Brahmamudi February 15th Episode : దుగ్గిరాల వారి పరువు కాపాడిన అప్పూ .. సీతారామయ్య కంటతడి

అప్పూ కోసం క్యారియర్ తీసుకుని స్టేషన్‌కు వచ్చిన కళ్యాణ్‌ను లేడీ కానిస్టేబుల్ మెచ్చుకుంటుంది. బట్టలు సర్దుకుంటున్న ధాన్యలక్ష్మీని ప్రకాశం వచ్చి నువ్వు ఈ జన్మకు మారవు అంటూ మండిపడతాడు. ఎవడో చేసిన మోసానికి మన కుటుంబం రోడ్డున పడుతోందని రాజ్‌తో చెప్పుకుని బాధపడుతుంది కావ్య. స్టాల్‌కు సంబంధించిన వీడియోను శృతి .. కావ్యకు పంపుతుంది. దానిని చూస్తుండగా నందగోపాల్ కనిపించడంతో రాజ్- కావ్యలు షాక్ అవుతారు. నంద చనిపోలేదని.. ఆ ఎస్ఐ ఎవరితోనే చేతులు కలిపి మనల్ని మోసం చేశాడని ఇద్దరూ అనుకుంటారు.

నంద గురించి అప్పూకి కావ్య - రాజ్‌లు చెప్పడంతో కుటుంబం కోసం ఆమె ఎస్ఐ కాల్ రికార్డింగ్స్ చేయిస్తుంది. నందతో ఎస్ఐ మాట్లాడినట్లు తేలియడంతో అతనిని ఫాలో చేస్తుంది. బ్యాంక్ వాళ్లకి ఆస్తి తాలుకా పత్రాలు, ఒంటి మీదున్న బంగారం సహా ఇచ్చేస్తారు దుగ్గిరాల కుటుంబ సభ్యులు. తాతయ్య తనకు ఇచ్చిన ఆస్తిని , బంగారాన్ని కూడా బ్యాంక్ వాళ్లకి ఇచ్చేస్తుంది స్వప్న.
ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఫిబ్రవరి 15వ తేదీ .. ఎపిసోడ్ 646లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 646 February 15th 2025 Here is full story

నందగోపాల్ దొరికాడా లేదా అని అప్పూకి ఫోన్ చేస్తుంది కావ్య. ఎట్టి పరిస్ధితుల్లోనూ వాడిని పట్టుకుని మన ఇంటికి తీసుకురావాలని చెబుతుంది. ఇంతలో రాజ్ వచ్చి ఏమైంది అని కావ్యని అడుగుతాడు. తాతయ్య మంచి మనసుతో ష్యూరిటీ పెడితే ఇలా జరిగిందని ఎంతో బాధపడుతున్నారని అంటాడు. ఇచ్చిన మాట కోసం సర్వస్వం వదులుకోవడానికి సిద్ధపడ్డ నిన్ను చూస్తే గర్వంగా ఉందని నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానని సీతారామయ్యతో అంటుంది ఇందిర. దాంపత్యం అంటే ఏంటో మీ ఇద్దరిని చూసి నేర్చుకోవాలని మెచ్చుకుంటుంది అపర్ణ.

మన నగలన్నీ జాగ్రత్తగా దాచి పెట్టావా అని రాహుల్‌ని అడుగుతుంది రుద్రాణి. ఈ మాటలను స్వప్న విని అందరూ నగలు తెచ్చిపెట్టారని.. నీ నగలు మాత్రం తెచ్చిపెట్టలేదని ప్రశ్నిస్తుంది . ఆ మాటలతో రుద్రాణి షాక్ అవుతుంది. నా దగ్గర చైన్ తప్పించి ఏం లేవని రుద్రాణి చెబుతుంది. నీ పెళ్లికి తాతయ్య , అమ్మమ్మలు ఎన్నో నగలు చేయించారుగా అవన్నీ ఎక్కడ దాచావ్ అని ప్రశ్నిస్తుంది స్వప్న. నాకేం చేయించలేదని, పుస్తెల తాడొక్కటే నా మొహన పడేశాడని అది కూడా వీళ్ల నాన్న ఎప్పుడో అమ్మేశాడని అంటుంది రుద్రాణి.

మా అత్తయ్య మావయ్య నీకు బోల్డన్నీ నగలు చేయించారని వెళ్లి తీసుకురా అంటుంది ధాన్యలక్ష్మీ. అసలు నాకు దుగ్గిరాల కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని రుద్రాణి చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నేను దుగ్గిరాల వారి ఆడపడుచునే కాదు, మా వంశం వేరు, ఇంటి పేరు వేరని అంటుంది. ఆస్తి కోసం ఇంటి ఆడపడుచు హోదాలో పోరాడావని, నగలు ఇవ్వాల్సి వచ్చేసరికి ఈ కుటుంబంతో సంబంధం లేదని అంటావా అంటూ అపర్ణ మండిపడుతుంది. అసలు ఆమెకు విశ్వాసమే లేదని , మర్యాదగా అడిగితే వీళ్లు ఇవ్వరని నేనే బెడ్‌ కింద దాచిన నగల్ని తీసుకొస్తానని స్వప్న అనడంతో అంతా రుద్రాణి - రాహుల్ షాక్ అవుతారు. స్వప్న నగలు తీసుకొచ్చి ఇవ్వడంతో చాలా మంచి పని చేశావని మెచ్చుకుంటాడు ప్రకాశం.

