Brahmamudi February 17th Episode : రాజ్ ఉగ్రరూపం, నిండా మునిగిన సామంత్.. సీతారామయ్య కాళ్లపై పడ్డ ప్రకాశం
బ్యాంక్ వాళ్లకి సర్వస్వం ఇచ్చేయడానికి సిద్ధపడ్డ సీతారామయ్యను చూసి ఇందిర గర్వపడుతుంది. అందరూ నగలు ఇచ్చి రుద్రాణి ఇవ్వకపోవడంతో స్వప్న పైన బెడ్‌రూంలో దాచిన గోల్డ్ తీసుకొచ్చి బ్యాంక్ వాళ్లకి ఇస్తుంది. ఇంతలో ఎస్ఐని ఫాలో అవుతూ నందగోపాల్ ఉన్న చోటికి వస్తుంది అప్పూ. అక్కడ ఆమెను చూసిన వారిద్దరూ షాక్ అవుతారు.
ష్యూరిటీ కింద ఆస్తులన్నీ జప్తు చేస్తున్నామని చెబుతూ ఫైల్‌పై సీతారామయ్యని సంతకం చేయమంటారు బ్యాంక్ అధికారులు . పెద్దాయన సంతకం చేస్తుండగా అప్పూ వచ్చి నందగోపాల్‌ని, ఎస్ఐని ఆయన కాళ్లపై పడేస్తుంది. సీతారామయ్యకి క్షమాపణలు చెప్పి బ్యాంక్ వాళ్లు వెళ్లిపోతారు. దీనంతటికి కారణం అనామిక - సామంత్ అని అప్పూ చెప్పడంతో రాజ్ ఆవేశంగా ఆమె ఇంటికి వెళ్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఫిబ్రవరి 17వ తేదీ .. ఎపిసోడ్ 647లో ఏం జరిగిందంటే..

నందగోపాల్ దొరికిపోయినట్లుగా ఫోన్ రావడంతో సామంత్ షాక్ అవుతాడు. ఈ విషయం అనామికకి చెప్పడంతో ఆమె కూడా షాక్ అవుతుంది. వాడు దొరికిపోతే మనం కూడా దొరికిపోయినట్లేనని అంటాడు సామంత్. తను చేయబోయే కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించి కొందరిని పిలిపించి సీక్రెట్‌గా మాట్లాడుతుంటారు సామంత్ - అనామిక. ఇంతలో రాజ్ - కావ్యలు అక్కడికొచ్చి.. ఎందుకు ఇదంతా చేశావంటూ సామంత్‌ను కొడతాడు. నువ్వు చేసిన పనికి బ్యాంక్ వాళ్లు వచ్చి నా ఇంటిని జప్తు చేయబోయారని అప్పుడు నా పరువు పోలేదా అని మండిపడతాడు రాజ్.
మనిద్దరం వ్యాపారంలో శత్రువులు కావొచ్చు, నీ కంపెనీని కొనడానికి నాకు ఎన్నోసార్లు ఓపెన్ ఆఫర్లు వచ్చాయి. కానీ నేనేప్పుడూ నిన్ను తొక్కాలని అనుకోలేదని చెబుతాడు రాజ్. ఈ అనామిక చెప్పుడు మాటలు విని నన్ను, నా బిజినెస్‌ను దెబ్బకొట్టి మా ఫ్యామిలీని రోడ్డుపైకి తీసుకురావాలని అనుకున్నావని మండిపడతాడు. నా ఫ్యామిలీకి ఏమైనా జరిగి ఉంటే నిన్ను చంపేసే వాడినని వార్నింగ్ ఇస్తాడు రాజ్. చంపితే చూస్తూ ఊరుకుంటానా అంటూ అనామిక అనగా కావ్య లాగి పెట్టి కొడుతుంది. మా ఆయన తలచుకుంటే క్షణాల్లో మిమ్మల్ని రోడ్డు మీదకు లాగేయగలడని అంటుంది కావ్య. నువ్వేదో నిజాయితీ పరుడవని నీతో బిజినెస్ చేయాలని అనుకున్నామని.. నీతో డీల్ చేయకముందే నువ్వంటే ఏంటో తెలిసిందని వచ్చిన క్లయింట్స్ సామంత్‌ని ఛీకొట్టి వెళ్లిపోతారు.
ఇంటికొచ్చిన అప్పూని ఎత్తుకుని గాల్లో తిప్పేస్తాడు కళ్యాణ్. నువ్వు ఉద్యోగంలో చేరిన మొదటి రోజే మన ఫ్యామిలీని కాపాడావని , ఏ భర్త అయినా గర్వపడటానికి ఇంతకంటే గొప్ప కారణం ఉండదన్నారు. పోలీస్ ఆఫీసర్‌గా, కోడలిగా రెండు పాత్రలకి సమ న్యాయం చేశావని అప్పూని మెచ్చుకుంటాడు. రుద్రాణి అత్త, అనామిక, నంద గోపాల్ కలిసి మన కుటుంబాన్ని రోడ్డున పడేయ్యాలని అనుకున్నారని కానీ ఆ ఇంటి ఇటుక కూడా కదిలించలేకపోయారని అంటాడు కళ్యాణ్. ఇద్దరూ మంచి రొమాంటిక్ మూడ్‌లో ఉండగా కరెంట్ బిల్లు ఇవ్వడానికి ఓ కుర్రాడు వస్తాడు.

