Brahmamudi February 13th Episode : దుగ్గిరాల వారి ఆస్తుల జప్తు ... ఇంటిని పట్టుకుని సీతారామయ్య కంటతడి
మన ఆస్తి మనం తీసుకోకుంటే 100 కోట్ల అప్పు మన మీద పడుతుందని కళ్యాణ్, ప్రకాశంలను హెచ్చరిస్తుంది ధాన్యలక్ష్మీ. ప్రకాశం కూడా ఈమె చెప్పిన మాటలతో ఆలోచిస్తాడు. మీ చెల్లి ఆస్తులన్నీ అమ్మేస్తుందని స్వప్నను కూడా తన వైపుకు తిప్పుకోవాలని అనుకుంటుంది రుద్రాణి. ఆసుపత్రిలో ఉన్న సీతారామయ్యకి ఇంట్లో జరుగుతున్న పరిణామాలు, 100 కోట్ల అప్పు గురించి చెబుతుంది ఇందిర. పోలీస్ స్టేషన్‌లో దొంగతనం చేసిన వాడిని పట్టుకుని తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది అప్పూ.
ఉదయాన్నే బ్యాంక్ వాళ్లు దుగ్గిరాల వారింటికి వచ్చి గడువు ముగిసిందని అప్పు కట్టకపోవడంతో మీ ఆస్తుల్ని జప్తు చేస్తున్నట్లు చెప్పడంతో అంతా షాక్ అవుతారు. రాజ్ - కావ్యలను నానామాటలు అనడంతో 100 కోట్ల ష్యూరిటీ సంగతి చెబుతాడు సుభాష్. మా ఆస్తుల్ని మాకు పంచి మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోమ్మని ధాన్యం, రుద్రాణి అంటారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఫిబ్రవరి 13వ తేదీ .. ఎపిసోడ్ 644లో ఏం జరిగిందంటే..

ఇంట్లో జరుగుతున్న గొడవను చూసి మండిపడతాడు సీతారామయ్య. ఇన్నాళ్లు మీరంతా నా కుటుంబం అనుకున్నానని.. మీ స్వార్ధం కోసం నా పరువు తీస్తారా అని ప్రశ్నిస్తాడు. మా పరువు మర్యాదలే మీకు అక్కర్లేనప్పుడు, మీరు నాకు అక్కర్లేదు అనడంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీ షాక్ అవుతారు. నాకు ఎవ్వరితోనూ పనిలేదని, ఎవరి అనుమతి నాకు అక్కర్లేదని మన ఆస్తులన్నీ అమ్మేసి బ్యాంక్ వాళ్లకి కట్టేయమని రాజ్‌కు చెబుతాడు సీతారామయ్య. అదేంటి మామయ్యగారు మీ వారసులు ఏమైపోయినా పర్లేదా అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది.
మీ మామయ్య పరువు మర్యాదలు అక్కర్లేనప్పుడు మీరు మా వారసులు ఎలా అవుతారని ఇందిర ప్రశ్నిస్తుంది. తాతయ్య చెప్పినట్లే చేయమని రాజ్‌తో అంటుంది. దీంతో ఆస్తి తాలుకా డాక్యుమెంట్స్‌ని మాకు అప్పగించాలని బ్యాంక్ వాళ్లు అడగటంతో అవన్నీ లాకర్‌లో ఉన్నాయని రేపు ఇస్తానని చెబుతాడు రాజ్. ఆస్తి మొత్తం చేజారిపోవడంతో రాహుల్ - రుద్రాణిలు ఓ చోట కూర్చొని ఏడుస్తుంటారు. ముసలోడు సరిగ్గా టైమ్‌కి వచ్చి మొత్తం చెడగొట్టాడని మండిపడుతుంది .
ఇంతలో స్వప్న వచ్చి రుద్రాణి చేతిలో బొచ్చె పెడుతుంది. అందమైన ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలని అనుకున్నారని, అమాయకుల్ని మీ వలలో వేసుకుని ఇల్లు గుల్ల చేయాలని అనుకున్నారని స్వప్న మండిపడుతుంది. కర్మ ఈ కాలంలో స్పాట్‌లోనే ఎఫెక్ట్ చూపెడుతోందని.. మీరు చేసిన దానికి మిగిలింది ఈ బొచ్చె మాత్రమేనని అంటుంది. ఒకసారి మీరు ఆడుక్కుంటుంటే చూడాలని ఉందని చెప్పడంతో రుద్రాణి - రాహుల్‌లు ఆడుక్కుంటుంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటారు.
మేం ఆడుక్కుతింటే నువ్వు ఎలా బతుకుతావని స్వప్నని ప్రశ్నిస్తుంది. నేను పుట్టినప్పటి నుంచి ఒకరి మీద ఆధారపడి బతకలేదని, మోడలింగ్ నేర్చుకున్నానని ఆ పని చేసుకుంటూ బతుకుతానని అంటుంది స్వప్న. మీ అమ్మ మాటలు వింటే పాడైపోతావని తొలి నుంచి నేను మొత్తుకుంటేనే ఉన్నానని.. ఇప్పటికైనా మనిషిలా మారి నాతో కలిసి బతుకు అంటుంది స్వప్న. ఆ ముసలోడు చేసిన పనికి మన ఫ్యూచర్ అలానే ఉంటుందా అని రుద్రాణిని రాహుల్ అడుగుతాడు.

