Brahmamudi February 14th Episode : బతికే ఉన్న నంద .. రంగంలోకి అప్పూ , కట్టుబట్టలతో దుగ్గిరాల ఫ్యామిలీ
ఇంట్లో ఆస్తుల కోసం, తన మాటను కూడా పక్కనపెట్టేయడం చూసిన సీతారామయ్య మనసు విరిగిపోతుంది. నా మాటను పట్టించుకోనప్పుడు, మీరూ నాకు అక్కర్లేదని రాజ్‌కి చెప్పి మొత్తం ఆస్తులన్నీ బ్యాంక్ వాళ్లకి ఇచ్చేయమని చెబుతాడు. సీతారామయ్య నిర్ణయంతో అంతా షాక్ అవుతారు. ఇక తమ చేతికి చిప్పేనంటూ రుద్రాణి - రాహుల్‌లు ఏడుస్తుండగా స్వప్న వచ్చి సెటైర్లు వేస్తుంది. ఇకనైనా మీ అమ్మ మాటలు వినకుండా మంచిగా బ్రతుకమని రాహుల్‌తో అంటుంది .
ఇందిర, అపర్ణ, సుభాష్, ప్రకాశంలు ఒక చోటికి చేరి ఆస్తుల జప్తు గురించి మాట్లాడాకుంటూ ఉంటారు. నువ్వు మారిపోయావని, ఇంట్లో బంధాల కంటే నీకు ఆస్తులు ఎక్కువైపోయాయని ప్రకాశంతో అంటారు. ఇందులో ప్రకాశం, ధాన్యలక్ష్మీల తప్పు లేదని రుద్రాణి అనే కలుపు మొక్కవల్లే ఇదంతా జరిగిందని అపర్ణ అంటుంది. బ్యాంక్ నుంచి ఆస్తి పత్రాలు తీసుకురావడానికి రాజ్ బయల్దేరతాడు. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు జప్తు కాబోతుండటంతో సీతారామయ్య ఇంటి గోడలను పట్టుకుని ఏడుస్తుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఫిబ్రవరి 14వ తేదీ .. ఎపిసోడ్ 645లో ఏం జరిగిందంటే..

క్యారియర్ తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వస్తాడు కళ్యాణ్. అది చూసిన అప్పూ షాక్ అవుతుంది. నువ్వు తీసుకురావడం ఏంటీ అని అడగ్గా.. ప్రేమ ఉంటే ఏ పనైనా చేయొచ్చు అనడంతో అక్కడే ఉన్న లేడీ కానిస్టేబుల్స్ కళ్యాణ్‌ను మెచ్చుకుంటారు. ఎగ్జిబిషన్‌లో స్టాల్‌ని అదిరిపోయేలా రెడీ చేసిన శృతి దానిని వీడియో తీస్తుంటుంది. ఇంతలో నందగోపాల్ పోలీకలతో ఉన్న ఓ వ్యక్తి దానికి అడ్డు రావడంతో శృతి అతనిని తప్పుకోమంటుంది.
బట్టలు సర్దుతూ కనిపించిన ధాన్యలక్ష్మీని చూసి ప్రకాశం షాక్ అవుతాడు. రేపు ఆస్తులన్నీ బ్యాంక్ వాళ్లకి అప్పగించేస్తారు.. తర్వాత వాళ్లు మనల్ని బయటికి గెంటేస్తారు , అంతకంటే ముందే పెట్టే బేడా సర్దేస్తున్నానని అంటుంది . నువ్వు, ఆ రుద్రాణి తప్ప అంతా ఈ ఇల్లు గుల్ల కావాలని కోరుకుంటున్నారని మండిపడతాడు ప్రకాశం. ఎలా ఉండే దానికి ఎలా మారిపోయావ్.. మా నాన్నకే ఎదురుచెప్పే స్థాయికి దిగజారిపోయావని ఫైర్ అవుతాడు.

