లు , ఇల్లులా లేదని అంటుంది ఇందిర.
నువ్వు కావ్య పేరు మీద ఆస్తి రాయడంతో మేం కూడా ఇంటి బాధ్యతలన్నీ తన పేరిట రాశామని తర్వాత ఇంట్లో ఏం జరిగిందో అంతా పూసగుచ్చినట్లు చెబుతుంది ఇందిర. ఇంట్లో కావ్య ఎందుకు ఆంక్షలు పెట్టిందో అసలు నిజం తెలిసిందని అంటుంది. రాజ్ - కావ్యలు కలిసి రూ.100 కోట్ల అప్పు చేశారని ఇందిర చెప్పడంతో సీతారామయ్య షాక్ అవుతాడు. ఈ విషయం బయటపడటంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీలు ఇంట్లో గొడవలు సృష్టిస్తున్నారని అంటుంది.
పోలీస్ స్టేషన్‌లో దొంగతనం చేసినవాడిని చితక బాదుతాడు రాజ్‌కి తెలిసిన ఎస్ఐ. దీనిని చూసిన అప్పూ అసలు దొంగని పట్టుకుంటుంది. నేను మీ బావగారు రాజ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎస్ఐ చెప్పడంతో అదంతా మీరు బయట చూసుకోండి అని అంటుంది అప్పూ. రాజ్ - కావ్యలు ఆఫీసుకు వెళ్తుండగా బ్యాంక్ వాళ్లు డైరెక్ట్‌గా ఇంటికొస్తారు. ఎవరు మీరు సరాసరి లోపలికి వచ్చేస్తున్నారు బయటికి వెళ్లమంటుంది రుద్రాణి. మేం కాదు మీరు బయటికి వెళ్లే సమయం వచ్చిందని బ్యాంక్ వాళ్లు చెప్పడంతో అంతా షాక్ అవుతారు.
గడువు సమయం ముగిసినా అప్పు తీర్చకపోవడంతో మీ ఆస్తులను జప్తు చేస్తున్నట్లు చెప్పడంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. వాళ్లు చేసిన అప్పుతో మాకేం సంబంధం లేదని రుద్రాణి, ధాన్యలక్ష్మీ అనడంతో ఆస్తంతా కావ్యగారి పేరుతో ఉందని బ్యాంక్ వాళ్లు అంటారు. ఇంత దూరం ఎందుకొచ్చింది నేను ఎన్నోసార్లు అసలు నిజం చెప్పమని అడిగానని మండిపడుతుంది అపర్ణ. ఆ డబ్బంతా ఎక్కడెక్కడ దాచి పెట్టారు? ఎవరెవరి పేరుతో ఏయే బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు? అని అడుగుతుంది రుద్రాణి.
ఇదంతా చూసిన సుభాష్ .. నా కొడుకు - కోడలు ఏ తప్పు చేయలేదని అనడంతో అంతా షాక్ అవుతారు. నిజంగానే మీ దగ్గర రాజ్ - కావ్యలు అప్పు చేశారా అని బ్యాంక్ వాళ్లను అడగ్గా వాళ్లు లేదు అని చెబుతారు. మీరు అనుకున్నట్లు కోట్లకు కోట్లు ఆస్తుల్ని కూడబెట్టలేదని , ఎవరి పేరు మీదా బ్యాంక్‌ల్లో జమ చేయలేదని సుభాష్ అంటాడు. మరి ఇదంతా ఏంటీ అని ప్రకాశం అడుగుతాడు. నాన్నగారు నంద కంపెనీకి రూ.100 కోట్లు ష్యూరిటీ కింద సంతకం చేశారని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఆ కంపెనీ బోర్డు తిప్పేస్తే నాన్నగారు ఇచ్చిన మాట నిలబెట్టడానికి ఆ అప్పు తీర్చే బాధ్యత నా కొడుకు కోడలు వాళ్ల భుజాన వేసుకున్నారని చెబుతాడు సుభాష్.
నిన్న రాత్రే ఆ విషయాలన్నీ తెలిశాయని సుభాష్ అనడంతో.. అందుకేనా ఈ ఇంట్లో ఎవరు అడిగినా నిజం చెప్పలేదని అపర్ణ అంటుంది. నా కొడుకు కోడలు ఈ ఇంటి పెద్ద ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం అడ్డమైన వాళ్లు ఎన్ని మాటలన్నీ పడ్డారని అంటుంది. వాళ్లకున్న ఇంగిత జ్ఞానం నాతో సహా ఎవరికీ లేదని .. వ్యక్తిత్వంలో వాళ్ల కాళ్ల గోటికి కూడా సరితూగరని ప్రశంసిస్తుంది అపర్ణ. పెద్ద త్యాగం చేశారులే.. మా నాన్నకి తెలివి లేక ఎవడికో పుట్టినవాడికి 100 కోట్లకు ష్యూరిటీ సంతకం పెట్టాడని అంటుంది రుద్రాణి.
వాడెవడో మోసం చేసిపోతే.. ఈ జంట పెద్దాయన మాట కోసం కుటుంబాన్నే రోడ్డు మీదకి లాగాలని అనుకుందని చెబుతుంది రుద్రాణి. అదంతా మాకు అనవసరమని మా వాటా ఆస్తి మాకు ఇచ్చి ఏదైనా చేసుకోమని అంటుంది ధాన్యలక్ష్మీ. ఆస్తులకన్నా నాన్నగారి మాటే మాకు ముఖ్యమని.. తలా ఓ ఉద్యోగం చేసుకుని బతుకుదామని అంటాడు సుభాష్. దీంతో అంతా గొడవ పడుతుండగా.. సీతారామయ్య వచ్చి ఆపండి అని గట్టిగా అరుస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