అపర్ణ, ఇందిర, ప్రకాశం, సుభాష్‌లు ఒక చోట కూర్చొని బాధపడుతుంటారు. ఇంతకుముందు మేం చూడని ప్రకాశాన్ని చూస్తున్నామని , నీలో మార్పు కనిపిస్తోందని అంటుంది అపర్ణ. మన ముందు తరాల వాళ్లు కానీ, నాన్న కానీ ఎప్పుడైనా మాట తప్పడం చూశామా అని ప్రకాశంను ప్రశ్నిస్తాడు సుభాష్. కానీ మనం ఏం చేస్తున్నాం.. ఆస్తుల కోసం కొట్టుకుంటున్నామని అంటాడు. ఇది దుగ్గిరాల కుటుంబానికి పట్టిన చెదలు వంటిదని చెబుతాడు సుభాష్. మనుషులు సంతోషంగా బతకడానికి అనుబంధాలు, అప్యాయతలే కానీ.. ఆస్తులు, అంతస్తులు కాదని అంటుంది అపర్ణ.
కళ్యాణ్ భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నానని అంటాడు ప్రకాశం. న్యాయంగానే అడిగి ఆస్తిలో వాటా తీసుకుందామని అనుకున్నామని చెబుతాడు. మనకి నాన్న నేర్పించింది క్రమశిక్షణ, విలువలని అంటాడు సుభాష్. హాస్పిటల్ నుంచి రాగానే వినకూడని మాటలు వినగానే ఆయన మనసు విరిగిపోయిందని అంటుంది ఇందిర. వీళ్ల కోసమా నేను కష్టపడిందని బాధపడ్డాడని, ఆ కష్టం తన బిడ్డలకు రాకూడదని జాగ్రత్త పడ్డాడని చెబుతుంది. ధాన్యలక్ష్మీ ఆ రుద్రాణిల వల్లే ఇంట్లో ఇంత జరుగుతుందని అపర్ణ అంటుంది. ధాన్యలక్ష్మీ , ప్రకాశంల వల్ల ఏ తప్పూ జరగలేదని.. ఆ ఒక్క కలుపు మొక్క వల్లే పచ్చని కుటుంబంలో చిచ్చు రేగిందని చెబుతుంది.
ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారని రాజ్‌ని కావ్య అడుగుతుంది. మన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ని తీసుకురావడానికి వెళ్తున్నానని అంటాడు రాజ్. ఈ సమస్య నుంచి బయటపడటానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేశామని.. కానీ ఎందుకు ఫెయిల్ అయ్యామో అర్ధం కాలేదని అంటుంది కావ్య. ఆ నందగాడు దొరికిపోయాడని అనుకున్నామని.. కానీ వాడి వెనకుండి కథ నడిపిస్తున్న వాళ్లు వాడినే లేకుండా చేశారని బాధపడుతుంది కావ్య.
ఇంటికి పెద్ద దిక్కు అని కూడా చూడకుండా రుద్రాణి, ధాన్యలక్ష్మీలు అలా మాట్లాడటం చూడలేకపోయానని అంటుంది కావ్య. తాతయ్యని ఎలాగో సంతోష పెట్టలేకపోయామని, కనీసం ఆయన మాటనైనా నిలబెడదామని కావ్యతో అంటాడు రాజ్. ఇంటిని కోల్పోతున్నామని తెలిసి సీతారామయ్య, ఇందిరలు గోడలను పట్టుకుని ఏడుస్తుంటారు. ఆస్తి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదని , వీళ్లకు మాత్రం ఆస్తే ముఖ్యమైందని బాధపడతాడు సీతారామయ్య. వస్తూ ఏమీ తీసుకురాలేదని, పోతూ పట్టుకుపోయేది లేదని మనమే పిల్లల గురించి ఎక్కువ ఆశలు పెట్టుకున్నామని అంటుంది ఇందిర.

కళ్యాణ్ క్యారియర్ తీసుకుని పోలీస్ స్టేషన్ లోపలికి వస్తుండగా లేడీ కానిస్టేబుల్ అడ్డుకుంటుంది. మా మిసెస్‌కు భోజనం ఇద్దామని వచ్చానని అంటాడు. మీ ఎస్సై మేడం మెడలో మూడు ముళ్లు వేసింది నేనే అనడంతో లేడీ కానిస్టేబుల్ సంతోషపడుతుంది. ఆ మాటలు విని అప్పూ బయటికొస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