దుగ్గిరాల కుటుంబమంతా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్ని రోజులు అప్పు సంగతి బయటపెట్టలేక నా కొడుకు , కోడలు ఎంతో క్షోభపడ్డారని అపర్ణ అంటుంది. ఇంట్లో ఆంక్షలు పెట్టి ఖర్చులన్నీ ఆపేసి కష్టపడి అప్పు తీర్చడానికి ప్రయత్నించారని చెబుతుంది. చిన్నవాళ్లే అయినా ఇంటి గుట్టు బయటపెట్టకుండా వంశ గౌరవాన్ని కాపాడారని .. ఇకనైనా అందరి అపార్ధాలు తొలగిపోయి ఉంటాయని అంటుంది అపర్ణ. ఇక ఇంటి సమస్యలన్నీ తీరిపోయినట్లే కదా అని చెబుతుంది. అసలు సమస్య ఇంకా తీరలేదన్న సీతారామయ్య.. ఆస్తి అని అంటాడు.
నా కుటుంబమంతా ఐశ్వర్యంతో తులతూగాలని భావించి వీలున్నప్పుడల్లా ఆస్తుల్ని కూడబెడుతూ వచ్చానని చెబుతాడు. ఇదంతా ఉమ్మడిగా అనుభవించాలని కోరుకున్నానని.. కానీ కొందరిలో స్వార్ధం ప్రవేశించిందని అంటాడు సీతారామయ్య. ఇంట్లో చీలికలు, గొడవలు మొదలయ్యాయని.. నాకు మనసు విరిగిపోయిందని అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నానని చెబుతాడు. ఆస్తి మొత్తం ముక్కలు చేసి ఎవరి వాటా వాళ్లకి పంచాలని అనుకుంటున్నానని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. రుద్రాణి, ధాన్యలక్ష్మీ మాత్రం చాలా సంతోషిస్తారు.
ఎవరి వాటా వాళ్లు తీసుకుని, ఎవరి దారి వాళ్లు చూసుకుంటే మంచిదని అంటాడు సీతారామయ్య. ఒకరిద్దరి కోసం మొత్తం కుటుంబాన్నే ముక్కలు చేయడం మంచిది కాదని అంటుంది ఇందిర. నా ఇద్దరి కొడుకులు రామలక్ష్మణుల్లా కలిసి ఉంటారని అనుకున్నానని.. కానీ ప్రకాశం కూడా మారిపోయాడని సీతారామయ్య అనడంతో ప్రకాశం బాధపడతాడు. మీరు ఏ ఆశయం కోసమైతే ఇంత ఆస్తిని కూడబెట్టారో దానిని మధ్యలోనే వదిలేస్తారా అని బాధపడతాడు సుభాష్. మాకు ఆస్తుల మీద ఆశ లేదని.. జప్తులో ఆస్తులన్నీ పోయినా మేం మీతోనే ఉండాలని అనుకున్నామని అంటుంది అపర్ణ.

వాటాలు పంచుకుని విడిపోవడం వల్ల అందరం దూరమైపోతామని చెబుతాడు రాజ్. పంచడం తప్పనిసరైతే మాకు వాటాలేమీ వద్దని, మేం మీతోనే ఉంటామని అంటుంది కావ్య. ఆ మాట చాలనీ, నీలా విశాలంగా ఆలోచించడం అందరికీ రాదని మెచ్చుకుంటాడు సీతారామయ్య. నేను చిట్టీ ఉన్నంత కాలం మీతోనే ఉంటామని అంటాడు . ఇంతలో క్షమించమంటూ సీతారామయ్య కాళ్ల మీద పడతాడు ప్రకాశం. అందరిలాగే నేను కూడా రాజ్ - కావ్యలని అపార్ధం చేసుకున్నానని.. నా భార్య మాటలకి లొంగిపోయి ఆస్తి గురించి కేసు వేయాలని అనుకున్నానని అంటాడు.
ఎప్పటికీ నా కొడుకు దుగ్గిరాల వంశానికి వారసుడిగా, సీతారామయ్య గారి మనవడిగా ఉంటేనే మాకు గౌరవమని అంటాడు. మాకు ఆస్తిలేం వద్దని.. అందరం కలిసే ఉందామని చెబుతాడు. కుటుంబాన్ని ముక్కలు చేయాలన్న ఆలోచన వద్దని అంటుంది అపర్ణ. తమ్ముడు కొంచెం అమాయకంగా ఉంటాడని, వాడు ఆస్తిని నిలుపుకోలేకపోతే మళ్లీ కష్టాలు పడతాడని అంటాడు సుభాష్. అప్పూని కోడలిగా ఒప్పుకుని అప్పూని , కళ్యాణ్‌ని మనింటికి తీసుకురావాలని చెబుతాడు సీతారామయ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