Brahmamudi Serial Today s Episode 646 February 15th 2025 Here is full story

ఇంతలో ఎస్ఐని ఫాలో అవుతూ నంద ఉన్న చోటికి వస్తుంది అప్పూ. జనం డబ్బుతో బాగా ఎంజాయ్ చేస్తున్నావని నందతో అంటాడు ఎస్ఐ. వీరిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా దానిని రికార్డ్ చేయిస్తుంది అప్పూ. డబ్బులు ఇంటికి వెళ్లి లెక్కపెట్టుకో ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని ఎస్ఐతో అంటాడు నందగోపాల్. ఆల్రెడీ దొరికిపోయారని , డబ్బు కోసం స్నేహితుడిని మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చిందని ఎస్ఐపై మండిపడుతుంది అప్పూ. నిన్ను నమ్మి 100 కోట్లు ష్యూరిటీ పెట్టినందుకు ఓ గొప్ప ఫ్యామిలీ రోడ్డున పడేలా ఉంటే నువ్వు ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తావా అని నందగోపాల్‌ను లాగి పీకుతుంది.

నేను పెట్టిన ష్యూరిటీకి ఆస్తుల లెక్క సరిపోయిందా అని బ్యాంక్ వాళ్లని అడుగుతాడు సీతారామయ్య. సరిపోయింది కానీ చెప్పడానికి మాకే కష్టంగా ఉందని మీరు ఈరోజు ఇల్లు ఖాళీ చేయాల్సిందేనని బ్యాంక్ వాళ్లు సీతారామయ్యకి చెబుతారు. ఆస్తులు అప్పగించేందుకు సంతకం చేస్తుండగా ఎస్ఐని, నందగోపాల్‌నీ తీసుకొచ్చి సీతారామయ్య కాళ్ల మీద పడేస్తుంది అప్పూ. తాతయ్య గారు మీరు సంతకం చేయాల్సిన పనిలేదని, ఆస్తుల్ని బ్యాంక్ వాళ్లకి స్వాధీనం చేయాల్సిన పని లేదని అంటుంది. ఇన్ని రోజులు చనిపోయినట్లు నాటకమాడి, డిపార్ట్‌మెంట్‌ని, బ్యాంక్‌ని, కంపెనీని మోసం చేసింది నందగోపాలేనని చెబుతుంది.

మా ఆస్తులు మాకు అప్పగించి మీరు వెళ్లండి అని అంటుంది అప్పూ .. అంటే నా నగలు పోనట్లే కదా అని రుద్రాణి , ధాన్యలక్ష్మీలు సంబరాలు చేసుకుంటారు. కేవలం ష్యూరిటీ సంతకం కోసం ఇంత ఆస్తిని వదులుకోవడానికి సిద్ధపడ్డ మీ ఫ్యామిలీకి చేతులెత్తి దండం పెట్టాలని చెప్పి బ్యాంక్ వాళ్లు క్షమాపణలు చెబుతారు. మీ ఫ్రెండే నిన్ను మోసం చేశాడని చెప్పేసరికి ఎస్ఐపై మండిపడతాడు రాజ్. నందాకి హెల్ప్ చేసి వీడు కూడా క్రిమినల్ అయ్యాడని ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నామని అంటుంది అప్పూ.

Brahmamudi Serial Today s Episode 646 February 15th 2025 Here is full story

వయసులో చిన్నదానివే అయినా కోడలిగా ఈ ఇంటి పరువుని కాపాడి, పోలీస్‌గా నీ కర్తవ్యాన్ని కూడా పూర్తి చేశావని అప్పూని మెచ్చుకుంటాడు సీతారామయ్య. కావ్య అక్క, రాజ్ బావగారు చెప్పడం వల్లే ఇదంతా చేశానని.. లేదంటే నంద బ్రతికే ఉన్నాడని తెలిసేది కాదని అంటుంది అప్పూ. మీకు నంద బతికే ఉన్నాడని ముందే తెలిస్తే ఎప్పుడో చెప్పొచ్చు కదా అని అంతా అంటారు. నిజం చెబితే ఎవ్వరూ నమ్మరని అందుకే వాడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని బ్యాంక్ వాళ్లకి అప్పగించాలని అనుకున్నామని అంటారు రాజ్ - కావ్య.

అప్పూ సక్సెస్‌ఫుల్‌గా నందగోపాల్‌ని పట్టుకుని మన సమస్యల్ని సాల్వ్ చేసిందని అంటుంది కావ్య. కోడలిగా వచ్చినప్పటి నుంచి సమస్య వచ్చిన ప్రతిసారి ఈ కుటుంబాన్ని కాపాడుతూనే ఉన్నావని మెచ్చుకుంటాడు సీతారామయ్య. కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తున్నానా అని బాధపడ్డానని.. కానీ ఆ బాధ లేకుండా చేశావని అంటాడు. కావ్య దేవతని, అప్పూ ధైర్యలక్ష్మీ అని ఇద్దరూ కలిసే సమస్యని సాల్వ్ చేశారని అంటుంది ఇందిర. ఇదేం బాలేదని.. అసలు నా చెల్లెళ్లు ఇద్దరూ ఈ ఇంట్లో అడుగుపెట్టడానికి కారణం నేనే అంటుంది స్వప్న.

మీరొక ముఖ్యమైన విషయం కనుక్కోవాలని.. నంద, విశ్వ కలిసి ఈ పని చేయలేదని వీరిద్దరిని వెనకుండి నడిపించింది అనామిక - సామంత్ అని అప్పూ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఆ మాట వినగానే కోపంతో రగిలిపోయిన రాజ్ .. అనామిక దగ్గరికి బయల్దేరతాడు. మొత్తానికి నా నగలు పోలేదని సంతోషపడుతున్న రుద్రాణిని.. నీ నగలు నువ్వు తీసుకోమని మండిపడుతుంది ఇందిర. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X