ఎవడో చేసిన మోసానికి మన కుటుంబం రోడ్డున పడుతుందని రాజ్‌తో చెప్పి బాధపడుతుంది కావ్య. ఎగ్జిబిషన్ కోసం స్టాల్ రెడీ అయినట్లుగా కావ్యకి శృతి ఫోన్ చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను పంపి చూడమని అంటుంది. ఆ వీడియోను చూస్తుండగా నందగోపాల్ పోలికలతో ఉన్న ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. ఫైల్స్ చూస్తున్న రాజ్ దగ్గరికి పాలు తీసుకుని కావ్య వస్తుంది. ఏ డాక్యుమెంట్ ఏ ప్రాపర్టీకి సంబంధించినదో క్లియర్‌గా ఓ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నానని అంటాడు రాజ్. బ్యాంక్ వాళ్లకి జీతాలు ఇస్తోందిగా .. వాళ్ల పని కూడా మనమే చేసి పెట్టాలా అంటూ మండిపడుతుంది కావ్య.
తాతయ్య గారు ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని , ఎవడో మోసం చేస్తే వాడికి బదులుగా మనం ఇవ్వాల్సి వస్తోందని బాధపడుతుంది కావ్య. తాతయ్య మాట కోసం ఏం జరిగినా పర్లేదని అంటాడు రాజ్. అసలు నందగాడే బతికి ఉంటే మనకి ఈ పరిస్ధితి వచ్చేది కాదని చెబుతాడు . మీరు కూడా మీ తాతయ్యలాగే ఆలోచిస్తున్నారని.. ఎంత మంచిగా ఉన్నా మనకి మంచి జరగడం లేదుగా అని బాధపడుతుంది. ఇంతలో కావ్యకి శృతి ఫోన్ చేసి ఎగ్జిబిషన్‌లో స్టాల్ రెడీ చేశామని ఆ వీడియోని ఒకసారి చూడమని అంటుంది. పాపం రేపు ఈ కంపెనీని కూడా బ్యాంక్ వాళ్లకి ఇచ్చేస్తున్నామని తెలియక వీళ్లంతా బిజీబిజీగా పనిచేస్తున్నారని అంటుంది కావ్య.
కంపెనీని బ్యాంక్ వాళ్లకి హ్యాండ్ ఓవర్ చేసినా వేరే వాళ్లు కొనుక్కునే వరకు మనమే దానిని నడిపించాలని చెబుతాడు రాజ్. వాళ్లని ఉన్నపళంగా ఉద్యోగంలో నుంచి తీసేస్తే వాళ్లంతా రోడ్డునపడతారని బాధపడతాడు. శృతి పంపిన వీడియోలో నంద పోలికలతో ఉన్న వ్యక్తిని చూసి కావ్య షాకై , రాజ్‌కి చూపిస్తుంది. నంద మన కళ్ల ముందే చచ్చాడు కదా? వీడు ఎలా బ్రతికాడో తెలియడం లేదని అంటుంది కావ్య. ఒకసారి మా ఫ్రెండ్ ఎస్ఐకి ఫోన్ చేసి ఇప్పుడే కనుక్కుంటానని రాజ్ ఫోన్ చేయబోతుండగా కావ్య ఆపుతుంది.

నిజంగా నంద చనిపోయి ఉంటే అప్పుడే పోస్ట్‌మార్టానికి పంపించేవాళ్లని, రిపోర్ట్ కూడా వచ్చేదని అలా జరగలేదంటే నంద బతికే ఉన్నాడని చెబుతుంది. నా ఫ్రెండ్ నాకు అబద్ధం చెప్పాడా అని ఇద్దరూ షాక్ అవుతారు. అంటే మీ ఫ్రెండ్ డబ్బుకి ఆశపడి ఎవరితోనో చేతులు కలిపాడని కావ్య చెబుతుంది. ఇదంతా ప్లాన్ ప్రకారం చేసిందేనని, దీని వెనుక ఎవరో ఉన్నారని రాజ్ అంటాడు. ఎలా తెలుసుకోవాలని అనుకుంటుండగా వాళ్లకి అప్పూ గుర్తోస్తుంది. వెంటనే ఆమెను కలిసి జరిగినదంతా చెబుతారు. నంద దొరక్కపోతే మన ఆస్తిని బ్యాంక్ వాళ్లు జప్తు చేస్తారని చెప్పడంతో అప్పూ షాక్ అవుతుంది. నేను చూసుకుంటానని, మీరేం భయపడొద్దని అంటుంది అప్పూ.
ఎస్ఐకి తెలియకుండా కాల్ ట్యాప్ చేయించి రికార్డింగ్స్ అన్ని వింటుంది. అందులో నందని ఎస్ఐ డబ్బు అడుగుతున్నట్టుగా ఉండటంతో అప్పూ షాకవుతుంది. ఇంతలో లీవ్ కావాలని ఎస్ఐ రావడంతో వాడికి పర్మిషన్ ఇచ్చి ఫాలో అవుతుంది. మరోవైపు.. ఆస్తుల జప్తు కోసం బ్యాంక్ వాళ్లు దుగ్గిరాల వారింటికి వస్తారు. ఆస్తులన్నీ లెక్కించిన కట్టాల్సిన దానికి సరిపోకపోవడంతో బంగారం, వెండి, విలువైన వస్తువులు, షేర్లు అన్నీ కావాలని అడుగుతారు. మీ ఒంటిపై ఉన్న బంగారం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని చెబుతారు బ్యాంక్ వాళ్లు.
మంగళ సూత్రాలు తప్పించి మొత్తం మీ ముందు పెట్టామని ఇందిర చెప్పడంతో అంతా బాధపడతారు. ఇంతలో స్వప్న వెళ్లి తన నగలను , తాతయ్య ఇచ్చిన ఆస్తి తాలుకా పత్రాలను కూడా ఇవ్వడంతో అందరూ షాక్ అవుతారు. అవి ఎందుకు ఇస్తున్నావని రాహుల్ అడగ్గా.. ఒకప్పుడు డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నానని కానీ నాకు , నా బిడ్డకు ఆస్తి రాసిచ్చారని అంటుంది స్వప్న. బంధాలకు వాళ్లు ఎంత విలువ ఇస్తారో చూశాక నాకేం సంబంధం లేనట్లు ఉండలేకపోతున్నానని అంటుంది. ధాన్యలక్ష్మీ సగం నగలే ఇచ్చిందని రుద్రాణి చెప్పడంతో నగలన్నీ తీసుకురమ్మని చెబుతారు బ్యాంక్ వాళ్లు. ఇంపోర్టెడ్ వాచ్ కూడా కావాలని అడగటంతో అది కూడా తీసి ఇచ్చేస్తాడు సుభాష్. నందని పట్టుకున్నావా? లేదా? అని అప్పూకి ఫోన్ చేస్తుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











